• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఆర్థికాభివృద్ధి

   ఒక దేశ ఆర్థికాభివృద్ధి అనేది సంక్లిష్ట పునర్నిర్మాణ ప్రక్రియ. ఇది దీర్ఘకాలంలో ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా, సంస్థాగతంగా సంభవించే మార్పులను తెలియజేస్తుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, విభిన్న సామాజిక సాంస్కృతిక విలువలు కలిగి, అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాల్లో ఆర్థికాభివృద్ధి.. అనేక సవాళ్లు, ఒడుదొడుకులతో నిత్యం అనిశ్చితిగా ఉంటుంది. అందుకే అభివృద్ధిని ఏ మేరకు సాధించామో తెలుసుకోవడానికి ఒక కొలమానం అవసరం. దానికి శాస్త్రీయమైన హేతుబద్ధత ఉండి లెక్కించడానికి వీలుగా ఉండాలి. 

అభివృద్ధి కొలమానాలు 
    అభివృద్ధితో పాటు దాని సమగ్ర కొలమానాలపై కూడా ఆర్థికవేత్తలు చర్చించారు. భారతదేశ ఆర్థిక పరిస్థితిపై పశ్చిమ దేశాలైన ఇంగ్లండ్, అమెరికా అభిప్రాయాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆర్థికాభివృద్ధిని కొలవడానికి ఉపయోగించే ముఖ్యమైన కొలమానాలు..

స్థూల జాతీయోత్పత్తి 
    సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల ద్వారా ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తమే స్థూల జాతీయోత్పత్తి. ఇది ఆర్థిక విలువలను తెలియజేస్తుంది. దీనిలో నాలుగు అంశాలు ఉంటాయి. అవి:
    1. ప్రజల వినియోగ వ్యయం (C) 
    2. సంస్థల పెట్టుబడి వ్యయం (I)
    3. ప్రభుత్వ వ్యయం (G) 
    4. విదేశాల నుంచి వచ్చే ఆదాయం(Net foreign income)
   GNP = C + I + G + Net foreign income
    ప్రపంచంలో మొదటిసారిగా జాతీయాదాయాన్ని సైమన్‌ కుజ్నెట్‌ అనే అమెరికా ఆర్థికవేత్త శాస్త్రీయంగా అంచనా వేశారు. ఈయన స్థూల ఉత్పత్తిలో పెరుగుదల వల్ల ఆర్థిక నిర్మాణం, జీవనంలో మార్పులు సంభవిస్తాయని తెలిపాడు. ‘ఇది భవిష్యత్‌ పురోగతికి అవసరం. కానీ జాతీయాదాయ లెక్కల నుంచి ప్రజా సంక్షేమాన్ని గ్రహించలేం’ అని స్పష్టం చేశారు.
* వాస్తవ జాతీయాదాయ అంచనాలు ధరల్లో మార్పులను తెలియజేయవు. ఆదాయ అసమానతలు, జనాభాలో వచ్చే మార్పులు, వాతావరణ కాలుష్యం వల్ల కలిగే నష్టాల గురించి పేర్కొనదు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అసంఘటిత రంగం, నిరక్షరాస్యత, బ్లాక్‌ మార్కెటింగ్‌ ఎక్కువ. కాబట్టి ఏ రంగానికి సంబంధించైనా కచ్చితమైన లెక్కలు లభించవు. 
* జాతీయాదాయ పరంగా భారతదేశం 2.7 ట్రిలియన్‌ డాలర్ల మొత్తంతో ప్రపంచంలో ఆరో స్థానాన్ని పొందింది. సామాజిక, సాంకేతిక, మానవ మూలధనం లాంటి అంశాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉంది. కాబట్టి ఇది సమగ్రమైన అభివృద్ధి కొలమానం అని చెప్పలేం.

వాస్తవ తలసరి ఆదాయం 
    ఒక దేశంలో జాతీయాదాయ పెరుగుదలపై జనాభా ప్రభావాన్ని పరిశీలిస్తూ అభివృద్ధిని గణించడానికి వాస్తవ తలసరి ఆదాయం ఉపకరిస్తుంది. మొత్తం జాతీయాదాయాన్ని జనసంఖ్యకు పంచినప్పుడు సగటున వచ్చే మొత్తాన్ని తలసరి ఆదాయం అంటారు. 


      సాధారణంగా తలసరి ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. తలసరి ఆదాయం పెరగకుండా జాతీయాదాయం మాత్రమే పెరగడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇది ఆర్థికాభివృద్ధిలో ప్రజల పాత్ర, వారి ఆదాయ స్థాయుల్లో మార్పులను తెలుపుతుంది. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కూడా తలసరి ఆదాయం ఆధారంగా దేశాలను అభివృద్ధిచెందిన, చెందుతున్న దేశాలుగా వర్గీకరించి అధ్యయనం చేస్తున్నాయి. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నివేదిక ప్రకారం 2018 నాటికి ప్రపంచంలోని అయిదు అత్యధిక ధనవంత దేశాలు వరుసగా లక్సెంబర్గ్, మకావు, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్‌. ఈ దేశాలు 75000 డాలర్లకు పైగా తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. జాతీయాదాయ పరంగా అగ్ర దేశమైన అమెరికా 65000 డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే తలసరి ఆదాయం కూడా సరైన కొలమానం కాదని కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.

విమర్శలు
* ఇది అసమగ్రమైన జాతీయాదాయ లెక్కలపై ఆధారపడి ఉందని, జనసంఖ్య పెరిగి తలసరి ఆదాయంలో మార్పు లేకపోయినా లేదా తగ్గినా అభివృద్ధి జరగలేదని చెప్పలేం. 
* ఇది ప్రజల సగటు ఆదాయం మాత్రమే. అందరి ఆదాయం కాదు. ఆదాయ అసమానతలు, పంపిణీ గురించి తెలపదు. 
* అనేక దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాల వల్ల భారతదేశం జాతీయాదాయపరంగా ఆరో పెద్ద దేశంగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయంలో 119వ స్థానంలో ఉంది. దీని ఆధారంగా మనదేశం అభివృద్ధిని సాధించలేదని చెప్పలేం. తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలతో పోల్చలేం. ఎందుకంటే అవి పరిమాణం, జనాభా పరంగా చిన్న దేశాలు. పరిశ్రమలు, వ్యాపారాలు, పర్యాటకం, బ్యాంకింగ్‌ లాంటి సేవల రంగాల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అయితే మనదేశం ఇప్పటికీ 60% మేర రుతుపవనాలపై ఆధారపడుతున్న వ్యవసాయాధారిత దేశం.
* 1951తో పోల్చినప్పుడు మనదేశ తలసరి ఆదాయం పెరిగింది కానీ ఆదాయ అసమానతలు తీవ్రతరం అయ్యాయని ప్రభుత్వ నివేెదికలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పెరిగిన తలసరి ఆదాయం తెలపదు.
* జాతీయాదాయం, తలసరి ఆదాయాలు అభివృద్ధిని కొలవడంలో సంతృప్తికరంగా లేకపోవడంతో కొలిన్‌ క్లార్క్, కిండెల్‌ బర్గర్, డి. బ్రైట్‌ సింగ్‌ లాంటి ఆర్థికవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.


ఆర్థిక సంక్షేమం: ప్రజల మధ్య ఆదాయ పంపిణీలో సమానత్వం, కొనుగోలు శక్తి పెరిగేలా ధరల స్థిర త్వాన్ని సాధించినప్పుడు ఆర్థిక సంక్షేమం ఉంటుందని వీరు అభిప్రాయపడ్డారు. అధిక ఆర్థిక సంక్షేమాన్ని అధిక అభివృద్ధికి చిహ్నంగా భావించారు. అయితే ఆర్థిక సంక్షేమం అనేది మానసికమైంది. దాన్ని కొలవలేం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంక్షేమ భావన ఒకేవిధంగా ఉండదు. జాతీయాదాయ మార్పుల స్వభావాన్ని, ఉత్పత్తి సామాజిక వ్యయాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ఆర్థిక సంక్షేమం అభివృద్ధికి కొలమానంగా ఆచరణలో సాధ్యం కాదని విమర్శలను ఎదుర్కొంది.

భౌతిక జీవన ప్రమాణ సూచిక 

* మోరీస్‌ డి మోరీస్‌ అనే శాస్త్రవేత్త ప్రజల ప్రాథమిక అవసరాల దృష్ట్యా ఈ కొలమానాన్ని రూపొందించారు. శిశు మరణాల రేటు, ఆయుఃప్రమాణం, అక్షరాస్యత లాంటి మూడు అంశాల సమాన భారాల సగటు ఆధారంగా ఈ సూచికను లెక్కిస్తారు.

విమర్శలు
*  ఇది ప్రాథమిక అవసరాలను మాత్రమే లెక్కించే పరిమిత కొలమానం.
* దీనిలో చేర్చే అంశాల సంఖ్య పట్ల ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు.
* ఈ సూచిక ఆర్థికాభివృద్ధిని విస్మరించింది. ఇది లేకుండా జీవన ప్రమాణాలు మెరుగుపడవు. 
* భద్రత, న్యాయం, మానవ హక్కుల లాంటి సామాజిక, మానసిక అంశాల గురించి ఈ సూచిక పేర్కొనలేదు.

మానవాభివృద్ధే అంతిమ లక్ష్యం 
    1990లో యూఎన్‌డీపీ (United nations development programme) వెలువరించిన మొదటి మానవాభివృద్ధి నివేదిక అభివృద్ధి ఆర్థికశాస్త్రం విధానాలు, కొలమానాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. దీంతో పాలకులు, పరిశోధకులు,  ప్రజల అభివృద్ధి ధోరణి మారిపోయింది. అప్పటివరకు అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి అని ప్రజల వస్తుసేవల పెరుగుదలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఉన్నత మానవ శ్రేయస్సు వైపు పురోగమించడమే మానవాభివృద్ధి అని, అదే నిజమైన అభివృద్ధి అని ఐక్యరాజ్యసమితి నివేదికలో నిర్వచించారు. అర్థశాస్త్ర చారిత్రక మేధోమథనం నుంచి అభివృద్ధి కొలమానాలకు ప్రత్యామ్నాయాల అన్వేషణ ఎప్పటి నుంచో జరుగుతోంది. 
* క్రీ.పూ.350లోనే అరిస్టాటిల్ '' well being as something generated by our actions and our belongings'' అని అభిప్రాయపడ్డారు.
* 18వ శతాబ్దంలో జెర్మి బెంథామ్‌ ప్రయోజనవాదం వ్యక్తుల ప్రయోజనాల కలయికే సామాజిక ప్రయోజనంగా గుర్తించి the greatest happiness for the greateast numberను సూచించింది.
* 19వ శతాబ్దంలో మార్షల్‌ లాంటి నూతన సంప్రదాయ ఆర్థికవేత్తలు ‘నెరవేర్చుకునే కోరికలు’ అనే భావనను ప్రవేశపెట్టారు. ‘‘అపరిమితమైన కోరికలను నెరవేర్చే పరిమిత వనరులను అదనంగా సమకూర్చుకునే కొద్దీ వాటి నుంచి పొందే అదనపు ప్రయోజనం (Marginal Utility) క్షీణిస్తుంది’’ అని నిరూపించారు. కాబట్టి మిగులు వనరులు ధనికుల నుంచి పేదలకు చేరితే సాంఘిక ప్రయోజనం పెరుగుతుందని తీర్మానించారు. వీరు ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనం పైనే దృష్టి సారించారు.
* 20వ శతాబ్దంలో జాన్‌ రాల్స్‌ అనే తత్వవేత్త ‘ఎ థియరీ ఆఫ్‌ జస్టిస్‌’ (1971) అనే పుస్తకం ద్వారా ప్రజల మధ్య సమానత్వం, న్యాయం గురించి చర్చించడంతో అభివృద్ధిలో మానవత్వ కోణాన్ని జోడించినట్లయింది. ఇతడి సిద్ధాంతం ఆధారంగా అమర్త్యసేన్, మార్థానస్‌బామ్ (Martha nussbaum)‌ మానవ శ్రేయస్సుకు మానవ సామర్థ్యాలు అవసరమని నిర్ధారించారు. మానవాభివృద్ధి అనేది మనిషి ఏమి కలిగి ఉన్నాడు అనేదానిపై కాకుండా ఏమి చేయగలడు అనే విషయంపై ఆధారపడి ఉంటుందని, సామర్థ్యాలు మాత్రమే మనిషి సంపాదన, దాని వినియోగాన్ని నిర్ణయించి అతడి సాధికారతకు దారి తీస్తాయని వివరించారు. ఆదాయాభివృద్ధి కాదు మానవాభివృద్ధే అంతిమ లక్ష్యమని చెప్పారు.
    జాతి, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా సర్వకాల సార్వజనీన విలువల ఆలంబనగా మహబూబ్‌-ఉల్‌-హక్‌ అనే పాకిస్థాన్‌ ఆర్థికవేత్త చొరవతో పాల్‌ స్ట్రీటెన్, ఫ్రాన్సిస్‌ స్టీవార్ట్, సుధీర్‌ ఆనంద్, మేఘనాథ్‌ దేశాయ్‌ లాంటి శాస్త్రవేత్తలు, మానవాభివృద్ధి సూచికను ప్రతిపాదించారు. అమర్త్యసేన్‌ సిద్ధాంతం దీనికి ఆధారం. 1990 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
    మానవుల సామర్థ్యాన్ని పెంచే విద్య, ఆరోగ్యం, తలసరి ఆదాయాలను పరిగణనలోకి తీసుకొని మానవాభివృద్ధి సూచికను రూపొందించారు. అప్పటి నుంచి పరిపాలన అనేది ఆదాయ పెంపు కోసం కాకుండా ప్రజల శ్రేయస్సుకు కేంద్రీకృతంగా మారింది. ప్రపంచం దీన్ని జాతీయ, తలసరి ఆదాయాలకు ప్రత్యామ్నాయంగా గుర్తించింది.

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక వృద్ధి - సూచికలు

లోరెంజ్‌ వక్రరేఖ
    అమెరికన్‌ ఆర్థికవేత్త మాక్స్‌ లోరెంజ్‌ 1905లో ఈ వక్రరేఖ ద్వారా ఆదాయ అసమానతలు, సంపద పంపిణీలో అసమానతలను వివరించారు. జనాభా, ఆదాయం లేదా సంపద పంపిణీల మధ్య సంబంధాన్ని రేఖాత్మకంగా వివరించారు.
    45 సంపూర్ణ సమానత్వ రేఖ ఆదాయం, జనాభాల మధ్య సంపూర్ణ సమానత్వాన్ని తెలుపుతుంది. సంపూర్ణ సమానత్వ రేఖ దిగువనున్న లోరెంజ్‌ వక్రరేఖ సంపద లేదా ఆదాయ పంపిణీ అసమానత్వాన్ని తెలుపుతుంది. అంటే 45 సంపూర్ణ సమానత్వ రేఖ దాని దిగువనున్న లోరెంజ్‌ వక్రరేఖ మధ్య ప్రాంతం ఆదాయం, సంపద పంపిణీల్లోని అసమానత్వాన్ని సూచిస్తుంది. అయితే ఆదాయ అసమానతలు ఎంత మేరకు ఉన్నాయనేది ‘గిని గుణకం’ ద్వారా తెలుసుకోవచ్చు.

గిని గుణకం
    ఇటలీ దేశానికి చెందిన గణాంక, సామాజికవేత్త ‘కొరాడో గిని’. ఈయన ‘గిని గుణకాన్ని’ అభివృద్ధి చేశారు. ఈ గుణకం విలువ ‘0’ నుంచి ‘1’ మధ్య ఉంటుంది. దీనిలో ‘సున్నా’ అనేది సంపూర్ణ సమానత్వాన్ని తెలియజేస్తుంది. అంటే జనాభా, ఆదాయం మధ్య సంపూర్ణ సమానత్వం ఉందని అర్థం. దీని విలువ ‘ఒకటి’ అయితే జనాభా, ఆదాయం మధ్య సంపూర్ణ అసమానత్వం ఉందని అర్థం. అయితే ‘0’ నుంచి ‘1’ మధ్య విలువలు ఆయా దేశాల ఆదాయ, సంపద పంపిణీల్లో అసమానతలను తెలుపుతాయి. దీనికి అనుగుణంగా తి/త్ఘితీ అనే సమీకరణాన్ని తయారు చేశారు. దీనిలో ×తి× అనేది లోరెంజ్‌ పటంలో ఆదాయ సమానత్వ 45 రేఖకు, లోరెంజ్‌ వక్రరేఖకు మధ్య ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. ×తీ× అనేది లోరెంజ్‌ వక్రరేఖకు దిగువనున్న ప్రాంతాన్ని సూచిస్తుంది. దీన్ని కింది పటం ద్వారా మరింత విపులంగా అర్థం చేసుకోవచ్చు.

లోరెంజ్‌ వక్రరేఖ, గిని గుణకం 

ఫిలిప్స్‌ వక్రరేఖ
    ఎ.డబ్ల్యూ. ఫిలిప్స్‌ ప్రతిపాదించిన వక్రరేఖ ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత మధ్య విలోమ సంబంధం ఉంటుందని తెలియజేస్తుంది. ఆర్థికవృద్ధితో సంభవించిన ద్రవ్యోల్బణం  అధిక ధరలకు, లాభాలు అధిక ఉద్యోగాల కల్పనకు దారితీస్తాయని ప్రతిపాదించారు. అయితే 1970 దశాబ్దంలో స్టాగ్‌ ఫ్లేషన్‌ సంభవించడం వల్ల ద్రవ్యోల్బణంతో పాటు అధిక నిరుద్యోగిత సంభవించింది. 

వివిధ రంగాల వారీ వృద్ధిరేట్ల విశ్లేషణ
* వ్యవసాయం, అనుబంధ రంగాలు అంటే వివిధ పంటలు, లైవ్‌ స్టాక్‌ అంటే కోళ్ల పెంపకం, పశుగణాభివృద్ధి (మేకలు, గొర్రెలు, గేదెలు సహా), అడవులు, అటవీ వృత్తులు, చేపల పెంపకం, గుడ్ల పరిశ్రమ మొదలైనవి. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17% వరకు ఉంది.
* ప్రస్తుత గణాంకాల ప్రకారం 2017-18లో భారతదేశం సాధించిన జీడీపీ వృద్ధిరేటు 6.7%. 2018-19 జీడీపీ వృద్ధిరేటును భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ 7.4%గా, ప్రపంచ బ్యాంక్‌ 7.3%గా అంచనా వేశాయి.

వ్యవసాయం, అనుబంధ రంగాలు
* జీవీఏలో (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌) వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 2012-13లో 18.2% ఉంటే 2017-18 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 16.4 శాతానికి క్షీణించింది. 2011-12లో పంటల వాటా 65% ఉంటే 2015-16కి 60 శాతానికి క్షీణించింది. 2012-13లో 1.5% ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిరేటు 2016-17 నాటికి 4.9%గా నమోదైంది. స్థూల మూలధన సంచయనం GVA లో 2011-12లో 18.2% ఉంటే 2015-16లో 16.4% ఉంది.

పారిశ్రామిక రంగం
* జీవీఏలో పారిశ్రామిక రంగం వాటా 31.2% ఉంది. 2017-18 (ఏప్రిల్‌ - నవంబరు)లో పారిశ్రామికోత్పత్తి 3.2% వృద్ధి చెందింది. పారిశ్రామికోత్పత్తి సూచీలో 40% వరకు భారత్వం ఉన్న ఎనిమిది కీలక రంగాలైన బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, తయారైన ఉక్కు, సిమెంట్, విద్యుచ్ఛక్తి వృద్ధిరేటు 2017-18లో 3.9% ఉంది. (ఏప్రిల్‌ - నవంబరు మధ్య) జీవీఏలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటా 32% ఉంది. 

సేవల రంగం
* జీవీఏలో సేవల రంగం వాటా 55.2% గా ఉంది. సేవల రంగం వృద్ధిరేటు 2016-17లో 7.7%గా మొదటి ముందస్తు అంచనాల్లో 2017-18లో 8.3%గా పేర్కొన్నారు. సేవల రంగం జీవీఏ వాటాలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీ, చండీగఢ్‌ 80% వాటా పొందగా, సిక్కిం 31.7% వాటాతో దిగువ స్థానంలో ఉంది. ఈ-కామర్స్‌ మార్కెట్‌ 19.1% వృద్ధితో 2016-17లో 33 బిలియన్‌ డాలర్ల విలువ నమోదు చేసుకుంది. 2015-16 జీవీఏలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నమోదైన వృద్ధి 7.7%. సాంఘిక సేవల రంగంలో 2015-16లో 5.8% వృద్ధి, 2017-18 బడ్జెట్‌ అంచనాల్లో 6.6% వృద్ధి నమోదయ్యాయి. జీడీపీలో మొత్తం వ్యయంలో సామాజిక సేవలపై వ్యయ శాతం కింది విధంగా ఉంది. 

     

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

1991లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ

భారత్‌ నేడు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి రేటు ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. దీనికి కారణం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన పాలనాకాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే. 1991 జులైలో పీవీ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో కలిసి దేశ ఆర్థికాభివృద్ధికి వ్యూహాలు రచించారు. వీటినే రావు - మన్మోహన్‌ అభివృద్ధి నమూనాగా పిలుస్తారు. భారతదేశం తన అభివృద్ధి ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంది. 
      1991లో భారత్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ సమయంలోనే ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యాన్ని గుర్తించి, వాటిని ప్రవేశపెట్టారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను విపత్కర పరిస్థ్థితుల నుంచి బయటపడేయడానికి ఈ సంస్కరణలను అత్యవసర శస్త్రచికిత్సలాగా ఉపయోగించారా? లేక అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థల ఒత్తిడి, ఆదేశాల ఫలితమా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే 1991 ముందు భారత్‌తోపాటు ప్రపంచ స్థితిగతులు, పరిణామాలను పరిశీలించాలి.


1991 నాటి ఆర్థిక సంక్షోభం 
స్వాతంత్య్రానంతరం మన దేశం అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నా వాటిని ఆర్థిక సంక్షోభంగా ఎప్పుడూ పరిగణించలేదు. 199091లో మాత్రం పరిస్థితులు చేయిదాటి దేశ ఆర్థిక నిర్వహణ సంక్షోభంలో పడింది. ఇది ప్రపంచ వేదికలపై చర్చలకు దారితీసింది. మన ఆర్థిక భద్రత ప్రశ్నార్థకమైంది.


నిర్వచనం: దేశ అవసరాలు, దిగుమతులకు లేదా పాత అప్పులు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద తగినన్ని సొంత నిధులు లేకపోవడం వల్ల వచ్చే సమస్యనే ఆర్థిక సంక్షోభం అంటారు. 1991 నాటి ఆర్థిక సంక్షోభం ప్రధానంగా రెండు రకాల లోటుల సంచిత (Cumulative) ఫలితంగా తలెత్తింది.
1) దేశీయ విత్త లోటు (Fiscal deficit) 
2) విదేశీ వ్యాపార లోటు (Current account deficit)


విదేశీ వ్యాపార లోటు   విత్త లోటు  ఆర్థిక సంక్షోభం


విత్త లోటు 
కేంద్ర ప్రభుత్వ సంవత్సర ఆదాయం కంటే వ్యయాలు ఎక్కువైనప్పుడు, ఆ లోటును దేశీయ రుణాలతో భర్తీచేయడాన్ని విత్తలోటు అంటారు. దీనివల్ల ప్రభుత్వంపై అప్పులు, వడ్డీల భారం పెరిగి క్రమంగా రుణ చెల్లింపు సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. రుణ ఊబిలో కూరుకుపోవచ్చు.


విదేశీ వ్యాపార లోటు
ఒక దేశం ఇతర దేశాలకు వస్తుసేవల ఎగుమతుల ద్వారా ఆదాయం పొందుతుంది. దిగుమతుల ద్వారా వ్యయాలు చేస్తుంది. దీన్నే విదేశీ చెల్లింపుల శేషం అంటారు. ఎగుమతుల కంటే  దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయాలకంటే వ్యయాలు ఎక్కువవుతాయి. అప్పుడు దిగుమతులకు చెల్లించడానికి తగినంత విదేశీ కరెన్సీ లేక అప్పులు చేయాల్సి వస్తుంది. దీన్నే విదేశీ వర్తక లోటు అంటారు. ఈ రెండు లోటుల్లో ఏ ఒక్కటి ఉన్నా దాన్ని చాలావరకు అధిగమించవచ్చు. ఇవి అనేక అంతర్గత, బహిర్గత అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. 1991లో ఈ రెండూ ఒకేసారి అధికస్థాయిలో మన దేశంలో సంభవించాయి. వాటి ప్రభావం అన్ని రంగాలపై పడి,  ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో సంస్కరణలు తప్పనిసరి అయ్యాయి.  


స్వదేశీ పరిస్థితులు
1980 దశాబ్దంలో దేశ స్థూల ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది. విత్తలోటు, విదేశీ వర్తకలోటు, అధిక ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు ఎక్కువయ్యాయి. 198182 లో దేశ జీడీపీలో విత్తలోటు 5.1 శాతం ఉంది. 1991 నాటికి అది 7.8 శాతానికి పెరిగింది. 198589 మధ్య ఇది సగటున 10 శాతంగా ఉంది. దీనివల్ల స్వదేశీ అప్పులు దేశ ఆదాయంలో సుమారు 49.7 శాతానికి చేరాయి. ఇది భరించరాని భారంగా పరిణమించింది. కేంద్ర ప్రభుత్వ రాబడిలో 39 శాతం నిధులు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే దేశం అపుల ఊబిలోకి జారుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. 
* 80వ దశాబ్దంలో దేశంలో ప్రభుత్వ వ్యయాలు గతంలో కంటే పెరిగాయి. ఇది మంచి పరిణామమే. అయితే ఆ పెరుగుదలకు కావాల్సిన నిధులు సొంత రాబడి లేదా పొదుపుల నుంచి సమకూరాలి. కానీ అలా జరగలేదు. అప్పు చేసి, ఖర్చు పెట్టారు.
* భారత్‌లో రెవెన్యూ ఖాతాలో అభివృద్ధియేతర వ్యయాలు విపరీతంగా పెరిగాయి. దీంతో విత్తలోటు అధికమైంది. దేశంలో ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రారంభమై సంక్షేమ పథకాలు, ఉచిత సబ్సిడీలకు కేటాయింపులు పెరిగాయి. పన్ను మినహాయింపులు ఎక్కువై వసూళ్లు తగినంతగా జరగలేదు.
* అనేక ప్రభుత్వ కంపెనీలు నిర్వహణ సామర్థ్యం కొరవడి, నష్టాల్లో కూరుకుపోయాయి. ఆ భారం అంతా బడ్జెట్లపై పడింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, రక్షణ వ్యయాలు ఏటేటా పెరుగుతూ వచ్చాయి.
* పెరుగుతున్న బడ్జెట్‌ లోటును పూడ్చటానికి ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇతర వాణిజ్య సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. దేశీయంగా ప్రభుత్వ రుణాలు పెరగడంతో ఆమేరకు ప్రైవేటు రంగానికి నిధుల కొరత ఏర్పడింది. కొత్త కరెన్సీ ముద్రణ చేయడం వల్ల దేశంలో ద్రవ్య సప్లై, వస్తువుల డిమాండ్‌ పెరిగి, క్రమంగా ద్యవ్యోల్బణానికి దారితీసింది. వినియోగదారుల సూచిక ప్రకారం 1991లో ద్రవ్యోల్బణం 11.2 శాతానికి పెరిగింది. దీంతో ప్రజలకు జీవనభారం అధికమైంది.
* 80 దశాబ్దం మధ్య నుంచి దేశంలో ఇంతకాలం సాగిన నిర్బంధ  ప్రణాళిక వ్యవస్థపై  విమర్శలు ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు, వ్యాపారాలను సరళీకరిస్తూ రాజీవ్‌గాంధీ స్వల్ప మార్పులు తెచ్చారు. తర్వాత వచ్చిన ప్రధానులు వి.పి.సింగ్, చంద్రశేఖర్‌ వాటిని కొనసాగించారు.
* రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ నిర్వహించిన వి.పి.సింగ్‌ సరళీకృత పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టారు. తాను ప్రధాని అయ్యాక వాటిని ఇంకా పెంచారు. ఈయన హయాంలో పారిశ్రామిక మంత్రిగా ఉన్న అజిత్‌ సింగ్‌ (మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ కుమారుడు)ఈ విధానాలను ప్రోత్సహించారు. 1990 నాటికి ఆర్థిక సంస్కరణల వాదిగా గుర్తింపు పొందడానికి, పెట్టుబడుల ఆకర్షణకు వి.పి.సింగ్‌ ప్రయత్నించారు.
* క్రమంగా 1990 నాటికి గత ప్రభుత్వాలు చేపట్టిన విధానాలతో విభేదిస్తూ, తర్వాత వచ్చిన ప్రధానులందరూ సరళీకృత ప్రైవేటు పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించారు. అప్పటికే అధికారులు, నాయకుల్లో ఈ మార్పులు, సంస్కరణలపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా భావించవచ్చు. దీన్నే నూతన పారిశ్రామిక విధానం-1990 అని పిలిచారు.
* ప్రధానిగా స్వల్పకాలం పనిచేసిన చంద్రశేఖర్‌ (నవంబరు 1990 - జూన్‌ 1991) దేశ చరిత్రలో మొదటిసారి పారిశ్రామిక శాఖను తనవద్దే ఉంచుకున్నారు. ఆ రంగంలోని సంస్కరణలను స్వయంగా పర్యవేక్షించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంప్రదాయాన్ని తర్వాతి ప్రధాని పీవీ నరసింహారావు కొనసాగించారు.
* రాజీవ్‌గాంధీ నుంచి పీవీ నరసింహారావు వరకు ఒకే ఆర్థిక నిపుణుల బృందం నూతన ఆర్థిక విధానాలకు రూపకల్పన చేసింది.  వీరిలో కొంతమందికి పశ్చిమ దేశాలతో అకడమిక్‌ సంబంధాలు ఉన్నాయి. కొందరు మంత్రులు రాజీవ్‌గాంధీ నుంచి పీవీ వరకు  కేబినెట్‌లో పనిచేశారు. ఈ పరిణామాలు సరళీకరణ ఆర్థిక విధానాల పట్ల ఒక ఉమ్మడి ఏకాభిప్రాయం, కార్యాచరణ ఏర్పడటానికి దోహదం చేశాయి.
* పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు.  అంతకుముందు మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ వద్ద సీనియర్‌ ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అనుభవంతో భారతదేశ ఆర్థిక పరిస్థితులపై మన్మోహన్‌సింగ్‌కు స్పష్టమైన అవగాహన ఏర్పడింది.
* రాజీవ్‌గాంధీ తర్వాత దేశంలో అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాయి.  దీంతో రాజకీయ అనైక్యత, మండల్‌-మందిర్‌ సమస్య మొదలైన కారణాల వల్ల బలమైన ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో విఫలమయ్యాయి. కానీ పీవీ నరసింహారావు వాటన్నింటినీ అధిగమించి సంస్కరణలను అమలు చేశారు.


విదేశీ పరిస్థితులు
విదేశాల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు కూడా భారతదేశం ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గు చూపడానికి ప్రేరేపించాయి.
* నాటి సోవియట్‌ రష్యా అంతర్గత కారణాలతో విచ్ఛిన్నం కావడంతో, ఆర్థికంగా బలహీనపడింది. దీంతో మనదేశానికి అంతవరకు చేస్తున్న ఆర్థిక, రక్షణ సహాయాలు తగ్గాయి. ప్రత్యామ్నాయ దేశాల సహాయం కోసం అన్వేషణ ప్రారంభించాల్సి వచ్చింది. 
* ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్, సామ్యవాద విధానాలపై విశ్వాసం సన్నగిల్లింది. బలమైన కమ్యూనిస్ట్‌ దేశమైన చైనా 1978 నుంచే ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టి, మార్కెట్‌ ఆధారిత విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.
* అప్పటి ఇంగ్లండ్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ ప్రయివేటీకరణను, రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్‌ సోషల్‌ డెమోక్రసీ విధానాలను అవలంబించారు. ఇవి వ్యక్తి స్వేచ్ఛను, ప్రైవేటు రంగాన్ని బలపరిచాయి. అమెరికా పెట్టుబడిదారీ విధానాలతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో మెజారిటీ వాటాను సాధించి ప్రాబల్యం పెంచుకుంది.
* మరోవైపు సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ దేశాలు అప్పటికే సరళీకృత ఆర్థిక విధానాలు అమలుచేసి పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి భారత్‌ సహా అభివృద్ధిచెందుతున్న దేశాల దృష్టిని ఆకర్షించాయి.
* 1970వ దశాబ్దం చివర్లో లాటిన్‌ అమెరికా దేశాలు రుణ చెల్లింపుల ఎగవేత సమస్యలు ఎదుర్కొని, చెడ్డపేరు తెచ్చుకున్నాయి. దీంతో విదేశీ రుణదాతలు అప్పులు ఇవ్వడానికి ప్రత్యామ్నాయ దేశం కోసం వెతకసాగారు. ఈ అవకాశాన్ని మన ప్రభుత్వాలు, కంపెనీలు ఉపయోగించుకుని, విదేశీ రుణాలను పొందాయి. ముఖ్యంగా జపాన్‌ నుంచి ఎక్కువ మొత్తంలో అప్పు సమకూరింది.
* దేశంలో 1976 నుంచే మాధ్యమిక మూలధన వస్తు దిగుమతులను సులభతరం చేశారు. కానీ మన ఎగుమతులు పెరగలేదు. అలాగే రాజకీయ కారణాల వల్ల విదేశీ సహాయాలు కూడా తగ్గుతూ వచ్చాయి. అయినా, విదేశీ రుణాలతో మన విత్త లోటును భర్తీ చేయడానికి ప్రయత్నాలు కొనసాగాయి. ఫలితంగా వడ్డీల భారం పెరిగింది. 
* 1990 నాటికి వడ్డీలకు చెల్లించే వ్యయం మన దేశ రక్షణ లేదా సబ్సిడీల వ్యయం కంటే ఎక్కువగా ఉంది.
* దేశ అభివృద్ధి కోసం 1980లోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి (International Monetary Fund) నుంచి నిధుల రూపంలో సహాయం పొందాం. అప్పటి నుంచి మనం వారి ఆదేశాలు, సలహాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాటిస్తూ వస్తున్నాం.
* దేశంలో విదేశీ చెల్లింపుల సమస్య 80 దశాబ్దంలో పెరిగింది. దిగుమతులను సులభతరం చేయడం, ఎగుమతులు ఆశించినంతగా పెరగకపోవడం వల్ల విదేశీ వ్యాపారంలో ఆదాయం కంటే వ్యయాలు పెరిగి వ్యాపారలోటు ఏర్పడింది. 
* సంకీర్ణ ప్రభుత్వాల పాలనలో ఏర్పడిన అనిశ్చితి వల్ల ఎన్‌ఆర్‌ఐలకు దేశీయ మార్కెట్లపై విశ్వాసం సన్నగిల్లి తమ డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా విదేశీమారక నిల్వలు తగ్గిపోతూ వచ్చాయి. ఈ లోటును భర్తీ చేయడానికి విదేశీ రుణాలు పెంచుకోవాల్సి వచ్చింది.
* 1991 నాటికి కరెంటు ఖాతాలో లోటు దేశీయ ఆదాయంలో 3.69 శాతానికి పెరిగింది. దీనివల్ల విదేశీ అప్పులు మన రాబడిలో 26 శాతానికి చేరాయి. ఇది నాటి భారతదేశ ఆర్థిక స్థితి ప్రకారం మోయలేని భారం. దీనిలో దాదాపు సగం అప్పులు ప్రభుత్వ రంగానివే.
* ముఖ్యంగా దేశంలో పెట్టుబడులు - పొదుపుల మధ్య సమతౌల్యం పాటించడంలో చోటుచేసుకున్న వైఫల్యం కారణంగా, ఆ లోటును భర్తీ చేయడానికి ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సివచ్చింది. విదేశాల నుంచి దిగుమతులకు సమానంగా ఎగుమతులు పెరగకపోవడం విదేశీ చెల్లింపుల సమస్యకు బీజం వేసింది.
* మన కరెన్సీ విలువ అధికంగా ఉండటం, విలువ తగ్గించడానికి పాలకులు సమ్మతించకపోవడం వల్ల విదేశీ వ్యాపారంలో మన ఎగుమతులు, రాబడులు పెరగలేదు.
* మరోవైపు 1990 నాటి గల్ఫ్‌ సంక్షోభం వల్ల ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. భారతదేశం డాలర్ల రూపంలో అధికంగా చెల్లించాల్సి వచ్చింది. దీంతో దిగుమతుల భారం పెరిగింది.
* ఇది ఇలాగే కొనసాగితే ఇకముందు చెల్లింపులకు విదేశీమారక నిల్వలు పూర్తిగా కరిగిపోతాయని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరపతి రేటు పడిపోతుంది. అదే జరిగితే విదేశీ రుణాలు లభించవు. అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ పరిస్థితినే విదేశీ చెల్లింపుల సంక్షోభం అంటారు.
* ఈ స్థితి నుంచి బయటపడటానికి నాటి చంద్రశేఖర్‌ ప్రభుత్వం 1991 మేలో 20 టన్నుల బంగారాన్ని జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌) నగరంలో విక్రయించడం ద్వారా, 240 మిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. 
* 1991 జూన్‌ నాటికి విదేశీమారక నిల్వలు ఒక బిలియన్‌ డాలర్‌ లోపునకు పడిపోయాయి. 1991 జులైలో మరో 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ దగ్గర కుదువపెట్టి, చెల్లింపులు జరిపారు.
* అయితే, ఈ సంక్షోభం అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది కాదు. దశాబ్దాల స్వదేశీ, విదేశీ అంశాలు, రాజకీయ,  పాలనాపరమైన కారణాలు ఈ పరిస్థితికి దారితీశాయి. 
* లాంటి విపత్కరమైన ఆర్థిక సంక్షోభ సమయంలో కేంద్రంలో 1991 జులైలో పి.వి. నరసింహారావు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే స్వదేశీ, విదేశీ పరిస్థితుల ప్రభావంతో ఆర్థిక సంస్కరణలకు అంకురార్పణ చేశారు. కొద్దికాలంలోనే ఆర్థిక సంక్షోభ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించడమే కాక భావి భారత ఆర్థిక ప్రగతికి కావలసిన సరికొత్త పునాదులు వేశారు. 

Posted Date : 09-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘం (2015 - 20)
డా.వై.వి.రెడ్డి అధ్యక్షులుగా, అజయ్‌ నారాయణ్‌ ఝా కార్యదర్శిగా 14వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేశారు. దీని సిఫార్సులు 2015 - 20 కాలానికి వర్తిస్తాయి.


i) కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల వాటా: 14వ ఆర్థిక సంఘం పన్ను రాబడుల్లో (డివిజిబుల్‌ పూల్‌) 42% వాటాను రాష్ట్రాలకు కేటాయించింది. 13వ ఆర్థిక సంఘం కేటాయించిన 32%తో పోలిస్తే ఇది 10% అధికం. దీనివల్ల రాష్ట్రాలు తమ అవసరాలకు తగ్గట్లు పథకాలు రూపొందించుకొని, నిధులు కేటాయించుకునే స్వేచ్ఛ లభిస్తుందని అభిప్రాయపడింది.


ii) పన్నుల రాబడి పంపిణీలో వివిధ రాష్ట్రాల వాటాలు: 14వ విత్త సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి  అధిక పన్నుల వాటా పొందే రాష్ట్రాలు: ఉత్తర్‌ప్రదేశ్‌ (17.959%), బిహార్ (9.665%), మధ్యప్రదేశ్ (7.548%). కేంద్రం నుంచి తక్కువ పన్నువాటా పొందే రాష్ట్రాలు: సిక్కిం  (0.37%), గోవా  (0.38%) 
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 6.74% పన్ను వాటాతో 5వ స్థానంలో ఉండేది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ 9, తెలంగాణ 15వ స్థానాల్లో ఉన్నాయి.


iii) రెవెన్యూ లోటు: దేశంలోని మొత్తం 11 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు ఉంది. అవి: ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అసోం, కేరళ, మేఘాలయ, పశ్చిమ్‌బెంగాల్‌. 
* అయిదేళ్ల కాలంలో  (2015-20)  ఈ రాష్ట్రాలకు రూ.1,94,182 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంటు మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 
* రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నుంచి ఎక్కువ సాయం అందుకుంది జమ్మూ కశ్మీర్‌. 


iv) ప్రకృతి విపత్తుల నిర్వహణ: ప్రకృతి విపత్తుల సమయంలో పునరావాసం, భద్రతా చర్యల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. అయినప్పటికీ కేంద్రం తన వంతు సాయాన్ని అందిస్తోంది. ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాలపై సెస్‌లు విధించడం ద్వారా జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కి నిధులు లభిస్తాయి. దీనికి మరిన్ని నిధులు సమకూర్చేందుకు  National Calamity Contingency Duty ని కూడా విధిస్తున్నారు. 
* రాష్ట్రవిపత్తు సహాయ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)కి రాష్ట్రాలు 10%, కేంద్రం 90% నిధులు అందించాలని 14వ ఆర్థిక సంఘం  సూచించింది. ప్రకృతి విపత్తుల కోసం రూ. 55,097 కోట్లు కేటాయించాలని సిఫార్సు చేసింది. 


v) స్థానిక సంస్థలు: 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్ర జనాభాకు 90%, ప్రాంతానికి 10% భారితం ఇచ్చి, స్థానిక సంస్థలకు నిధులు అందించాలని సిఫార్సు చేసింది. 2015 - 20 కాలానికి స్థానిక సంస్థలకు రూ. 2,87,436 కోట్లను అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మొత్తంలో పంచాయతీలకు రూ.2,00,292 కోట్లు, మున్సిపాలిటీలకు రూ. 87,144 కోట్లు సిఫార్సు చేసింది. 


గ్రాంట్లు రెండు రకాలు అవి: బేసిక్‌ గ్రాంట్, పెర్ఫార్మెన్స్‌ గ్రాంట్‌. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధుల్లో బేసిక్, పెర్ఫార్మెన్స్‌ గ్రాంట్లను గ్రామ పంచాయతీలకు 90 : 10, పురపాలక సంఘాలకు 80 : 20 నిష్పత్తిలో అందించాలి. కేంద్రం నుంచి నిధులు విడుదలైన 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయాలి. అలా జరగకపోతే వడ్డీతో సహా మొత్తం జమ చేయాలి. గనులు తవ్వడం ద్వారా రాష్ట్రాలకు వచ్చిన రాయల్టీలో కొంత భాగాన్ని స్థానిక సంస్థలకు కేటాయించాలి. ఇవి ప్రజల ప్రాథమిక సౌకర్యాల కల్పనకు (తాగునీరు, పారిశుద్ధ్యం, సామాజిక ఆస్తులు, వీధి దీపాలు, రహదారుల నిర్వహణ) నిధులు ఖర్చు చేయాలి. స్థానిక సంస్థలు ప్రోత్సాహక నిధులను పొందాలంటే తప్పనిసరిగా ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఆడిటింగ్‌ చేయాలి.


vi) కోశ క్రమశిక్షణ: 2019 - 20 నాటికి దేశ కోశ లోటును 3 శాతానికి తెచ్చి, రెవెన్యూ లోటును పూర్తిగా లేకుండా చేయాలనేది 14వ ఆర్థిక సంఘం లక్ష్యం. రాష్ట్రాల్లోనూ కోశ లోటు 3% (0.25% అటూఇటూగా) ఉంచాలని పేర్కొంది. రాష్ట్రాల అప్పులు వాటి  GSDP లో  25% మించకూడదు. ఈ అంశాలకు అనుగుణంగా  FRBM చట్టాన్ని సవరించి దాని స్థానంలో Debt Ceiling & Fiscal Responsibility Legislation ను తేవాలి. వాస్తవ రెవెన్యూ లోటును  (Effective Revenue Deficit) విడిచిపెట్టాలని సూచించింది.


vii) వస్తు సేవల పన్ను (జీఎస్టీ): జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి మూడేళ్లు రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని 100%, నాలుగో ఏడాది 75%, అయిదో సంవత్సరం 50% కేంద్రమే భరించాలని 14వ ఆర్థిక సంఘం సూచించింది.


viii) కేంద్ర ప్రాయోజిత పథకాలు  (Central Sponsored Schemes): కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 30 స్కీంలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. పథకాల ప్రాముఖ్యత, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎనిమిదింటిని మాత్రమే ప్రభుత్వం బదిలీ చేసింది.


ix) విద్యుత్‌ రంగంపై సిఫార్సులు: రాష్ట్రాలు కొన్ని వర్గాల ప్రజలకు ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీలను ముందుగానే విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెల్లించాలి. అలా చేయని రాష్ట్రాలకు జరిమానా విధించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. విద్యుత్‌ పంపిణీ సంస్థలకు లాభాలు రావాలంటే వాటికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని, దానికోసం రాష్ట్ర స్థాయి విద్యుత్‌ నియంత్రణ మండలి నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. వ్యవసాయ పంపు సెట్లకు, ఇతర వర్గాలవారికి నీటిని అందించే మోటార్లకు తప్పనిసరిగా మీటర్లు పెట్టాలి. తద్వారా ప్రభుత్వం ఇచ్చే రాయితీల ధ్రువీకరణ, విద్యుత్‌ సాంకేతిక నష్టాలు, విద్యుత్‌ చౌర్యం లాంటి సమాచారం తెలుస్తుందని పేర్కొంది.


x) ప్రభుత్వ రంగ సంస్థలు: ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వ రంగ సంస్థలను నాలుగు వర్గాలుగా విభజించారు. అవి:
1) అత్యంత ముఖ్యమైనవి 
2) ముఖ్యమైనవి 
3) సాధారణమైనవి  
4) అవసరం లేనివి 
వీటిలో పెట్టుబడి పెట్టాలన్నా, ఉపసంహరించాలన్నా ఈ వర్గీకరణ ఆధారంగానే జరగాలి. అవసరం లేని సంస్థలను పారదర్శకంగా వేలం వేసి, విక్రయించాలని ఆర్థిక సంఘం సూచించింది.


xi) ఇతర అంశాలు: రైల్వే టికెట్‌ ధరలను నిర్ణయించడానికి స్వయంప్రతిపత్తి హోదా ఉన్న ధరల నిర్ణయాధికార సంస్థను వేగంగా ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారికి జీతభత్యాలు నిర్ణయించాలి.  Pay Revision Commission (PRC) పేరును  Pay and Productivity Commission (PPC) గా మార్చాలి. స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్ఠి కోసం వృత్తిపన్నును భారీగా పెంచి, నిధులు సమకూర్చాలని ఆర్థిక సంఘం సూచించింది.


xii) కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ   వాటాలు: 2015 - 20 మధ్య కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాలకు రూ. 39,48,187 కోట్లు కేటాయించారు. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా రూ.1,69,970 కోట్లు (4.305%)  కేటాయించారు. సేవాపన్ను వాటా 4.398%. తెలంగాణకు రూ. 96,217 కోట్లు (2.437%) ఇచ్చారు. సేవాపన్ను వాటా 2.499%.


13వ విత్త సంఘం (2010-15)
* 13వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు వెళ్లే గరిష్ఠ వనరులు (పన్నులు, గ్రాంట్లు) 39.5 శాతంగా, పన్ను రాబడుల వాటాను 32 శాతంగా నిర్ణయించింది. అయితే సర్‌ఛార్జి, సెస్‌లపై రాష్ట్రాలకు వాటా ఇవ్వాలనే డిమాండ్‌ను ఆమోదించలేదు. 
* 11వ ఆర్థిక సంఘం మొదటిసారి కేంద్రం నుంచి రాష్ట్రాలకు వెళ్లే గరిష్ఠ వనరులు 37.5% వరకు ఉండొచ్చని, వాటిలో పన్ను రాబడుల వాటా 29.5 శాతంగా ఉండాలని సూచించింది. 
* 12వ ఆర్థిక సంఘం గరిష్ఠ వనరులను 38 శాతంగా, పన్ను రాబడుల వాటాను 30.5 శాతంగా నిర్ణయించింది. 


15వ ఆర్థిక సంఘం
రాష్ట్రపతి 2017, నవంబరు 27న ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌కే సింగ్‌ అధ్యక్షులుగా, అరవింద్‌ మెహతా కార్యదర్శిగా 15వ ఆర్థిక సంఘాన్ని నియమించారు. 2020, అక్టోబరు 30 నాటికి ఇది తన నివేదికను సమర్పించాలని ఆదేశించారు.


ఆర్థిక సంఘం సభ్యులు: అజయ్‌ నారాయణ్‌ ఝా (కేంద్ర మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి), అశోక్‌ లహరి (కేంద్ర మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు), రమేష్‌ చంద్‌ (నీతి ఆయోగ్‌ సభ్యులు), అనూప్‌ సింగ్‌ (జార్జ్‌ టౌన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌)
* ఈ సంఘం 2 నివేదికలు సమర్పించింది. మొదటి దానిలో 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలు ఉండగా, రెండో దానిలో 2021 - 2026 కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. 


టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌: కింద పేర్కొన్న   అంశాలను పరిశీలించి నివేదికను తయారుచేయాలని 15వ ఆర్థిక సంఘానికి సూచించారు.
* కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, వాటిలో రాష్ట్రాలకు వచ్చే వాటాలను నిర్ణయించడం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్ల పరిమాణాన్ని నిర్ణయించి, వీటిని పొందడానికి రాష్ట్రాలకు ఉండాల్సిన అర్హతలను ప్రకటించడం.
* మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధులు అందించేందుకు రాష్ట్ర సంఘటిత నిధిని బలోపేతం చేసే చర్యలు సూచించడం. 
* 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు కేంద్ర కోశ స్థితిగతులపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయో సమీక్షించడం. 
* కేంద్రం, రాష్ట్రాల రుణాల స్థితిగతులు, మంచి విత్త నిర్వహణకు తీసుకోవాల్సిన కోశపరమైన చర్యలు సూచించడం.
* ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ ప్రభావాన్ని అధ్యయనం చేయడం. 
* జనాభావృద్ధి రేటును తగ్గించేందుకు చేపట్టిన చర్యలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కృషి, మూలధన వ్యయాన్ని పెంచడంలో ప్రగతి, విద్యుత్‌ రంగంలో నష్టాలు తగ్గించడం, పన్ను-పన్నేతర రాబడిని పెంచడంలో ప్రగతి, ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్‌ ఎకానమీని ప్రోత్సహించడం, సులభతర వాణిజ్యం  (Ease of Doing Business)లో ప్రగతి, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో సాధించిన ప్రగతి మొదలైన అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ప్రదర్శన ఆధారిత ప్రోత్సాహకాలను సిఫార్సు చేయడం. 
* రక్షణ, అంతర్గత భద్రతలకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక యంత్రాంగం అవసరమా? ఒకవేళ అవసరమైతే దాన్ని ఎలా నిర్వహించాలి? అనే అంశంపై సలహా ఇవ్వడం. 
* 2011 జనాభా లెక్కల ఆధారంగానే సిఫార్సులు ఉండాలి.  

 

15వ ఆర్థిక సంఘం - నివేదికలు
* 15వ ఆర్థిక సంఘం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి రెండు నివేదికలను సమర్పించింది. మొదటి నివేదికలో 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలు ఉండగా, రెండో నివేదికలో 2021 - 26 కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి.

 

ఆదాయ వ్యత్యాసం: అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రంతో పోలిస్తే ఒక రాష్ట్రం ఎంత దూరంలో ఉందో ఈ ప్రమాణం తెలుపుతుంది. 2016 - 17 నుంచి 2018 - 19 వరకు ఉన్న మూడేళ్ల సగటు తలసరి జీఎస్‌డీపీ లెక్కించడం ద్వారా ఒక రాష్ట్ర  తలసరి ఆదాయం వస్తుంది. తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలకు అధిక సాయం అందించే ఉద్దేశంతో ఆదాయ వ్యత్యాస ప్రమాణాన్ని చేర్చారు. రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని సాధించడం దీని లక్ష్యం. మొదటి నివేదిక తయారీకి సూచన కాలం (రిఫరెన్స్‌ పీరియడ్‌)గా  2015 - 18ని తీసుకున్నారు.


జనాభా సంబంధ ప్రగతి Demographic Performance): జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలకు బహుమతిగా ఈ ప్రమాణాన్ని చేర్చారు. దీని ప్రకారం ఫలదీకరణ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాలు అధికంగా లబ్ది పొందుతాయి. 

అడవులు, ఆవరణ వ్యవస్థ: అన్ని రాష్ట్రాల్లోని మొత్తం దట్టమైన అడవుల్లో ఒక రాష్ట్రంలోని దట్టమైన అడవుల వాటా ఎంత ఉందో లెక్కించి ఈ ప్రమాణాన్ని పరిగణిస్తారు.

పన్నుల వసూల్లో కృషి (Tax Effort):  అధిక పన్ను వసూలు సామర్థ్యం ఉన్న రాష్ట్రాలకు బహుమతిగా ఈ ప్రమాణాన్ని చేర్చారు. 2016 - 17 నుంచి 2018 - 19 కాలానికి ఒక రాష్ట్రంలో సగటు తలసరి సొంత పన్ను రాబడికి, సగటు తలసరి జీఎస్‌డీపీకి మధ్య ఉన్న నిష్పత్తి ఆధారంగా దీన్ని లెక్కిస్తారు.
* 13వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కలను మాత్రమే ఆధారంగా తీసుకున్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి 2011 జనాభా లెక్కలను ప్రమాణంగా  తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు స్వాగతించగా, మరికొన్ని వ్యతిరేకించాయి. 

 

2011 జనాభా లెక్కలు - అనుకూల వాదనలు:
* 1971 జనాభా లెక్కలు 50 ఏళ్ల నాటి పాత సమాచారాన్ని పేర్కొంటాన్నాయి. ఇవి ప్రస్తుత స్థితిగతులను ప్రతిబింబించవు. 
* 1971 జనాభా లెక్కలు వలసలను పరిగణనలోకి తీసుకోలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం సంవత్సరానికి 33 లక్షల మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.  ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. 
* పాత గణాంకాలతో సరైన కేటాయింపులు జరగకపోవచ్చు. వలసలు కూడా పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేస్తే జనాభా సంబంధ మార్పుల ద్వారా వచ్చే జనాభా సంబంధ లబ్ది (demographic dividend) చేకూరుతుంది.


ప్రతికూల వాదనలు:
* 1971 నుంచి 2011 నాటికి మొత్తం జనాభాలో దక్షిణ భారత రాష్ట్రాల వాటా 4% తగ్గగా, ఉత్తర భారత రాష్ట్రాల వాటా సాపేక్షంగా పెరిగింది. ఫలితంగా ఆ రాష్ట్రాలు ఎక్కువ లబ్ది పొందుతున్నాయి. 
* అధిక జనాభా వల్ల ఉత్తర భారత రాష్ట్రాల తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కేటాయింపులు పెరగడానికి ఈ అంశం కూడా ఒక కారణం. 
* ధనిక రాష్ట్రాలు పేద రాష్ట్రాలకు సహాయం చేయాలి. అనేక సంవత్సరాల నుంచి ఉత్తర భారత రాష్ట్రాలకు సాయం అందిస్తున్నప్పటికీ అవి వెనుకబడే ఉన్నాయి. వెనుకబాటుతనం ఆధారంగా నిధుల కేటాయింపు జరగడం వల్ల ఆర్థిక సంఘం వెనుకబాటుతనాన్ని ప్రోత్సహించినట్లు అనిపిస్తోందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
ఉదా: తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్‌ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన దాని కంటే తక్కువమొత్తం పొందుతున్నాయి. ఈ రాష్ట్రాలు కేంద్రానికి రూ.100 చెల్లిస్తే, తిరిగి రూ. 30 మాత్రమే దక్కుతుంది. ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌ లాంటి రాష్ట్రాలు రూ.100 చెల్లిస్తే, రూ.200 పైనే పొందుతున్నాయి. బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నుంచి అధికంగా నిధులు లభిస్తున్నాయి.
* 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల 4 దక్షిణాది రాష్ట్రాలతో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలూ నష్టపోతున్నాయి.

 

మొదటి నివేదిక
* 2020 - 21కి రూ.8,55,176 కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేయాలని సిఫార్సు చేసింది.  ఈ మొత్తం డివిజబుల్‌ పూల్‌లో 41 శాతంగా ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 42 శాతం కంటే ఇది 1 శాతం తక్కువ. 2020 ఫిబ్రవరిలో ఈ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 
* 2020 - 21కి ఉత్తర్‌ప్రదేశ్‌ అత్యధికంగా రూ.1,53,342 కోట్లు పొందింది. డివిజబుల్‌ పూల్‌లో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో ఈ రాష్ట్రం వాటా 17.93 శాతం. బిహార్‌ రూ.86,039 కోట్లతో రెండో స్థానంలో ఉంది. 
* 2020 - 21కి ఆంధ్రప్రదేశ్‌కు రూ.35,156 కోట్లు లభించాయి. 14వ ఆర్థిక సంఘం డివిజబుల్‌ పూల్‌లో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం కేటాయించగా, 15వ ఆర్థిక సంఘం 4.111 శాతం కేటాయించింది. 
* పన్నుల విభజన తర్వాత కూడా 14 రాష్ట్రాలు రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాయి. దీన్ని భర్తీ చేసేందకు ఆయా రాష్ట్రాలకు రూ.74,341 కోట్లు రెవెన్యూ లోటు గ్రాంటు కింద సిఫార్సు చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. 
* 2019 - 20తో పోలిస్తే 2020 - 21లో కర్ణాటక, మిజోరం, తెలంగాణలకు పన్నుల విభజన, రెవెన్యూ లోటు గ్రాంటు ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉంది. దీనికోసం ఆ మూడు రాష్ట్రాలకు రూ.6,674 కోట్లు కేటాయించింది. 
* 2020 - 21లో స్థానిక సంస్థలకు రూ.90,000 కోట్ల గ్రాంటును సిఫార్సు చేసింది. డివిజబుల్‌ పూల్‌లో ఇది 4.31%. ఈ మొత్తంలో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.60,750 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.29,250 కోట్లు కేటాయించింది. 
* జాతీయ, రాష్ట్ర డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్‌ మెంట్‌ ఫండ్‌లను ఏర్పాటుచేయాలని ఈ సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (State Disaster Risk Management Fund-SDRMF) కు రూ.28,983 కోట్లు, జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ నిధి  (National Disaster Risk Management Fund NDRMF) కు రూ.12,390 కోట్లు సిఫార్సు చేసింది. 
* 2020 - 21 లో పోషణ (Nutrition) రంగానికి రూ.7,375 కోట్ల గ్రాంటును సిఫార్సు చేసింది. 
* ప్రదర్శనాధారిత, రంగాల వారీ గ్రాంట్లను పూర్తిగా తొలగించారు.


రెండో నివేదిక
* 15వ ఆర్థిక సంఘం 2020 నవంబరులో తన నివేదికను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించింది. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021 ఫిబ్రవరి 1న బడ్జెట్‌తో పాటు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో 202126 కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆర్థిక సంఘం కేంద్రం, రాష్ట్రాలకు కీలక సిఫార్సులు చేసింది.


కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా: 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సిఫార్సు చేసినట్లే 2021 - 26 కాలానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 41 శాతంగా ప్రకటించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన దానికంటే ఇది 1 శాతం తక్కువ. ఈ ఒక్క శాతాన్ని కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌ కోసం కేటాయించాలన్న కేంద్రప్రభుత్వ సూచనకు ఆర్థిక సంఘం అంగీకరించింది. 2021 - 22 నుంచి 2025 - 26 వరకు మొత్తం పన్ను వసూళ్లు రూ.135.2 లక్షల కోట్లుగా ఉంటాయని ప్రభుత్వం అంచనా. సెస్సులు, సర్‌ఛార్జీలు లాంటివి మినహాయిస్తే ఈ మొత్తం రూ.103 లక్షల కోట్లకు తగ్గుతుంది. అందులో 42% అంటే రూ.42.2 లక్షల కోట్లు రాష్ట్రాలకు దక్కాలి.
 రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు ప్రమాణాలు: దీనికోసం 15వ ఆర్థిక సంఘం 2020 - 21కి ఉపయోగించిన ప్రమాణాలనే 2021 - 26 కాలానికీ తీసుకుంది. వాటికి కేటాయించిన భారితాల్లోనూ ఎలాంటి మార్పు లేదు. ‘పన్ను వసూల్లో కృషి’కి (Tax Effort) బదులు ‘పన్ను-కోశ కృషి’ (Tax and Fiscal Effort) అనే పేరును ఉపయోగించారు. అయితే ఆదాయ వ్యత్యాసం, పన్నుల వసూల్లో కృషి అనే రెండు ప్రమాణాల లెక్కింపునకు 2020 - 21కి రిఫరెన్స్‌ పీరియడ్‌గా 2015 - 18; 2021 - 26 కాలానికి 2016 - 19ను తీసుకున్నారు. 2020 - 21తో పోలిస్తే రాష్ట్రాల వాటాల్లో స్వల్పంగా మార్పులు జరిగాయి.
* ఈ విధానంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటకల మొత్తం వాటా 13.955% నుంచి 11.721 శాతానికి తగ్గింది. ఈ రాష్ట్రాలు మొత్తంగా 2.234% వాటాను అంటే రూ.94,381.13 కోట్లను కోల్పోయాయి. ఒడిశా, అసోం, ఉత్తర్‌ ప్రదేశ్‌లు కూడా వెయిటేజీని కోల్పోయాయి. ఈ ఏడు రాష్ట్రాలు అయిదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా నష్టపోనున్నాయి. తమిళనాడు వెయిటేజీ 4.023% నుంచి 4.079%కి పెరిగింది.


రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు ప్రమాణాలు
* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నిర్ణయించేందుకు 15వ ఆర్థిక సంఘం కింది ప్రమాణాలను అనుసరించి, భారితాలు ఇచ్చింది.

 

గ్రాంట్లు
* 2021 - 26 కాలానికి కేంద్ర వనరుల నుంచి  రాష్ట్రాలకు కింద పేర్కొన్న గ్రాంట్లు అందుతాయి.
 రెవెన్యూ లోటు గ్రాంట్లు: రెవెన్యూ లోటును అధిగమించేందుకు 17 రాష్ట్రాలకు రూ.2.9 లక్షల కోట్లు కేటాయించారు.


8 రంగాలకు ప్రత్యేక గ్రాంట్లు: కింది రంగాల కోసం రాష్ట్రాలకు ప్రత్యేకంగా రూ.1.3 లక్షల కోట్లు ఇస్తారు. అవి:
1. ఆరోగ్యం      2. పాఠశాల విద్య        3. ఉన్నత విద్య 
4. వ్యవసాయ సంస్కరణల అమలు 
5. పీఎంజీఎస్‌వై రహదారుల నిర్వహణ 
6. న్యాయ వ్యవస్థ         7. గణాంకాలు 
8. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులు. 
* ఈ గ్రాంట్లలో కొంత భాగం పనితీరు  ఆధారంగా ఉంటాయి.


రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు: ఆర్థిక సంఘం రాష్ట్రాలకు రూ.49,599 కోట్ల ప్రత్యేక గ్రాంట్లను సిఫార్సు చేసింది. వీటిని కింది అవసరాలకు ఇస్తారు. 
* సాంఘిక అవసరాలు 
* పాలనా గవర్నెన్స్, మౌలిక వసతులు 
* తాగునీరు, పారిశుద్ధ్యం 
* సంస్కృతి, చారిత్రక కట్టడాల సంరక్షణ 
* అధిక వ్యయం ఉన్న భౌతిక అవస్థాపన 
* పర్యటకం 
రాష్ట్రాలు, రంగాల వారీగా ప్రత్యేక గ్రాంట్ల వినియోగాన్ని సమీక్షించి, పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. స్థానిక సంస్థలకు గ్రాంట్లు: స్థానిక సంస్థలకు మొత్తం రూ.4.36 లక్షల కోట్లు ఇస్తారు. ఈ గ్రాంట్లలో కొంత మొత్తం పనితీరు ఆధారంగా ఇస్తారు. వీటిలో గ్రామీణ స్థానిక సంస్థలకు  రూ.2.4 లక్షల కోట్లు; పట్టణ స్థానిక సంస్థలకు రూ.1.2 లక్షల కోట్లు; స్థానిక ప్రభుత్వాల ద్వారా ఆరోగ్య గ్రాంట్లు రూ.70,051 కోట్లు కేటాయించారు. స్థానిక సంస్థలకు అందించే గ్రాంట్లు 3 అంచెల (గ్రామం, బ్లాక్, జిల్లా) పంచాయతీరాజ్‌ సంస్థలకు అందుబాటులో ఉంటాయి.


ఆరోగ్య గ్రాంట్లు: ఈ నిధులను కింది విధంగా వెచ్చిస్తారు.
* గ్రామీణ ఆరోగ్య సబ్‌ సెంబర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్‌సీలు) ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాలుగా మార్చడం.  
* ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలకు మద్దతుగా డయాగ్నోస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడం.
* పట్టణ ఆరోగ్య-వెల్‌నెస్‌ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్‌సీలకు, బ్లాక్‌స్థాయిలో ఉన్న ప్రజా ఆరోగ్య యూనిట్లకు మద్దతు అందించడం.
* ఆరోగ్య గ్రాంట్లు మినహా స్థానిక సంస్థలకు అందించే మిగిలిన గ్రాంట్లను జనాభా, విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. జనాభాకు 90%, విస్తీర్ణానికి 10% భారితం ఇస్తారు. ఈ గ్రాంట్లను (ఆరోగ్య గ్రాంట్లు మినహా) పొందడానికి ఆర్థిక సంఘం కొన్ని షరతులను విధించింది. అవి:
* ఆడిట్‌ చేసిన అకౌంట్లను ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రచురించాలి. 
* ఆస్తి పన్నులకు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస ఫ్లోర్‌ రేట్లను నిర్ణయించాలి. ఆస్తి పన్ను వసూళ్లలో ప్రగతిని చూపాలి. 
* ఒక రాష్ట్రం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయకపోతే 2024, మార్చి తర్వాత స్థానిక సంస్థలకు ఎలాంటి గ్రాంట్లు విడుదల చేయకూడదు.

 

ప్రకృతి విపత్తుల నిర్వహణ గ్రాంట్లు: ప్రకృతి విపత్తుల నిర్వహణ నిధులకు అయ్యే వ్యయాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర, రాష్ట్రాలు వాటాల రూపంలో నిధులను సమకూరుస్తాయి. 


కేంద్రం - రాష్ట్రాల మధ్య వ్యయాల పంపిణీ:
* ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90 : 10
* ఇతర రాష్ట్రాలకు 75 : 25.
రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధులకు రూ.1.6 లక్షల కోట్లు ఉండాలని నిర్ణయించింది. ఇందులో కేంద్రం వాటా రూ.1.2 లక్షల కోట్లుగా పేర్కొంది.


ఆర్థిక రోడ్‌ మ్యాప్‌ (Fiscal roadmap) 
కోశ లోటు, రుణ స్థాయి: కేంద్రప్రభుత్వం కోశలోటును 2021 - 22లో 6%, 2022 - 23లో 5.5%, 2023 - 24లో 5%, 2024 - 25లో 4.5%, 2025 - 26 నాటికి జీడీపీలో 4 శాతానికి తగ్గించాలి. 
* అన్ని రాష్ట్రాలు తమ కోశ లోటు పరిమితిని (జీఎస్‌డీపీ శాతాల్లో) 2021 - 22లో 4%, 2022 - 23లో 3.5%, 2023 - 26 మధ్య కాలంలో 3 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. 
* ఒక రాష్ట్రానికి మొదటి 4 సంవత్సరాలకు (2021 - 25) మంజూరైన రుణ పరిమితిని పూర్తిగా వినియోగించలేకపోతే, ఆ  రుణాన్ని తర్వాతి ఏడాదిలో ఉపయోగించుకోవచ్చు. 
* విద్యుత్తు రంగంలో సంస్కరణలు చేపట్టిన రాష్ట్రాలకు మొదటి నాలుగేళ్లు (2021 - 25) అదనంగా జీఎస్‌డీపీలో 0.5% రుణాన్ని సమీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సంస్కరణలు ప్రధానంగా 

1. నిర్వహణ వ్యయాలు తగ్గించడం.
2. రెవెన్యూ వ్యత్యాసాన్ని తగ్గించడం. 
3. సబ్సిడీ చెల్లింపుల కోసం ప్రత్యక్ష నగదు బదిలీ చేపట్టడం. 
4. రెవెన్యూలో టారిఫ్‌ సబ్సిడీ వాటా తగ్గించడం.
* తాము సిఫార్సు చేసిన కోశ లోటు మార్గసూచీ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణాలు తగ్గుతాయని ఆర్థిక సంఘం భావిస్తోంది. 2020 - 21లో జీడీపీలో 62.9%గా ఉన్న అప్పులు 2025 - 26 నాటికి 56.6%కి తగ్గుతాయని ఆర్థిక సంఘం పేర్కొంది. అన్ని రాష్ట్రాల మొత్తం రుణాలు జీడీపీలో 33.1% నుంచి 32.5 శాతానికి చేరతాయని తెలిపింది. 
* ఉన్నతస్థాయి అంతర మంత్రిత్వ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ద్రవ్య బాధ్యతా-బడ్జెట్‌ నిర్వహణ చట్టాన్ని (Fiscal Responsibility and Budget Management Act -FRBM) సమీక్షించాలని సిఫార్సు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నూతన FRBM ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని సూచించింది.


ఆదాయ సమీకరణ: ఆదాయం, ఆస్తి ఆధారిత పన్నులను బలోపేతం చేయాలి. వేతన ఉద్యోగుల ఆదాయపు పన్నుపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలి. దీనికోసం టీడీఎస్‌/టీసీఎస్‌ పన్ను మినహాయింపు, సేకరణకు చెందిన నిబంధనల కవరేజీని విస్తరించాలి. రాష్ట్ర స్థాయిలో పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడానికి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేయొచ్చు. ఇందుకోసం కంప్యూటరీకరించిన ఆస్తుల రికార్డులను, లావాదేవీల రిజిస్ట్రేషన్‌తో ఇంటిగ్రేట్‌ చేయాలి. ఆస్తుల మార్కెట్‌ విలువను కచ్చితంగా లెక్కించాలి. 


జీఎస్టీ: జీఎస్టీలో ఉన్న మధ్యంతర ఇన్‌పుట్, తుది అవుట్‌పుట్‌ల మధ్య విలోమ డ్యూటీ స్ట్రక్చర్‌ను పరిష్కరించాలి. జీఎస్టీ రేటు రెవెన్యూ తటస్థతను పునరుద్ధరించాలి. 12%, 18% రేట్లను విలీనం చేయడం ద్వారా రేటు నిర్మాణాన్ని హేతుబద్దీకరించాలి. జీఎస్టీ బేస్‌ను విస్తరించడానికి, సమ్మతిని ధ్రువీకరించడానికి రాష్ట్రాలు క్షేత్రస్థాయి ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. 


ఆర్థిక నిర్వహణ విధానాలు: 
* ప్రజల ఆర్థిక నిర్వహణ కోసం సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలి. 
* కేంద్రం, రాష్ట్రాల నుంచి రికార్డులను మదింపు చేసే అధికారాలతో ఒక స్వతంత్ర ఆర్థికమండలిని ఏర్పాటు చేయాలి. కౌన్సిల్‌కు కేవలం సలహా పాత్ర మాత్రమే ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఖర్చుకు సంబంధించి ఆఫ్‌ బడ్జెట్‌ ఫైనాన్సింగ్‌ లేదా పారదర్శకం కాని ఫైనాన్సింగ్‌ మార్గాలను ఆశ్రయించకూడదు. 
* స్థూల ఆర్థిక, ఆర్థిక అంచనా కచ్చితత్వం, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి కేంద్రం, రాష్ట్రాలు కృషి చేయాలి. 
* కేంద్రం తన చట్టంలో తెచ్చిన రుణ నిర్వచనానికి అనుగుణంగా రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత చట్టాన్ని సవరించాలి. రాష్ట్రాలు స్వల్పకాలిక అప్పు కోసం రుణాలు, అడ్వాన్సులు, భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి ఓవర్‌ డ్రాప్ట్‌ సదుపాయం కాకుండా ఇతర మార్గాల నుంచి ఎక్కువగా తీసుకోవాలి.  రాష్ట్రాలు తమ రుణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఒక స్వతంత్ర రుణ నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేయొచ్చు.


ఇతర సిఫార్సులు
ఆరోగ్యం: 2022 నాటికి ఆరోగ్యంపై చేసే వ్యయాన్ని రాష్ట్రాలు తమ బడ్జెట్‌లో 8% కంటే ఎక్కువగా కేటాయించాలి. అదే ఏడాది నాటికి మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యయం 2/3 వంతు ఉండాలి. ఆరోగ్య రంగంలో ఉన్న కేంద్ర ప్రాయోజిక పథకాలు రాష్ట్రాలకు సౌలభ్యంగా ఉండాలి. అఖిల భారత వైద్య, ఆరోగ్య సేవలు ప్రారంభించాలని సిఫార్సు చేసింది.


రక్షణ, అంతర్గత భద్రత కోసం నిధులు:
రక్షణ, అంతర్గత భద్రతల బడ్జెట్‌ అవసరాలకు, వాస్తవ కేటాయింపులకు మధ్య  వ్యత్యాసాన్ని భర్తీ చేయాలని పేర్కొంది. దీనికోసం రక్షణ, అంతర్గత భద్రతా  ఆధునికీకరణ నిధిని (Modernisation Fund for Defence and Internal Security MFDIS) ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
* 2021 - 26 మధ్య ఉన్న 5 సంవత్సరాల కాలానికి రూ.2.4 లక్షల కోట్ల కార్పస్‌ను ఈ నిధి కలిగిఉంటుంది. ఇందులో రూ.1.5 లక్షల కోట్లు భారత సంఘటిత నిధి నుంచి బదిలీ అవుతాయి. మిగిలిన మొత్తం రక్షణ రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, రక్షణశాఖ ఆధీనంలో ఉన్న భూములను విక్రయించడం ద్వారా సమీకరించాలని సిఫార్సు చేసింది. 


కేంద్రప్రాయోజిత పథకాలు (CSS):
వీటికి కనీస వార్షిక కేటాయింపులను నిర్ణయించాలి. అంతకంటే తక్కువగా కేటాయించడాన్ని నిలిపివేయాలి. ఒక నిర్దిష్ట కాల పరిమితిలోపు CSSల థర్డ్‌పార్టీ మూల్యాంకనం పూర్తి చేయాలి. వీటికి కేంద్ర - రాష్ట్రాల నిధుల కేటాయింపు వాటాలను పారదర్శకంగా నిర్ణయించాలి. అవి స్థిరంగా ఉండాలి.


ఆంధ్రప్రదేశ్‌
14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 4.305 శాతం వాటాను సిఫార్సు చేయగా, 15వ ఆర్థిక సంఘం 4.047 (-0.258%) శాతాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం తన మొదటి నివేదికలో 4.111 శాతాన్ని కేటాయించింది. 2021 - 26 మధ్య ఆంధ్రప్రదేశ్‌ రూ.10,900 కోట్లు నష్టపోనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2021 - 26 మధ్య రాష్ట్రానికి రూ. 2,34,013 కోట్లు వస్తాయి. వీటిలో 73% పన్నులు కాగా మిగిలినవి గ్రాంట్ల రూపంలో అందుతాయి. 


తెలంగాణ
* 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 2.43 శాతం వాటాను సిఫార్సు చేయగా, 15వ ఆర్థిక సంఘం 2.102 (-0.328%) శాతాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం తన మొదటి నివేదికలో 2.133 శాతాన్ని కేటాయించింది. 202126 మధ్య తెలంగాణ రూ.9,621 కోట్లు నష్టపోనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 202 1- 26 మధ్య రాష్ట్రానికి రూ. 1,09,786 కోట్లు రానున్నాయి. వీటిలో 73% పన్నులు కాగా మిగిలినవి గ్రాంట్ల రూపంలో అందుతాయి.


15వ ఆర్థిక సంఘం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు అందనున్న వనరులు (రూ.కోట్లలో)

అంశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
పన్నుల్లో వాటా 1,70,976 88,806
రెవెన్యూ లోటు 30,497 0
స్థానిక సంస్థలు 18,063 13,111
ప్రకృతి వైపరీత్య నిర్వహణ 6,183 2,483
న్యాయ వ్యవస్థ 295 245
వైద్యం 877 624
PMGSY రహదారులు 344 255
గణాంకాలు 19 46
ఉన్నత విద్య 250 189
వ్యవసాయం 4,209 1,665
రాష్ట్రప్రత్యేకం 2,300 2,362
మొత్తం 2,34,013 1,09,786
Posted Date : 19-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

   భారతదేశం స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు దాటింది. ఐఎంఎఫ్‌ నివేదిక - 2018 ప్రకారం నామినల్‌ జీడీపీలో ఆరో పెద్ద దేశంగా అవతరించింది. విదేశీ మూలధనంలోనూ ముందంజలో ఉంది. ఇంత అభివృద్ధి సాధించినా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే గుర్తిస్తున్నారు. 

దేశాల వర్గీకరణ
    రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రం పొందిన భారత్‌ లాంటి అనేక దేశాలు అభివృద్ధి కోసం ప్రణాళికలు ప్రారంభించిన నేపథ్యంలో పరిపాలకులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ‘అభివృద్ధి’ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్ర]వ్యనిధి లాంటి సంస్థలు దేశాల ప్రగతికి సహాయం చేయడానికి వివిధ దేశాలను పోల్చుకునే అవసరం ఏర్పడింది. ఫలితంగా మొదట.. ప్రపంచ దేశాలను అభివృద్ధి చెందిన, వెనుకబడిన దేశాలుగా వర్గీకరించి అధ్యయనం చేశారు. ఆ తర్వాత అభివృద్ధి కొనసాగిస్తున్న మూడో రకం దేశాలను అభివృద్ధి చెందుతున్న లేదా వర్ధమాన దేశాలుగా పేర్కొన్నారు. ఈ విభజన కోసం అనేక రకాల సూచికలను ఉపయోగించారు. 

ఆర్థికవ్యవస్థ నిర్మాణంలో మార్పులు
    ఏ దేశ ఆర్థిక ప్రగతి అయినా మూడు రంగాల (ప్రాథమిక, ద్వితీయ, తృతీయ)పై ఆధారపడి ఉంటుందని మొదటిసారి అలెన్‌ ఫిషర్, కొలిన్‌ క్లార్క్, జీన్‌ ఫోర్‌స్టై అనే ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. ఇదే విధానం ఇప్పటికీ అన్ని దేశాలలో అమల్లో ఉంది. వీరి ప్రతిపాదన ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయం, ఉపాధిలో ద్వితీయ, తృతీయ రంగాలు అధిక వాటాను కలిగి ఉంటాయి. దీనికి భిన్నంగా ప్రాథమిక లేదా వ్యవసాయ రంగం వెనుకబడిన దేశాల్లో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈ సూచిక ఆధారంగా 1951 నాటికి మనదేశ జనాభాలో సుమారు 80% ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఈ రంగం నుంచే సగానికిపైగా ఆదాయం లభించేది కాబట్టి మన దేశాన్ని వెనుకబడిన దేశంగా పిలుస్తున్నారు. 
    2018 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పును పరిశీలిస్తే వ్యవసాయ రంగం శ్రామికుల్లో సగం మందికి ఉపాధి కల్పిస్తుంటే మన జాతీయాదాయంలో మాత్రం దాని వాటా గణనీయంగా తగ్గి 14.39%కి చేరింది. సేవల రంగం అతిపెద్ద రంగంగా మారి 54.15% ఆదాయాన్ని అందిస్తుంది. ఉపాధి, ఆదాయంలో వ్యవసాయేతర రంగాల వాటా పెరిగితే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చెప్పవచ్చు. కానీ మనదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే.  

తలసరి ఆదాయం
    ఐక్యరాజ్య సమితి నిపుణుల ప్రకారం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ యూరప్‌ దేశాల వాస్తవ తలసరి ఆదాయం కంటే తక్కువ ఆదాయం కలిగినవన్నీ వెనుకబడిన దేశాలే. ప్రపంచ బ్యాంక్‌ కూడా తలసరి ఆదాయం (బిదీశి ్ప’౯ ‘్చ్పi్మ్చ) ప్రామాణికంగా 1978 నుంచి దేశాల వర్గీకరణను ప్రారంభించింది. ఆయా దేశాల ప్రజల సగటు ఆదాయమైన తలసరి ఆదాయం లెక్కింపులో శాస్త్రీయత, సారుప్యత లోపించి అనేక విమర్శలు రావడంతో ప్రపంచ బ్యాంక్‌ వెనుకబడిన, అభివృద్ధి చెందిన దేశాలు అనే పదాలను పక్కన పెట్టి దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరించింది. 
1) అల్పాదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 995 డాలర్ల కంటే తక్కువ కలిగిన దేశాలు.
2) దిగువ మధ్య ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 996 నుంచి 3895 డాలర్ల మధ్య.
3) ఎగువ మధ్య ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 3896 నుంచి 12055 డాలర్ల మధ్య.
4) అధిక ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 12056 డాలర్ల కంటే ఎక్కువుగా ఉన్న దేశాలు. 
    ప్రపంచ బ్యాంక్‌ నివేదికల ప్రకారం 2001 తర్వాత వివిధ దేశాల అభివృద్ధి తీరుతెన్నుల్లో మార్పులు రావడం వల్ల క్రమంగా అల్పాదాయ దేశాల సంఖ్య తగ్గి అభివృద్ధి చెందుతున్న, అధిక ఆదాయ దేశాల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం పది మందిలో ఒకరు మాత్రమే అల్పాదాయ దేశాల్లో జీవిస్తున్నారు. సుమారు 73 శాతం మంది ప్రజలు వర్ధమాన/మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నారు. 2017 నాటికి ప్రపంచ బ్యాంక్‌ అంచనా ప్రకారం భారత స్థూల జాతీయ తలసరి ఆదాయం (GNP per capita) 1,927  డాలర్లుగా ఉండటంతో మన దేశాన్ని దిగువ మధ్య ఆదాయ దేశంగా చెప్పవచ్చు.

అభివృద్ధి సామర్థ్యం
    జాకోబ్‌ వీనర్‌ లాంటి ఆర్థికవేత్తలు అభివృద్ధి సామర్థ్యం, అవకాశాల ఆధారంగా ఒక దేశ వెనుకబాటుతనాన్ని అంచనావేయడం సులభమని చెప్పారు. వీరి అభిప్రాయం ప్రకారం 1951లో ప్రణాళిక సంఘం ‘తక్కువ ఉపయోగించిన/అసలు ఉపయోగించని మానవ వనరులు, వినియోగించని సహజ వనరులను కలిగి ఉన్న దేశాన్ని వెనుకబడిన దేశం’గా నిర్వచించింది. అయితే ఇటీవల అనేక నూతన సూచికలు అందుబాటులోకి రావడంతో వివిధ దేశాల అభివృద్ధిలోని దశ దిశలను, నాణ్యతను వాటి ద్వారా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా మానవాభివృద్ధి సూచిక, లింగ సాధికారత సూచిక, బహుళ పేదరిక సూచిక, యూఎన్‌వో 17 అంశాల సుస్థిరాభివృద్ధి సూచికలను ఉపయోగిస్తున్నారు. గత 70 ఏళ్ల ప్రగతిలో భారత్, చైనా లాంటి దేశాలు అల్పాదాయ దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిణామం చెందాయి.

భారతదేశ ఆర్థికాభివృద్ధి లక్షణాలు
* మన దేశంలోని సుమారు 46 కోట్ల మంది శ్రామికుల్లో సగం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తూ తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. మనం ఈ రంగాల్లో ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం.
* 1951-1981 మధ్య 30 ఏళ్లపాటు జీడీపీ వృద్ధి రేటు 3.5% మాత్రమే ఉంది. 1981-2001 మధ్య 5.5%, 2001-2018 మధ్య సరాసరి 6.7% మాత్రమే సాధించగలిగాం. 
* జనాభా పెరగడం వల్ల తలసరి ఆదాయం తక్కువగా ఉంది. పట్టణీకరణ, ఆధునికీకరణలో సేవలరంగం పాత్ర పెరుగుతుంది. 
* దేశంలో అక్షరాస్యత 2011 నాటికి 74%కి పెరిగినప్పటికీ విద్యలో నాణ్యత లోపించింది. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (GER) అమెరికా లాంటి దేశాల్లో 80% పైగా ఉండగా మన దేశంలో 25% మాత్రమే ఉంది. 
* ప్రపంచంలో అత్యధిక యువ జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ నిరుద్యోగిత రేటు అధికంగా ఉంది. కేవలం 3% విద్యార్థులు మాత్రమే వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాల్లో ఇది 50%పైగా ఉంది.

* విస్తారమైన అడవులు, ఖనిజాలు, నదులు, సముద్ర తీరప్రాంతం ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నాం. ఇప్పటికీ మన దేశంలో 60% సాగు రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది.
* భారత్‌ లాంటి దేశాల్లో మూలధన కల్పన తక్కువగా ఉండటం వల్ల అల్ప వృద్ధి రేటు, సహజవనరుల వినియోగం తక్కువగా ఉంటుంది. 1950-51లో దేశ జీడీపీలో పొదుపు 8.9% ఉండగా ఇటీవల 30%కి చేరింది. అయితే ఆ సమయంలో మూలధన నిష్పత్తి ఎక్కువగా ఉంది. మన దేశంలో 2012-13 నుంచి 2016-17 మధ్య 6.3 - 4.0 శాతానికి తగ్గింది. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరుల నాణ్యత పెరిగేకొద్దీ మూలధన నిష్పత్తి తగ్గుతుంది. అమెరికా, జపాన్‌ దేశాల్లో ఈ నిష్పత్తి ఇంకా తక్కువగా ఉండటం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి సాధిస్తున్నారు. 
* రంగరాజన్‌ కమిటీ ప్రకారం 2011-12 నాటికి భారత్‌లో 29.5% మంది పేదరిక గీత కింద ఉన్నారు అంటే పది మందిలో ముగ్గురు పేదవారే. 
* గ్రామాల్లో ప్రచ్చన్న నిరుద్యోగం ఉండగా పట్టణాల్లో చదువుకున్న యువతలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరుగుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం 2014-2019 కాలానికి భారతదేశంలో నిరుద్యోగిత రేటు 3.6%గా ఉంది. గతంలో కంటే నిరుద్యోగిత రేటు పెరగడం గమనార్హం.

* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్వంద్వ ఆర్థిక లక్షణాలు ఎక్కువ. పరస్పర విరుద్ధమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, డిమాండు స్థాయులు దేశంలో కనిపిస్తాయి. 
    ఉదా: భారీయంత్రాలు వాడే పరిశ్రమలు - మానవ శ్రమతో కూడిన కుటీర పరిశ్రమలు.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ వ్యాపార లోటు సహజంగా ఉంటుంది. ఈ దేశాల్లో అవసరాలు ఎక్కువ. మన దేశం ప్రధానంగా ఆయిల్, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలు, బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ మనం వ్యవసాయ, వస్త్ర, ముడి ఖనిజాల ఉత్పత్తులపైనే ఆధారపడుతున్నాం. దిగుమతుల కంటే ఎగుమతుల విలువ తక్కువగా ఉండటం వల్ల విదేశీ వ్యాపారఖాతాలో లోటు ఉంటుంది. మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధిలో మన దేశం మధ్య స్థాయి పనితీరును కనబరుస్తుంది.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మాన‌వాభివృద్ధిలో భార‌త‌దేశం   

       ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం మానవాభివృద్ధి. యూఎన్‌డీపీ 1990 నుంచి మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా పేదల సాధికారత, సుస్థిర అభివృద్ధికి అనేక ప్రయత్నాలు జరిగాయి. భారతదేశం కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్‌ శాస్త్రవేత్త మహబూబ్‌ ఉల్‌హక్‌ సమగ్రమైన అభివృద్ధికి కొలమానంగా మానవాభివృద్ధిని సూచించారు. మన దేశ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ మానవాభివృద్ధి సూచికను సమర్థించి అభివృద్ధి పరిచారు.
                     మొదటి మానవాభివృద్ధి నివేదిక (Human development report)లో  తొలిమాటగా హక్‌ ‘ప్రజలే ఒక దేశానికి నిజమైన సంపద’ అని పేర్కొన్నారు. ప్రజలు సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడమే పాలన ప్రథమ ధ్యేయం కావాలని పిలుపునిచ్చారు. మానవాభివృద్ధి మనుషుల సుసంపన్న మనుగడను కోరుకుంటుంది. ఇది ప్రజల ఎదుగుదలకు అవకాశాలు కల్పించి వాటి ఎంపికలో తగిన స్వేచ్ఛను అందిస్తుంది. మానవాభివృద్ధి సూచిక అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ పాలకుల ఆలోచన, ప్రాధాన్యాల అమలుతీరులో మార్పు మొదలైంది. ప్రపంచ దేశాలను పరిశీలించి వాటికి ర్యాంకులు ప్రకటించడం వల్ల దేశాల మధ్య పోటీ ఏర్పడింది.   
* ప్రస్తుతం యూఎన్‌డీపీ మూడు అంశాల ఆధారంగా ప్రపంచ మానవాభివృద్ధి సూచికను లెక్కిస్తుంది.
    1) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచిక 
    2) విజ్ఞాన సూచిక (చదువుకునే అంచనా సంవత్సరాలు + చదువులో పిల్లలు కొనసాగే సగటు సంవత్సరాలు) 
    3) GNP per capita (ppp US $)

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం   
    1990 నుంచి ఇప్పటి వరకు యూఎన్‌డీపీ ఏటా మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్‌లో 1965, నవంబరు 22న ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలందించే స్వచ్ఛంద విరాళాలతో పనిచేస్తుంది. దాదాపు 180 దేశాల ప్రభుత్వాలతో కలిసి స్థానిక అభివృద్ధి సమస్యల గురించి అవగాహన కల్పిస్తుంది. ప్రభుత్వాల సామర్థ్యాలను పెంచి పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ప్రపంచ మానవాభివృద్ధి నివేదికతో పాటు స్థానిక, ప్రాంతీయ, జాతీయ నివేదికలను తయారుచేసి అందజేస్తుంది.

మన దేశ ప్రయత్నాలు 
    యూఎన్‌డీపీ భారతదేశంలో మానవాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 42 ప్రాజెక్టులు అమలు చేస్తూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వామిగా ఉంది. వీటిలో శక్తి, పర్యావరణం (25); పేదరిక నిర్మూలన (9), ప్రజాస్వామ్య పాలన (7), ప్రకృతి వైపరీత్యాలకు (1) సంబంధించిన ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో అయిదు నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి. ప్రభుత్వాలు 1947 నుంచి వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజల ఆదాయవృద్ధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. 

భారతదేశ ప్రగతి
    ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం 189 దేశాలను పరిశీలించి ఆయా దేశాల ప్రగతి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుంది. 2018 నివేదిక ప్రకారం నార్వే మొదటి స్థానం, నైజర్‌ 189వ స్థానంలో ఉన్నాయి. భారత్‌ 2017లో 131వ స్థానంలో ఉండగా 2018లో 130వ స్థానాన్ని పొందింది. 1990 నాటి మొదటి నివేదిక ప్రకారం భారత్‌ 114వ స్థానంలో ఉంది. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచిక విలువను 0  1 మధ్య లెక్కించి ప్రపంచ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది.  

1) అత్యధిక మానవాభివృద్ధి దేశాలు: 0.80  - 1
    నార్వే, స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా, జపాన్, సౌదీ అరేబియా  

2) అధిక మానవాభివృద్ధి దేశాలు: 0.7  - 0.8
    చైనా, బ్రెజిల్, ఇరాన్, మెక్సికో, థాయ్‌లాండ్, శ్రీలంక  

3) మధ్య స్థాయి మానవాభివృద్ధి దేశాలు: 0.55  - 0.7 
    బంగ్లాదేశ్, ఇండియా, భూటాన్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా  

4) తక్కువ మానవాభివృద్ధి దేశాలు: 0.55 కంటే తక్కువ
    అఫ్గానిస్థాన్, బురుండి, నైజీరియా, టాంజానియా, ఉగాండా  
    1990లో భారతదేశ మానవాభివృద్ధి సూచిక విలువ 0.427 నుంచి 2000 సంవత్సరం నాటికి 0.493 కు పెరిగింది. అంటే తక్కువ మానవాభివృద్ధి దేశంగా దాదాపు దశాబ్ద కాలం కొనసాగింది. ఈ విలువ 2012లో 0.600 కు, 2018లో 0.640 కు వృద్ధి చెంది మధ్య స్థాయి మానవాభివృద్ధి దేశాల జాబితాలో చేరింది. చైనా, శ్రీలంక మినహా ఇతర పొరుగు దేశాలు ర్యాంకుల్లో తేడా ఉన్నప్పటికీ మధ్య స్థాయి జాబితాలోనే ఉన్నాయి. 1990 నుంచి మన దేశ సూచిక విలువ దాదాపు 50% పెరగడాన్ని పేదరికంపై విజయంగా పేర్కొనవచ్చు. 1990  2017 మధ్య మన దేశ తలసరి ఆదాయంలో అత్యధికంగా 266.6% వృద్ధి నమోదైంది. 1990 కంటే ప్రస్తుత సగటు జీవనకాలం 11 సంవత్సరాలు, సగటు పాఠశాలలో గడిపే కాలం 4.7 సంవత్సరాలు పెరిగింది. 
    మానవాభివృద్ధి సూచిక ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం అన్నింట్లో వెనుకబడి ఉంది. ఆర్థిక అసమానతలు అధికమవడం వల్ల 26.8% మానవాభివృద్ధిని కోల్పోయాం. శ్రామిక మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం కేవలం 27.2% ఉండగా పురుషులది 78.8%. అంటే లింగ సమానత్వంలో మన దేశం ఇంకా వెనుకబడి ఉంది. విద్య, ఆరోగ్య సేవల్లో నాణ్యత లోపించింది. మానవాభివృద్ధిలో రాష్ట్రాల మధ్య అసమానతలు ఉన్నాయి. కేరళ అగ్రస్థానంలో, బిహార్‌ చివరి స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 27వ స్థానంలో ఉండి మధ్య స్థాయి మానవాభివృద్ధి రాష్ట్రంగా కొనసాగుతుంది. 

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మాన‌వాభివృద్ధిలో భార‌త‌దేశం   

మాదిరి ప్రశ్నలు


1.  ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ప్రకారం మానవాభివృద్ధి సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?
    1) 130     2) 131     3) 136     4) 140

2. మానవాభివృద్ధి సూచీలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
    1) బిహార్‌     2) కేరళ     3) తమిళనాడు     4) ఆంధ్రప్రదేశ్‌

3. మానవాభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్‌ ఏ స్థానంలో ఉంది?
    1) 27     2) 28     3) 29     4) 30

4. యూఎన్‌డీపీ ప్రపంచ మానవాభివృద్ధి సూచికను ఏ అంశాల ఆధారంగా లెక్కిస్తుంది?
    ఎ) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచిక
    బి) విజ్ఞాన సూచిక (చదువుకునే అంచనా సంవత్సరాలు ్ఘ చదువులో పిల్లలు కొనసాగే సగటు సంవత్సరాలు)
    సి) GNP per capita (ppp US $)
    1) ఎ, బి      2) బి, సి     3) సి, ఎ     4) అన్నీ 

5. యూఎన్‌డీపీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (దీన్ని 1965 నవంబరు 22న స్థాపించారు)
   1) న్యూయార్క్‌     2) పారిస్‌     3) జెనీవా     4) దిహేగ్

జ‌వాబులు : 1-1, 2-2, 3-1, 4-4, 5-1

 

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భార‌త ఆర్థికవ్య‌వ‌స్థ ల‌క్ష‌ణాలు   

మాదిరి ప్రశ్నలు

1. 2018 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో భారతదేశ స్థానం?
    1) 3         2) 2         3) 4         4) 6                                            

2. అభివృద్ధి చెందుతున్న దేశం అంటే?
    1) వెనుకబడిన దేశం         2) అభివృద్ధి చెందిన దేశం
    3) వర్ధమాన దేశం        4) అభివృద్ధి తిరోగమన దేశం       

3. ప్రపంచ దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్‌ ఉపయోగించిన ప్రమాణం?
    1) GNP per capita     2) GDP per capita 
    3) NNP per capita     4) GAV per capita 

4. కిందివాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాల్లో సరికానిది?
    ఎ) తక్కువ తలసరి ఆదాయం      బి) తక్కువ పారిశ్రామికాభివృద్ధి
    సి) తక్కువ పొదుపు          డి) తక్కువ ఎగుమతులు
    1) ఎ, బి      2) ఎ, సి      3) సి, డి      4) అన్నీ               

5. రంగరాజన్‌ కమిటీ ప్రకారం 2011-12 నాటికి భారత్‌లో ఎంత శాతం మంది పేదరిక గీత కింద జీవిస్తున్నారు?
    1) 29.5%    2) 27.5%     3) 30.5%    4) 39.5%

6. మన దేశంలో..... 
    1) జనసంఖ్య, మానవ వనరులు ఎక్కువ
    2) జనసంఖ్య, మానవ వనరులు తక్కువ
    3) జనసంఖ్య ఎక్కువ, మానవ వనరులు తక్కువ
    4) జనసంఖ్య తక్కువ, మానవ వనరులు ఎక్కువ

7. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ వ్యాపార లోటుకు కారణం?
    1) ఎగుమతులు లేకపోవడం            2) ఎగుమతులు చేయకపోవడం
    3) ఎగుమతుల్లో నాణ్యత లోపించడం  4) ఎగుమతులు తక్కువగా ఉండటం

సమాధానాలు: 1 - 4; 2 - 3; 3 - 1; 4 - 4; 5 - 1; 6 - 3; 7 - 4.

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయాదాయం

ఒక దేశంలో సంవత్సరం కాలంలో తయారైన మొత్తం వస్తుసేవల అంతిమ నికర విలువనే జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక కార్యకలాపాల వల్ల వస్తుసేవల ఉత్పత్తి పెరిగితే దేశ ఆదాయం పెరుగుతుంది. అంటే ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయానికి సంబంధం ఉంటుంది.

జాతీయాదాయ భావనలు

స్థూల దేశీయోత్పత్తి (GDP): ఒక దేశంలో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసే మొత్తం వస్తుసేవల విలువను స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఈ భావనలో పరిగణించే వస్తుసేవలను అంతిమ వస్తుసేవలుగా భావించాలి. జాతీయాదాయ అంచనాల్లో అంతిమ వస్తువులనే లెక్కిస్తారు. అంతిమ ఉత్పత్తిలో నాలుగు అంశాలు ఉంటాయి. 

    1) వినియోగం 2) పెట్టుబడి 3) ప్రభుత్వ కొనుగోళ్లు 4) నికర లాభాలు (ఎగుమతులు - దిగుమతులు)

నికర జాతీయోత్పత్తి (NNP): వస్తుసేవల ఉత్పత్తిలో యంత్ర పరికరాల ఉపయోగం వల్ల అరుగుదల, తరుగుదల ఉంటాయి. మొత్తం ఉత్పత్తిలో అరుగుదల, తరుగుదలను మినహాయిస్తే నికర జాతీయోత్పత్తి తెలుస్తుంది.

    నికర జాతీయోత్పత్తి  = స్థూల జాతీయోత్పత్తి - తరుగుదల 

జాతీయాదాయం (National Income): భూమి, శ్రామికులు, మూలధనం లాంటి ఉత్పత్తి కారకాలు సంపాదించిన ఆదాయాల మొత్తాన్ని జాతీయాదాయంగా చెప్పవచ్చు. నికర జాతీయోత్పత్తిలో పరోక్ష వ్యాపార పన్నులను (ఆస్తిపన్ను, అమ్మకం పన్ను) మినహాయిస్తే జాతీయాదాయం వస్తుంది.

    జాతీయాదాయం = నికర జాతీయోత్పత్తి - పరోక్ష పన్నులు

వైయక్తిక/వ్యక్తిగత ఆదాయం (Personal Income): ఒక కుటుంబానికి వివిధ మార్గాల నుంచి లభించే మొత్తం ఆదాయాన్ని వైయక్తిక ఆదాయం అంటారు.

వ్యయార్హ ఆదాయం (Disposable Income): వైయక్తిక ఆదాయంలో వ్యక్తిగత పన్నులను మినహాయిస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. వ్యక్తి వినియోగానికి, పొదుపు చేయడానికి ఉపయోగపడే ఆదాయం వ్యయార్హ ఆదాయం.

కలపబడిన స్థూల విలువ (Gross Value Added): ఉత్పత్తి చేసిన అన్ని వస్తుసేవల స్థూల విలువ నుంచి వాటి ఉత్పత్తి కోసం ఉపయోగించిన ఉత్పాదకాల విలువను తీసివేస్తే కలపబడిన స్థూల విలువ తెలుస్తుంది. దీన్నే జాతీయ ఉత్పత్తిగా పేర్కొంటారు.

కలపబడిన నికర విలువ (Net Value Added): కలపబడిన స్థూల విలువ నుంచి స్థిర మూలధన వినియోగ విలువ తీసివేస్తే కలపబడిన నికర విలువ తెలుస్తుంది.

తలసరి ఆదాయం లేదా తలసరి స్థూల జాతీయోత్పత్తి (PCI): సగటున ఒక వ్యక్తి పొందే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. జాతీయాదాయాన్ని మొత్తం దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది

జాతీయాదాయ అంచనాలు

    స్వాతంత్య్రానికి పూర్వం మన దేశంలో జాతీయాదాయాన్ని మొదటిసారి గణించినవారు దాదాభాయ్‌ నౌరోజీ.  ఈయన పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. సంపద దోపిడి (డ్రైన్‌ థియరీ) సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈయన 1868 సంవత్సరానికి సంబంధించిన జాతీయాదాయ అంచనాలు తయారుచేశారు. ఆ తర్వాత లెక్కించినవారు విలియం డిగ్బీ (1899), ఎఫ్‌.షిర్రాస్‌ (1911, 1922, 1931), షా (1921), కాంబట్టా (1925 - 29), ఆర్‌.సి.దేశాయ్‌ (1931 - 40).

    స్వాతంత్య్రానికి ముందు దేశంలో శాస్త్రీయ లేదా ఒక క్రమ పద్ధతిలో తొలిసారిగా జాతీయాదాయాన్ని 1931 - 32లో డాక్టర్‌ వి.కె.ఆర్‌.వి.రావు (విజయేంద్ర కస్తూరిరంగా వరదరాజారావు) అంచనా వేశారు. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం 1949లో జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి, దత్తాంశాల సేకరణకు ఒక సమగ్రమైన పద్ధతిని రూపొందించడానికి జాతీయాదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి పి.సి.మహలనోబిస్‌ అధ్యక్షత వహించగా డి.ఆర్‌.గాడ్గిల్, వి.కె.ఆర్‌.వి.రావు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 1948 - 49 నుంచి 1950 - 51 వరకు జాతీయాదాయానికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తూ తన మొదటి నివేదికను 1954 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించింది.

జాతీయాదాయ అంచనా - సంస్థల ఏర్పాటు

    జాతీయాదాయాన్ని అంచనావేయడానికి 1951లో కేంద్ర గణాంక సంస్థను (Central Statistical Organisation) ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. 1954 నుంచి 2019 వరకు సీఎస్‌వో జాతీయాదాయాన్ని అంచనావేసింది. జాతీయ నమూనా సర్వేక్షణ సంస్థ (National Sample Survey Organisation) ను 1950లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. 2019లో ఎన్‌ఎస్‌ఎస్‌వో, సీఎస్‌వోలను విలీనం చేసి ‘జాతీయ గణాంక సంస్థ’ (National Statistical Office) గా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ సంస్థ 2019 నుంచి మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది.

    జాతీయ గణాంక సంస్థ (NSO) వివిధ ఆధార సంవత్సరాల ప్రాతిపదికన జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది. 

    1) 1948 - 49

    2) 1960 - 61

    3) 1970 - 71

    4) 1980 - 81

    5) 1993 - 94

    6) 1999 - 2000

    7) 2004 - 05

    8) 2011 - 12 (ప్రస్తుతం)

    ప్రస్తుతం మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనావేయడానికి తీసుకుంటున్న ప్రాతిపదిక/ఆధార సంవత్సరం 2011 - 12 (8వది). 2011 - 12 ప్రాతిపదిక సంవత్సరాన్ని 2017 - 18 ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకోవాలని ప్రతిపాదన చేస్తున్నారు.

జాతీయాదాయ అంచనా - రంగాల విభజన

    ఎన్‌ఎస్‌వో ప్రస్తుత లేదా మార్కెట్ ధ‌ర‌లు, నిల‌క‌డ ధ‌ర‌ల్లో జాతీయాదాయాన్ని అంచనావేస్తుంది. జాతీయాదాయాన్ని అంచనావేయడానికి ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల విభజనను కింది విధంగా ఉపయోగిస్తుంది. 

1) ప్రాథమిక రంగం: వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు; అడవులు, చేపల పెంపకం, గనులు.

2) ద్వితీయ రంగం: వస్తు తయారీ, విద్యుత్, గ్యాస్, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం. 

3) తృతీయ రంగం/సేవా రంగం: బ్యాంకులు, బీమా, రవాణా, కమ్యూనికేషన్స్, వ్యాపారం, వర్తకం. 

జాతీయాదాయాన్ని కొలిచే పద్ధతులు

    జాతీయ గణాంక సంస్థ జాతీయాదాయాన్ని అంచనావేయడానికి కింది పద్ధతులను ఉపయోగిస్తుంది.  

1)     ఉత్పత్తి మదింపు పద్ధతి: దీన్ని ఇన్వెంటరీ పద్ధతి, వాల్యు యాడెడ్‌ మెథడ్‌ అంటారు. ఒక దేశంలోని వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన మొత్తం వస్తుసేవల ద్రవ్య విలువను జాతీయాదాయంగా చెప్పవచ్చు.

2)     ఆదాయ మదింపు పద్ధతి: ఇందులో ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఉత్పత్తి కారకాలు పొందే మొత్తం ఆదాయాలను కలపడం ద్వారా దేశ జాతీయాదాయాన్ని నిర్ణయిస్తారు. 

3)     వ్యయాల మదింపు పద్ధతి: ఇందులో అంతిమ వస్తుసేవలపై ఖర్చు చేసిన మొత్తాలను కలపడం ద్వారా జాతీయాదాయాన్ని లెక్కిస్తారు.

*  ముఖ్యంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతులను ఉపయోగించి జాతీయాదాయాన్ని అంచనావేస్తుంది. 

జాతీయదాయ అంచనాల వల్ల ఉపయోగాలు

*  ఆర్థిక వ్యవస్థ మొత్తం పనితీరును విశ్లేషిస్తుంది.

స్థూల జాతీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాలు, వాటి ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.

*   దేశ ఆర్థిక ప్రగతిని తెలుసుకోవచ్చు.

*   పన్నుల విధానంలోని మార్పులు తెలుసుకోవచ్చు

*   ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తెలుసుకోవచ్చు.

*   దేశంలోని వినియోగం, పొదుపు స్థాయిని తెలుసుకోవచ్చు. 

*    2021 - 22 భారత ఆర్థిక సర్వే ప్రకారం 2021 నాటికి  జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా 18.8%, పరిశ్రమల రంగం వాటా 28.2%, సేవారంగం వాటా 53 శాతంగా ఉంది. దీనిలో సేవారంగం వాటా ఎక్కువగా, వ్యవసాయ రంగం వాటా తక్కువగా ఉంది. 

*    2021 - 22 భారత ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుత ధరల్లో స్థూల జాతీయాదాయం రూ.2,30,38,772 కోట్లు కాగా స్థిర ధరల్లో రూ.1,46,40,445 కోట్లుగా ఉంది. 

*    ప్రస్తుత ధరల్లో నికర జాతీయాదాయం రూ.2,05,73,371 కోట్లు ఉండగా స్థిర ధరల్లో రూ.1,28,61,032 కోట్లుగా ఉంది. 

*     ప్రస్తుత ధరల్లో తలసరి నికర జాతీయాదాయం రూ.15,03,326 ఉండగా స్థిర ధరల్లో రూ.93,973గా ఉంది. 


    రచయిత: బండారి ధనుంజయ

మరింత సమాచారం ... మీ కోసం!

ఆర్థిక సంఘం

వస్తు సేవల పన్ను

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ మార్కెట్

ఆర్థిక వృద్ధి - సూచికలు

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ మార్కెట్

* సెక్యూరిటీ కాంట్రాక్టుల (క్రమబద్ధ) చట్టం - 1956 ప్రకారం ‘సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని నియంత్రించడానికి లేదా సులభతరం చేయడానికి ఏర్పాటు చేసిన సంఘాన్ని ‘స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌’ (Stock Exchange) అంటారు. నమోదైన లేదా నమోదు కాని వ్యక్తులు ఈ సంఘంలో ఉంటారు.
* వ్యవస్థీకృత మూలధన మార్కెట్‌లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ముఖ్యమైన భాగం. ఇందులో పారిశ్రామిక, వ్యాపార సంస్థల వాటాలు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, ఇతర సెక్యూరిటీల క్రయవిక్రయాలు జరుగుతాయి. దీన్నే స్టాక్‌ మార్కెట్‌ అని కూడా పిలుస్తారు. దేశంలోని ఆర్థిక వాతావరణానికి దీన్ని భారమితిగా పేర్కొంటారు.
* కంపెనీల చట్టం ప్రకారం కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అధికారిక జాబితాల్లో నమోదు చేసుకోవచ్చు. ఇందులో చేర్చిన సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ పరిధిలో జరుగుతాయి. జాబితాలో చేర్చని సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లను మధ్యవర్తులు (బ్రోకర్లు) ఎక్స్ఛేంజ్‌ వెలుపల నిర్వహిస్తారు. ప్రభుత్వ సెక్యూరిటీలకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి పొందిన ప్రభుత్వ బ్రోకర్లు ఉంటారు.
* స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ జాబితాలో చేర్చిన సెక్యూరిటీలకు మార్కెట్‌లో న్యాయబద్ధమైన ధర లభిస్తుంది. పన్నుల విధింపులోనూ కొన్ని రాయితీలు లభిస్తాయి. ఈ సెక్యూరిటీలకు ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది. పరపతిని సులభంగా పొందొచ్చు. వాటాల బదిలీ కూడా తేలిగ్గా జరుగుతుంది. ఇలాంటి సెక్యూరిటీలు ఉన్న కంపెనీలకు మార్కెట్‌లో గౌరవం, నమ్మకం ఎక్కువగా ఉంటాయి.  

 

షేర్‌/ వాటా: షేర్‌ అంటే వాటా లేదా భాగం అని అర్థం. ఏదైనా కంపెనీ షేర్‌ను కొంటే అందులో మనకు భాగం ఉందని అర్థం. వ్యాపార విస్తరణకు, వస్తూత్పత్తికి, నిర్వహణ సంబంధిత కార్యకలాపాలకు అవసరమయ్యే డబ్బును సమకూర్చుకునేందుకు కంపెనీలు వాటాలు లేదా షేర్లను విక్రయిస్తాయి. క్రయ, విక్రయాలు: ఒక కంపెనీకి మెరుగైన లాభాలు వస్తే, దాని షేర్లు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. నష్టాలు వస్తే అప్పటికే కొన్నవారు వాటిని విక్రయించాలనుకుంటారు. ఈ క్రయ, విక్రయాలను స్టాక్‌ మార్కెట్‌లో జరుపుతారు. ఇక్కడ వాటాలు ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతాయి. అందుకే వీటిని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు అంటారు.


మార్కెట్‌ క్రాష్‌: షేర్ల ధరలు ఉన్నట్లుండి పడిపోతే దాన్ని మార్కెట్‌ క్రాష్‌ అంటారు.
ఉదా: 1992లో హర్షద్‌ మెహతా చేసిన సెక్యూరిటీస్‌ కుంభకోణం వల్ల షేర్‌ మార్కెట్‌  క్రాష్‌కు గురైంది. కేతన్‌ పరేఖ్‌ సెక్యూరిటీల విలువను కృత్రిమంగా సృష్టించాడు. దీంతో 2001లో మార్కెట్‌ మరోసారి పతనమైంది.


మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌: మొత్తం షేర్ల సంఖ్యను మార్కెట్‌ విలువతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అంటారు. దీని ఆధారంగానే కంపెనీల షేర్ల పరిస్థితి తెలుస్తుంది.


లిస్టెడ్‌ సెక్యూరిటీలు: వివిధ కంపెనీలు తమ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్, లిస్ట్‌ చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంటాయి. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సంవత్సరానికి కొంత మొత్తం ఫీజు చెల్లించాలి. ఇలా చేసే కంపెనీల షేర్లను లిస్టెడ్‌ సెక్యూరిటీస్‌ అంటారు.


పర్మిటెడ్‌ సెక్యూరిటీలు: కొన్ని సందర్భాల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌తో కంపెనీలు ఒప్పందం చేసుకుంటాయి. ఈ మేరకు వాటి షేర్లను ట్రేడింగ్‌ చేయడానికి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బ్రోకర్లకు అనుమతి ఇస్తుంది. వీటిని పర్మిటెడ్‌ సెక్యూరిటీలు అంటారు.


స్పెసిఫైౖడ్‌ లేదా ‘ఎ’ గ్రూప్‌ షేర్లు: ఎక్కువ మంది షేర్‌ హోల్డర్లు అధిక పెట్టుబడి పెట్టిన పెద్ద కంపెనీల షేర్లను స్పెసిఫైడ్‌ షేర్లు లేదా ఎ గ్రూప్‌ షేర్లు అంటారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఈ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ విషయంలో  బ్రోకర్లకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది.


నాన్‌ స్పెసిఫైడ్‌ లేదా ‘బి’ గ్రూప్‌ షేర్లు: తక్కువ మంది షేర్‌ హోల్డర్లు, తక్కువ పెట్టుబడి కలిగి, అంతగా ప్రాముఖ్యత లేని, కొంత మేరకు మాత్రమే పరిమితమయ్యే కంపెనీల షేర్లను నాన్‌ స్పెసిఫైడ్‌ షేర్లు లేదా ‘బి’ గ్రూప్‌ షేర్లు అంటారు.


కెర్బ్‌ ట్రేడింగ్‌: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు పనిచేసేందుకు పరిమిత పని గంటలు ఉంటాయి. ఈ సమయంలోనే ట్రేడింగ్‌ జరగాలి. ఈ ట్రేడింగ్‌ అంతా నమోదవుతుంది. పని గంటలు అయ్యాక కూడా స్టాక్‌ బ్రోకర్లు కొంతసేపు షేర్లకు సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లను అనధికారికంగా కొనసాగిస్తారు. దీన్నే ‘కెర్బ్‌ ట్రేడింగ్‌’ అంటారు.


బుల్స్‌: షేర్‌ మార్కెట్‌లో వ్యాపారం చేసే వాళ్లలో బుల్స్‌ అనేది ఒక కేటగిరి. దేశ ఆర్థిక పరిస్థితి, కంపెనీల ఫలితాలు, డివిడెండ్లు, బోనస్‌లు, వివిధ కంపెనీల విస్తరణ, బడ్జెట్‌ లాంటి విషయాల కారణంగా మార్కెట్‌లో మార్పులు సంభవిస్తాయి. వీటి వల్ల వివిధ కంపెనీల షేర్ల ధరలు పెరుగుతాయని భావించి భవిష్యత్తులో లాభాలు స్వీకరించవచ్చనే ఉద్దేశంతో ట్రేడింగ్‌ చేసే వారిని బుల్స్‌ అంటారు. వీరు ఆశావాదులు. రానున్న కాలంలో ధరలు పెరుగుతాయని ఊహించి, ప్రస్తుత రేట్ల వద్ద సెక్యూరిటీలు కొని, విలువ పెరిగాక షేర్లను విక్రయిస్తారు.


బేర్‌లు: భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఊహించి, సెక్యూరిటీలను అమ్మేవారిని బేర్‌లు అంటారు. వీరు నిరాశావాదులు.


స్టాగ్‌లు: వీరు బుల్స్‌లాగానే భవిష్యత్తులో సెక్యూరిటీల ధరలు పెరుగుతాయని ఊహిస్తారు. కొత్త కంపెనీ జారీ చేసిన సెక్యూరిటీలకు ఎక్కువ దరఖాస్తు రుసుం చెల్లించి, పెద్ద మొత్తంలో వాటికోసం నమోదు చేసుకునే వారే స్టాగ్‌లు. వీరి చర్యల వల్ల సెక్యూరిటీలకు కృత్రిమ డిమాండ్‌ ఏర్పడి ధరలు పెరుగుతాయి. కానీ వీటి ధరలు త్వరలోనే తగ్గిపోతాయి.


లేమ్‌డక్‌లు: వీరి దగ్గర సెక్యూరిటీలు లేనప్పటికీ అమ్మడానికి కాంట్రాక్టులు రాసి, వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరల వద్ద సెక్యూరిటీలు కొనడానికి అన్వేషిస్తుంటారు.


ఫండమెంటల్‌ ఎనాలసిస్‌: ఒక కంపెనీ పనితీరు, ఆర్థిక పరిస్థితి, లాభాలు, విస్తరణ, వాటాలు, డిబెంచర్లు లాంటి విషయాలకు సంబంధించిన విశ్లేషణను ఫండమెంటల్‌ ఎనాలసిస్‌ అంటారు. ఇందులో వివిధ పన్నులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు లాంటి అంశాలను విశ్లేషిస్తారు.


టెక్నికల్‌ ఎనాలసిస్‌: స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ జరుగుతున్న పలు కంపెనీల షేర్ల లభ్యత ఆధారంగా ఈ ఎనాలసిస్‌ ఉంటుంది. కంపెనీ షేర్ల డిమాండ్, సప్లయ్‌ అంశాల ఆధారంగా జరిగే ట్రేడింగ్‌ను ఇది విశ్లేషిస్తుంది. వివిధ కంపెనీల షేర్ల విలువలను వాటి కదలికలను గ్రాఫ్‌ల రూపంలో వివరిస్తుంది.


బుక్‌: ఇది నిర్దిష్ట షేర్లకు సంబంధించిన కొనుగోలు, విక్రయ ఆర్డర్ల పెండింగ్‌ జాబితాను నిర్వహించే ఎలక్ట్రానిక్‌ రికార్డు. ఇందులో ఏ షేర్ల కొనుగోళ్లకు బిడ్‌లు, విక్రయానికి ఆఫర్లు వచ్చాయనే వివరాలుంటాయి.


బుక్‌ వాల్యూ: ఒక కంపెనీ మూలధనాన్ని, రిజర్వ్‌ నిధులను అది జారీచేసిన వాటాలతో భాగిస్తే వచ్చేదాన్ని బుక్‌ వాల్యూ అంటారు. ఇది షేర్‌ అసలు ధరను ప్రతిబింబిస్తుంది.


రైట్స్‌ ఇష్యూ: వివిధ కంపెనీలు విస్తరణ, తదితర కారణాలతో మూలధనాన్ని తిరిగి వాటాదారుల వద్ద నుంచి సేకరించాలని నిర్ణయిస్తాయి. దీనికి ప్రతిఫలంగా వాటాదారులకు మరికొన్ని వాటాలను కేటాయిస్తారు. సాధారణంగా వాటాదారులకు రైట్స్‌ ఇష్యూ ద్వారా మార్కెట్‌ ధర కంటే తక్కువకు షేర్లు లభ్యమవుతాయి.


బోనస్‌ ఇష్యూ: గణనీయంగా లాభాలు సంపాదించేవి, రిజర్వులు అధికంగా ఉన్న కంపెనీలు తమ వాటాదారులకు రిజర్వుల నుంచి ఉచితంగా కొన్ని షేర్లను కేటాయిస్తాయి. ఈ విధంగా అవి వాటాదారుల నుంచి ఎలాంటి సొమ్ము వసూలు చేయకుండా వాటాలు కేటాయించడాన్ని బోనస్‌ షేర్లు లేదా బోనస్‌ ఇష్యూ ప్రకటించడం అంటారు.


ప్రాథమిక షేర్‌ మార్కెట్‌
ఒక కంపెనీ మూలధనం కోసం ప్రజల నుంచి వాటాల రూపంలో డబ్బును సేకరించే ప్రక్రియను షేర్‌ మార్కెట్‌లో ప్రాథమిక మార్కెట్‌గా వ్యవహరిస్తారు. ఇలా పెట్టుబడి సమీకరణకు కంపెనీలు జారీచేసే షేర్ల ప్రక్రియను పబ్లిక్‌ ఇష్యూ అని కూడా అంటారు. పబ్లిక్‌ ఇష్యూ జారీచేసే సమయంలో కంపెనీ ఉత్పత్తులు, ప్రమోటర్ల వివరాలు, ఉత్పత్తి ప్రారంభమయ్యే కాలం, సేకరిస్తున్న మూలధన వివరాలు లాంటి విషయాలను కంపెనీలు వివరంగా ప్రకటించాలి. సాధారణంగా ప్రాథమిక షేర్‌ మార్కెట్‌లో పొదుపు చేయడం శ్రేయస్కరమని పెట్టుబడిదారులు భావిస్తారు.


ద్వితీయ షేర్‌ మార్కెట్‌ 
పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియ పూర్తి చేసిన కంపెనీల షేర్లు మార్కెట్‌లో ట్రేడ్‌ అవుతాయి. ఈ విధమైన షేర్లను కొనడం లేదా అమ్మడాన్ని ద్వితీయ మార్కెట్‌ (సెకండరీ షేర్‌ మార్కెట్‌) విధానంగా పేర్కొంటారు. వివిధ కంపెనీలు ప్రకటించే లాభాలు, బోనస్‌లు, డివిడెండ్‌లు, రైట్స్‌ లాంటి అనేక విషయాల ప్రాతిపదికన ద్వితీయ మార్కెట్‌లో షేర్లను కొంటారు. ఈ షేర్ల కొనుగోలుకు  మార్కెట్‌లో ఉన్న రేటును చెల్లించాలి.


ప్రాఫిట్‌ ఈక్విటీ రేషియో
వివిధ కంపెనీల షేర్ల విలువకు, ఆ కంపెనీ షేర్ల మీద వచ్చే రాబడికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రాఫిట్‌ ఈక్విటీ రేషియో అంటారు. ఒక షేర్‌ను ఎన్ని రెట్లు ఎక్కువ ధరకు కొంటున్నామో దీని ఆధారంగానే తెలుస్తుంది. కంపెనీ షేర్‌ ధరను ఆ కంపెనీ ఈక్విటీ ప్రాఫిట్‌ రేషియోతో భాగిస్తే ప్రాఫిట్‌ ఈక్విటీ తెలుస్తుంది.


ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌
ఒక కంపెనీకి సంబంధించిన రైట్స్, బోనస్, డివిడెండ్, విస్తరణ లాంటి విషయాలను ముందుగానే తెలుసుకొని వాటి ఆధారంగా ఆ కంపెనీ షేర్ల క్రయ, విక్రయాలను జరపడాన్ని ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ అంటారు. దీని వల్ల సామాన్య వాటాదారులు నష్టపోతారు. ఇలాంటి ట్రేడింగ్‌కు పాల్పడే వారిపై సెబీ చర్యలు తీసుకుంటుంది.


బ్లూచిప్‌ షేర్లు
బ్లూచిప్‌ అనే పదాన్ని పోకర్‌ ఆట నుంచి గ్రహించారు. ఆ ఆటలో తెలుపు, ఎరుపు, నీలం రంగుల్లో చిప్స్‌ ఉంటాయి. వాటిలో బ్లూ చిప్స్‌కు విలువ అధికం. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. మంచి ఆర్థిక ఫలితాలను సాధిస్తూ, కొన్నేళ్లుగా సమర్థవంతంగా పనిచేస్తూ, డివిడెండ్లు, బోనస్‌లు, రైట్స్‌ ఇష్యూల లాంటివి పాటిస్తూ, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పొందిన కంపెనీల షేర్లను ‘బ్లూచిప్‌ షేర్లు’ అంటారు. లేదా ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలకు చెందిన షేర్లను బ్లూచిప్‌ షేర్లు అంటారు. 


కాల్‌మనీ
కొత్తగా ప్రజల నుంచి వాటాల రూపంలో సొమ్మును సేకరించే కంపెనీలు వాయిదాల రూపంలో షేర్లను అమ్ముతాయి. ఒక వాయిదా అనంతరం మిగతా వాయిదాకు సంబంధించిన సొమ్మును చెల్లించమని వాటాదారులను కోరతారు. దీన్నే కాల్‌మనీ అంటారు. వాయిదాలన్నీ చెల్లించిన వారినే కంపెనీ వాటాదారులుగా భావిస్తుంది.


స్పెక్యులేషన్‌/అంచనా 
వ్యాపారం/ సత్తా వ్యాపారం
స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్లు వివిధ కంపెనీల షేర్లను ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనడం లేదా అమ్మడం చేస్తారు. మరికొందరు ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు తమ పట్టులోకి వచ్చే స్థాయిలో లావాదేవీలు చేస్తుంటారు. తక్కువ ధర ఉన్న షేర్‌ను బ్రోకర్లు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొంటే, సామాన్య పెట్టుబడిదార్లు కూడా అదే కంపెనీ షేర్లు కొనేందుకు సిద్ధపడతారు. అదే సమయంలో అతడు తన వద్ద ఉన్న షేర్లను వెంటనే అమ్ముతాడు. దీని వల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయో పెట్టుబడిదారులకు అర్థంకాక నష్టపోతారు. షేర్‌ ధరలు పెరుగుతాయి లేదా తగ్గుతాయని ఊహించి పెద్దమొత్తంలో లావాదేవీలు చేయడాన్ని స్పెక్యులేషన్‌ అంటారు.


బుక్‌ క్లోజర్‌
వివిధ కంపెనీలు బోనస్, రైట్స్, డివిడెండ్‌ ఇచ్చే సమయంలో కొంతకాలం కంపెనీ రిజిస్టర్లను నిలిపేస్తాయి. ఏ తేదీ వరకు క్లోజ్‌ చేస్తారనే విషయాన్ని కంపెనీ ముందుగానే వాటాదారులకు తెలుపుతుంది. బుక్‌ తేదీ తర్వాత కంపెనీ రిజిస్టర్లలో ఉన్నవారినే వాటాదారులుగా పరిగణిస్తారు. వారి షేర్‌తోనే డివిడెండ్, బోనస్, రైట్స్‌ లాంటివి జారీ చేస్తుంది.

 

భారత ఆర్థిక వ్యవస్థ - స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రభావం
వివిధ కంపెనీల షేర్లను కొనడానికి లేదా అమ్మడానికి ఉన్న వేదికే స్టాక్‌ మార్కెట్‌. ఇది దేశ ఆర్థిక ప్రగతిలోనూ ముఖ్య భూమిక పోషిస్తోంది. షేర్లలో పెట్టుబడి పెడితే త్వరగా లాభాలు పొందొచ్చని సాధారణ ప్రజలు భావిస్తారు. షేర్‌ మార్కెట్‌ల ఏర్పాటు, క్రయవిక్రయాలు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం మొదలైన విషయాల గురించి పరీక్షార్థులకు అవగాహన అవసరం.  


కన్వర్టబుల్‌ సెక్యూరిటీలు: ఏదైనా సంస్థ లేదా ప్రభుత్వం జారీచేసిన  సెక్యూరిటీ (బాండ్లు, డిబెంచర్లు, ప్రిఫర్డ్‌ స్టాక్స్‌)లను అదే సంస్థకు లేదా ప్రభుత్వానికి చెందిన మరో సెక్యూరిటీగా మార్చొచ్చు. వీటినే‘కన్వర్టబుల్‌ సెక్యూరిటీస్‌’ అంటారు. ఒక్కోసారి ఈ సెక్యూరిటీలను తీసుకున్న వ్యక్తి ఎంపిక ద్వారా ఇలా జరుగుతుంది. లేదంటే సంస్థ లేదా ప్రభుత్వ ఎంపిక ద్వారా కూడా ఇలా అవ్వొచ్చు.


రక్షణాత్మక షేరు (డిఫెన్సివ్‌ స్టాక్‌): విపత్కర ఆర్థిక పరిస్థితుల్లోనూ స్థిరంగా డివిడెండ్లు, ఆదాయాలను అందించే షేర్‌ను రక్షణాత్మక షేర్‌ అంటారు. యాంటీ స్టాక్‌ మార్కెట్స్‌ (Anti - Stock Markets) తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సమయంలోనూ ఈ కంపెనీలు స్థిరమైన రేటు వద్ద డివిడెండ్లు ఇస్తాయి. మదుపర్లు సాధారణంగా ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లను డిఫెన్సివ్‌ స్టాక్స్‌గా  భావిస్తారు.


కమోడిటీస్‌: ఇవి ప్రత్యేక, అధీకృత ప్లాట్‌ఫాంపై ట్రేడయ్యే వాణిజ్య ఉత్పత్తులు. వ్యవసాయ ఉత్పత్తులు, సహజ వనరులు ఇందులో ఉంటాయి. 
ఉదా: బంగారం, వెండి, చమురు, సహజ వాయువు, అల్యూమినియం, ధనియాలు, పసుపు తదితరాలన్నీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే కమోడిటీస్‌.


డెరివేటివ్స్‌: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంతర్లీన ఆస్తుల నుంచి ఏదైనా ఒక సెక్యూరిటీ ధరను నిర్ణయిస్తే దాన్ని డెరివేటివ్‌గా చెప్పొచ్చు. ఆ అంతర్లీన ఆస్తుల జాబితాలో షేర్లు, బాండ్లు, కమోడిటీలు, కరెన్సీలు, వడ్డీరేట్లు, సూచీలుంటాయి. ఈ డెరివేటివ్స్‌గా ఫ్యూచర్స్, ఆప్షన్‌లను మళ్లీ పుట్‌ ఆప్షన్, కాల్‌ ఆప్షన్‌ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు.


హెడ్జింగ్‌: ఇదో ట్రేడింగ్‌ వ్యూహం. సెక్యూరిటీల ధరల్లో హెచ్చుతగ్గుల నుంచి నష్టాలను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నం. ఉదా: ఒక గోధుమ రైతు పంట చేతికి రాకముందే ఆ కమోడిటీ ఫ్యూచర్స్‌ (వీట్‌ ఫ్యూచర్స్‌)ను విక్రయించవచ్చు. ఒకవేళ నగదు మార్కెట్లో ధరలో క్షీణత కనిపించి, నష్టం వాటిల్లినా ఫ్యూచర్‌ పొజిషన్‌ ద్వారా వచ్చిన లాభాలతో దాన్ని తగ్గించుకోవచ్చు.


బాండ్లు: ఇవి కంపెనీలు లేదా ప్రభుత్వాలు కొనుగోలుదారులకు జారీచేసే హామీ పత్రాలు. వీటిని కొంటే నిర్దిష్ట సమయం వరకు నిర్దిష్ట మొత్తాన్ని ఆ బాండ్లలో కొనుగోలుదారు ఉంచినట్లు లెక్క. ఆ బాండ్‌కి ఇచ్చే కూపన్‌ రేటు (వడ్డీ రేటు)ను బట్టి మెచ్యూరిటీ సమయానికి నిర్దిష్ట సొమ్ముపై వడ్డీతో కూడిన మొత్తం అందుతుంది.


లావాదేవీలు: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో చిన్న మదుపుదార్ల (షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరిపేవారు) నుంచి సంస్థాగత మదుపుదార్లు, పెన్షన్‌ ఫండ్, బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్, హెడ్జ్‌ఫండ్‌ ట్రేడర్లు లాంటి అనేక స్థాయుల వ్యక్తులు, సంస్థలు లావాదేవీలు నిర్వహిస్తారు.


విదేశీ మూలధనం (Foreign Capital): ఒక దేశ ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో విదేశీ మూలధనం అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని విదేశీ సంస్థలు ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టడం లేదా రుణాలు, గ్రాంట్ల రూపంలో నిధులు సమకూర్చడం చేయొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామీకరణ, ఆర్థికాభివృద్ధి వేగవంతమవ్వాలంటే తొలిదశల్లో యంత్రాలు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, ముడి పదార్థాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకు విదేశీమారక ద్రవ్యం కావాలి.


విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (Foreign Direct Investment - FDI): విదేశీ సంస్థలు ప్రత్యక్షంగా ప్రవేశించి తమ పెట్టుబడులతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపించవచ్చు. కొన్ని పెద్ద విదేశీ సంస్థలు వాటి శాఖ (బ్రాంచ్‌)లను ఏర్పాటు చేయొచ్చు.


విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లేదా మదుపుదారులు (Foreign Portfolio investment - FPI): 
* మన దేశ స్టాక్‌ మార్కెట్లో భారీ హెచ్చు తగ్గులు ఏర్పడటానికి విదేశీ సంస్థాగత పెట్టుబడులే కారణమని  చెప్పొచ్చు. FPIలను కాళ్లు నిలవని పెట్టుబడులు (Footloose capital) అని అంటారు.
* ఎఫ్‌పీఐలను ‘సీతాకోకచిలుక పెట్టుబడులు’ (Butterfly Capital)  అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం సీతాకోకచిలుక వాలడం, ఎగిరిపోవడం లాగా ఉంటుంది. 
* స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడాన్ని వాలడంగా, ఉపసంహరించడాన్ని ఎగిరిపోవడంగా పేర్కొంటారు. షేర్లు కొన్నప్పుడు స్టాక్‌మార్కెట్‌ ఒక్కసారిగా ఊపందుకోవడం, షేర్లను అమ్మినప్పుడు పతనమవ్వడం లాంటివి జరుగుతాయి. 
* కాబట్టి నీశిఖిలకు ప్రిడేటరీ క్యారెక్టర్‌ ఉంటుంది. వీటివల్ల విదేశీ పెట్టుబడుదారులు భారతీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి వైదొలిగి షేర్లు అమ్ముకుంటారు. దీనికి కారణం ‘ప్రాఫిట్‌ బుకింగ్‌’. అంటే షేర్ల ధరలు భారీగా పెరిగినప్పుడు లాభాల కోసం అమ్ముకోవడం. 


డాలర్‌ విలువ పెరగడం (డాలర్‌ ఇండెక్స్‌):
* డాలర్‌ విలువను అంతర్జాతీయ కరెన్సీలతో పోల్చి దాని సగటు విలువను అంచనా వేస్తారు. దాన్నే డాలర్‌ ఇండెక్స్‌ అంటారు. అంటే అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌కు విలువ పెరగడం 
ఉదా: డాలర్‌ విలువ 0.43 శాతం పెరిగిందనుకుంటే, ఇండియా కరెన్సీ రూపాయితో పోల్చితే దాని విలువ ఒక్క రూపాయి నాలుగు పైసలు పెరుగుతుంది. 
* డాలర్‌ విలువ పెరిగినప్పుడు మనదేశంలోని స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు తమ షేర్లను అమ్ముకొని డాలర్లను కొంటారు. వాటినే డాలర్‌ డినామినేటెడ్‌ అసెట్స్‌ అంటారు. అంటే డాలర్‌ రూపంలో ఉన్న ఫైనాన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌  కొనుగోలు చేస్తారు. ఉదా: బాండ్స్‌
* అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి సానుకూల అంశాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. దాంతో పాటు అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో వచ్చిన పరిణామాలు కూడా స్టాక్‌ మార్కెట్‌ పతనానికి కారణమవుతాయి.


విదేశీ పరోక్ష పెట్టుబడులు:
విదేశీ సంస్థలు మనదేశంలోకి ప్రవేశించి పరోక్షంగా బాండ్‌లు లేదా సెక్యూరిటీల రూపంలో పెట్టుబడులు పెడతాయి. వీటినే విదేశీ పరోక్ష పెట్టుబడులు అంటారు.


ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల (స్టాక్‌ మార్కెట్స్‌) ఏర్పాటు
* ప్రపంచంలో మొట్టమొదట స్థాపించిన స్టాక్‌మార్కెట్‌ లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. దీన్ని 18వ శతాబ్దంలో నెలకొల్పారు.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు:
* అమెరికాలోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నాస్‌డాక్‌  (NASDAQ - National Association of Securities Dealers Automated Quotation system). 
* ఇంగ్లండ్‌లోని లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 
* జపాన్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌.
* భారత్‌లో మొట్టమొదటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ను 1875లో ముంబయిలో స్థాపించారు. తర్వాత అహ్మదాబాద్‌ (గుజరాత్‌), చెన్నై (తమిళనాడు), దిల్లీ, ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌), కాన్పూర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌), హైదరాబాద్‌ (తెలంగాణ), బెంగళూరు (కర్ణాటక), లూథియానా (పంజాబ్‌) మొదలైన నగరాల్లో స్థాపించారు.
* భారతదేశంలో సెబీ గుర్తించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఎనిమిది. వీటిలో అయిదు శాశ్వతమైనవి. అవి:
1. అహ్మదాబాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1894లో ఏర్పాటైంది.)
2. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌
3. కోల్‌కతా స్టాక్‌ ఎక్చేంజ్‌ (1908లో  ఏర్పాటైంది.)
4. మగథ్‌ (పాట్నా) స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌
5. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌


 ప్రస్తుతం దేశంలో ఉన్న ఆపరేటింగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు:
1. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ముంబయి)
2. కోల్‌కతా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌
3. ఇండియా ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (India INX)
4. మెట్రో పాలిటన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ముంబయి)
5. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) (ముంబయి)
6. ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌ఈ  - NSE IFSE


ప్రస్తుతం దేశంలో ఆపరేటింగ్‌ కమోడిటీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు:
1. ఇండియన్‌ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ - ICX   (ముంబయి)
2. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా - MCX (ముంబయి) 
3. నేషనల్‌ కమోడిటీ, డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ - NCDX (ముంబయి)


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  (BSE)
* 1875లో బొంబాయిలో  ‘The Native Share and Stock Broker’s Association’ అనే సంస్థ ఏర్పడింది. అదే తర్వాత బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌గా మారింది. 1957, ఆగస్టు 31న ఇది శాశ్వత ప్రాతిపదిక గుర్తింపు పొందింది. భారత్‌లో ఈ గుర్తింపు పొందిన తొలి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఇదే. 
* దీని ప్రధాన కార్యాలయం ముంబయిలోని దలాల్‌ స్ట్రీట్‌లో ఉంది. ఇది ఆసియాలోని పురాతన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 
* 2021, ఫిబ్రవరి నాటికి మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2.8 ట్రిలియన్‌ డాలర్లు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రపంచంలో ఏడో అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 
* బీఎస్‌ఈలో జాబితాల సంఖ్య 5,439. సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎస్‌ అండ్‌ పి బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, ఎన్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ మిడ్కాప్, ఎన్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ లార్జ్‌ క్యాప్, బీఎస్‌ 500.
& హిందీలో దలాల్‌ స్ట్రీట్‌ అంటే బ్రోకర్‌ స్ట్రీట్‌ అని అర్థం.


నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  (NSE)
* 1992, నవంబరులో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియాను ముంబయిలో స్థాపించారు. 1994, జూన్‌ 30 నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొదట రుణ మార్కెట్‌ విభాగం మాత్రమే పని చేయడం ప్రారంభించింది. ఈక్విటీ మార్కెట్‌ విభాగం 1994, నవంబరు 3 నుంచి లావాదేవీలను ప్రారంభించింది. అప్పటివరకు అతిపెద్దదైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కంటే ఎక్కువ వ్యాపారాన్ని సాధించింది. దేశంలో ఆధునిక, పూర్తి ఆటోమేటెడ్‌ స్క్రీన్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ వ్యవస్థను అందించిన తొలి ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ. ఇది పెట్టుబడిదారులకు సులభమైన వాణిజ్య సౌకర్యాలను అందించింది. ఎన్‌ఎస్‌ఈలో జాబితాల సంఖ్య 1,952. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2.27 ట్రిలియన్‌ డాలర్లు (2018, ఏప్రిల్‌ నాటికి). సూచీలు నిఫ్టీ 50, నిఫ్టీ నెక్ట్స్‌ 50, నిఫ్టీ 500. ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 


అంచనా వ్యాపారం
సాధారణంగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో అంచనా వ్యాపారం (Speculation Business) ఎక్కువగా జరుగుతుంది. భవిష్యత్తులో సెక్యూరిటీల ధరల్లో వచ్చే మార్పులను ముందుగా అంచనా వేసి, అధిక లాభాపేక్షతో కొనుగోలు, అమ్మకం చేసే వ్యాపారులను అంచనా వ్యాపారులు (Speculators) అంటారు.  ఫార్వర్డ్‌ డెలివరీ కాంట్రాక్ట్‌లలో ఈ వ్యాపారం జరుగుతుంది. దేశంలోని కొన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో మాత్రమే దీన్ని అనుమతించారు. అంచనా వ్యాపారం చేసే సభ్యులను నాలుగు రకాలుగా వర్గీకరించారు.
* బుల్స్‌ (Bulls)   
* బేర్స్‌  (Bears) 
* స్టాగ్స్‌ (Stags) 
* లేమ్‌ డక్‌ (Lame ducks)

 

భారతదేశంలో స్టాక్‌మార్కెట్‌ సూచికలు
ప్రపంచంలో ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ సూచికలు డో జోన్స్‌ (న్యూయార్క్‌); నిక్కీ (టోక్యో); హాంగ్‌కాంగ్‌ (హాంగ్‌ సెంగ్‌); డోలెక్స్, సెన్సెక్స్, నిఫ్టీ-ఫిఫ్టీ (ఇండియా).  
* భారత్‌లో ప్రధాన స్టాక్‌ మార్కెట్‌ సూచికలు రెండు. అవి: 1. సెన్సెక్స్‌     2. నిఫ్టీ ఫిఫ్టీ 


సెన్సెక్స్‌: 1875లో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటైంది. తర్వాత 111 ఏళ్లకు 1986లో సెన్సెక్స్‌ ఏర్పడింది. తొలుత దీన్ని 100 పాయింట్లతో ప్రారంభించారు. ప్రాతిపదిక ఏడాదిగా 1978-79ను తీసుకున్నారు. సెన్సిటివ్, ఇండెక్స్‌ అనే పదాల నుంచి సెన్సెక్స్‌ ఏర్పడింది. ఈ పేరును సూచించింది దీపక్‌ మొహానీ అనే స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు. దీన్నే సెన్సిటివ్‌ ఇండెక్స్‌గా కూడా పిలుస్తారు. ఇది బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సంబంధించిన సూచిక. ఇందులోని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 30.


నిఫ్టీ ఫిఫ్టీ - NSE 50:  ఈ సూచికను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ రూపొందిస్తుంది. ఇందులో 50 ప్రాతినిధ్య సంస్థల వాటాలను చేర్చారు. దీనిపేరును S&P CNX  నిఫ్టీగా మార్చారు. నిఫ్టీ సూచిక 1996, ఏప్రిల్‌ 22న ప్రారంభమైంది. నిఫ్టీ 50 ఇండెక్స్‌ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో (2020, జూన్‌ 20 నాటికి) 14 రంగాలకు వర్తిస్తుంది.


నేషనల్‌ ఇండెక్స్‌: ఇది బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి సంబంధించిన మరో సూచిక. దీనిలోని ప్రాతినిధ్య సంస్థలు 100. ఆధార సంవత్సరం 1983-84.


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ): ఈ సూచికలో 200 ప్రాతినిధ్య సంస్థలు ఉన్నాయి. ఆధార సంవత్సరం 198990. దీనిలో 21 ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు ఉన్నాయి.
డోలెక్స్‌: బీఎస్‌ఈ200 డాలర్‌ విలువను డోలెక్స్‌ అంటారు. దీని ఆధార సంవత్సరం 198990.
బ్యాంకెక్స్‌: దీన్ని 2003, జూన్‌ నుంచి రూపొందిస్తున్నారు. ఇందులో 12 బ్యాంకుల వాటాలను చేర్చారు. ఆధార సంవత్సరం జనవరి 2002.


కమోడిటీ ఫ్యూచర్‌ మార్కెట్‌
* భవిష్యత్తులో కొన్ని వస్తువుల ధరల్లో అధిక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ ప్రభావాన్ని తప్పించేందుకు కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఒక వస్తువును రానున్న కాలంలో  ఒక నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత తేదీన, నిర్ణీత ధర వద్ద కొనడం లేదా అమ్మడం గురించి ఒప్పందం కుదుర్చుకుంటారు. దీన్నే కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్లు అంటారు.
* వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, ముడిచమురు, లోహ వస్తువులు, విమాన ఇంధనం, ధనియాలు, వెల్లుల్లి, ఉక్కు మొదలైన వస్తువులతో ఫ్యూచర్‌ వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్‌కు సంబంధించిన ఎక్స్ఛేంజ్‌లను కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు అంటారు. 


భారత్‌లో పనిచేస్తున్న కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు 
* నేషనల్‌ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (NMCE) 
* ఎంసీఎక్స్‌ (MCX) ముంబయి (2003)
* నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ (NCDEX) 
* ఏసీఈ కమోడిటీ ఎక్స్ఛేంజ్, ముంబయి 


క్రిసిల్‌
* క్రిసిల్‌ (CRISIL - Credit Rating Information Services of India Limited) భారతదేశ మొదటి రేటింగ్‌ ఏజెన్సీ. దీన్ని 1987లో నెలకొల్పారు. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌తో కలిసి క్రిసిల్‌ - 500 సూచికను అభివృద్ధి చేసింది. దీనిపేరును S&P CNX-550 సూచికగా మార్చారు. ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.
* ఇది రేటింగ్స్, డేటా, పరిశోధన, విశ్లేషణ, సొల్యూషన్స్‌ లాంటి సేవలను అందిస్తుంది. సంస్థల వ్యాపార నష్ట భయం, నిర్వహణ నష్టభయం, ఆర్థిక నష్టభయం అనే మూడు అంశాలను మూల్యాంకనం చేసి వ్యాపార సంస్థలకు రేటింగ్‌ ఇస్తుంది. 2020, డిసెంబరు నాటికి క్రిసిల్‌ ఆదాయం 290 మిలియన్‌ డాలర్లు, నికర ఆదాయం 50 మిలియన్‌ డాలర్లు. దీని మాతృసంస్థ  S&P గ్లోబల్‌.


కొవిడ్‌ నేపథ్యంలో దేశ జీడీపీ - స్టాక్‌ మార్కెట్ల తీరు తెన్నులు
* ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను స్టాక్‌ మార్కెట్లు ప్రతిఫలిస్తాయి. పతనం, వృద్ధి ఏదైనా మార్కెట్లు ముందే స్పందిస్తాయి. భవిష్యత్తు ఆధారంగానే వీటి పనితీరు ఉంటుంది.
* 201920 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 4.2 శాతం (2020-21 సర్వే ప్రకారం) వృద్ధి రేటు సాధించింది. కొవిడ్‌ కారణంగా 2020-21లో జీడీపీ క్షీణత (-) 7.7 శాతంగా (2020-21 సర్వే ప్రకారం) నమోదైంది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష 2021, ఏప్రిల్‌ నివేదికలో 2021-22లో భారత్‌ జీడీపీ వృద్ధిరేటును 10.5 శాతంగా అంచనా వేసింది. ఐఎంఎఫ్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ 2021, ఏప్రిల్‌ నివేదిక ప్రకారం 2021లో దేశ జీడీపీ వృద్ధి రేటు 12.5 శాతం, కాగా 2022లో 6.9 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది.
* 2020, మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. అయితే 2020, నవంబరు నుంచి సూచీలు లాభపడుతూ వచ్చాయి.
* 2021, జనవరి 21న స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో తొలిసారి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 50,000 పాయింట్లను తాకింది. 
* బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ 20 ఏళ్లలో 32 రెట్లు పెరిగింది. 
* 2001-02 ఆర్థిక సంవత్సరం చివర్లో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.6.12 లక్షల కోట్లు కాగా, 2020-21, జనవరి 21 నాటికి దీని విలువ రూ.196.51 లక్షల కోట్లకు చేరింది. 
* 2021, జనవరి 12న జీవితకాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఆ రోజు నమోదైన రూ.197.46 లక్షల కోట్లు ఇప్పటి వరకు అత్యధికం.
* 2008, జనవరిలో సెన్సెక్స్‌ 21,000 పాయింట్ల వద్ద ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అదే ఏడాది అక్టోబరు చివరికి 8700 పాయింట్లకు చేరింది. 
* 2008-09 ఆర్థిక సంవత్సరం చివర్లో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.30 లక్షల కోట్లకు క్షిణించింది. 2007-08లో ఈ విలువ రూ.51 లక్షల కోట్లు. అయితే తర్వాతి ఏడాది పుంజుకుని రెట్టింపైంది. 
* 2020, మార్చిలో కొవిడ్‌ సంక్షోభంతో సెన్సెక్స్‌ 26000 పాయింట్లకు, కంపెనీల మార్కెట్‌ విలువ రూ.113 లక్షల కోట్లకు చేరింది. 2018-19 ఆఖరులో ఈ విలువ రూ.151 లక్షల కోట్లు.


స్టాక్‌ మార్కెట్లు - జీడీపీ వృద్ధి - ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు
* బ్యాంకులు స్థిరీకరణ, రుణాల రికవరీపై దృష్టి సారించడం వల్ల వాటి ఆర్థిక నిల్వలు బలోపేతమయ్యాయి. అవి వ్యాపార సంస్థల విస్తరణ అవసరాలకు రుణాలిచ్చేందుకు సిద్ధమయ్యాయి. కార్పొరేట్‌ సంస్థలు తమ అప్పులు తగ్గించుకున్నాయి. 
* గత కొన్నేళ్లలో జీఎస్టీ - ఐబీసీ (దివాలా స్మృతి) అమలుతో పాటు కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో బలహీన కార్పొరేట్‌ సంస్థలు మూతపడగా, తట్టుకున్న సంస్థలు బలోపేతమయ్యాయి. ఇలా నిలిచిన సంస్థల మార్కెట్‌ వాటా, ఆదాయాలు పెరుగుతున్నాయి. అందుకే వచ్చే ఆర్థిక సంవత్సరం, ఆపై ఏడాది కూడా భారత్‌ అధిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే స్టాక్‌ మార్కెట్స్‌కు ఇంధనం. 
* ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినా సమీప భవిష్యత్తులో కోలుకుంటుందని, కంపెనీలు అధిక ఆదాయాలు నమోదు చేస్తాయనే అంచనాలతో షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ముందుకొస్తున్నారు. 
* కొత్త ఇన్వెస్టర్లకు అనుగుణంగా డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.


 

స్టాక్‌ మార్కెట్లు - డీమ్యాట్‌ ఖాతాలు 
స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. ఈ ఖాతాలు పెరుగుతున్నాయంటే, స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికమవుతోందని అర్థం.
* 2018-19తో పోలిస్తే 2019-20లో 49 లక్షల నూతన డీమ్యాట్‌ ఖాతాలు పెరిగాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కొత్త ఖాతాలు మరింత పెరిగినట్లు సమాచారం.


 సంవత్సరం    డీమ్యాట్‌ ఖాతాలు (కోట్లలో)
 2010-11          1.90
 2011-12          1.99
 2012-13          2.09
 2013-14          2.18
 2014-15          2.33
 2015-16          2.52
 2016-17          2.79
 2017-18          3.19
 2018-19          3.59
 2019-20          4.08


మనదేశ జీడీపీ వృద్ధిరేట్లు (శాతంలో)
సంవత్సరం        జీడీపీ వృద్ధి
2010-11              9.3
2011-12              6.2
2012-13              5.6
2013-14              6.6
2014-15              7.2
2015-16               8
2016-17              8.2
2017-18               7
2018-19              6.1
2019-20              4.2
2020-21            (-) 7.7 
2021-22              11 

ఆధారం: భారత ఆర్థిక సర్వే: 2012-13, 2015-16, 2018-19, 2020-21

Posted Date : 25-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో భూసంస్కరణలు

సమ సమాజ నిర్మాణం... సకల జనుల సౌభాగ్యం!


ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో భూమి ప్రధానపాత్ర పోషిస్తోంది. అనాదిగా ఆ భూమి పంపిణీలో పాతుకుపోయిన అసమానతలు సమాజంలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమవుతున్నాయి. దీనికి సంబంధించి బ్రిటిష్‌ కాలంలో రకరకాల విధానాలను అమలు చేసి శిస్తుల రూపంలో దోపిడీలు చేశారు. అందుకోసం జమీందారులు, భూస్వాముల వంటి దళారులను సృష్టించారు. స్వాతంత్య్రానంతరం సమ సమాజాన్ని, అందరి సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని సామాజిక న్యాయాన్ని అందించేందుకు ప్రభుత్వం భూ సంస్కరణలు చేపట్టింది. భారత ఆర్థిక వ్యవస్థ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటి గురించి వివరంగా తెలుసుకోవాలి. 

 

భారతదేశంలో భూసంస్కరణలు 

గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రజలకు భూమే ప్రధాన జీవనాధారం. కానీ ఆ భూమి పంపిణీకి సంబంధించి అనేక అసమానతలు అమలవుతున్నాయి. గ్రామాల్లో ఎక్కువ మొత్తం భూమి అతి తక్కువ సంఖ్యలో ఉన్న ధనవంతులైన భూస్వాముల అధీనంలో ఉంది. ఈ పరిస్థితి సామాజిక న్యాయం అందించాలనే ప్రణాళికా లక్ష్యానికి విరుద్ధంగా ఉంది. భూమి యాజమాన్యంలోని అసమానతలను తగ్గించి సామాజిక న్యాయాన్ని అందించడానికి భూసంస్కరణలు అమలుచేయాల్సిన అవసరం ఏర్పడింది. భూయాజమాన్యంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడాన్నే భూసంస్కరణలుగా చెప్పవచ్చు.

 

నిర్వచనాలు

* భూసంస్కరణలు అంటే భూమి పునఃపంపిణీ, కౌలు పరిమాణం నిర్ణయం, కౌలుదారులకు భద్రత, వ్యవసాయ కార్మికుల వేతనాల నిర్ణయం, వ్యవసాయ పరపతి ఆధారాల అభివృద్ధి, భూమి పన్నుల విధానంలో మార్పులు, సహకార వ్యవస్థ మెరుగుదల, వ్యవసాయ విద్య, సాంకేతిక మార్పులు.  - ఐక్యరాజ్య సమితి

* మధ్యవర్తుల తొలగింపు, భూహక్కుల పునఃపంపిణీ, కమతాల సమీకరణ, కౌలు సంస్కరణలు, సహకార, సామూహిక వ్యవస్థల నిర్మాణం భూసంస్కరణల లక్ష్యం.  - ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ

* రైతుల ఆర్థిక, సామాజిక, రాజకీయ శక్తిని దృఢపరచడమే భూసంస్కరణల లక్ష్యం. భూమిని దున్నేవాడికి యాజమాన్యపు హక్కుగా చేయడంతోనే భూసంస్కరణల లక్ష్యం పూర్తికాదు. అలాంటి హక్కును సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందగలిగే ఇతరత్రా మార్పులు కూడా భూసంస్కరణల పరిధిలోనివే.   - జవహర్‌లాల్‌ నెహ్రూ 

స్థూలంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని వ్యవసాయ నిర్మాణంలో (అగ్రేరియన్‌ స్ట్రక్చర్‌) మార్పులు తీసుకురావడాన్ని భూసంస్కరణలు అంటారు.

భూసంస్కరణలను వ్యవసాయ సంబంధ సంస్కరణలని అంటారు. భూసేకరణ చట్టం - 1894 ప్రకారం ప్రైవేటు భూములు సేకరించే అధికారం  ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభలకు భూసంబంధ చట్టాలు చేసే అధికారం ఉంది. దేశంలో భూసంస్కరణలు చేసిన మొదటి రాష్ట్రం కేరళ. తర్వాత పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలు అమలుచేశాయి.

 

ఇతర దేశాల అనుభవాలు

చరిత్రాత్మకంగా ప్రపంచంలో భూసంస్కరణలు చాలా పురాతనమైనవి. ఆరో శతాబ్దంలో గ్రీకులోని (133 - 121 బి.సి) రోమ్‌లో భూసంస్కరణలు ప్రవేశపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం వరకు స్వీడన్‌ (1827), డెన్మార్క్‌ (1850), ఐర్లాండ్‌ (1930) దేశాల్లో భూసంస్కరణలు ప్రవేశపెట్టారు. తర్వాత ఫ్రాన్స్‌లో 1992లో అమలయ్యాయి.

బ్రిటిష్‌ ఇండియాలో భూమిశిస్తు విధానాలు:  బ్రిటిషర్ల పరిపాలనలో వ్యవసాయ భూముల శిస్తు వసూలుకు అనేక పద్ధతులు అనుసరించారు. వాటిలో మూడు విధానాలు ముఖ్యమైవి.అవి 1) జమీందారీ పద్ధతి (1793) 2) రైత్వారీ విధానం (1820)  3) మహల్వారీ విధానం (1833)

 

జమీందారీ పద్ధతి

శాశ్వత భూమిశిస్తు వసూలు విధానం: ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రభుత్వం 1793లో లార్డ్‌ కారన్‌వాలీస్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న సమయంలో శాశ్వత భూమి శిస్తు వసూలు పద్ధతిని ప్రవేశపెట్టింది. దీన్నే జమీందారీ విధానం అంటారు. ఇది బెంగాల్, బిహార్, ఒడిశాల్లో అమల్లో ఉండేది. ఈ పద్ధతి ప్రకారం మొదట వ్యవసాయ భూముల నికర ఆదాయంలో 83% కౌలుగా వసూలు చేసేవారు. ఆ తర్వాత సాగుభూమిలో నికర ఆదాయంలో 40% శిస్తుగా వసూలు చేశారు. అయితే శాశ్వత భూమి శిస్తు నిర్ణయం ప్రకారం జమీందార్లు 10/11వ వంతు పంట దిగుబడిని ప్రభుత్వానికి చెల్లించాలి. దీంతో శిస్తు వసూలుకు జమీందార్లు రైతులను పీడించేవారు. చివరికి రైతులు భూమిపై వ్యవసాయం చేసే హక్కుకు వదులుకునేవారు. ఈ పద్ధతి వల్ల రైతులు, కూలీలుగా మారి వ్యవసాయ రంగ అభివృద్ధి క్షీణించింది.

తాత్కాలిక శిస్తు నిర్ణయ విధానం: భూమిశిస్తు వసూలు విధానాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించి అవసరమైనప్పుడు భూమిశిస్తును సవరించే తాత్కాలిక నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 20 - 40 సంవత్సరాలకు వ్యవసాయదారులు చెల్లించాల్సిన శిస్తు నిర్ణయిస్తారు. దీంతో రైతులపై పన్ను భారం పెరిగి వ్యవసాయ రంగానికి హాని జరిగింది.

* 1952లో మొదటి ప్రణాళికా కాలంలో జమీందారీ విధానాన్ని రద్దు చేసి భూసంస్కరణలు అమలుచేశారు.

 

రైత్వారీ విధానం

రైతు అంటే భూమిని సాగుచేసేవాడు. రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కును ఇవ్వడం. భూమిని సొంతంగా సాగుచేసే లేదా ఇతరులతో సాగు చేయించే భూమి వాస్తవ యజమానులు/సాగుదారుల నుంచి నేరుగా శిస్తు వసూలు చేయాలని నిర్ణయించారు. మధ్యవర్తుల ద్వారా పన్నులు వసూలు చేయడంలో ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని తొలగించడానికి 1820లో థామస్‌ మన్రో రైత్వారీ విధానాన్ని అమలుచేశారు. దీన్నే రైత్వారీ శిస్తు నిర్ణాయక విధానం అంటారు. భూమిపై హక్కు ఉన్న రైతులందరినీ భాగస్వాములుగా ఏర్పాటుచేశారు. సంవత్సరానికి ఒకసారి ఈ పన్నును రైతులు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ పద్ధతిలో పన్ను వసూలు చేయడంలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. భూసారం, ఉత్పత్తి వ్యయం అంశాల ఆధారంగా ప్రభుత్వమే పన్ను నిర్ణయిస్తుంది. భూయజమానులే (కౌలుదారులు కాదు) ఈ పన్నును బ్రిటిష్‌ ప్రభుత్వానికి చెల్లించాలి. స్థూల ఉత్పత్తిలో 40% - 50% వరకు పన్నుగా నిర్ణయించారు. శిస్తును 20 నుంచి 40 సంవత్సరాలకు ఒకసారి సవరించే వీలు ఉంటుంది. రైత్వారీ విధానాన్ని ముందుగా (1817 - 18) బొంబాయి, మద్రాస్‌ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి తర్వాత ఈశాన్య, వాయవ్య రాష్ట్రాలకు విస్తరించారు. దేశంలోని 38% వ్యవసాయ భూమిలో మాత్రమే ఈ విధానం అమల్లో ఉండేది.

 

మహల్వారీ విధానం

బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక గ్రామంలోని వ్యవసాయ యోగ్యమైన మొత్తం భూమిని అంచనా వేసి దాన్ని ఆ గ్రామ సమష్టి ఆస్తిగా పరిగణించి మొత్తం భూమిపై శిస్తు విధించేది. ఈ పద్ధతిని మహల్వారీ పద్ధతి అంటారు. దీన్ని 1833లో విలియం బెంటింక్‌ ప్రవేశపెట్టాడు. గంగా మైదానంలో ఈ పద్ధతి అమల్లో ఉండేది. మహల్వారీ పద్ధతిని ఆగ్రా, అవధ్‌ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామపెద్దకు ఈ భూమిపై శిస్తు వసూలు చేసే అధికారం ఉంటుంది. ఈయన గ్రామంలోని రైతుల నుంచి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. తన సేవలకు ప్రతిఫలంగా వసూలు చేసిన భూమి శిస్తులో కొంత శాతం కమిషన్‌గా పొందుతాడు. దేశంలోని 5 శాతం వ్యవసాయ భూమిలో మాత్రమే మహల్వారీ పద్ధతి అమల్లో ఉండేది.

* అలీస్‌ థోర్నర్‌ చెప్పినట్లు జమీందారీ విధానం జమీందార్లను గ్రామ అధికారులుగా మారిస్తే, రైత్వారీ విధానం గ్రామ వ్యవస్థను ఛేదించి రైతులను, ప్రభుత్వాన్ని వేరుచేసింది.

 

లక్ష్యాలు

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్లమెంటు జోసెఫ్‌ చెల్లాదురై కార్నెలియస్‌ కుమారప్ప (జేసీ కుమారప్ప) అధ్యక్షతన 1948లో వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. 1949లో ఆ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ సిఫార్సులను అనుసరించి జమీందారీ లాంటి మధ్యవర్తుల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దున్నేవాడికే భూయాజమాన్యాన్ని బదిలీ చేయాలని సూచించింది.

* వ్యవసాయ సంబంధాలను పునర్‌వ్యవస్థీకరించి సమసమాజ స్థాపన చేయడం. 

* భూసంబంధ వ్యవహారాల్లో దోపిడీ నిర్మూలన.  

* దున్నేవాడికే భూమి హక్కు కల్పించడం. 

* భూసంబంధ అసమానతలు తొలగించి గ్రామీణ ప్రాంతాల్లో పేదవర్గాల వారికి భూయాజమాన్య వసతి కల్పించడం. 

* భూమి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం. 

* ప్రభుత్వానికి, రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరిచి వివిధ వర్గాల రైతులకు సాంఘిక న్యాయం సమకూర్చడం. 

* స్థానిక సంస్థల ద్వారా సాంఘిక సమానత్వాన్ని సాధించడానికి విధానపరమైన మార్పులు చేయడం.

 

8వ పంచవర్ష ప్రణాళిక (1992-97)లో పొందుపరిచిన భూసంస్కరణల లక్ష్యాలు: 

* సామాజిక సమానత్వాన్ని సాధించేలా భూవ్యవసాయ సంబంధాలను పునర్నిర్మించడం.

* భూవ్యవసాయ సంబంధాల దోపిడీని అరికట్టడం.

* దున్నేవాడికే భూమిని సమకూర్చడం.

* గ్రామీణ పేదలకు భూమి పంపిణీ చేసి వారి ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం.

* వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం.

* గ్రామీణ వ్యవస్థలో అన్నిరకాలుగా సమానత్వాన్ని సాధించడం.


రచయిత: బండారి ధనుంజయ 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

‣  ఆర్థిక వృద్ధి - సూచికలు

‣  వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వస్తు సేవల పన్ను

జీఎస్టీ చరిత్ర

* 2000లో అప్పటి అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం పన్ను సంస్కరణల కోసం డా.సి.రంగరాజన్, ఐ.జి.పటేల్, బిమల్‌జలాన్‌ నేతృత్వంలో ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటుచేసింది.
* ఈ కమిటీ జీఎస్టీ విధివిధానాల రూపకల్పనకు నాటి పశ్చిమ్‌బెంగాల్‌ ఆర్థికమంత్రి అసిమ్‌దాస్‌ గుప్తా నేతృత్వంలో మరో బృందాన్ని నియమించాలని సిఫార్సు చేసింది. 
* దేశంలో ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వ్యవస్థల ఏర్పాట్ల బాధ్యతనూ దీనికే అప్పగించారు. అందుకే గుప్తాను జీఎస్టీ రూపశిల్పిగా పేర్కొంటారు. 
* పన్ను సంస్కరణలను అమలు చేసే లక్ష్యంతో వాజ్‌పేయీ ప్రభుత్వం 2003లో ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
* 12వ ఆర్థికసంఘం సూచించిన విధంగా జీఎస్టీని తీసుకురావాలని కేల్కర్‌ కమిటీ 2005లో సిఫార్సు చేసింది.
* 2011లో డా.మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం జీఎస్టీ అమలు కోసం లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

 

వస్తు సేవల పన్ను -  భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అన్ని వస్తు, సేవలపై దేశమంతా ఒకేలా విధించే పరోక్షపన్నును వస్తు-సేవల పన్ను(Goods and Services Tax - GST) అంటారు. దీని అమలుతో మిగిలిన పరోక్ష పన్నులు ఏవీ ఉండవు. పన్నుల సరళీకరణ  జరిగి వ్యాపారం సులభతరం అవుతుంది.


ప్రాధాన్యం
* దేశంలో ఎక్కడికైనా వస్తు రవాణా సులభమవుతుంది. దేశమంతా ఒకే మార్కెట్‌గా ఆవిర్భవిస్తుంది.
* పన్నులపై పన్నులు ఉండవు.
* స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) 1 నుంచి 1.5 శాతం అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది.
* అధికసంఖ్యలో వస్తువులకు పన్ను మినహాయింపు ఉంటుంది.
* సగటు ఆదాయం ఉన్న వ్యక్తులు గరిష్ఠ ప్రయోజనం పొందుతారు.
* నమోదు, సుంకం చెల్లింపు, రిటర్న్‌దాఖలు, పన్నుల వాపసు కోసం ఉమ్మడి విధానాలు.
* అధిక పన్నుల ప్రవాహాన్ని తొలగించడానికి తయారీదారు/ సరఫరాదారు నుంచి వినియోగదారు/ రిటైలర్‌కు నిరంతరాయంగా పన్ను క్రెడిట్‌ అవుతుంది.
* మన ఎగుమతులు అంతర్జాతీయంగా పోటీపడేలా ఉండేందుకు పన్నుల తటస్థీకరణ  ప్రభావవంతంగా జరుగుతుంది.
* తమ ఉత్పత్తులను చౌకగా తయారు చేయడానికి చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి రాయితీలు లభిస్తాయి.
* ఏకీకృత ఉమ్మడి జాతీయ మార్కెట్‌ కల్పన.
* భారతదేశం తయారీ రంగ హబ్‌గా రూపొందుతుంది.
* పెట్టుబడులు, ఎగుమతులు పెరుగుతాయి.
* పెరిగిన ఆర్థిక కార్యకలాపాల వల్ల ప్రజలకు మరింత ఉపాధి దొరుకుతుంది.
* వస్తు, సేవలపై ప్రస్తుతం విధిస్తున్న అనేక పన్నులు తగ్గుతాయి. దాంతో సరళీకరణ సాధ్యమవుతుంది.
* దేశవ్యాప్తంగా పన్ను చట్టాలు, విధానాలు, ధరల సమన్వయం.
* పన్ను నిర్వహణలో కచ్చితత్వాన్ని పెంపొందించడానికి వస్తు, సేవల వర్గీకరణకు ఉమ్మడి విధానం.
* పెరిగిన పోటీ వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. 
* దేశవ్యాప్తంగా ఉత్పత్తిదారులు, వినియోగదారులకు అనువైన ప్రదేశం.
* ప్రజల్లో ఐకమత్యం, జాతీయ భావాలు పటిష్ఠం అవుతాయి.


పరిణామక్రమం - అమలు తీరు

* 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ మౌలిక స్వరూపాన్ని ఆ ఏడాది బడ్జెట్‌ ప్రసంగంలో ప్రముఖంగా పేర్కొంది.
* 2010లో జీఎస్టీ మౌలికస్వరూపంపై ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చింది.
* 2011లో జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం వ్యతిరేకించడంతో దాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపారు.
* 2013లో జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసేందుకు అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం రూ.9000 కోట్ల నిధులను ప్రకటించారు.
* 2014లో 15వ లోక్‌సభ రద్దవడంతో రాజ్యాంగ సవరణ బిల్లుకు కాలం చెల్లింది.
* 2016, ఏప్రిల్‌ 1 నుంచి జీఎస్టీని అమలు చేస్తామని 2015, ఫిబ్రవరి 8న అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.
* 2016, మార్చిలో జీఎస్టీ రేట్లపై పరిమితి విధించాలనే ప్రతిపక్షాల ప్రతిపాదనను మోదీ ప్రభుత్వం అంగీకరించింది.
* 2016, ఆగస్టు 3న జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది.
* 2016, ఆగస్టు 8న జీఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది.
* 2016, సెప్టెంబరులో ఈ బిల్లుకు 16 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి.
* 2016, నవంబరులో నాలుగు అంచెల పన్ను స్వరూపాన్ని జీఎస్టీ మండలి ఖరారు చేసింది.
* 2017, మార్చిలో జీఎస్టీ అమలుకు ఉద్దేశించిన నాలుగు బిల్లులను పార్లమెంట్‌ ఆమోదించింది.
* జీఎస్టీని అమల్లోకి తెచ్చేందుకు 2017, జూన్‌ 30 అర్ధరాత్రి పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశమైంది.
* మన దేశంలో వస్తువులపై పన్నులు విధించే విధానంలో ఎంతో వైవిధ్యం ఉంది.
* వస్తువు తయారయ్యే చోటు నుంచి మొదలై విక్రేతలు, చిల్లర వ్యాపారులు, వినియోగదారులకు చేరే వరకు అన్ని దశల్లోనూ పన్నులు ఉన్నాయి. రాష్ట్రాల మధ్య ఈ పన్నులు మారుతూ ఉంటాయి. 
* పన్నుపై పన్ను విధించడంతో వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో వాటి ధరలు కొన్ని చోట్ల తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. 
* దీనికోసమే భారత్‌ పన్ను వ్యవస్థలో మార్పులు చేసి ‘ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మార్కెట్‌’  (One Nation - One Tax One Market) భావనను అమలుచేసింది. 
* పరోక్ష పన్నుల సరళీకృత విధానం కోసం  భారత రాజ్యాంగంలోని జీఎస్టీకి పార్లమెంట్‌ 122వ సవరణ చేసింది. 
* 2016, సెప్టెంబరు 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జీఎస్టీ బిల్లును ఆమోదించారు. దీంతో 122వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది.
* 17 రకాల కేంద్ర, రాష్ట్ర పన్నుల స్థానంలో 2017, జులై 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీని అమలు చేశారు (జమ్మూ కశ్మీర్‌ మినహా).
* మనదేశంలో జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం - అసోం (2016, ఆగస్టు 12).
* దాదాపు 130 కోట్ల జనాభా, 2.3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో దేశం ఏకీకృత మార్కెట్‌గా రూపొందింది.


పన్ను విధానం

ఒక వస్తువు విలువ పన్నుతో కలిసి రూ.100 అనుకుంటే 10 శాతం జీఎస్టీ ప్రకారం అది చివరకు ఎంత అవుతుందో పరిశీలిద్దాం. 
* పత్తి నూలు విలువ రూ.100 అనుకుందాం. దాన్ని నేతన్న చీరగా తయారు చేశాడు. దాని తయారీ ఖర్చుగా రూ.30 తీసుకున్నాడు. ఆ చీర విలువ రూ.130 అవుతుంది. 
* జీఎస్టీ ప్రకారం ఇక్కడ మొత్తం విలువపై పన్ను ఉండదు. నేతన్న తీసుకున్న రూ.30 కే పన్ను విధిస్తారు. (అంటే రూ.3 మాత్రమే). అప్పుడు చీర విలువ రూ.133 అవుతుంది. 
* నేతన్న నుంచి రూ.133కి కొన్న చీరను టోకు వ్యాపారి రూ.20 లాభంతో రూ.153కి దుకాణదారుడికి  అమ్మాడని అనుకుందాం. ఇక్కడ జీఎస్టీ ప్రకారం వ్యాపారి లాభం రూ.20పై మాత్రమే పన్ను (రూ.2 మాత్రమే) ఉంటుంది. ఇప్పుడు చీర విలువ రూ.155 అవుతుంది. హోల్‌సేలర్‌ నుంచి రూ.155కి కొన్న చీరను దుకాణదారుడు రూ.10 లాభంతో రూ.165కి అమ్మాడు అనుకుందాం. అప్పుడు లాభం రూ.10పై మాత్రమే పన్ను వేస్తారు. 
* అంటే ఇక్కడ పన్ను రూ.1 మాత్రమే. అంటే మొత్తం చీర విలువ రూ.166 అవుతుంది. 
* మొత్తం పన్ను 10 + 3 + 2 + 1 = రూ.16 అవుతుంది.


ప్రపంచ దేశాల్లో జీఎస్టీ 

* 1954లో ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్రాన్స్‌ జీఎస్టీని అమలు చేసింది. ప్రస్తుతం 160 దేశాల్లో జీఎస్టీ/ వ్యాట్‌ అమల్లో ఉంది. 
* జీఎస్టీ అమల్లో లేని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ అమెరికా. అక్కడ పన్ను రేట్లపై రాష్ట్రాలకు పూర్తి స్వతంత్రం ఉంది.
* ఆస్ట్రేలియా 2000లో జీఎస్టీని ప్రవేశపెట్టింది.
* న్యూజిలాండ్‌ 1986లో 10% పన్ను రేటుతో జీఎస్టీని ప్రవేశపెట్టింది. ఈ రేటును 1989లో 12.5%; 2010లో 15 శాతానికి పెంచింది.
* 1989లో జపాన్‌లో వినియోగ పన్నును (3%) ప్రవేశపెట్టారు. దాన్ని 1997లో 5%; 2012లో 10 శాతానికి పెంచారు. 
* కెనడాలో 1991లో జీఎస్టీని ప్రవేశపెట్టారు. మన దేశంలో ఉన్నట్లే అక్కడా ద్వంద్వ విధానం (రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ) అమలవుతోంది. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రావిన్స్‌లకు ఉంది. జీఎస్టీని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై మూడు ప్రావిన్స్‌లు దావా వేశాయి. 
* కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌ జీఎస్టీని ప్రవేశపెట్టింది. అమల్లో సవాళ్లు ఏర్పడటంతో రెండేళ్లలోనే తిరిగి పాత పన్ను విధానానికే మారింది.
* 1994లో సింగపూర్‌లో జీఎస్టీని ప్రవేశపెట్టారు. దీంతో అక్కడ ద్రవ్యోల్బణం పెరిగింది. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక హక్కుల సంస్థలు జీఎస్టీని వ్యతిరేకించాయి. ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. కార్పొరేట్‌-ఐటీ పన్ను తర్వాత జీఎస్టీ ద్వారానే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. 
* 2015లో మలేసియాలో జీఎస్టీని అమలు చేశారు.
* 2016లో చైనా వ్యాట్‌ సంస్కరణలను పూర్తిచేసింది. సంక్లిష్టంగా ఉన్న వ్యాపార పన్ను వ్యవస్థ స్థానంలో వాటిని ప్రవేశపెట్టింది. వ్యాపార, ఇతర పన్నులను తొలగించడంతో అక్కడ స్థిరాస్తి రంగం మెరుగుపడింది. చైనాలో కొన్ని సరకులపై పాక్షిక జీఎస్టీ ఉంది.
* బ్రెజిల్‌లో జీఎస్టీ స్థానంలో వ్యాట్‌ అమల్లో ఉంది. అయితే ప్రాంతాల మధ్య పన్ను రేట్లలో వ్యత్యాసాలు ఎక్కువ. ఈ రేటు సావోపౌలో 17% ఉంటే, రియో డిజెనీరోలో 18% పన్ను రేటు ఉంది. దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర సరఫరా పన్ను రేట్లు వేర్వేరుగా (4 నుంచి 25 శాతం వరకు) ఉన్నాయి.
* సీషెల్స్, కాంగో, గాంబియా, మలేసియా దేశాల్లో గత అయిదేళ్ల నుంచే జీఎస్టీ అమల్లో ఉంది.


వివిధ దేశాల్లో పన్ను (శాతాల్లో)

దేశం పన్ను శాతం
బ్రెజిల్‌ 4 - 25
బ్రిటన్, ఫ్రాన్స్‌ 20
భారత్, రష్యా 18
చైనా 17
మెక్సికో 16
దక్షిణాఫ్రికా 14
ఆస్ట్రేలియా 10
జపాన్, స్విట్జర్లాండ్‌ 8
థాయ్‌లాండ్‌ 7
మలేసియా 6
కెనడా 5
Posted Date : 30-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో భూసంస్కరణ చట్టాలు

భూహక్కులకు భరోసా!

సమ సమాజ నిర్మాణంలో భాగంగా భూములపై అందరికీ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూసంస్కరణలను చేపట్టింది. ఆ హక్కులకు భరోసానిచ్చేందుకు కొన్ని చట్టాలు చేసింది. భూగరిష్ఠ పరిమితినీ విధించింది. ఈ అంశాలపై పరీక్షల కోణంలో అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

 

భారతదేశంలో భూసంస్కరణ చట్టాలు

ఏ దేశంలోనైనా భూమి ముఖ్యంగా వ్యవసాయ యోగ్యమైన భూమిపై అందరికీ హక్కు కల్పించడం సమానత్వ సూత్రానికి ప్రాతిపదిక అవుతుంది. భూ యాజమాన్యం కొంత మందికి మాత్రమే పరిమితమైతే భూమి లేనివారు (పేదలు, కూలీలు, ఇతర బలహీన వర్గాలు) భూస్వామ్య వర్గాలపై తిరుగుబాటు చేసినట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సామాజిక సమానత్వం పాటించే ఎక్కువ మందికి కనిష్ఠ స్థాయి కమతాలపై హక్కులు కల్పించడానికి భూసంస్కరణలు అవసరం. 

 

             పంటల పండించే రైతుకు భూమిపై హక్కు కల్పించాలి. అంతేకాకుండా రైతులు పరపతి సౌకర్యాలను పొందడానికి వారికి భూమిపై హక్కు అవసరం. చిన్నకారు, సన్నకారు రైతులకు భూమి హక్కు తగిన భద్రతను కల్పించి ఉత్పాదకతను సాధించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. పెద్దకమతాల కంటే చిన్నకమతాలను సమర్థంగా సాగు చేయవచ్చు.      

 

భారత ప్రభుత్వం భూసంస్కరణలు అమలు చేయడానికి అనేక చట్టాలను రూపొందించింది. వాటిలో ముఖ్యమైనవి...

* మధ్యవర్తుల తొలగింపు చట్టం

* కౌలుదారీ చట్టాలు

* భూగరిష్ఠ పరిమితి చట్టం

* కమతాల సమీకరణ లేదా ఏకీకరణ

 

మధ్యవర్తుల తొలగింపు చట్టం: మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారిగా 1948లో మద్రాస్‌ రాష్ట్రంలో అమలుచేశారు. ఈ చట్టాన్ని మధ్యవర్తుల దోపిడీ ఎక్కువగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో 1954 - 55లో అమలుచేశారు. 1960 నాటికి దేశమంతా మధ్యవర్తుల తొలగింపు పూర్తయింది.

 

కౌలుదారీ చట్టాలు: భూస్వాముల నుంచి చిన్నరైతులు, వ్యవసాయ శ్రామికులు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారు. పండించిన దానిలో నిర్ణీత భాగం వీరు భూస్వాములకు కౌలుగా చెల్లిస్తారు. బ్రిటిష్‌ కాలంలో మూడు రకాల కౌలుదార్లు ఉండేవారు

1) శాశ్వత కౌలుదార్లు: వీరికి భూమి యాజమాన్యంపై శాశ్వత హక్కు ఉంటుంది. నిర్ణీత శాతం కౌలుగా చెల్లిస్తారు. వారసత్వపు కౌలు హక్కు కలిగిన వీరికి భద్రత ఉండేది.

2) ఏ హక్కులు లేని కౌలుదార్లు: వీరికి భూయాజమాన్యంపై ఎలాంటి అధికారం లేకుండా భూస్వాముల దయాదాక్షిణ్యాలపై జీవిస్తూ వారు నిర్ణయించిన కౌలు మొత్తాన్ని చెల్లిస్తుంటారు. వీరికి భద్రత లేకపోగా దోపిడీకి గురయ్యేవారు.

3) ఉప కౌలుదార్లు: వీరు కౌలుదార్ల నుంచి భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారు. వీరిని ఎలాంటి షరతులు లేకుండా తొలగించవచ్చు. ఉప కౌలుదార్లు కూడా ఎలాంటి భద్రత లేకుండా భూస్వాముల దోపిడీకి గురయ్యేవారు.

పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కౌలు సంస్కరణల చట్టాలు సత్ఫలితాలు చూపాయి. కౌలు సంస్కరణలు అంటే కౌలుదారుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు.

* కౌలు సంస్కరణల్లో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి.

 

ఎ) కౌలు పరిమాణ నిర్ణయం: భారత ప్రభుత్వం చట్టం ద్వారా కౌలు మొత్తాన్ని నిర్ణయించింది. మొదటి ప్రణాళిక (1951 - 56), రెండో ప్రణాళికల్లో (1956 - 61) ఈ కౌలు మొత్తం పంట ఉత్పత్తిలో నాలుగు లేదా అయిదు వంతుల కంటే ఎక్కువ ఉండకూడదని సూచించింది. అంతేకాకుండా ఈ కౌలు మొత్తాన్ని ద్రవ్యరూపంలో చెల్లించాలని నాలుగో ప్రణాళికలో (1969 - 74) సూచించింది. కౌలు పరిమాణం వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా  నిర్ణయించారు. 

* పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో 33.3%

* తమిళనాడులో 33.3% - 40% వరకు

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల భూమికి 25%, మిగిలిన భూములకు 20% 

* కేరళలో 25% - 50% వరకు కౌలు మొత్తంగా చెల్లించాలని నిర్ణయించారు.

 

బి) కౌలుదారులకు భద్రత కల్పించడం: కౌలుదారులను తరచూ తొలగించకుండా వారికి భూమిపై శాశ్వత హక్కులను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వీటి ముఖ్య ఉద్దేశం .....

* చట్టంలోని నిబంధనల ప్రకారం మాత్రమే కౌలుదారుల తొలగింపు జరిగేలా చూడటం.

* యజమాని సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నప్పుడే కౌలుకు ఇచ్చిన భూమి నుంచి కౌలుదారును తొలగించేందుకు వీలు కల్పించడం.

* సొంతంగా వ్యవసాయం చేయాలనుకొని కౌలుదారును భూమి నుంచి తొలగించేటప్పుడు కొంత పరిమాణంలో భూమిని కౌలుదారులకు తప్పనిసరిగా ఉంచడం.

ఉదా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కౌలు పరిమితి 6 సంవత్సరాలుగా నిర్ణయించారు.

 

సి) కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు: కౌలుదారులకు వారు సేద్యం చేస్తున్న భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రణాళిక ముసాయిదా పత్రాల్లో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. భూస్వాముల నుంచి భూములు తీసుకున్న కౌలుదారులు నష్టపరిహారాన్ని సులభమైన వాయిదాల్లో చెల్లించాలని, ఈ వాయిదాల పరిమాణం మొత్తం ఉత్పత్తిలో నాలుగో భాగానికి మించకూడదని ప్రణాళికా సంఘం సూచించింది.

* యాజమాన్య హక్కును చట్టబద్ధం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1993 అక్టోబరు 31న ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీని ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాలున్న వారికి మాత్రమే యాజమాన్య హక్కు ఉంటుంది.

 

భూగరిష్ఠ పరిమితి చట్టం

ఒక కుటుంబం ఎంత పరిమాణంలో భూమిని తమ అధీనంలో లేదా యాజమాన్యంలో ఉంచుకోవచ్చు అనేది భూగరిష్ఠ పరిమితి చట్టం. దీనికి సంబంధించి యూనిట్‌ అంటే కుటుంబం అని అర్థం. ఒక కుటుంబం అంటే 5 మంది వ్యక్తులు (భర్త, భార్య, ముగ్గురు పిల్లలు). 1950 దశాబ్దం చివరలో, 1960 దశాబ్దం ప్రారంభంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూగరిష్ఠ పరిమితి చట్టాలను ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్‌లో, 1961లో మహారాష్ట్రలో తీసుకొచ్చారు.

 

1972 జులైలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో భూగరిష్ఠ పరిమితులకు సంబంధించి కింది నిర్ణయాలు తీసుకున్నారు.

* నీటిపారుదల వసతి ఉండి సంవత్సరానికి రెండు పంటలు పండే భూమి ఒక కుటుంబానికి 10 - 18 ఎకరాల వరకు ఉండవచ్చు.

* సంవత్సరానికి ఒకే పంట పండే భూమి అయితే 18 - 27 ఎకరాల వరకు ఉండవచ్చు.

* భూసారం ఒకేవిధంగా ఉండని భూమి అయితే 54 ఎకరాలు ఉండవచ్చు.

* కుటుంబంలోని వ్యక్తుల సంఖ్య అయిదు మంది కంటే ఎక్కువ ఉంటే భూగరిష్ఠ పరిమితిని మించి అదనంగా భూమి కలిగి ఉండే వీలు కల్పించారు.

మినహాయింపులు:  టీ, కాఫీ తోటలు, ఇతర పండ్ల తోటలు, వ్యవసాయేతర అవసరాల కోసం పారిశ్రామిక, వాణిజ్య సంస్థల అధీనంలో ఉన్న భూములకు భూగరిష్ఠ పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. చక్కెర కర్మాగారాలు 100 ఎకరాల వరకు భూమిని అధీనంలో ఉంచుకునేందుకు అనుమతించారు.

మిగులు భూమి పరిమాణం: భూగరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం 1961 - 71 మధ్య కాలంలో దేశంలో కేవలం 23 లక్షల ఎకరాల భూమిని మిగులు భూమిగా ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన మొత్తం విస్తీర్ణంలో ఇది కేవలం 2 శాతం. బిహార్, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో మిగులు భూమి లేదని పేర్కొన్నారు. 1972 జాతీయ నిబంధనల సూచిక ప్రకారం రెండు పంటలు పండే సాగు నేలకు 4.05 నుంచి 7.28 హెక్టార్లుగా, ఒక పంట పండే సాగు భూమికి 10.93 హెక్టార్లుగా మెట్ట భూముల గరిష్ఠ పరిమితి విధించారు.

 

కమతాల సమీకరణ చట్టం

భూకమతాల పరిమాణం తక్కువైతే వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉంటుందని భావించిన ప్రభుత్వం కమతాల సమీకరణ చట్టాన్ని అమలు చేసింది. కమతాల సమీకరణ అంటే ఒక గ్రామంలోని భూములన్నింటినీ ఒక క్షేత్రంగా మార్చి లాభసాటి కమతాలుగా విభజిస్తారు. విఘటన జరిగిన కమతాలను ఒకేచోట ఉండేలా ఏర్పాటుచేసే పద్ధతిని కమతాల ఏకీకరణ లేదా కమతాల సమీకరణ అంటారు.

 

* కమతాల సమీకరణను రెండు విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు.

1) ఒక గ్రామంలోని కమతాలన్నీ ఒక బ్లాకుగా ఏర్పాటుచేసి ఒక్కో వ్యక్తికి అతడి భూమి విలువకు సమానంగా ఉండేలా ఒకేచోట ఇస్తారు.

2) ఒకరికొకరు స్వచ్ఛందంగా తమ భూములను మార్పు చేసుకొని భూమి అంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

 

     కమతాల సమీకరణ చట్టాన్ని మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అమలుచేశారు. ఈ విధానంలో భాగంగా సహకార వ్యవసాయాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రణాళికలో చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చట్టాలు అమలుచేయలేదు. బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని నిలిపివేశారు.

* భూకమతాల విభజన అంటే కుటుంబంలోని సంతానం మధ్య మొత్తం భూమి ఆస్తుల విభజన.

* భూకమతాల విఘటన అంటే ప్రతి స్థలంలో ఉన్న భూమిని కుటుంబంలోని సంతానం మధ్య పంపిణీ చేయడం.

* ‘ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో భూపునఃవిభజన తప్పనిసరి అయింది’ అని డి.ఆర్‌.గాడ్గిల్‌ భూసంస్కరణల కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.

 

భూగరిష్ఠ పరిమితి విధానం ఆశయాలు: 

* భూమి లేని వారి అవసరాలు తీర్చడం.

* భూయాజమాన్యంలో ఉన్న అసమానతలు తగ్గించి, గ్రామీణ ప్రాంతాల్లో సహకార పద్ధతిని అభివృద్ధి పరచడం.

* భూయాజమాన్యం ద్వారా స్వయం ఉపాధిని విస్తరించడం.

 

భూమి రెవెన్యూ రికార్డు - అడంగల్‌/పహాణి: భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డును అడంగల్‌ లేదా పహాణి అంటారు. ప్రతి గ్రామానికి ఒక అడంగల్‌  ఉంటుంది. దీన్ని  గ్రామాధికారులు నిర్వహిస్తారు. భూమికి సంబంధించిన సర్వే సంఖ్య, సబ్‌ డివిజన్‌ సంఖ్య, భూమి విస్తీర్ణం, సాగుకు పనికి వచ్చే విస్తీర్ణం, పనికిరాని విస్తీర్ణం, భూమి స్వభావం, శిస్తు భూమి వివరణ, జలాధారం, ఆయకట్టు విస్తీర్ణం, ఖాతా సంఖ్య, పట్టాదారు పేరు, అనుభవదారు పేరు, అనుభవ విస్తీర్ణం, అనుభవ స్వభావం లాంటి వివరాలు ఇందులో ఉంటాయి. ఈ వివరాలన్నీ కంప్యూటరీకరించినప్పుడు నకలు పొందడానికి వీలవుతుంది.

రచయిత: బండారి ధనుంజయ

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

‣  ఆర్థిక వృద్ధి - సూచికలు

‣  వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 04-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూసంస్కరణ చట్టాల అమలు-లోపాలు

అడుగడుగునా అడ్డుగోడలు!

 

సమాజంలో అసమానతలను తొలగించేందుకు రూపొందించిన భూసంస్కరణలు అనేక కారణాల వల్ల సమగ్ర అమలుకు నోచుకోలేదు. బలహీన వర్గాలకు సాంఘిక న్యాయాన్ని అందించేందుకు చేసిన భూచట్టాలు, ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఆశించిన ఫలితాలను అందించలేదు. అవినీతి, అక్రమాలు, రాజకీయ జోక్యం అడుగడుగునా అడ్డుగోడలుగా మారాయి. ఈ అంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 

పేదరికం, నిరుద్యోగితను నిర్మూలించి బలహీన వర్గాలను ఆదుకోవడాన్ని సాంఘిక న్యాయం అంటారు. ఆదాయం, సంపద వినియోగాల్లో ఉండే అసమానతలను తగ్గించడమూ అందులో భాగమే. భూ సంస్కరణల వల్ల సాంఘిక న్యాయం జరుగుతుంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. వివిధ రాష్ట్రాలు భూ సంస్కరణ చట్టాలను వివిధ స్థాయుల్లో అమలు పరిచాయి. కానీ అవన్నీ ఒకే రకంగా లేవు. ఏకీకృతం చేయడానికి  జాతీయ భూ సంస్కరణల మండలిని (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ల్యాండ్‌ రిఫార్మ్స్‌) 2008లో స్థాపించినప్పటికీ ఆశించిన ఫలితం అందలేదు. 

1991 నుంచి అమలుచేస్తున్న ఆర్థిక సంస్కరణల కారణంగా భూ సంస్కరణల అంశం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. సరళీకరణ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపలేదు. 9వ పంచవర్ష ప్రణాళిక (1997-2002) ముగిసే నాటికి కూడా భూ గరిష్ఠ పరిమితి చట్టంలో ఎలాంటి మార్పు లేదు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో కౌలు సంస్కరణలు కొత్త సమస్యలను సృష్టించాయి. అప్రకటిత/రాతపూర్వకం కాని విధానం పెరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక (2002-07) వ్యవసాయ వాణిజ్యీకరణ, వ్యవసాయ భూముల లీజు, భాటకాన్ని మార్కెట్‌ నిర్ణయించే ప్రస్థానాన్ని వేగవంతం చేసింది. ఈ ప్రణాళికా కాలంలో పూర్వపు భూసంస్కరణలు, వాటి లక్ష్యాలకు ప్రాధాన్యం తగ్గింది. నోబెల్‌ బహుమతి గ్రహీత ఆచార్య అమర్త్యసేన్‌ ప్రకారం ఆర్థిక సంస్కరణల ఫలితాలు అందరికీ అందాలంటే భూ సంస్కరణలు అమలు జరగాలి. 

భూసంస్కరణలు పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో విజయవంతమయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో అమలులో జాప్యానికి, వైఫల్యాలకు కింది అంశాలను కారణాలుగా పేర్కొనవచ్చు.  

* రాష్ట్రాల్లో చట్టాలు రూపొందించడంలో విపరీతమైన ఆలస్యం చేయడంతో భూముల బదలాయింపులు జరిగిపోయాయి. దీనివల్ల న్యాయంగా ఆశించినంత మిగులు భూమి సమకూరలేదు.

* చట్టాలు లోపభూయిష్టంగా ఉండటంతో న్యాయస్థానాల్లో కేసులు వేశారు. దాంతో జాప్యం జరిగింది.

* చట్టాలను సమర్థంగా అమలుచేయడానికి అవసరమైన యంత్రాంగం లేకపోవడం మరో లోపం. 

* మధ్యవర్తులైన జమీందార్లను తొలగించడంతో వారికి చెల్లించాల్సిన నష్ట పరిహారంపై న్యాయస్థానాల్లో వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో భూసంస్కరణల వల్ల ఆశించిన ఫలితాలు అందలేదు.

* భూగరిష్ఠ పరిమితి చట్టంలో అనేక మినహాయింపులు ఇవ్వడంతో మిగులు భూమి తగ్గిపోయింది.

* చట్టాల అమలుకు అవసరమైన దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రభుత్వాలు భూసంస్కరణల పట్ల ఉదాసీన వైఖరిని ప్రదర్శించాయి.

* ఉద్యోగస్వామ్య దృక్పథం, అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడం, అవినీతి, అసమర్థత, రాజకీయ జోక్యం, లోపాయికారీ అక్రమాలు అడ్డుగోడలుగా మారాయి.

* సమాచార లోపం, రికార్డుల్లో లోపాలతో సంస్కరణల అమలు ఆలస్యమైంది.

* భూమి యజమానితో కౌలుదార్లు నిర్దిష్టమైన రాతపూర్వక ఒప్పందాలు చేసుకోకపోవడం వల్ల వారికి ప్రభుత్వం విధానాల కారణంగా రావాల్సిన కొన్ని రాయితీలు, పరపతి, బీమా లాంటి ప్రయోజనాలు అందలేదు.

* జమీందారీ వ్యవస్థ అంతరించి అనుపస్థిత భూస్వాములు పెరిగారు. వారి వల్ల చాలా భూమి నిరుపయోగంగా ఉండిపోయింది.

* కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం లాంటి విధానాలు విజయవంతం కాలేదు. దీనివల్ల వ్యవసాయాభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించేందుకు దోహదపడే భారీస్థాయి వ్యవసాయం అమలుకు వీలు కాలేదు.

* ప్రభుత్వం వివిధ ప్రణాళికల్లో అమలుచేసిన గ్రామీణాభివృద్ధి పథకాలు, పేదరిక నిర్మూలన, ఉపాధి పథకాల వల్ల ఉపాంత రైతులు, వ్యవసాయ శ్రామికులు లబ్ధి పొందారు. దాంతో వారి నుంచి భూసంస్కరణల అమలు కోసం ప్రభుత్వంపై తగినంత ఒత్తిడి రాలేదు.

* కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల అమలును నిర్లక్ష్యం చేయడం వల్ల షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు సంబంధించి పంచాయతీ విస్తరణ చట్టం (పెసా) పరిధిలోని అనేక అంశాలు వెలుగుచూడలేదు. సామాజిక ఆస్తులు, వనరుల సర్వే చేపట్టడానికి శిక్షణ ద్వారా సమర్థ  నిర్మాణం చేయాల్సిన భూవినియోగ బోర్డుకు వనరులు లేక సాధికారతను పొందలేదు. గ్రామసభల సాధికారత జరగలేదు. భూసంబంధ విధానాలు కొరవడి మహిళల భూయాజమాన్య హక్కులు కూడా సాకారం కాలేదు.

       నీతి ఆయోగ్‌ 2016లో మోడల్‌ అగ్రికల్చరల్‌ లాండ్‌ లీజింగ్‌ యాక్ట్‌ను రూపొందించింది. వివిధ రాష్ట్రాల్లో కౌలు చట్టాలను సమీక్షించడానికి నీతి ఆయోగ్‌ టి.హఖ్‌ అధ్యక్షతన ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఆన్‌ లాండ్‌ లీజింగ్‌ను ఏర్పాటు చేసింది. భూమి లేని ఉపాంత రైతులకు వ్యవసాయ భూమిని లీజుకు ఇవ్వడానికి ఉన్న అవకాశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఉపాంత రైతులకు సంస్థాగత పరపతి సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తుంది.

భూసేకరణ చట్టం - 2013 (Right to fair compensation and transparency in land acquisition and resettlement act - 2013)ను 2014 నుంచి అమలుచేశారు. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారమే భూసేకరణ జరుగుతోంది. భూరికార్డుల డిజిటలైజేషన్‌ కింద కర్ణాటకలో చేపట్టిన భూమి ప్రాజెక్టు ముఖ్యమైంది. రాజస్థాన్‌ ప్రభుత్వం 2016లో అర్బన్‌ లాండ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది.

 

భూ సంస్కరణల చట్టం ముసాయిదా-2013

కేంద్ర ప్రభుత్వం 2013, ఆగస్టు 12న కొత్త భూసంస్కరణ చట్టం ముసాయిదాను తయారుచేసింది. 

ఈ చట్టంలోని అంశాలు: * గ్రామాల్లో భూమి లేని పేదలందరికీ భూపంపిణీ చేయడం.

* దళితులు, గిరిజన వర్గాల నుంచి అన్యాయంగా తీసుకున్న భూములను తిరిగి ఇప్పించడం.

* లీజు చట్టం విధానాలను సడలించడం.

* భూమిపై మహిళల హక్కులను పెంచడం.

2015 డిసెంబరు నాటికి దేశంలో 6.7 మిలియన్‌ ఎకరాల భూమిని ప్రభుత్వం మిగులు భూమిగా ప్రకటించింది. ఇందులో 6.1 మిలియన్‌ ఎకరాలను స్వాధీనం చేసుకొని దానిలో 5.1 మిలియన్‌ ఎకరాలను 5.78 మిలియన్ల ప్రజలకు పంపిణీ చేసింది.

తెలంగాణ - ధరణి పోర్టల్‌:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020, అక్టోబరు 29న ప్రారంభించిన సంఘటిత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ ధరణి. ఇది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించినది. 2020, నవంబరు 23న వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ కూడా మొదలైంది. మా భూమి (ధరణి) ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ప్రజలు, పట్టాదారులు తమ భూముల వివరాలను నేరుగా తెలుసుకునే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. పహాణి (అడంగల్‌) ఆర్‌ఓఆర్‌. (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) డాక్యుమెంట్లను దీని ద్వారా పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ - భూధార్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2015, జూన్‌ 13న ‘మీ భూమి’ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది భూయజమానులు, పౌరులు తమ భూముల వివరాలు తెలుసుకునే ఎలక్ట్రానిక్‌ సౌకర్యం. అయితే 8 ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారాన్ని ఒకే చోట నుంచి తెలుసుకోవడానికి భూసేవ ప్రాధికార సంస్థను నెలకొల్పి దాని ద్వారా 2015 నవంబరులో ‘భూధార్‌ కార్యక్రమం’ను ప్రారంభించింది. ఆధార్‌లో ఉన్నట్లు  భూధార్‌ కూడా 11 అంకెలతో ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. అన్ని పత్రాల్లో భూధార్‌ను చట్టపరంగా ఉపయోగించడానికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 2019, ఫిబ్రవరి 18న ఆమోదం తెలిపింది. ఈ తరహా ఏర్పాటు దేశంలోనే తొలిసారి జరిగింది. రెవెన్యూ పరిధిలోని 99.15% భూములకు శాశ్వత భూధార్‌ సంఖ్యలను కేటాయించారు.

 

భూ కమతాలు

వ్యవసాయ కమతం: రైతు సేద్యం చేసే భూమిని వ్యవసాయ కమతం అంటారు. ఒక ప్రాంతంలో సేద్యం చేసే భూ విస్తీర్ణాన్ని వ్యవసాయ కమతం అని, ఆ కమతంలో సాగయ్యే విస్తీర్ణాన్ని సాగు కమతం అంటారు. భూ కమతం అంటే ఒక రైతుకు సాగు చేసుకోవడానికి ఉన్న భూమి విస్తీర్ణం. కమతం అంటే భూమి, పొలం, చేను.

కమతం పరిమాణాన్ని అయిదు రకాలుగా వర్గీకరించారు.

1) ఉపాంత కమతం/ఉపాంత రైతు: ఒక హెక్టారు (సుమారు 2.5 ఎకరాలు) కంటే తక్కువ పరిమాణం ఉన్న వ్యవసాయ భూమిని ఉపాంత కమతం అంటారు. అలాంటి కమతాన్ని సాగు చేసే రైతులను ఉపాంత రైతులు అంటారు.

2) చిన్న కమతం: 1 నుంచి 2 హెక్టార్ల (2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు) మధ్య ఉన్న సాగు భూమిని చిన్న కమతం అంటారు. దీన్ని సాగు చేసే రైతులను చిన్నకారు రైతులు అంటారు.

3) చిన్న మధ్యస్థ కమతం: 2 నుంచి 4 హెక్టార్ల పరిమాణం ఉన్న కమతాన్ని చిన్న మధ్యస్థ కమతం అంటారు. వీటిని సాగు చేసే వారిని చిన్న మధ్యస్థ రైతులు అంటారు.

4) మధ్యస్థ కమతం: 4 నుంచి 10 హెక్టార్ల పరిమాణం ఉన్న కమతాన్ని మధ్యస్థ కమతం అంటారు. వాటిని సాగు చేసే రైతులను మధ్యస్థ రైతులు అంటారు.

5) పెద్దకమతం/భూస్వామి/పెద్ద రైతు: 10 హెక్టార్లు (25 ఎకరాలు), అంతకంటే ఎక్కువ ఉన్న రైతును భూస్వామి అంటారు.

మన దేశంలో సగటు భూకమత పరిమాణం 2015 - 16 వాటికి 1.08 హెక్టార్లుగా ఉంది.

 

మాదిరి ప్రశ్నలు


1. జమీందారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు?

1) కారన్‌ వాలీస్‌    2) థామస్‌ మన్రో  3) విలియం బెంటింక్‌   4) జె.సి.కూమారప్ప


2. జమీందారీ పద్ధతిని ఏమని పిలుస్తారు?

1) తాత్కాలిక శిస్తు నిర్ణయ విధానం     2) శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి

3) సామాజిక వ్యవసాయక విధానం     4) రైతు శిస్తు నిర్ణయ విధానం


3. రైత్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 

1) జె.సి.కుమారప్ప    2) థామస్‌ మన్రో     3) కారన్‌ వాలీస్‌      4) విలియం బెంటింక్‌ 


4. మహల్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 

1) థామస్‌ మన్రో     2) విలియం బెంటింక్‌     3) కారన్‌ వాలీస్‌     4) ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ


5. కిందివాటిని జతపరచండి. 

i) 1793                a) రైత్వారీ పద్ధతి

ii) 1820               b) జమీందారీ పద్ధతి

iii) 1948              c) మహల్వారీ పద్ధతి 

iv) 1833              d) వ్యవసాయ సంస్కరణల కమిటీ               

1) i-b, ii-a, iii-d, iv-c             2) i-b, ii-a, iii-c, iv-d
3) i-a, ii-b, iii-c, iv-d             4) i-b, ii-c, iii-a, iv-d


6. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని ఎప్పుడు చేశారు? 

1) 1946      2) 1947      3) 1948      4) 1949


7. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్లమెంటు ఎవరి అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది?

1) జె.సి.కుమారప్ప      2) డి.ఆర్‌.గాడ్గిల్‌     3) ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ   4) జవహర్‌లాల్‌ నెహ్రూ


8. భూ గరిష్ఠ పరిమితికి సంబంధించి యూనిట్‌ అంటే?

1) కుటుంబం (భర్త, భార్య, ముగ్గురు మైనర్‌ పిల్లలు)     2) ఉమ్మడి కుటుంబం

3) వారసత్వ కుటుంబం        4) అన్నీ 


9. ఒక కుటుంబం ఎంత పరిమాణంలో భూమిని తన యాజమాన్యంలో ఉంచుకోవచ్చని తెలిపే చట్టం?

1) భూ సంస్కరణల చట్టం    2) భూ గరిష్ఠ పరిమితి చట్టం

3) కౌలుదారీ చట్టం          4) కౌలు భద్రత చట్టం


10. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం?

1) మద్రాస్‌      2) పశ్చిమ బెంగాల్‌       3) ఆగ్రా       4) అవధ్‌

 

సమాధానాలు 

1-1, 2-2, 3-2, 4-2, 5-1, 6-3, 7-1, 8-1, 9-2, 10-1.

రచయిత: బండారి ధనుంజయ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

‣  ఆర్థిక వృద్ధి - సూచికలు

‣  వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 05-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో భూసంస్కరణ చట్టాలు

మాదిరి ప్రశ్నలు


1. జమీందారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు?

1) కారన్‌ వాలీస్‌    2) థామస్‌ మన్రో  3) విలియం బెంటింక్‌   4) జె.సి.కూమారప్ప


2. జమీందారీ పద్ధతిని ఏమని పిలుస్తారు?

1) తాత్కాలిక శిస్తు నిర్ణయ విధానం     2) శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి

3) సామాజిక వ్యవసాయక విధానం     4) రైతు శిస్తు నిర్ణయ విధానం


3. రైత్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 

1) జె.సి.కుమారప్ప    2) థామస్‌ మన్రో     3) కారన్‌ వాలీస్‌      4) విలియం బెంటింక్‌ 


4. మహల్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 

1) థామస్‌ మన్రో     2) విలియం బెంటింక్‌     3) కారన్‌ వాలీస్‌     4) ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ


5. కిందివాటిని జతపరచండి. 

i) 1793                a) రైత్వారీ పద్ధతి

ii) 1820               b) జమీందారీ పద్ధతి

iii) 1948              c) మహల్వారీ పద్ధతి 

iv) 1833              d) వ్యవసాయ సంస్కరణల కమిటీ               

1) i-b, ii-a, iii-d, iv-c             2) i-b, ii-a, iii-c, iv-d
3) i-a, ii-b, iii-c, iv-d             4) i-b, ii-c, iii-a, iv-d


6. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని ఎప్పుడు చేశారు? 

1) 1946      2) 1947      3) 1948      4) 1949


7. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్లమెంటు ఎవరి అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది?

1) జె.సి.కుమారప్ప      2) డి.ఆర్‌.గాడ్గిల్‌     3) ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ   4) జవహర్‌లాల్‌ నెహ్రూ


8. భూ గరిష్ఠ పరిమితికి సంబంధించి యూనిట్‌ అంటే?

1) కుటుంబం (భర్త, భార్య, ముగ్గురు మైనర్‌ పిల్లలు)    

2) ఉమ్మడి కుటుంబం

3) వారసత్వ కుటుంబం        4) అన్నీ 


9. ఒక కుటుంబం ఎంత పరిమాణంలో భూమిని తన యాజమాన్యంలో ఉంచుకోవచ్చని తెలిపే చట్టం?

1) భూ సంస్కరణల చట్టం    2) భూ గరిష్ఠ పరిమితి చట్టం

3) కౌలుదారీ చట్టం          4) కౌలు భద్రత చట్టం

 

10. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం?

1) మద్రాస్‌      2) పశ్చిమ బెంగాల్‌       3) ఆగ్రా       4) అవధ్‌

 

సమాధానాలు 

1-1, 2-2, 3-2, 4-2, 5-1, 6-3, 7-1, 8-1, 9-2, 10-1.

Posted Date : 07-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పన్నుల సంస్కరణలు - రాబడి మార్పులు

విధిస్తే విధిగా చెల్లించాల్సిందే!

 

  ప్రజల జీవన ప్రమాణాల వృద్ధికి అవసరమైన కార్యక్రమాలు, చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి ఆదాయం అవసరం. ఆ ఆదాయాన్ని సమకూర్చుకోడానికి రకరకాల పన్నులు విధిస్తుంది. ఒకసారి నిర్ణయించి, విధిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలు విధిగా చెల్లించాల్సిందే. ప్రత్యక్ష లేదా పరోక్ష మార్గాల్లో పన్ను వసూళ్లు జరుగుతాయి. మన దేశంలో అమలవుతున్న ఈ పన్నుల వ్యవస్థ, అందులో వచ్చిన సంస్కరణలు, ఇతర మార్పుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ఈ అధ్యాయం నుంచి పరీక్షలో తప్పకుండా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

  భారత ప్రభుత్వానికి విత్త వనరులు సమకూర్చే ప్రధాన మార్గం పన్నుల రాబడి. మూడంచెల భారత ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది.

భారత రాజ్యాంగంలోని 268, 300వ అధికరణలు పన్నుల విధింపు, వసూలు అంశాలను తెలియజేస్తున్నాయి. భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం పాలనా విధులను మూడు జాబితాలుగా విభజించారు.  

1) కేంద్ర జాబితా 

2) రాష్ట్ర జాబితా 

3) ఉమ్మడి జాబితా

వీటిని అనుసరించే పన్నులు విధించే అధికారాన్ని స్పష్టం చేశారు. 

  భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా 12 రకాల పన్నులు విధించి వసూలు చేస్తుంది. ఎక్కువ రాబడిని ఇచ్చే పన్నులు కేంద్ర పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 18 రకాల పన్నులు విధించి రాబడిని సమకూర్చుకుంటాయి. కేంద్ర పన్నుల రాబడితో పోలిస్తే రాష్ట్ర పన్నుల నుంచి తక్కువ ఆదాయం లభిస్తుంది.

పన్నుల విధింపు, వసూలు రాబడి వినియోగాన్ని బట్టి పన్నులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 

1) కేంద్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా తానే వినియోగించుకునే పన్నులు.

2) రాష్ట్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా రాష్ట్రాలే వినియోగించుకునే పన్నులు.

3) కేంద్రం విధించి, వసూలు చేసి నికర రాబడిని పూర్తిగా రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నులు.

 

స్థానిక సంస్థల పన్నులు

భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు పన్నులు కేటాయించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో స్థానిక సంస్థలు పనిచేస్తాయి కాబట్టి రాష్ట్ర జాబితాలోని పన్నులను కొన్నింటిని వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు బదలాయించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ బదలాయింపు ఒకేరకంగా లేదు. అయినా భూమి, భవనాలు, వాహనాలు, వినోదం, ప్రకటనలపై పన్ను, ఆక్ట్రాయ్‌ పన్ను, టెర్మినల్‌ పన్ను, వృత్తులు, వ్యాపారాలు, ప్రయాణికులు, సరకులు, వస్తువులు, ఆస్తి బదిలీపై పన్ను లాంటివి స్థానిక సంస్థలు వసూలు చేస్తాయి. 

 

ప్రభుత్వ రాబడి 

ప్రభుత్వానికి ప్రధానంగా రెండు మార్గాల నుంచి రాబడి లభిస్తుంది. 

1) సొంత పన్నుల రాబడి      

2) పన్నేతర రాబడి 

 

పన్నుల వర్గీకరణ 

పన్నులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 

ప్రత్యక్ష పన్నులు (Direct Tax): ఆదాయం, ఆస్తులపై విధించే పన్నులు. 

పరోక్ష పన్నులు (Indirect Tax): వస్తుసేవల ఉత్పత్తిపై విధించే పన్నులు.

 

పంపిణీ న్యాయం ఆధారంగా విధించే పన్నులు

అనుపాత పన్ను (Proportional Tax):  పన్ను విధింపునకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ లేదా వస్తువు విలువలో మార్పులతో నిమిత్తం లేకుండా అన్ని ఆదాయ స్థాయులకు లేదా విలువ స్థాయులకు ఒకే పన్నురేటును వర్తింపజేస్తే, అది అనుపాత పన్ను అవుతుంది.

పురోగామి పన్ను (Progressive Tax): పన్నుకు ఆధారమైన ఆదాయం, సంపద విలువ మారుతూ పన్నురేటు కూడా మారితే దాన్ని పురోగామి పన్ను అంటారు.

తిరోగామి పన్ను (Regressive Tax): ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గితే తిరోగామి పన్ను.

డిగ్రెసివ్‌ పన్ను (Degressive Tax): ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరుగుతూ ఉన్నప్పటికీ పురోగామిత్వం క్షీణిస్తూ ఆదాయం పెరిగినంత వేగంగా త్యాగం పెరగకపోతే అది డిగ్రెసివ్‌ పన్ను అవుతుంది.

 

వస్తువు విలువ లేదా పరిమాణం ఆధారంగా విధించే పన్నులు  

మూల్యానుగత పన్ను (ad valorem tax): ఇది వస్తువు విలువను బట్టి విధించే పన్ను. కొన్ని వస్తువులపై ఎక్సైజ్‌ సుంకాన్ని ఈ పద్ధతిలోనే విధిస్తారు.

నిర్దిష్టమైన పన్ను (Specific Tax): ఒక వస్తువు బరువు లేదా పరిమాణాన్ని బట్టి పన్ను విధిస్తే అది నిర్దిష్టమైన పన్ను.

 

కేంద్ర ప్రభత్వ సొంత పన్నుల రాబడి

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు: 

* వ్యక్తిగత ఆదాయపు పన్ను (1860) 

* కార్పొరేషన్‌ పన్ను (1965 - 66) 

* వడ్డీపై పన్ను (1974) 

* వ్యయ పన్ను (1957) 

* సంపద పన్ను (1957) (ప్రస్తుతం రద్దు) 

* ఎస్టేట్‌ డ్యూటీ (1953) 

* కానుక/బహుమతి పన్ను (1958)

వస్తుసేవలపై పన్నులు : కేంద్ర ప్రభుత్వానికి వస్తుసేవల పన్ను ద్వారా అధిక రాబడి వస్తుంది. అందువల్ల ఇవి ప్రధానమైన పన్నులు. 

1) కేంద్ర ఎక్సైజ్‌ సుంకం: ఇది ఉత్పత్తిపై విధించే పన్ను. మద్యం, మత్తుపదార్థాలు తప్ప అన్ని ఇతర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం విధిస్తుంది. ఎక్సైజ్‌ సుంకం పరోక్ష పన్ను, అనుపాత పన్ను అని రెండు రకాలు.

2) కస్టమ్స్‌ సుంకాలు: ఎగుమతి, దిగుమతుల మీద విధించే పన్నులు కస్టమ్స్‌ సుంకాలు. 

3) సేవలపై పన్ను: తొలిసారిగా ఈ పన్నును 1994 - 95లో విధించారు. 1994 జులై 1 నుంచి టెలిఫోన్, స్టాక్‌ బ్రోకర్, జనరల్‌ బీమా లాంటి సేవల మీద సేవాపన్ను విధిస్తున్నారు.

 

కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి

కేంద్ర ప్రభుత్వానికి పన్నుల నుంచే కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా రాబడి వస్తుంది. ముఖ్యంగా రైల్వేలు, పోలీసు, అడవులు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల నుంచి రాబడి వస్తుంది. దీన్ని పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడి ప్రధానంగా మూడు మార్గాల నుంచి లభిస్తుంది.  

1) పరిపాలన సేవలు: పోలీసులు, జైళ్లు, కోర్టులు 

2) సాంఘిక సేవలు: విద్య, వైద్యం 

3) ఆర్థిక సేవలు: నీటిపారుదల పన్ను, విద్యుచ్ఛక్తి పన్ను

 

కేంద్ర అధికార రెవెన్యూ సంస్థలు

కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రాబడికి సంబంధించి రెండు రెవెన్యూ అధికార సంస్థలు ఉన్నాయి.

1) ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ ్బదితీదీగ్శి: ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని ఒక భాగమే ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ. దేశంలో ప్రత్యక్ష పన్నుల విధానం, ప్రణాళికలు నిర్ణయించడమే ఈ సంస్థ ముఖ్యమైన విధి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రత్యక్ష పన్నుల చట్టాలను తయారు చేయడం దీని బాధ్యత.

2) ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ ్బదితీనిద్శి: ఆర్థిక మంత్రిత్వ శాఖలో గల రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని మరొక భాగమే ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ. ఇది ఎక్సైజ్‌ సుంకం, సేవల పన్నులు, పరిపాలన సంబంధిత నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. వస్తుసేవల పన్నులను అమలు చేయడం వల్ల ఈ సంస్థ పేరును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ ్బదితీఖిద్శి గా మార్చారు. ఇది వస్తుసేవల పన్ను విధానాల రూపకల్పన అమలు, వసూలుకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తుంది.

 

దేశంలో పన్నుల సంస్కరణలు - కమిటీలు  

* 1953  - జాన్‌ మతాయ్‌ సంఘం

* 1956 - నికోలస్‌ కాల్డార్‌ సంఘం (వ్యయంపై పన్ను)

* 1959 - మహవీర్‌ త్యాగి సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన)

* 1967 - భూతలింగం సంఘం (పన్ను విధానాల ఆధునికీకరణ)

* 1970 - కె.ఎస్‌.వాంఛూ సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన, పన్నుల ఎగవేత, నల్లధనం)

* 1972 - కె.ఎస్‌.రాజ్‌ సంఘం (వ్యవసాయం, వ్యవసాయ సంపదపై పన్ను)

* 1977 - సి.సి.చోక్సీ సంఘం (ప్రత్యక్ష పన్నుల రేషనలైజేషన్‌) 

* 1981 - ఎల్‌.కె.ఝా సంఘం (పరోక్ష పన్నుల పరిశీలన)

* 1991 - ఆర్‌.చెల్లయ్య సంఘం (పన్నుల సంస్కరణలు)

* 2002 - ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ సంఘం (ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు)

* 2012 - పార్థసారథి షోమ్‌ సంఘం (యాంటీ ఆవాయిడెన్స్‌ టాక్స్‌)  

 

కలపబడిన విలువ పన్ను (VAT - Value Added Tax)

అమ్మకం పన్ను చట్టం స్థానంలో వ్యాట్‌ చట్టాన్ని ప్రవేశపెట్టారు. వ్యాట్‌ అనేది పరోక్ష పన్ను. మన దేశంలో మొదటిసారి 2003 ఏప్రిల్‌లో వ్యాట్‌ను అమలు చేసిన రాష్ట్రం హరియాణా. 2005 ఏప్రిల్‌ 1న దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్‌ను అమలు చేశాయి. 2012 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్‌ను అమలు చేశాయి. 

* సవరించిన కలపబడిన విలువ పన్ను(Modified Value Added Tax - MODVAT)ను1986లో ఎల్‌.కె.ఝా నేతృత్వంలో ప్రవేశపెట్టారు.

* కేంద్ర కలపబడిన విలువ పన్ను(CENVAT - Central Value Added Tax)ను 2004లో ప్రవేశపెట్టారు. మాడ్‌ వ్యాట్‌ను సెన్‌ వ్యాట్‌ పథకంగా మార్చారు. ప్రపంచంలో తొలిసారిగా వ్యాట్‌ను ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్‌ (1954). టర్నోవర్‌ ట్యాక్స్‌కు బదులుగా వ్యాట్‌ను ప్రవేశపెట్టింది.  

 

వస్తుసేవల పన్ను (Goods and Service Tax)

దేశంలో వ్యాట్‌ స్థానంలో జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌)ని ప్రవేశపెట్టారు. జీఎస్టీ పరోక్ష పన్ను. ప్రపంచంలో తొలిసారిగా జీఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్‌ (1954). మన దేశంలో తొలిసారిగా 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను విధించాలనే ఆలోచన చేసింది. అదే సంవత్సరంలో అప్పటి అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం పన్ను సంస్కరణ కోసం డాక్టర్‌ సి.రంగరాజన్, ఐ.జి.పటేల్, బిమల్‌జలాన్‌ల నేతృత్వంలో ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జీఎస్టీ విధి విధానాల రూపకల్పనకు నాటి పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి ఆసిమ్‌దాస్‌ గుప్తా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. 

* జీఎస్టీ రూపశిల్పి ఆసిమ్‌దాస్‌ గుప్తా. దీని నినాదం ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మార్కెట్‌.

* జీఎస్టీ అంటే అన్ని వస్తుసేవలపై దేశమంతటా ఒకేలా విధించే పరోక్ష పన్ను.

* మన దేశంలో జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అసోం (2016 ఆగస్టు 12).

  పరోక్ష పన్నుల సరళీకృత విధానం కోసం భారత రాజ్యాంగంలోని జీఎస్టీకి పార్లమెంట్‌ 122వ సవరణ చేసింది. జీఎస్టీ బిల్లు 2016 ఆగస్టు 3న రాజ్యసభ, ఆగస్టు 8న లోక్‌సభలో ఆమోదం పొందింది. 2016 సెప్టెంబరు 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ బిల్లును ఆమోదించారు. దీంతో 122వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. 

జీఎస్టీ మండలి: జీఎస్టీ కౌన్సిల్‌ను భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దీనికి కేంద్ర ఆర్థికమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలో సవరించిన ఆర్టికల్‌ 279్బత్శ్బి1్శ ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన జీఎస్టీ మండలిని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి వేదిక అంటారు.

 

జీఎస్టీ నాలుగు రకాలు 

1) కేంద్ర జీఎస్టీ

2) స్టేట్‌ జీఎస్టీ

3) ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ

4) యూజీఎస్టీ

జీఎస్టీ కౌన్సిల్‌ నాలుగు రకాల పన్నురేట్లను నిర్ణయించింది. దీని ప్రకారం 5%, 12%, 18%, 28% పన్నురేట్లను ప్రతిపాదించింది. మొత్తం 1211 వస్తువులపై పన్నురేట్లను నిర్ణయించారు. మరో 500 రకాల సేవలపై జీఎస్టీని ప్రకటించింది.

 

భారత ఆర్థిక సంఘం (విత్తసంఘం)

  భారత రాజ్యాంగంలోని అధికరణం 280 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రతి అయిదేళ్లకు లేదా అంతకంటే ముందుగా విత్తసంఘాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికేతర విత్తవనరుల బదిలీ, పంపిణీ సమస్యలను పరిష్కరించాలి. ఆర్థిక సంఘం ఒక చట్టబద్ధమైన సంస్థ. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి నుంచి రాష్ట్రాలకు బదిలీ చేయడానికి ప్రాతిపదికను సూచించడం విత్తసంఘం విధి. 1951 నుంచి 2017 వరకు 15 విత్తసంఘాలను ఏర్పాటు చేశారు. ఆర్థిక సంఘం ప్రధాన కార్యాలయమైన జవహర్‌ వ్యాపార్‌ భవన్‌ న్యూదిల్లీలో ఉంది. మొదటి ఆర్థిక సంఘాన్ని 1951 నవంబరు 22న, 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబరు 27న ఏర్పాటు చేశారు. 

  15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ (నందకిషోర్‌ సింగ్‌). ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఉంటారు. ప్రస్తుత కార్యనిర్వహణాధికారి అరవింద్‌ మెహతా. 15వ ఆర్థికసంఘం ప్రస్తుత సభ్యులు అజయ్‌ నారాయణ్‌ ఝూ, ప్రొఫెసర్‌ అనూప్‌సింగ్, అశోక్‌ లాహిరి, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌. ఈ ఆర్థిక సంఘం సిఫారసులు 2020 - 26 వరకు అమల్లో ఉంటాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1) వస్తుసేవల పన్నును (జీఎస్టీ) మన దేశంలో ఎప్పుడు అమలు చేశారు?

1) 2017 జులై 1           2) 2016 జులై 1 

2) 2017 జులై 4            3) 2017 జులై 2 

 

2. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పన్నుల విధింపు వసూలు అంశాలను తెలియజేస్తుంది?

1) 268వ అధికరణ            2) 300వ అధికరణ               3) 1, 2          4) 280వ అధికరణ

 

3. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు? 

1) 5వ షెడ్యూల్‌            2) 6వ షెడ్యూల్‌ 

3) 7వ షెడ్యూల్‌            4) 8వ షెడ్యూల్‌

 

4. ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరిగితే అది 

1) పురోగామి పన్ను            2) తిరోగామి పన్ను            3) వ్యాట్‌         4) జీఎస్టీ

 

5. తిరోగామి పన్ను అంటే?

1) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గడం.

2) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరగడం.

3) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు సమానంగా ఉండటం.

4) పైవన్నీ 

 

6. అనుపాతపు పన్ను అంటే? 

1) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు సమానంగా ఉండటం.

2) పన్నురేటు స్థిరంగా లేకపోవడం. 

3) ఆదాయం పెరుగుతున్నప్పటికీ పురోగామిత్వం క్షీణించడం. 

4) పైవన్నీ

 

7. వస్తువు విలువను బట్టి విధించే పన్ను?  

1) మూల్యానుగత పన్ను        2) నిర్దిష్ట పన్ను 

3) వ్యాట్‌                        4) జీఎస్టీ 

 

8. కలపబడిన విలువపన్ను (వ్యాట్‌) ను తొలిసారిగా దేశంలో ఏ రాష్ట్రం, ఎప్పుడు అమలు చేసింది? 

1) హరియాణా, 2003            2) ఒడిశా, 2004 

3) అసోం, 2005                 4) గుజరాత్, 2006 

 

9. వ్యాట్‌ను దేని స్థానంలో ప్రవేశపెట్టారు? 

1) టర్నోవర్‌ పన్ను             2) అమ్మకం పన్ను 

3) ఆక్ట్రాయ్‌ పన్ను               4) ఎక్సైజ్‌ సుంకం 

 

10. వ్యాట్‌ ఒక 

1) పరోక్ష పన్ను             2) ప్రత్యక్ష పన్ను 

3) పురోగామి పన్ను         4) తిరోగామి పన్ను 

 

సమాధానాలు

1-1     2-3     3-3     4-1     5-1     6-1     7-1     8-1     9-2     10-1.

 

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 29-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పన్నుల సంస్కరణలు - రాబడి మార్పులు

విధిస్తే విధిగా చెల్లించాల్సిందే!

 

  ప్రజల జీవన ప్రమాణాల వృద్ధికి అవసరమైన కార్యక్రమాలు, చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి ఆదాయం అవసరం. ఆ ఆదాయాన్ని సమకూర్చుకోడానికి రకరకాల పన్నులు విధిస్తుంది. ఒకసారి నిర్ణయించి, విధిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలు విధిగా చెల్లించాల్సిందే. ప్రత్యక్ష లేదా పరోక్ష మార్గాల్లో పన్ను వసూళ్లు జరుగుతాయి. మన దేశంలో అమలవుతున్న ఈ పన్నుల వ్యవస్థ, అందులో వచ్చిన సంస్కరణలు, ఇతర మార్పుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ఈ అధ్యాయం నుంచి పరీక్షలో తప్పకుండా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

  భారత ప్రభుత్వానికి విత్త వనరులు సమకూర్చే ప్రధాన మార్గం పన్నుల రాబడి. మూడంచెల భారత ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది.

భారత రాజ్యాంగంలోని 268, 300వ అధికరణలు పన్నుల విధింపు, వసూలు అంశాలను తెలియజేస్తున్నాయి. భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం పాలనా విధులను మూడు జాబితాలుగా విభజించారు.  

1) కేంద్ర జాబితా 

2) రాష్ట్ర జాబితా 

3) ఉమ్మడి జాబితా

వీటిని అనుసరించే పన్నులు విధించే అధికారాన్ని స్పష్టం చేశారు. 

  భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా 12 రకాల పన్నులు విధించి వసూలు చేస్తుంది. ఎక్కువ రాబడిని ఇచ్చే పన్నులు కేంద్ర పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 18 రకాల పన్నులు విధించి రాబడిని సమకూర్చుకుంటాయి. కేంద్ర పన్నుల రాబడితో పోలిస్తే రాష్ట్ర పన్నుల నుంచి తక్కువ ఆదాయం లభిస్తుంది.

పన్నుల విధింపు, వసూలు రాబడి వినియోగాన్ని బట్టి పన్నులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 

1) కేంద్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా తానే వినియోగించుకునే పన్నులు.

2) రాష్ట్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా రాష్ట్రాలే వినియోగించుకునే పన్నులు.

3) కేంద్రం విధించి, వసూలు చేసి నికర రాబడిని పూర్తిగా రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నులు.

 

స్థానిక సంస్థల పన్నులు

భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు పన్నులు కేటాయించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో స్థానిక సంస్థలు పనిచేస్తాయి కాబట్టి రాష్ట్ర జాబితాలోని పన్నులను కొన్నింటిని వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు బదలాయించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ బదలాయింపు ఒకేరకంగా లేదు. అయినా భూమి, భవనాలు, వాహనాలు, వినోదం, ప్రకటనలపై పన్ను, ఆక్ట్రాయ్‌ పన్ను, టెర్మినల్‌ పన్ను, వృత్తులు, వ్యాపారాలు, ప్రయాణికులు, సరకులు, వస్తువులు, ఆస్తి బదిలీపై పన్ను లాంటివి స్థానిక సంస్థలు వసూలు చేస్తాయి. 

 

ప్రభుత్వ రాబడి 

ప్రభుత్వానికి ప్రధానంగా రెండు మార్గాల నుంచి రాబడి లభిస్తుంది. 

1) సొంత పన్నుల రాబడి      

2) పన్నేతర రాబడి 

 

పన్నుల వర్గీకరణ 

పన్నులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 

ప్రత్యక్ష పన్నులు (Direct Tax): ఆదాయం, ఆస్తులపై విధించే పన్నులు. 

పరోక్ష పన్నులు (Indirect Tax): వస్తుసేవల ఉత్పత్తిపై విధించే పన్నులు.

 

పంపిణీ న్యాయం ఆధారంగా విధించే పన్నులు

అనుపాత పన్ను (Proportional Tax):  పన్ను విధింపునకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ లేదా వస్తువు విలువలో మార్పులతో నిమిత్తం లేకుండా అన్ని ఆదాయ స్థాయులకు లేదా విలువ స్థాయులకు ఒకే పన్నురేటును వర్తింపజేస్తే, అది అనుపాత పన్ను అవుతుంది.

పురోగామి పన్ను (Progressive Tax): పన్నుకు ఆధారమైన ఆదాయం, సంపద విలువ మారుతూ పన్నురేటు కూడా మారితే దాన్ని పురోగామి పన్ను అంటారు.

తిరోగామి పన్ను (Regressive Tax): ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గితే తిరోగామి పన్ను.

డిగ్రెసివ్‌ పన్ను (Degressive Tax): ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరుగుతూ ఉన్నప్పటికీ పురోగామిత్వం క్షీణిస్తూ ఆదాయం పెరిగినంత వేగంగా త్యాగం పెరగకపోతే అది డిగ్రెసివ్‌ పన్ను అవుతుంది.

 

వస్తువు విలువ లేదా పరిమాణం ఆధారంగా విధించే పన్నులు  

మూల్యానుగత పన్ను (ad valorem tax): ఇది వస్తువు విలువను బట్టి విధించే పన్ను. కొన్ని వస్తువులపై ఎక్సైజ్‌ సుంకాన్ని ఈ పద్ధతిలోనే విధిస్తారు.

నిర్దిష్టమైన పన్ను (Specific Tax): ఒక వస్తువు బరువు లేదా పరిమాణాన్ని బట్టి పన్ను విధిస్తే అది నిర్దిష్టమైన పన్ను.

 

కేంద్ర ప్రభుత్వ సొంత పన్నుల రాబడి

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు: 

* వ్యక్తిగత ఆదాయపు పన్ను (1860) 

* కార్పొరేషన్‌ పన్ను (1965 - 66) 

* వడ్డీపై పన్ను (1974) 

* వ్యయ పన్ను (1957) 

* సంపద పన్ను (1957) (ప్రస్తుతం రద్దు) 

* ఎస్టేట్‌ డ్యూటీ (1953) 

* కానుక/బహుమతి పన్ను (1958)

వస్తుసేవలపై పన్నులు : కేంద్ర ప్రభుత్వానికి వస్తుసేవల పన్ను ద్వారా అధిక రాబడి వస్తుంది. అందువల్ల ఇవి ప్రధానమైన పన్నులు. 

1) కేంద్ర ఎక్సైజ్‌ సుంకం: ఇది ఉత్పత్తిపై విధించే పన్ను. మద్యం, మత్తుపదార్థాలు తప్ప అన్ని ఇతర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం విధిస్తుంది. ఎక్సైజ్‌ సుంకం పరోక్ష పన్ను, అనుపాత పన్ను అని రెండు రకాలు.

2) కస్టమ్స్‌ సుంకాలు: ఎగుమతి, దిగుమతుల మీద విధించే పన్నులు కస్టమ్స్‌ సుంకాలు. 

3) సేవలపై పన్ను: తొలిసారిగా ఈ పన్నును 1994 - 95లో విధించారు. 1994 జులై 1 నుంచి టెలిఫోన్, స్టాక్‌ బ్రోకర్, జనరల్‌ బీమా లాంటి సేవల మీద సేవాపన్ను విధిస్తున్నారు.

 

కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి

కేంద్ర ప్రభుత్వానికి పన్నుల నుంచే కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా రాబడి వస్తుంది. ముఖ్యంగా రైల్వేలు, పోలీసు, అడవులు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల నుంచి రాబడి వస్తుంది. దీన్ని పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడి ప్రధానంగా మూడు మార్గాల నుంచి లభిస్తుంది.  

1) పరిపాలన సేవలు: పోలీసులు, జైళ్లు, కోర్టులు 

2) సాంఘిక సేవలు: విద్య, వైద్యం 

3) ఆర్థిక సేవలు: నీటిపారుదల పన్ను, విద్యుచ్ఛక్తి పన్ను

 

కేంద్ర అధికార రెవెన్యూ సంస్థలు

కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రాబడికి సంబంధించి రెండు రెవెన్యూ అధికార సంస్థలు ఉన్నాయి.

1) ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ (CBDT): ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని ఒక భాగమే ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ. దేశంలో ప్రత్యక్ష పన్నుల విధానం, ప్రణాళికలు నిర్ణయించడమే ఈ సంస్థ ముఖ్యమైన విధి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రత్యక్ష పన్నుల చట్టాలను తయారు చేయడం దీని బాధ్యత.

2) ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ (CBEC): ఆర్థిక మంత్రిత్వ శాఖలో గల రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని మరొక భాగమే ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ. ఇది ఎక్సైజ్‌ సుంకం, సేవల పన్నులు, పరిపాలన సంబంధిత నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. వస్తుసేవల పన్నులను అమలు చేయడం వల్ల ఈ సంస్థ పేరును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (CBIC) గా మార్చారు. ఇది వస్తుసేవల పన్ను విధానాల రూపకల్పన అమలు, వసూలుకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తుంది.

 

దేశంలో పన్నుల సంస్కరణలు - కమిటీలు  

* 1953  - జాన్‌ మతాయ్‌ సంఘం

* 1956 - నికోలస్‌ కాల్డార్‌ సంఘం (వ్యయంపై పన్ను)

* 1959 - మహవీర్‌ త్యాగి సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన)

* 1967 - భూతలింగం సంఘం (పన్ను విధానాల ఆధునికీకరణ)

* 1970 - కె.ఎస్‌.వాంఛూ సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన, పన్నుల ఎగవేత, నల్లధనం)

* 1972 - కె.ఎస్‌.రాజ్‌ సంఘం (వ్యవసాయం, వ్యవసాయ సంపదపై పన్ను)

* 1977 - సి.సి.చోక్సీ సంఘం (ప్రత్యక్ష పన్నుల రేషనలైజేషన్‌) 

* 1981 - ఎల్‌.కె.ఝా సంఘం (పరోక్ష పన్నుల పరిశీలన)

* 1991 - ఆర్‌.చెల్లయ్య సంఘం (పన్నుల సంస్కరణలు)

* 2002 - ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ సంఘం (ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు)

* 2012 - పార్థసారథి షోమ్‌ సంఘం (యాంటీ ఆవాయిడెన్స్‌ టాక్స్‌)  

 

కలపబడిన విలువ పన్ను (VAT - Value Added Tax)

అమ్మకం పన్ను చట్టం స్థానంలో వ్యాట్‌ చట్టాన్ని ప్రవేశపెట్టారు. వ్యాట్‌ అనేది పరోక్ష పన్ను. మన దేశంలో మొదటిసారి 2003 ఏప్రిల్‌లో వ్యాట్‌ను అమలు చేసిన రాష్ట్రం హరియాణా. 2005 ఏప్రిల్‌ 1న దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్‌ను అమలు చేశాయి. 2012 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్‌ను అమలు చేశాయి. 

* సవరించిన కలపబడిన విలువ పన్ను(Modified Value Added Tax - MODVAT)ను1986లో ఎల్‌.కె.ఝా నేతృత్వంలో ప్రవేశపెట్టారు.

* కేంద్ర కలపబడిన విలువ పన్ను(CENVAT - Central Value Added Tax)ను 2004లో ప్రవేశపెట్టారు. మాడ్‌ వ్యాట్‌ను సెన్‌ వ్యాట్‌ పథకంగా మార్చారు. ప్రపంచంలో తొలిసారిగా వ్యాట్‌ను ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్‌ (1954). టర్నోవర్‌ ట్యాక్స్‌కు బదులుగా వ్యాట్‌ను ప్రవేశపెట్టింది.  

 

వస్తుసేవల పన్ను (Goods and Service Tax)

దేశంలో వ్యాట్‌ స్థానంలో జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌)ని ప్రవేశపెట్టారు. జీఎస్టీ పరోక్ష పన్ను. ప్రపంచంలో తొలిసారిగా జీఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్‌ (1954). మన దేశంలో తొలిసారిగా 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను విధించాలనే ఆలోచన చేసింది. అదే సంవత్సరంలో అప్పటి అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం పన్ను సంస్కరణ కోసం డాక్టర్‌ సి.రంగరాజన్, ఐ.జి.పటేల్, బిమల్‌జలాన్‌ల నేతృత్వంలో ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జీఎస్టీ విధి విధానాల రూపకల్పనకు నాటి పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి ఆసిమ్‌దాస్‌ గుప్తా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. 

* జీఎస్టీ రూపశిల్పి ఆసిమ్‌దాస్‌ గుప్తా. దీని నినాదం ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మార్కెట్‌.

* జీఎస్టీ అంటే అన్ని వస్తుసేవలపై దేశమంతటా ఒకేలా విధించే పరోక్ష పన్ను.

* మన దేశంలో జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అసోం (2016 ఆగస్టు 12).

  పరోక్ష పన్నుల సరళీకృత విధానం కోసం భారత రాజ్యాంగంలోని జీఎస్టీకి పార్లమెంట్‌ 122వ సవరణ చేసింది. జీఎస్టీ బిల్లు 2016 ఆగస్టు 3న రాజ్యసభ, ఆగస్టు 8న లోక్‌సభలో ఆమోదం పొందింది. 2016 సెప్టెంబరు 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ బిల్లును ఆమోదించారు. దీంతో 122వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. 

జీఎస్టీ మండలి: జీఎస్టీ కౌన్సిల్‌ను భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దీనికి కేంద్ర ఆర్థికమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలో సవరించిన ఆర్టికల్‌ 279్(A)(1) ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన జీఎస్టీ మండలిని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి వేదిక అంటారు.

 

జీఎస్టీ నాలుగు రకాలు 

1) కేంద్ర జీఎస్టీ

2) స్టేట్‌ జీఎస్టీ

3) ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ

4) యూజీఎస్టీ

జీఎస్టీ కౌన్సిల్‌ నాలుగు రకాల పన్నురేట్లను నిర్ణయించింది. దీని ప్రకారం 5%, 12%, 18%, 28% పన్నురేట్లను ప్రతిపాదించింది. మొత్తం 1211 వస్తువులపై పన్నురేట్లను నిర్ణయించారు. మరో 500 రకాల సేవలపై జీఎస్టీని ప్రకటించింది.

 

భారత ఆర్థిక సంఘం (విత్తసంఘం)

  భారత రాజ్యాంగంలోని అధికరణం 280 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రతి అయిదేళ్లకు లేదా అంతకంటే ముందుగా విత్తసంఘాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికేతర విత్తవనరుల బదిలీ, పంపిణీ సమస్యలను పరిష్కరించాలి. ఆర్థిక సంఘం ఒక చట్టబద్ధమైన సంస్థ. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి నుంచి రాష్ట్రాలకు బదిలీ చేయడానికి ప్రాతిపదికను సూచించడం విత్తసంఘం విధి. 1951 నుంచి 2017 వరకు 15 విత్తసంఘాలను ఏర్పాటు చేశారు. ఆర్థిక సంఘం ప్రధాన కార్యాలయమైన జవహర్‌ వ్యాపార్‌ భవన్‌ న్యూదిల్లీలో ఉంది. మొదటి ఆర్థిక సంఘాన్ని 1951 నవంబరు 22న, 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబరు 27న ఏర్పాటు చేశారు. 

  15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ (నందకిషోర్‌ సింగ్‌). ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఉంటారు. ప్రస్తుత కార్యనిర్వహణాధికారి అరవింద్‌ మెహతా. 15వ ఆర్థికసంఘం ప్రస్తుత సభ్యులు అజయ్‌ నారాయణ్‌ ఝూ, ప్రొఫెసర్‌ అనూప్‌సింగ్, అశోక్‌ లాహిరి, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌. ఈ ఆర్థిక సంఘం సిఫారసులు 2020 - 26 వరకు అమల్లో ఉంటాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1) వస్తుసేవల పన్నును (జీఎస్టీ) మన దేశంలో ఎప్పుడు అమలు చేశారు?

1) 2017 జులై 1           2) 2016 జులై 1 

2) 2017 జులై 4            3) 2017 జులై 2 

 

2. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పన్నుల విధింపు వసూలు అంశాలను తెలియజేస్తుంది?

1) 268వ అధికరణ            2) 300వ అధికరణ               3) 1, 2          4) 280వ అధికరణ

 

3. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు? 

1) 5వ షెడ్యూల్‌            2) 6వ షెడ్యూల్‌ 

3) 7వ షెడ్యూల్‌            4) 8వ షెడ్యూల్‌

 

4. ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరిగితే అది 

1) పురోగామి పన్ను            2) తిరోగామి పన్ను            3) వ్యాట్‌         4) జీఎస్టీ

 

5. తిరోగామి పన్ను అంటే?

1) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు తగ్గడం.

2) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరగడం.

3) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు సమానంగా ఉండటం.

4) పైవన్నీ 

 

6. అనుపాత పన్ను అంటే? 

1) ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు సమానంగా ఉండటం.

2) పన్నురేటు స్థిరంగా లేకపోవడం. 

3) ఆదాయం పెరుగుతున్నప్పటికీ పురోగామిత్వం క్షీణించడం. 

4) పైవన్నీ

 

7. వస్తువు విలువను బట్టి విధించే పన్ను?  

1) మూల్యానుగత పన్ను        2) నిర్దిష్ట పన్ను 

3) వ్యాట్‌                        4) జీఎస్టీ 

 

8. కలపబడిన విలువ పన్ను (వ్యాట్‌) ను తొలిసారిగా దేశంలో ఏ రాష్ట్రం, ఎప్పుడు అమలు చేసింది? 

1) హరియాణా, 2003            2) ఒడిశా, 2004 

3) అసోం, 2005                 4) గుజరాత్, 2006 

 

9. వ్యాట్‌ను దేని స్థానంలో ప్రవేశపెట్టారు? 

1) టర్నోవర్‌ పన్ను             2) అమ్మకం పన్ను 

3) ఆక్ట్రాయ్‌ పన్ను               4) ఎక్సైజ్‌ సుంకం 

 

10. వ్యాట్‌ ఒక 

1) పరోక్ష పన్ను             2) ప్రత్యక్ష పన్ను 

3) పురోగామి పన్ను         4) తిరోగామి పన్ను 

 

సమాధానాలు

1-1     2-3     3-3     4-1     5-1     6-1     7-1     8-1     9-2     10-1.

 

రచయిత: బండారి ధనుంజయ

 

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 భార‌త‌దేశ ఆర్థికాభివృద్ధి

 జాతీయాదాయం

 వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ద్రవ్యోల్బణం

పాకుతూ... పరిగెడుతూ... నడుస్తూ... దూకుతూ!

  అప్పట్లో అయిదువేలు జీతం. అవసరమైనవన్నీ కొనుకున్నా... ఇంకా నెలకు అయిదు వందలు దాచుకునేవాళ్లం. ఇప్పుడు యాభైవేల వేతనమైనా ఏ మూలకు సరిపోవడం లేదు. ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరిగింది. అంతకంటే వేగంగా వస్తుసేవల డిమాండ్, వాటి ధరలూ పెరిగాయి. డబ్బు విలువ పడిపోయింది. దీంతో వినియోగదారుల కొలుగోలుశక్తి తగ్గిపోయింది. ఇదే ద్రవ్యోల్బణం. ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్న అంతర్జాతీయ సమస్య. ఇది పాకుతుంది, నడుస్తుంది, పరిగెడుతుంది, దూకుతుంది. అందుకే దీన్ని నియంత్రించడానికి నిపుణులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, వాటి భావనలు, రకాలు, అంచనా పద్ధతులు, కారణాలు, ఫలితాలు తదితరాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

  ద్రవ్యోల్బణం ఒక స్థూలమైన జాతీయ సమస్య. ఇది వివిధ వర్గాల ప్రజలపై వేర్వేరు ప్రభావాలను చూపుతుంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దశ, స్థాయులను ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రభుత్వం తగిన నివారణ చర్యలను చేపట్టాలి. లేకపోతే హెచ్చుస్థాయి ద్రవ్యోల్బణం ఆర్థిక అస్థిరతను కలిగిస్తుంది. సాధారణంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. కానీ వాస్తవానికి వస్తుసేవలకు ఉన్న అత్యధిక డిమాండ్‌ వల్ల ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరగడాన్నే ద్రవ్యోల్బణం అంటారు.

 

అయిదు భావనలు 

1) సాధారణంగా ధరల తగ్గుదలను ప్రతిద్రవ్యోల్బణం అంటారు.

2) ద్రవ్యోల్బణం రేటులో తగ్గుదలను ద్రవ్యోల్బణ పంథా అంటారు.

3) నియంత్రించడానికి వీలుకాని ద్రవ్యోల్బణ విస్ఫోటాన్ని అతి తీవ్రమైన ద్రవ్యోల్బణం అంటారు.

4) ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ స్థాయి ఆర్థిక వృద్ధిరేటు మిశ్రమ స్థితిని స్తబ్ధత ద్రవ్యోల్బణం అంటారు.

5) ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి ధరలను పెంచే ప్రయత్నాన్నే పరిమిత ద్రవ్యోల్బణం అంటారు.

 

ద్రవ్యోల్బణ రకాలు 

పాకుతున్న ద్రవ్యోల్బణం (Creepimg Inflation): ఒక సంవత్సరంలో ధరల పెరుగుదల 3 శాతానికి మించకుండా ఉంటే దాన్ని పాకుతున్న ద్రవ్యోల్బణం అని కెంట్‌ అనే అర్థశాస్త్రవేత్త వివరించారు.

 

నడుస్తున్న ద్రవ్యోల్బణం (Walking Inflation): ఒక సంవత్సరంలో ధరల పెరుగుదల 3 - 4 శాతం మధ్యలో ఉంటే దాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు.

 

పరిగెత్తే ద్రవ్యోల్బణం (Running Inflation): సంవత్సరంలో ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉంటే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు.

 

దూకుతున్న ద్రవ్యోల్బణం (Gallop[ing Inflation): చాలా ఎక్కువ స్థాయిలో ధరల పెరుగుదల ఉంటే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదల 100 శాతం కూడా ఉండవచ్చు. దీన్ని అతి తీవ్ర ద్రవ్యోల్బణం అంటారు. 

* రాబర్ట్‌ జె.గార్డన్‌ ద్రవ్యోల్బణాన్ని మూడు రకాలుగా వివరించారు. ఈ వివరణను త్రికోణ నమూనా (Triangle Model) అంటారు.

1) డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం ((Demand Plan Inflation): ఇది ప్రభుత్వ, ప్రైవేటు వ్యయాల వల్ల సమష్టి డిమాండ్‌లో కలిగే పెరుగుదల కారణంగా ఏర్పడే ద్రవ్యోల్బణం.

 

2) వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం (Cost Push Inflation): ఉత్పత్తి కారకాల ధరల పెరుగుదల వల్ల సమష్టి సప్లయ్‌ తగ్గినప్పుడు ఈ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

 

3) అంతర్లీన ద్రవ్యోల్బణం (Built-in Inflation): వేతనాలు పెరగాలనే కార్మికులు, ఉద్యోగుల ఆశలు ద్రవ్యోల్బణానికి ప్రేరణ కల్పిస్తాయి. దీన్ని ధర/వేతన విస్ఫోటం అంటారు. ఈ విధమైన వేతన పెరుగుదల వ్యయం వినియోగదారుడి పైకి మారుతుంది. అంతర్లీన ద్రవ్యోల్బణం గత కాలపు పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. అందువల్ల దీన్ని అంతర్లీన ద్రవ్యోల్బణం (హ్యాంగోవర్‌ ద్రవ్యోల్బణం) అంటారు.

 

గుణాత్మక ద్రవ్యోల్బణం (Quality Inflation): అమ్మకందారుడు వస్తువుల అమ్మకం ద్వారా సేకరించిన కరెన్సీని భావికాలంలో మార్పు చేసుకోవాలనే అంచనాపై ఆధారపడిన ధరల పెరుగుదలను గుణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.

 

పరిమాణాత్మక ద్రవ్యోల్బణం (Quality Theory of Inflation): ద్రవ్య సప్లయ్, చెలామణీ, ద్రవ్య మారకాల సమీకరణంపై ఆధారపడిన ధరల పెరుగుదలను పరిమాణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.

 

రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం (Sectoral Inflation): ఉత్పత్తి రంగంలోని ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తుసేవల ధరలు పెరగడాన్ని రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటారు. ముడిచమురు ధర పెరిగితే దాన్ని ఉపయోగించే ఇతర పరిశ్రమల ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి.

 

ధర - శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం (Pricing Power Inflation): పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి, అమ్మకపు ధరలు పెంచడాన్ని ధర - శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం అంటారు.

 

కోశ సంబంధ ద్రవ్యోల్బణం (Fiscal Inflation): ఇది ప్రభుత్వం సేకరించిన రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం. ప్రభుత్వ బడ్జెట్‌ లోటు వల్ల కలిగే ధరల పెరుగుదలను కోశ సంబంధ ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు.

 

ద్రవ్యోల్బణాన్ని అంచనావేసే పద్ధతులు 

కొంతరేటులో ధరల పెరుగుదల కొంత కాలం కొనసాగితే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయవచ్చు. 

1) వినియోగదారుల ధరల సూచిక (Consumer PriceIndex): ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు వాడే వస్తుసేవల ధరలను ప్రతిబింబిస్తూ తయారు చేసిన ధరల సూచిక ద్వారా దీన్ని అంచనా వేయవచ్చు.

 

2) ఉత్పత్తిదారుల ధరల సూచిక (Producer Price Index): దీన్ని టోకు ధరల సూచిక అంటారు. వినియోగదారుడి ధరల సూచిక మాదిరిగానే ఉత్పత్తిదారుడి ధరల సూచికను కూడా నిర్మించవచ్చు.

 

3) స్థూల జాతీయోత్పత్తి అవ్యక్త ద్రవ్యోల్బణ సూచిక (GNP Implicit Price Deflator): ఇది ప్రతిద్రవ్యోల్బణానికి సంబంధించిన సూచిక. ఎందుకంటే ప్రస్తుత రూపాయి విలువలో స్థూల జాతీయోత్పత్తికి, ప్రాతిపదిక సంవత్సర రూపాయి విలువలో స్థూల జాతీయోత్పత్తికి ఉన్న వ్యత్యాసాన్ని తెలుపుతుంది.

 

4) వినియోగదారుడి వ్యయ అవ్యక్త ద్రవ్యోల్బణ సూచిక (Consumer Implicit Price Deflator): ఇది వినియోగదారుడి ధరల సూచికకు ప్రత్యామ్నాయ సూచిక. వినియోగదారుడు వ్యయం చేసే వస్తువుల ధరల్లోని మార్పును ఈ సూచిక తెలియజేస్తుంది.

 

5) జీవన ప్రమాణ వ్యయ సూచీ (Cost of Living Index): వినియోగదారుడి సూచీ లాంటిదే జీవన ప్రమాణ వ్యయ సూచీ. దీనిలో  స్థిర ఆదాయాలు, కాంట్రాక్టు ఆదాయాలు, వాటి వాస్తవిక విలువను నిలకడగా ఉంచడానికి తగిన సవరణలు చేసే వీలుంటుంది.

 

6) మూలధన వస్తువుల ధరల సూచీ (Capital Goods Price Index): వాస్తవానికి ద్రవ్య సప్లయ్‌ పెరుగుదల వినియోగదారుడి వస్తువుల ద్రవ్యోల్బణంతో పాటు మూలధన వస్తువుల ద్రవ్యోల్బణాన్ని కూడా కలిగిస్తుంది.

 

ప్రతిద్రవ్యోల్బణ సూచీ: కొన్ని సంవత్సరాల ధరల గణాంకాలను ఆధార సంవత్సర ధరల్లో తెలియజేయడానికి ఉపయోగపడే విలువను ప్రతిద్రవ్యోల్బణ సూచీ (Price Deflator)  అంటారు.

 

ద్రవ్యోల్బణానికి కారణాలు 

డిమాండ్, సప్లయ్‌ మధ్య సమతౌల్యం ఏర్పడటం చాలా కష్టం. అందువల్ల ధరల్లో స్థిరత్వాన్ని సాధించడానికి వీలు కాదు. ఏదైనా ఒక కాలంలో డిమాండ్, సప్లయ్‌ మధ్య సమతౌల్యం ఏర్పడినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవదు. అందువల్ల ధరల స్థాయిని సవరిస్తుండాలి. ఇది నిరంతర ప్రక్రియ. లేకపోతే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వానికి ధరలను నియంత్రించే శక్తి తగ్గిందని చెప్పవచ్చు. అందువల్ల మార్కెట్‌ శక్తులైన డిమాండ్, సప్లయ్‌  అంశాల్లో ఇమిడి ఉన్న అనిశ్చితి వల్ల ధరలు నిలకడగా లేక ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణానికి డిమాండ్‌ ప్రేరిత, వ్యయ ప్రేరిత అంశాలు కారణాలుగా చెప్పవచ్చు.

 

డిమాండ్‌ ప్రేరిత అంశాలు: 

* జనాభా పెరుగుదల వల్ల వస్తుసేవల డిమాండ్‌ పెరుగుతుంది. 

* దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల ప్రజల ఆదాయాలు పెరిగి వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది. 

* సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ కల్పన పథకాలపై బడ్జెట్‌ కేటాయింపులు ఎక్కువ చేసి ఉపాధి కల్పించడం వల్ల వస్తుసేవల డిమాండ్‌ పెరుగుతుంది. 

* ఉత్పాదక ప్రాజెక్టులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడి రేటు తక్కువగా ఉండి ఉత్పత్తి కుంటుపడుతుంది. 

* ద్రవ్య సప్లయ్‌ పెరిగి ద్రవ్య చెలామణి ఎక్కువై వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది. 

* ఎంఆర్‌టీపీ చట్టం నీరుకారిపోవడం వల్ల వస్తుసేవలకు కృత్రిమ కొరత ఏర్పడి డిమాండ్‌ పెరుగుతుంది. 

* ప్రభుత్వ రుణ సేకరణ పెరిగి అనుత్పాదక అంశాలపై వ్యయం చేయడం వల్ల దేశంలో కొనుగోలుశక్తి పెరిగి డిమాండ్‌ పెరుగుతుంది. 

* బడ్జెట్‌లో కోశలోటు నియంత్రణలో ప్రభుత్వం సఫలీకృతం కాలేకపోవడం వల్ల వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది.

* విచక్షణా రహిత, హేతుబద్ధం కాని సబ్సిడీల వల్ల కూడా వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది.

వ్యయ ప్రేరిత అంశాలు:

* ఉత్పత్తి కారకాలపై వ్యయం పెరుగుతుంది. భూమి రేటు, బాటకం, మూలధనంపై వడ్డీరేటు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. 

* శ్రామికుల వేతనాల పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కొన్ని శ్రామిక సంఘాల డిమాండ్‌లు విపరీతంగా ఉంటున్నాయి. 

* పాతవైన పెద్ద పరిశ్రమల్లో ఆధునికీకరణ రేటు తక్కువగా ఉండి వ్యయం పెరుగుతుంది. పరిశ్రమల ఆధునికీకరణకు అవసరమైన యంత్ర భాగాలు దిగుమతి చేసుకోవడం వ్యయంతో కూడుకున్నది. కాబట్టి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. 

* ప్రభుత్వరంగ సంస్థల యాజమాన్యం సమర్థంగా లేకపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది.


ద్రవ్య సంబంధ అంశాలు: 

  సప్లయ్‌ వైపు ఆర్థిక అంశాలను వివరించినట్లు ద్రవ్య సప్లయ్‌ పెరుగుదల లేదా ద్రవ్య మిగులుకు ఉన్న డిమాండ్‌ తగ్గుదలను ద్రవ్యోల్బణ పరిస్థితిగా చెప్పవచ్చు.

* ఆస్ట్రిషన్‌ అనే అర్థశాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం అదనపు ద్రవ్యం కలిగి ఉన్నవారి కొనుగోలుశక్తి పెరుగుతుంది. దాంతో వారి కొనుగోలు లక్షణాలు మారి సాధారణంగా వస్తుసేవల డిమాండ్‌ పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులకు కారణమవుతాయి. 

* కార్ల్‌మార్క్స్‌ వాదన ప్రకారం శ్రామికశక్తిలో కొలిచిన ఉత్పత్తి వ్యయం వాస్తవిక ద్రవ్యోల్బణానికి ముఖ్య కారణం.

* జె.ఎం.కీన్స్‌ అనే అర్థశాస్త్రవేత్త విశ్లేషణ ప్రకారం ఆర్థిక వ్యవస్థలోని వాస్తవిక అంశాలను ద్రవ్య పారదర్శకత తెలియజేస్తుంది. ధరల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థలోని ఒత్తిడి కారణంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

  రాబోయే కాలంలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి ఉత్పత్తి స్థాయిని విధాన నిర్ణాయక పాలకులు కచ్చితంగా అంచనా వేయడం ఒక సమస్య. అందుకే ద్రవ్యోల్బణం అసమానంగా తగ్గడం కంటే పెరగుతుంది. అంటే విధాన నిర్ణాయక అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని చెప్పవచ్చు.ఇతర అంశాలు: భారతదేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేక అంశాలు కారణమవుతాయి.  

1) మూలధన కొరత  2) వ్యవస్థాపక నైపుణ్యత లేమి 3) శ్రామిక నైపుణ్యత కొరత 4) శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన లభ్యత లేమి  5) అవస్థాపక సౌకర్యాల కొరత 6) విదేశీ మారక ద్రవ్య కొరత, ఆహార భద్రత లేమి

 

ద్రవ్యోల్బణ ప్రభావాలు

ద్రవ్యోల్బణ ప్రభావం ముఖ్యంగా ఉత్పత్తి, పంపిణీ, విదేశీ చెల్లింపులపై ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దేశంలోని పారిశ్రామికవేత్తలు, రుణదాతలు, రుణగ్రహీతలు, వేతనాలు, జీతాలు పొందేవారు; షేర్లు, బాండ్లు లాంటివి ఉన్న వివిధ వర్గాల ప్రజలపై కూడా ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతుంది. 

 

వివిధ వర్గాలపై ద్రవ్యోల్బణ ప్రభావం: 

* ధరల పెరుగుదల దేశంలోని వివిధ వర్గాలపై అనేక రకాల ప్రభావాలు చూపుతుంది. దీనివల్ల కొన్ని వర్గాల వారికి ప్రయోజనం, మరికొన్ని వర్గాల వారికి నష్టం కలుగుతుంది. గతంలో రుణాలు స్వీకరించిన వారు (రుణ గ్రహీతలు) ద్రవ్యోల్బణంలో అప్పులు తీర్చడం వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకంటే వారు అప్పు తీసుకున్నప్పుడు దాన్ని ద్రవ్య విలువ ఎక్కువ, తీర్చేటప్పుడు దాని ద్రవ్య విలువ తక్కువ. ఈ కారణంగా రుణదాతలు కొంతవరకు నష్టపోతారు. 

* స్థిరమైన ఆదాయ వర్గాల ప్రజలు ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు. వారి ఆదాయం స్థిరంగా ఉండి వస్తుసేవల ధరలు పెరిగితే గతంలో మాదిరి  అదే పరిమాణంలో వస్తుసేవలను కొని వినియోగించలేరు. అందువల్ల జీవన ప్రమాణ స్థాయి తగ్గవచ్చు. 

* వేతన కార్మికులు ద్రవ్యోల్బణం వల్ల నష్టపోవచ్చు. కానీ అది ధరల పెరుగుదల రేటుకు సమానంగా, వేతనాల పెరుగుదలను వేగంగా సాధించే శ్రామిక సంఘాల శక్తి, సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. 

* నిర్ణీత వడ్డీరేటు కంటే డిబెంచర్లను కలిగి ఉన్నవారు ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు. 

* వ్యవసాయ రంగంలో భూములను నిర్ణీత మొత్తాలకు కౌలుకు ఇచ్చినవారు నష్టపోతారు. ఉత్పత్తి వ్యయం పెరగకుండా వ్యవసాయ ఉత్పత్తి ధరలు పెరిగితే కౌలుదారులు లాభపడతారు. 

* నిర్ణీత వేతనాలకు పనిచేసే వ్యవసాయ కార్మికులు ద్రవ్యోల్బణం వల్ల నష్టపోతారు. 

అందువల్ల ద్రవ్యోల్బణం వివిధ వర్గాల ప్రజలపై మిశ్రమ ప్రభావాలను చూపుతుంది.  

 

రచయిత: బండారి ధనుంజయ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 భార‌త ఆర్థికవ్య‌వ‌స్థ ల‌క్ష‌ణాలు

 స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ మార్కెట్

  ఆర్థిక సంఘం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 07-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు

మాదిరి ప్రశ్నలు


1. దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయంలో వృద్ధి అంటే?    

1) ఆర్థిక వృద్ధి              2) ఆర్థికాభివృద్ధి       3)  తలసరి ఆదాయ వృద్ధి       4) అన్నీ 

 

2. ఆర్థికవృద్ధి ఏవిధమైనది?

1) గుణాత్మకమైంది       2) పరిమాణాత్మకమైంది    3)  1, 2                       4) స్థిరమైంది

 

3. ఆర్థికాభివృద్ధి లక్షణం ఏమిటి? 

1) స్థిరమైంది           2) గుణాత్మకమైంది    3)  పరిమాణాత్మకమైంది        4) అన్నీ 

 

4. దీర్ఘకాలంలో వ్యవస్థాపూర్వక మార్పులు, వనరుల కేటాయింపులో మార్పులతో కూడిన వాస్తవిక తలసరి ఆదాయ పెరుగుదలను ఏమంటారు?     

1) జీడీపీ రేటు       2) ఆర్థిÄకాభివృద్ధి      3)  ఆర్థికవృద్ధి     4) అన్నీ 

 

5. భారతదేశం ఏ ఆదాయ వర్గానికి చెందుతుంది? 

1) నిమ్న మధ్యస్థ ఆదాయ దేశం            2) ఉన్నత ఆదాయ దేశం

3)  అత్యధిక ఆదాయ దేశం            4) అన్నీ 

 

6. రాజ్యాంగ పరంగా భారత ఆర్థిక వ్యవస్థ?

1) ఫెడరల్‌ ఆర్థిక వ్యవస్థ             2) మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ

3)  గిగ్‌ ఎకనామీ                 4) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ


7. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక నియంత్రణ అధికారాల విభజన ఉన్న రాజ్యాంగ వ్యవస్థ? 

1) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ             2) ఫెడరల్‌ ఆర్థిక వ్యవస్థ

3)  ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ               4) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ

 

8.  ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యం దృష్ట్యా భారత ఆర్థిక వ్యవస్థ?    

1) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ          2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

3)  ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ              4) మార్కెట్‌ వ్యవస్థ 

 

9. భారతదేశం ఎలాంటి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది?

1) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ              2) మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ

3)  గిగ్‌ ఆర్థిక వ్యవస్థ                 4) కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ

 

10. ఐక్యరాజ్య సమితి వర్తకం అభివృద్ధి సమావేశం (UNCTAD)  అంతర్జాతీయ ద్రవ్యనిధి వర్గీకరణ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఎలాంటిది? 

1) అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ                   2) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ     3)  అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ           4) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

 

11. భౌతిక జీవన నాణ్యత సూచీని (PQLI) అభివృద్ధి చేసినవారు ఎవరు?

1) డేవిడ్‌ మోరిస్‌                       2) మహబూబ్‌-ఉల్‌-హక్‌

3)  సి.రంగరాజన్‌                    4) మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా

 

12. భౌతిక జీవన నాణ్యత సూచీని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1970           2) 1971              3)  1972            4) 1974

 

13. భౌతిక జీవన నాణ్యత సూచీలో గణన చేసే అంశాలు? 

1) ఆయుఃప్రమాణం                2) శిశు మరణాల రేటు

3) మౌలిక అక్షరాస్యత               4) అన్నీ           

 

14. మానవాభివృద్ధి సూచికను ప్రచురించే సంస్థ? 

1) ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (గీవిదీశి)    2) యునిసెఫ్‌      

3) ఎన్‌ఎస్‌వో         4) నీతి ఆయోగ్‌ 

 

15. మానవాభివృద్ధి సూచికను ్బబీదీఖ్శి తొలిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1990             2) 1991              3) 1992              4) 1993

 

16. మానవాభివృద్ధి సూచిక భావనను ప్రతిపాదించిన ఆర్థికవేత్త? 

1) మహబూబ్‌-ఉల్‌-హక్‌       2) అమర్త్యసేన్‌    3) డేవిడ్‌ మోరిస్‌            4) ఎవరూ కాదు

 

17. మానవాభివృద్ధి సూచికను అభివృద్ధి చేయడంలో పాల్గొన్న భారత ఆర్థికవేత్త? 

1) అమర్త్యసేన్‌             2) జాన్‌ డ్రేజ్‌            3) డేవిడ్‌ మోరిస్‌            4) అందరూ  

 

18. బహుళ కోణ పేదరిక సూచీని (MPI) ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 2009              2) 2010               3) 2011             4) 2012

 

19. మానవ పేదరిక సూచీని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 

1) 1995              2) 1996               3) 1997               4) 1998

 

20. భారత ఆర్థిక వ్యవస్థలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం?

1) సేవారంగం             2) వ్యవసాయ రంగం     3) పరిశ్రమల రంగం          4) అన్నీ 

 

21. మానవ పేదరిక సూచీని ప్రవేశపెట్టిన సంస్థ? 

1) UNCTAD       2) UNDP      3) IMF     4) ప్రపంచ బ్యాంకు

 

22. అభివృద్ధి కృషికి సామర్థ్యాల అప్రోచ్‌ను ప్రతిపాదించిన ఆర్థిక వేత్త? 

1) అమర్త్యసేన్‌    2) డేవిడ్‌ మారిస్‌    3) మహబూబ్‌-ఉల్‌-హక్‌     4) ఎవరూ కాదు

 

23. జాతీయాదాయ వృద్ధిరేటు కంటే తలసరి ఆదాయ వృద్ధిరేటు తక్కువగా ఉండటానికి కారణం?

1) తక్కువ జనాభా వృద్ధిరేటు        2) అధిక జనాభా వృద్ధిరేటు

3) తలసరి వృద్ధిరేటు        4) జీడీపీ వృద్ధిరేటు

 

24. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యం కొనసాగుతున్న రంగం?

1) వ్యవసాయ రంగం       2) పరిశ్రమల రంగం    3) సేవారంగం             4) ఏదీకాదు

 

25. 2020లో ప్రపంచ ఆర్థిక అవలోకనం ప్రకారం అత్యధిక స్థూల జాతీయోత్పత్తి గల దేశాల్లో భారత్‌ స్థానం?

1) నామినల్‌ జీడీపీ ప్రకారం అయిదో స్థానం    2) పీపీపీ ప్రకారం మూడో స్థానం

3) 1, 2         4) పీపీపీ ప్రకారం ఆరోస్థానం

 

26. లింగ అభివృద్ధి సూచీని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1995      2) 1996      3) 1997      4) 1998

 

27. లింగ అసమానత సూచీని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1992      2) 1993      3) 1994      4) 1995

 

28. బహుళ కోణ పేదరిక సూచీలో ఎన్ని అంశాలు, సూచికలను పరిగణనలోకి తీసుకుంటారు?

1) 3 అంశాలు, 12 సూచీలు        2) 3 అంశాలు, 10 సూచీలు

3) 3 అంశాలు, 13 సూచీలు        4) 4 అంశాలు, 12 సూచీలు

 

29. నీతి ఆయోగ్‌ 2021 నవంబరులో తెలిపిన నివేదిక ప్రకారం బహుళ కోణ పేదరిక సూచీ ప్రకారం మన దేశంలో అతి తక్కువ పేదరికం గల రాష్ట్రం?

1) కేరళ        2) గుజరాత్‌    3) సిక్కిం        4) మహారాష్ట్ర

 

30. ఆర్థికాభివృద్ధి ఏ రకమైంది? 

1) విశాలమైంది       2) ఏకముఖమైంది    3) 1, 2            4) పరిమితమైంది

 

31. కిందివాటిలో అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలకు సంబంధించి సరైంది?

ఎ) ఫెడరల్‌ వ్యవస్థ        బి) వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న ఆర్థిక వ్యవస్థ

సి) మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ    డి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

1) ఎ సరైంది      2) బి సరైంది       3) సి సరైంది      4) అన్నీ 

 

32. 2024 - 25 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎన్ని ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని లక్ష్యంగా నిర్దేశించారు?

1) 4 ట్రిలియన్‌ డాలర్లు          2) 5 ట్రిలియన్‌ డాలర్లు

3) 6 ట్రిలియన్‌ డాలర్లు          4) 7 ట్రిలియన్‌ డాలర్లు

 

33. 2022లో భారతదేశ 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని దేశాన్ని ఎన్ని ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దడానికి నీతి ఆయోగ్‌ న్యూ ఇండియా జీ75 వ్యూహాన్ని తయారు చేసింది? 

1) 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ    2) 6 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

3) 4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ    4) 7 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

 

34. ప్రపంచ బ్యాంకు 2021, జులై 1న 2020లో ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాను ప్రకటించింది. వాటిలో మొదటి, రెండో స్థానాల్లో ఉన్న దేశాలు వరుసగా?

1) చైనా, అమెరికా         2) బ్రిటన్, అమెరికా      3) ఇటలీ, కెనడా       4) అమెరికా, చైనా 

 

35. ప్రపంచ బ్యాంకు 2021, జులై 1న 2020లో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాలో భారతదేశ స్థానం?

1) 3వ       2) 4వ      3) 5వ      4) 6వ 

 

36. ప్రపంచంలో కొనుగోలు శక్తి సమానత ఆధారంగా మన దేశం ఎన్నో స్థానంలో ఉంది?

1) ప్రథమ స్థానం      2) ద్వితీయ స్థానం      3) మూడో స్థానం      4) నాలుగో స్థానం

 

37. భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల ఎన్నో దేశంగా రూపొందించాలని లక్ష్యంగా నిర్దేశించారు?

1) మొదటి స్థానం         2) రెండో స్థానం        3) మూడో స్థానం        4) నాలుగో స్థానం

 

38. సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చ్‌ ్బదినితీళ్శి - వరల్డ్‌ ఎకనామిక్‌ లీగ్‌ టేబుల్‌ - 2022 13వ ఎడిషన్‌ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలో మొదటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల పది దేశాల జాబితాలో భారత దేశ స్థానం?

1) ఆరో స్థానం      2) అయిదో స్థానం       3) మూడో స్థానం      4) రెండో స్థానం

 

39. యుఎన్‌డీపీ - మానవ అభివృద్ధి సూచీ నివేదిక - 2020 ప్రకారం 189 దేశాల జాబితాలో భారతదేశ స్థానం?

1) 130         2) 131        3) 132         4) 133

 

40. సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చ్‌ - వరల్డ్‌ ఎకనామిక్‌ లీగ్‌ టేబుల్‌ - 2022 13వ ఎడిషన్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలో మొదటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గల పది దేశాల్లో 2036 నాటికి భారత్‌ ఎన్నో స్థానంలో ఉంటుందని తెలిపింది? 

1) మొదటి స్థానం    2) రెండో స్థానం    3) మూడో స్థానం    4) నాలుగో స్థానం

 

సమాధానాలు

1-1, 2-2, 3-2, 4-2, 5-1, 6-1, 7-2, 8-2, 9-1, 10-3, 11-1, 12-1, 13-4, 14-1, 15-1, 16-1, 17-1, 18-2, 19-3, 20-1, 21-2, 22-1, 23-2, 24-1, 25-3, 26-1, 27-4, 28-1, 29-1, 30-1, 31-4, 32-2, 33-3, 34-4, 35-4, 36-3, 37-3, 38-1, 39-2, 40-3.

Posted Date : 27-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు

నిలకడ వృద్ధి... నిర్మాణాత్మక మార్పు!

  ఒక దేశంలో వస్తుసేవల ఉత్పత్తి ఎలా ఉంది? వాటి అమ్మకాలు, కొనుగోళ్లు ఏవిధంగా జరుగుతున్నాయి? తదితర అంశాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంచనా వేస్తారు. అందుబాటులో ఉన్న వనరులు, వాటి కేటాయింపులు, వినియోగాలనూ పరిగణలోకి తీసుకుంటారు. ఇందుకోసం కొన్ని సూచీలను ఏర్పాటుచేశారు. ఆ కొలమానాల ప్రకారం మనదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్నారు. 

 

  తక్కువ తలసరి ఆదాయం, పేదరికం, ఎక్కువ జనాభా వృద్ధి రేటు, వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల కొరత, పెట్టుబడుల లేమి వంటివి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. భారతదేశం ఈ రకంలోకే వస్తుంది. 

 

ఆర్థిక వృద్ధి: దీర్ఘకాలంలో వస్తుసేవల ఉత్పత్తి నిలకడగా పెరిగినప్పుడే దాన్ని వృద్ధిగా పేర్కొంటారు. అందుకే వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తిలోని దీర్ఘకాల వస్తుసేవల పెరుగుదలను ఆర్థికవృద్ధిగా నిర్వచిస్తారు. ఇది పరిమాణాత్మకమైంది, ఏకముఖమైంది. ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన.  

ఉదా: అమెరికా

  స్థూల వస్తుసేవల కంటే దేశ జనాభా మరింత పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. అధిక జనాభా కంటే జీడీపీ పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి జరుగుతుంది.

ఆర్థికాభివృద్ధి: ఆర్థికాభివృద్ధి చాలా విశాలమైంది, గుణాత్మకమైంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన భావన.  ఉదా: భారత్‌ 

 

  ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు. వీటిని ప్రధానంగా కింది విధంగా పేర్కొంటారు. 

* నిరుద్యోగిత, పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గించడం.

* అక్షరాస్యతను పెంచి, ప్రజల ఆరోగ్యస్థితిని మెరుగుపరచడం. 

* జీడీపీలో వ్యవసాయ రంగం, పరిశ్రమలు, సేవారంగం వాటా పెరగడం.

* సంప్రదాయ ఉత్పత్తి పద్ధతులను వదిలి ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఎంచుకోవడం.

* రవాణా, విద్యుత్, సమాచారం లాంటి అవస్థాపన రంగాలను అభివృద్ధి చేయడం.

* పట్టణీకరణ 

* శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి

 

ఆర్థికాభివృద్ధిని కొలిచే సూచికలు

 

* తలసరి వినియోగ స్థాయి

 

* ఐక్యరాజ్య సమితి పరిశోధన సంస్థ సాంఘిక ఆర్థిక సూచీ (UNRISD), 1963

 

* భౌతిక జీవన నాణ్యత సూచీ (PQLI), (1970)

 

* మానవాభివృద్ధి సూచీ (HDI), 1990

 

* లింగ అసమానత సూచీ (GII), 1995

 

* లింగ అభివృద్ధి సూచీ (GDI), 1995 

 

* లింగ సాధికారత కొలమానం (GEM), 1995 

 

* మానవ పేదరిక సూచీ (HPI), 1997

 

* అమర్త్య కుమార్‌ సేన్‌ ప్రతిపాదించిన సామర్థ్యాల అప్రోచ్, 1999 

 

* బహుళ కోణ పేదరిక సూచీ (MPI), 2010

 

* ప్రపంచ హరిత ఆర్థిక వ్యవస్థ సూచీ (GGEI)

 

* సామాజిక ప్రగతి సూచీ (SPI)

 

భౌతిక జీవన నాణ్యత సూచీ (PQLI):     దీన్ని 1970వ దశకం మధ్యలో డేవిడ్‌ మోరిస్‌ అనే ఆర్థిక వేత్త అభివృద్ధి చేశారు. దీనిలో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని అంచనా వేస్తారు. 1) అక్షరాస్యత రేటు 2) శిశు మరణాల రేటు 3) ఆయుర్ధాయం

 

మానవాభివృద్ధి సూచీ (HDI): యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (గీవిదీశి) మానవాభివృద్ధి నివేదికను విడుదల చేస్తుంది. మానవాభివృద్ధి సూచికను 1990లో పాకిస్థాన్‌ ఆర్థికవేత్త మహబూబ్‌-ఉల్‌-హక్‌ రూపొందించారు. అమర్త్యసేన్‌ కూడా ఈయనతో కలిసి పని చేశారు. దీనిలో ఆయుర్ధాయం, విద్యార్హత, తలసరి స్థూల జాతీయోత్పత్తి అనే మూడు అంశాలను తీసుకుంటారు. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదిక - 2020ని 2020, డిసెంబరు 15న విడుదల చేసింది. మొత్తం 189 దేశాల ర్యాంకులను ప్రకటించారు. ఇందులో నార్వే మొదటి స్థానంలో ఉండగా నైగర్‌కు చివరి స్థానం లభించింది. భారత్‌ 131వ స్థానంలో నిలిచింది.

 

ప్రపంచ దేశాలు - అంతర్జాతీయ సంస్థల వర్గీకరణ 

 

2020లో ప్రపంచ బ్యాంకు అట్లాస్‌ పద్ధతి ద్వారా 2019 తలసరి స్థూల జాతీయాదాయం ఆధారంగా దేశాలను కింది విధంగా వర్గీకరించింది.

 

అల్ప ఆదాయ దేశాలు: 1036 డాలర్ల కంటే తక్కువ తలసరి స్థూల జాతీయాదాయం ఉన్న దేశాలు.

 

మధ్యమ ఆదాయ దేశాలు (నిమ్న మధ్య ఆదాయ దేశాలు): 1036 - 4045 డాలర్ల మధ్య ఆదాయ దేశాలు.

 

ఉన్నత మధ్య ఆదాయ దేశాలు: 4046 - 12,535 డాలర్లు డాలర్ల మధ్య ఆదాయం ఉన్న దేశాలు.

 

అధిక ఆదాయ దేశాలు: 12,535 డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలు. 

* ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని మధ్యమ ఆదాయ దేశాల జాబితాలో చేర్చింది. 

 

భారత్‌- మిశ్రమ ఆర్థిక వ్యవస్థ 

భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా (Mixed Economy) గా పేర్కొంటారు. 1948లో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం వల్ల మన దేశంలో తొలిసారిగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది పడింది. 

 

లక్షణాలు: 

 

* సమాఖ్య వ్యవస్థ (ఫెడరల్‌ వ్యవస్థ) 

 

* మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

 

* వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న ఆర్థిక వ్యవస్థ

 

* ప్రజా పంపిణీ వ్యవస్థ - ఆహార భద్రత

 

* సముచిత స్థాయిలో పారిశ్రామికీకరణ 

 

* మూలధనకల్పన - విస్తరణ 

 

* వేగంగా వృద్ధి చెందుతున్న సేవారంగం

 

* పెరుగుతున్న ఎగుమతులు - రాబడి

 

* పెద్ద మార్కెట్‌గా రూపొందుతున్న వ్యవస్థ

 

* మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

 

* నిలకడగా వృద్ధి చెందే స్థూల ఆర్థిక వ్యవస్థ

 

* స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల 

 

* ద్రవ్యోల్బణ నియంత్రణ 

 

* ఆదాయ అసమానతలు తగ్గించడం 

 

* ఉపాధి కల్పన, అవకాశాల విస్తరణ 

 

* అవస్థాపన సౌకర్యాల కల్పన - విస్తృతి

 

* పెరుగుతున్న పట్టణీకరణ రేటు 

 

* సాంఘిక సేవల విస్తరణ - మానవ వనరుల అభివృద్ధి

 

5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా..!

  ప్రపంచ బ్యాంకు 2021, జలై 1న ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితా-2020 ప్రకటిచింది. వాటిలో మొదటి పది స్థానాల్లో ఉన్న దేశాలు 1) అమెరికా  2) చైనా  3) జపాన్‌  4) జర్మనీ  5) బ్రిటన్‌ 6) భారత్‌ 7) ఫ్రాన్స్‌  8) ఇటలీ  9) కెనడా  10) దక్షిణ కొరియా.

  సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చ్‌ ్బదినితీళ్శి - వరల్డ్‌ ఎకనామిక్‌ లీగ్‌ టేబుల్‌ - 2022 (13వ ఎడిషన్‌) 191 దేశాలకు సంబంధించిన నివేదికను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల జాబితాలో 2022లో అమెరికా మొదటి స్థానం, చైనా రెండో స్థానంలో ఉండగా తువాలు చివరి స్థానంలో ఉంది. భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. 2031 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రకటించింది. 

* 2024 - 25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. 

* నీతి ఆయోగ్‌ - న్యూ ఇండియాజీ75 డ్రాఫ్ట్‌ నివేదిక ప్రకారం 2022 సంవత్సరానికి భారతదేశాన్ని నాలుగు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం.

 

రచయిత: బండారి ధనుంజయ్‌ 

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

  ఆర్థిక వృద్ధి - సూచికలు

‣  వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 28-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ద్రవ్యం (ద్రవ్యం-బ్యాంకింగ్‌-ప్రభుత్వ విత్తం)

అందరూ అంగీకరించే కల్పితం!

  తళ తళ మెరుస్తూ, పెళ పెళలాడే నోటును చూడగానే ఎవరి కళ్లయినా కాస్త పెద్దవి కావాల్సిందే. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి పడుకునే వరకు దాదాపు ప్రతి పనికీ మనీ ఉండాల్సిందే. అందరి ఆనందాలు, అవసరాలు అన్నీ ఆ డబ్బుతో అంటే ఆర్థిక పరిభాషలో ద్రవ్యంతోనే ముడిపడి ఉంటాయి. చేసే శ్రమకు, తయారయ్యే వస్తువుకు, అందించే సేవకు విలువ కట్టే విశిష్ట కొలమానం ద్రవ్యం. ప్రాచీన కాలం నుంచి అనేక రూపాలు మార్చి ఇప్పటికీ చలామణిలో చెలరేగి పోతోంది. నిజానికి దాని విలువ కల్పితం, కానీ అందరికీ ఆమోదనీయం. కనిపెట్టిన మనిషినే కట్టి పడేసే కనికట్టుగా నిలిచిన ఆ ద్రవ్యం పుట్టుక, పరిణామక్రమం, ప్రస్తుత రూపాలు, విధుల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

 

  ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. ఆధునిక సమాజంలో ద్రవ్యం ప్రవేశపెట్టక పూర్వం వస్తుసేవల కొనుగోలు, అమ్మకాలకు నిర్దిష్ట మాధ్యమం లేదు. వస్తుమార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. దీనిలోని లోపాల వల్ల ద్రవ్యం ఒక వినిమయ మాధ్యమంగా అమల్లోకి వచ్చింది.

 

వస్తుమార్పిడి పద్ధతి: వస్తువును ఇచ్చి దానికి బదులుగా కావాల్సిన మరో వస్తువును పొందటాన్ని వస్తుమార్పిడి పద్ధతి లేదా వస్తు వినిమయ పద్ధతి అంటారు. గతంలో మనిషి కోర్కెలు, ఆర్థిక కార్యకలాపాలు రెండూ పరిమితంగా ఉండటం వల్ల ఈ పద్ధతి సాధ్యమైంది. ఇందులో వినిమయ మాధ్యమం ఉండదు. అందువల్ల దీన్ని వస్తువు నుంచి వస్తువు ఆర్థిక వ్యవస్థ అనేవారు.

 

వస్తుమార్పిడి పద్ధతిలో లోపాలు: 1) కోరికల సమన్వయం లేకపోవడం 2) కాల సమన్వయం లేకపోవడం 3) విలువలను కొలిచే కొలమానం లేకపోవడం 4) వస్తువును విభజించే వీలు లేకపోవడం 5) సంపదను నిల్వ చేయలేకపోవడం

 

ద్రవ్య ఆవిర్భావం-నిర్వచనం-పరిణామ క్రమం: ‘మనీ’ అనే ఆంగ్ల పదం లాటిన్‌ పదమైన ‘మానెటా’ నుంచి పుట్టింది. రోమన్‌ దేవత అయిన మానెటా ఆలయంలో మొదటిసారి నాణేలను ముద్రించడం వల్ల ‘మనీ’ పేరు స్థిరపడిందనేది చరిత్రకారుల అభిప్రాయం. అతిముఖ్యమైన మానవ కల్పనల్లో ద్రవ్యం ఒకటి. ప్రతి శాస్త్రంలో ముఖ్యమైన కల్పన ఒకటి ఉంటుంది. 

ఉదా: యాంత్రిక శాస్త్రంలో చక్రం, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు, అర్థశాస్త్రంలో ద్రవ్యం ప్రధాన కల్పనలని క్రౌధర్‌ అనే ఆర్థికవేత్త అభిప్రాయం.

 

ద్రవ్య నిర్వచనాలు: * ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం - వాకర్‌ 

* సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం - సెలిగ్‌మన్‌ 

* వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువ కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం - క్రౌధర్‌  

* ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం - మిల్టన్‌ ప్రీడ్‌మన్‌ 

* రుణ ఒప్పందాలు ఉండి వివాదాల పరిష్కార శక్తి కలిగిందే ద్రవ్యం - జె.ఎం.కీన్స్‌

 

ద్రవ్య పరిణామ క్రమం 

 

వస్తురూప ద్రవ్యం: ప్రారంభంలో వస్తువులనే ద్రవ్యంగా ఉపయోగించారు.

ఉదా: స్విట్జర్లాండ్‌లో గవ్వలు, భారత్‌లో పశువులు, ఆఫ్రికాలో ఏనుగు దంతాలు, ఉత్తర అమెరికాలో పొగాకు

 

లోహద్రవ్యం: వస్తురూప ద్రవ్యంలోని కొన్ని సమస్యల వల్ల, నాగరికత అభివృద్ధి చెందడంతో లోహద్రవ్యం వాడుకలోకి వచ్చింది.

ఉదా: బంగారం, వెండి, రాగి, ఇత్తడి మొదలైనవి. ప్రారంభంలో లోహాన్ని ముద్దలుగా, కడ్డీలుగాను ఉపయోగించేవారు. తర్వాత కాలంలో లోహాలతో నాణేలు తయారుచేశారు.క్రీ.పూ.700 సంవత్సరంలో లిధియా దేశంలో మొదటగా నాణేలు జారీ చేశారు. రోమన్ల కాలంలో బిసాంత్‌ అనే బంగారు నాణెం, మౌర్యుల కాలంలో ఫణ అనే వెండి నాణేలు ఉండేవి.

 

కాగితపు ద్రవ్యం: క్రీ.శ.600 సంవత్సరంలో చైనాను పాలించిన సోంగ్‌ రాజవంశీయులు మొదటిసారిగా కాగితపు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టారు. భారత్‌లో మౌర్యుల కాలం నుంచి ‘హుండీ’ అనే కాగితపు ద్రవ్య వ్యవస్థ ఉ