• facebook
  • whatsapp
  • telegram

సన్నద్ధతలో నాణ్యత ముఖ్యం

ఏపీ సెట్‌ రాయదల్చినవారు కంటెంట్‌పై పూర్తిస్థాయి పట్టు పెంచుకోవడం అవసరం. విషయ సామర్థ్యాన్నీ, గ్రహణ శక్తినీ మెరుగుపరచుకోవాలి. మూల భావనలపై వివిధ కోణాల్లో సన్నద్ధత కొనసాగించాలి. ఉత్తీర్ణత సాధించలేనివారు గతంలోని పొరపాట్లను సరిదిద్దుకొని సన్నద్ధత కొనసాగిస్తే ఉత్తీర్ణులు కావొచ్చు.

* ఒకే సూత్రం, భావనలపై వైవిధ్యభరితంగా ఉండే ప్రశ్నలు సాధన చేయాలి. ప్రశ్నలో అంతర్లీనంగా ఉండే విషయం/ భావనపై దృష్టి పెట్టాలి.
* ప్రశ్నలు జతపరచడం, సమస్యాపూరణం మొదలైనవి లోతుగా, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
* మొదట సాధన నిదానంగా ఉండడం, చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజం. నిరంతర ప్రేరణతో, అభ్యాసం చేయడం వల్ల తప్పులు లేకుండా సాధించే సామర్థ్యం అలవడుతుంది. వేగంగా, కచ్చితంగా సాధించే నైపుణ్యం వస్తుంది. షార్ట్‌కట్స్‌, కొండ గుర్తులు సొంతంగా తయారుచేసుకుంటే సమయం ఆదా అవుతుంది.
* నేర్చుకోదలచిన విషయంపై మంచి పట్టు ఏర్పడిన తర్వాత నమూనా పరీక్షలు సాధన చేయాలి.
* అభ్యర్థులు రెండు పేపర్లలో ప్రతి అంశంలో తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. అదనపు సమాచారంకోసం రెఫరెన్స్‌ పుస్తకాలు, యూట్యూబ్‌, సామాజిక మాధ్యమాల ద్వారా వివరణలతో కూడిన బోధనను వినియోగించుకోవాలి.
* గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకొని, ఏ అంశాలకు ప్రాధాన్యముందో స్పష్టత పెంచుకోవాలి.
* నిర్ణీత కాలంలో సిలబస్‌, మోడల్‌ పరీక్షలు పూర్తిచేసుకోవటానికి ఒత్తిడి లేని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* చదివిన అంశాల పునశ్చరణ తప్పనిసరి. మంచి స్కోరు చేయటానికి అవకాశం ఉంటుంది.
* పోటీపరీక్ష శైలిలో ముఖ్యాంశాలను అభ్యసించి, సాధన చేయాలి. నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయగలిగేలా నైపుణ్యం పెంపొందించుకోవాలి.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌