• facebook
  • whatsapp
  • telegram

 Anything else / more? 

 Aditya: Have you anything else to say?

(నువ్వు ఇంకా ఏమైనా చెప్పాల్సి ఉందా?)

Sarath: Nothing else (ఇంకేం లేదు).

Aditya: Who else did you say this to? (ఇంకెవరికి చెప్పావు నువ్విది?)

Sarath: To Kiran and Kapil. (కిరణ్‌కూ, కపిల్‌కూ)

Aditya: Does anyone else know this? Did you tell them? (ఇంకెవరికైనా ఈ విషయం తెలుసా? నువ్వు చెప్పావా వాళ్లకీ విషయం?)

Sarath: No, I didn't (నేను చెప్పలేదు).

Aditya: How else did they come to know of it? (మరి ఎలా తెలిసింది వాళ్లకీ విషయం?)

Sarath: They must have got it from someone else. (వాళ్లెవరి దగ్గరి నుంచైనా తెలుసుకుని ఉండాలి.)

Aditya: OK. I'll find it (సరే, నేను కనుక్కుంటా).

             Dear Readers, You must have observed the use of 'else' in the conversation above.

             మీరు పై సంభాషణలో 'else' వాడకం గమనించే ఉంటారు. ఇది చాలా ఉపయోగకరమైన మాట. మన సంభాషణకు ఎంతో సహజత్వాన్ని, శక్తిని ఇస్తుంది.

else = ఇతర - ఇదీ అసలర్థం.

అయితే 'else' ను independent గా వాడం. 'ఇంకేంటి?' 'ఇంకెవరు?' 'ఇంకే విధంగా?' 'ఇంకెక్కడ?' అనే అర్థాలతో వాడతాం.

పై సంభాషణలోని ఈ వాక్యాలను చూడండి.

Anything else = ఇంకేదన్నా

Have you anything else? = నీ దగ్గర ఇంకేమన్నా ఉందా? = Have you any thing more? = Have you any other thing?

           పైవన్నీ correct. అయితే అన్నింటిలో ఎక్కువగా వాడేది - Anything else.

Sukhram: Have you anything more to say? (మీరు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా?)

Narayana: Nothing more.

పై సంభాషణలో 'more' బదులు 'else' వాడితే ఎంతో బాగుంటుంది.

Sukhram: Have you anything else to say?

Narayana: Nothing else.

          Observe the use of 'else' in the following sentences:

a) Madan: Have you anything more to say?

Kishan: I have little more to say

Compare:

Madan: Have you anything else to say?

Kishan: I have little else to say.

b) You can take the help of some other person = నువ్వు ఇంకెవరి సాయమైనా తీసుకోవచ్చు = You can take the help of someone else/ somebody else.

Which address to?

Sudheer: I was speaking to him just a few minutes ago. (క్షణం కిందట నేనతడితో మాట్లాడుతున్నాను)

Amith: Who to? (ఎవరితో?)

Sudheer: Jairam. We had a discussion that lasted ten minutes. (జయరాంతో. పది నిమిషాలపాటు మా చర్చ జరిగింది.)

Amith: Oh, you are annoying. What about? (ఓహ్, నువ్వు విసిగిస్తున్నావు. దేని గురించి?)

Sudheer: About our trip north. (మన ఉత్తర దేశ యాత్ర గురించి)

Amith: When? Why didn't you be clearer? (ఎప్పుడు? స్పష్టంగా ఎందుకు చెప్పవు?)

Sudheer: He said he would be bringing his cousin Parasuram. (తనతోపాటు తన బాబాయి వాళ్లబ్బాయి పరశురాంను కూడా తీసుకొస్తానన్నాడు)

Amith: Who did he say he would bring along with him? (ఎవర్ని తీసుకొస్తానని అన్నాడు?)

Sudheer: His cousin Parasuram, I said. ( చెప్పానుగా, అతని cousin పరశురాంను).

           చూశారు కదా. పైవన్నీ పూర్తి ప్రశ్న అడగకుండా, మనం English మాట్లాడేటప్పుడు (in spoken English) ఒక విషయం సరిగా వినకపోతేనో, లేదంటే రూఢిపరచుకునేందుకో అడిగే Interrogative responses (ప్రశ్నార్థక స్పందనలు.)

Look at the following too:

Bhanu: My brother is as strong as Bhima. (మా అన్న భీముడంతటి బలవంతుడు.)

           ఇది మనం నమ్మలేకపోతేనో, 'ఏదీ మళ్లీ చెప్పు' అనే ధోరణిలోనో, 'ఆహా, అలాగా' అని వ్యంగ్యంగా అనేటప్పుడో కింది విధంగా స్పందిస్తాం.

Seenu: As strong as who? (ఏంటీ, ఎవరిలాగా? - 'మళ్లీ చెప్పు' అన్నట్లు)

గమనించండి: 'As strong as who?' is not a question sentence, but a question (Interrogative) response. It makes our conversation natural.

Look at some more examples:

Ashish: Listen! (విను)

Akash: Who to? / What to? (ఎవరిని / దేన్ని - వినమంటున్నావు?)

Ashish: Listen to me. Send it at once. (నేను చెప్పేది విను. దాన్ని వెంటనే పంపించెయ్.)

Akash: Send what and who to? (దేన్ని? ఎవరికి? పంపమంటావ్)

Ashish: The book, to my brother (ఆ పుస్తకాన్ని, మా తమ్ముడికి)

kash: Which address to? (ఏ అడ్రస్‌కు?)

Ashish: Here it is. (ఇదిగో)

           ఈ responses - Interrogative / question responses- బాగా practice చేద్దాం.

I'm afraid so.. 

b) Janaki: Hi Vasantha, I'm surprised to see you here. What are you doing here? (వసంతా! నువ్విక్కడున్నావేంటి? ఇక్కడేం చేస్తున్నావు?) 

  Vasantha: This is where I live. See. That's my home there. What bring you here? (నేనుండేది ఇక్కడే. అదే మా ఇల్లు. నువ్విక్కడికెందుకొచ్చావు?)

Janaki: I've come for Priyanka. (నేను ప్రియాంక కోసం వచ్చాను.)

Vasantha: I'm afraid you have come to the wrong address. (నువ్వు తప్పు అడ్రస్‌కు వచ్చావనుకుంటా. ఇది కూడా కాస్త మర్యాదగా చెప్పడం.)

c) Nishanth: I haven't seen Mukund for quite some time. Is he in town at all? (ముకుంద్‌ను నేను చూసి చాలాకాలం అయ్యింది. అసలు ఊర్లో ఉన్నాడా?)

Nischal: I'm afraid not. He must have left for Delhi for some interview. (లేడనే అనుకుంటా. ఢిల్లీకి interview కు వెళ్లుండాలి.)

d) Pramod: Do you think the boss will give me a rise in the salary? (నాకు బాస్ జీతం ఏమన్నా పెంచుతాడంటావా?)

Srikanth: I'm afraid not. (లేదనే అనుకుంటా.)

e) Vinay: Will the police come now? (ఇప్పుడు పోలీసులు వస్తారంటారా?)

Charan: I'm afraid so. (వస్తారనే అనిపిస్తోంది.)

             ఇది మీ సంభాషణలో అలవాటు చేసుకోండి.

'Afraid' మామూలు అర్థం భయపడటం/ భయంగా ఉండటం. కానీ 'afraid' ను చెడు విషయాన్ని/ కోపం/ అసహనం కలిగించే విషయాన్ని చెప్పేందుకు వాడతారని ఇంతకు ముందు నేర్చుకున్నాం. గుర్తుంది కదా. Afraid, wonderఈ రెండింటి ఇతర ఉపయోగాలను ఇప్పుడు చూద్దాం.     In this lesson we are going to study the peculiar use of two expressions which are quite frequent in spoken English and which makes our English sound natural. (ఇప్పుడు మనం వ్యావహారిక English లో చాలా తరచుగా వినిపించే రెండు విచిత్ర ప్రయోగాలను గురించి తెలుసుకోబోతున్నాం. వీటిని సరిగా వాడటం వల్ల మన spoken English చాలా సహజంగా వినిపిస్తుంది.)

Pavan: I wonder where Aswin now is and what he is doing? (అశ్విన్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడబ్బా?)

Diwakar: I am sure he is still in Chennai, searching for a job. I'm afraid he hasn't been able to land a job. (ఇంకా చెన్నైలోనే ఉంటూ ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాడని నా నమ్మకం. ఇంకా ఏ ఉద్యోగం దొరకలేదేమో / వచ్చిందో లేదో?)

Pavan: The last time he called me he told me that he had had an offer of a Rs.30000 a month job, but I'm (I am) afraid he wasn't happy about it. (నాకు చివరిసారిగా ఫోన్ చేసినప్పుడు తనకు నెలకు రూ. 30,000 జీతం వచ్చే ఉద్యోగం వచ్చిందని అన్నాడు. కానీ అతడికి అది తృప్తిగా లేదని నా అనుమానం.)

Diwakar: But do you think he can get more than that? (కానీ అంతకంటే అతడెక్కువ పొందగలడంటావా?)

Pavan: I wonder if he can, considering the fact he has no experience. (నాకూ అతనంతకంటే ఎక్కువ పొందగలడాని సందేహమే.)

Diwakar: I'm afraid he isn't being realistic. I wonder when he will take a proper view of the situation. (అతడు వాస్తవాన్ని గమనించలేకపోతున్నాడని నా అనుమానం. ఎప్పుడు తను సరైన అభిప్రాయానికి వస్తాడా అని నా సందేహం.)

         Afraid = భయంతో ఉండటం; Wonder = ఆశ్చర్యపోవడం.

అయితే చాలా తరచుగా English conversation లో

1) I'm afraid ను ఇతరులకు ఏదైనా నిరుత్సాహం, కోపం, విసుగు కలిగించే విషయం, మర్యాదగా చెప్పేందుకు వాడతాం. (To convey something disappointing, annoying, upsetting or that you are sorry about something.)

a) Vinod: What is that you are prepared to offer for the bike? (ఆ bike కు ఎంత చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.)

Vikram: Say Rs.30,000/-

(రూ. 30,000 అనుకోండి).

Vinod: I'm afraid it is too low. అది చాలా తక్కువ, (మర్యాదగా చెప్పడం).

wonder what he is..

Lakshmi: Where are our guests - I mean your uncle and aunt? They left in the morning and haven't returned so far. I wonder where they are. (మన అతిథులు, అదే మీ బాబాయి, పిన్నివాళ్లు ఎక్కడున్నారు? పొద్దున వెళ్లారు, ఇంతవరకు తిరిగిరాలేదు. ఎక్కడున్నట్టు వీళ్లు?)

Kishore: I wonder too mom. It is raining heavily. They must have got caught in the rain and are perhaps waiting for it to stop. (నాకూ అదే తెలియకుండా ఉందమ్మా. జోరుగా వర్షం కురుస్తోంది. దాన్లో చిక్కుకుపోయారేమో. అది ఆగేందుకు ఎదురుచూస్తున్నారేమో).

Lakshmi: I'm (I am) afraid she may catch a cold. She is of delicate health you know. (ఆమెకేమన్నా జలుబు చేస్తుందేమో అని నా అనుమానం. తన ఆరోగ్యం అంతంత మాత్రమే కదా.)

Kishore: I wonder when this rain will stop, and if it will stop at all. (ఈ వానెప్పుడు ఆగుతుందా, అసలు ఆగుతుందా లేదా అని సందేహంగా ఉంది.)

Lakshmi: Do they know their way back home at all. I wonder if you could reach them on the mobile. (ఇంటికి దారైనా తెలుసా వాళ్లకు. నువ్వెమైనా వాళ్లకు phone చేయగలవా?)

Kishore: I wonder whether he hasn't changed his number. I remember vaguely his telling me so. (ఆయన phone number మార్చకుండా ఉన్నారా అని? మారుస్తున్నానని ఆయన చెప్పినట్లు నాకు గుర్తు.)

Lakshmi: Ah! Here they are, soaked to the bone. They have come at last. What a relief? (ఆ, వచ్చారు వాళ్లు, పూర్తిగా తడిసిపోయి. ఎలాగైతేనేం వచ్చారు. నెత్తిన బరువు దించినట్టుంది.)

Look at the following sentences from the conversation:

       1) I wonder where they are.

       2) I wonder too.

       3) I'm afraid she may catch cold.

       4) I wonder when this rain will stop.

       5) I wonder if you could reach them on the mobile.

       6) I wonder whether he hasn't changed his number.

a) Bhanu: Hope he hasn't failed the exam. (అతడు పరీక్ష తప్పలేదని ఆశిస్తున్నా.)

Vidur: I'm afraid he has. (Fail అయ్యాడనే అనుకుంటున్నా - బాధ కలిగించకుండా చెప్పడం.)

b) Suneeta: Has she married that good for nothing fellow, after all? (చివరికి ఆ పనికిరాని వాడిని పెళ్లాడిందా?)

Sasi: I'm afraid so (అదే అయిందనుకుంటున్నాను.)

          ఇదీ 'afraid' ను ఉపయోగించే విధానం. 

          ఇప్పుడు 'wonder' కూడా దాని మామూలు అర్థాలతో (ఆశ్చర్యపడటం/ ఆశ్చర్యం/ అద్భుతం) కాకుండా conversational English లో వాడే విధానం చూద్దాం.

          ఈ lesson సందర్భంలో 'wonder' ను, మనకేదైనా ఇదమిద్ధంగా తెలియనప్పుడు, మన సందేహాన్ని/ మనం అనుకునే తీరును వ్యక్తపరచేందుకు వాడతాం.

1. a) Ashok: Will he be at home now? (అతడిప్పుడు ఇంట్లో ఉంటాడంటావా?)

Maneesh: I wonder (నాకు సందేహమే).

b) Bahadur: Hello, is it Mukund? (హలో, ముకుందేనా మాట్లాడుతోంది.)

Mukund: Yes, it is. (అవును.)

Bahadur: Thank God. I was just wondering if I could get you over the phone. I am happy. (బతికిపోయాను. నువ్వు phone లో దొరుకుతావో లేదో అని సందేహపడుతున్నా. దొరికావు. సంతోషం.)

2.  'Wonder' ను ఇలాంటి పరిస్థితుల్లో, అనుకోవడం (think seriously) అనే అర్ధంతో కూడా వాడతాం.

a) Prasad: You appear absent minded. Why? (ఏదో పరధ్యానంగా ఉన్నావు. ఎందుకు?)

Sravan: I have been searching for my bike key since morning. I was wondering where I could have put it. (పొద్దుటి నుంచి నా bike key కోసం వెతుకుతున్నా. ఎక్కడ పెట్టానా అని ఆలోచిస్తున్నా.)

b) Jayaram: So you are going to meet Sai today, are you? (అయితే నువ్వు సాయిని కలుసుకోబోతున్నావన్నమాట, అవునా?)

Mahesh: So I am, but I wonder if I can recognize him after all these years. (అవును. కానీ ఇన్నేళ్ల తర్వాత అతడిని నేను గుర్తుపట్టగలనా అని ఆలోచిస్తున్నా.)

3. Wonder ను guess (ఊహించడం) అనే అర్థంతో కూడా వాడతాం.

a) Bharat: The tax people are after Nataraj for non payment of tax. I've been warning him again and again. He is in real trouble. (పన్ను చెల్లించనందుకు ఆదాయపన్నువాళ్లు నటరాజ్ కోసం వెతుకుతున్నారు. అతడిని నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. నిజంగా ఇబ్బందుల్లో ఉన్నాడతను.)

Chakri: I wonder what he is going to do now? (ఇప్పుడతడు ఏం చేయబోతున్నాడో అని ఆలోచిస్తున్నా.)

b) Nischal: Do you think he will pay you back the money before this month end? (ఈ నెలాఖరులోగా నీ డబ్బు నీకు తిరిగి చెల్లిస్తాడా?)

Chari: I wonder where he can get the money from. (అతడు ఆ డబ్బు ఎక్కడ పొందగలడా అని ఆలోచిస్తున్నా.)

4. 'Wonder' ను మర్యాదగా ఏదైనా అడిగేందుకు (Request) అభ్యర్థనకు వాడతాం.

a) Anand: What brings you here Raju? Long time no see. (ఏమిటిలా వచ్చావు? నిన్ను చూసి చాలారోజులైంది.)

Raju: I wonder if I might borrow some money from you. (నీ దగ్గర కాస్త డబ్బు అప్పేమైనా దొరుకుతుందా అనుకుంటున్నా/ డబ్బేమైనా అప్పివ్వగలవా అని అడిగేందుకు వచ్చా.)- Polite request.

b) Pratap: I wonder if I could borrow your book for a few days. (నీ పుస్తకం కొన్నిరోజులపాటు నేను అరువు తీసుకోవచ్చా?)

Venkat: I'm afraid I can't just now. (ఇప్పుడిప్పుడే ఇవ్వలేనేమో అనుకుంటున్నా.)

One more example:

Ram: I was wondering if I could borrow your car for a day? (నీ కారు ఓ రోజు నేను అరువు తీసుకోవచ్చా అని ఆలోచిస్తున్నా).

Rahim: Have it by all means. (నిరభ్యంతరంగా తీసుకో.)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌