• facebook
  • whatsapp
  • telegram

Eat a humble pie

కొంతమంది ఎప్పుడూ తామే కరెక్ట్‌ అని భావిస్తుంటారు. ఆ విషయం గురించి ఇతరులతో ఎంత గట్టిగానైనా వాదిస్తుంటారు. అయితే అలాంటివాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో తమ తప్పుని ఒప్పుకోక తప్పదు. ఇలాంటి పరిస్థితిని సూచించే వ్యక్తీకరణ ఏమిటి? తెలుసుకుందామా?

Ranganath: I do not see why I should talk anymore to Nagaraj. His behaviour turns me off (నాగరాజ్‌తో నేను ఎందుకు మాట్లాడాలో నాకు తెలీడం లేదు. వాడి ప్రవర్తన నాకు రోత పుట్టిస్తోంది).

Jagannath: But you had been hanging out with him for years together. I donÕt see why you dislike him now (మరి నువ్వు వాడితో సంవత్సరాలపాటు తిరుగుతూనే ఉన్నావు కదా. మరి వాడంటే నీకెందుకు ఇష్టం లేదో తెలీడం లేదు).

Ranganath: I want to break up with him. His attitude I can no longer tolerate (వాడితో సంబంధాలు తెంపేసుకోవాలనుకుంటున్నాను. వాడి వైఖరి నేనింక భరించలేను).

Jagannath: What exactly happened between you? Why are you so put out with him? (మీ మధ్య అసలేం జరిగింది? వాడంటే నీకెందుకు ఇష్టం లేకుండా పోయింది?)

Ranganath: You know he borrowed some money from me. I have waited patiently for three years. Last week when I asked him for the money, he put me off by saying that he does not owe me any money (నీకు తెలుసుకదా, నా దగ్గర వాడు అప్పు తీసుకున్నాడని. మూడేళ్లు ఓర్పుతో ఉన్నాను, ఇస్తాడులే అని. క్రితం వారం నేను వాడిని డబ్బు తిరిగివ్వమని అడిగితే నాకేమీ తాను డబ్బివ్వక్కర్లేదని వదిలించుకున్నాడు).

Jagannath: So that is the reason. Yours was the mistake in lending him the money. You have to pay for it now (అయితే అదన్నమాట కారణం. వాడికి అప్పివడం నీ తప్పే. దానికి శిక్ష అనుభవించు నువ్వు).

Ranganath: But I have a friend who I can count on to recover the money from Nagaraj. I will definitely get back at him. I will make him eat the humble pie (అయితే నా డబ్బు నాకప్పగించగల స్నేహితుడున్నాడు. అతను నాగరాజు దగ్గర్నుంచి నా డబ్బు తిరిగి ఇప్పించగలడు. నాగరాజుకు సరైన బుద్ధి చెప్తా. వాడిని నేను మట్టి కరిపిస్తా).

Jagannath: Wish you all luck. Next time when we meet I like to hear that you have recovered the money from him (నీకా అదృష్టం కలగాలని కోరుకుంటున్నా. మళ్లీ ఈసారి కలుసుకున్నప్పుడు నువ్వు నీ డబ్బును తిరిగి వాడి దగ్గర్నుంచి తెచ్చుకోగలిగావని వినాలనుకుంటున్నా).

Now let us look at the phrasal verbs from the conversation

1) Turns me off - the original phrasal verb - turn somebody off = make a person lose liking for somebody (ఒకరి మీద అయిష్టం కలగడం).

a) Pandu: Nataraj really is not a person to like. How I hate him! (నటరాజ్‌ అంతగా మనం ఇష్టపడే వ్యక్తి కాదు. అతనంటే నాకు ద్వేషం).

Srinivas: How long have you taken to realize it! He turns off everybody that tries to be friendly with him (అది గ్రహించడానికి నీకెంత సమయం పట్టింది! వాడు తనతో స్నేహం చేయాలనుకునే వాళ్లందరినీ అతనంటే ఇష్టం పోయేలా చేస్తాడు).

b) Harsha: Though I have been friends with Raghu for just a short while, I have found him very likable (రఘుతో నేను స్నేహం చేయడం మొదలుపెట్టింది చాలా తక్కువ కాలమే అయినా అతనంటే అందరూ ఇష్టపడేట్టు చేస్తాడు).

Ashok: That is true. He never behaves in a way that turns people off from him (అది నిజమే. ఇతరులు తనంటే ఇష్టం పోయేలా ఎప్పుడూ ప్రవర్తించడు).

2) Be put out with= make a person dislike some one else (ఒకరంటే మనకు ఇష్టం లేకుండా చేసుకోవడం).

a) Srikar: I donÕt see why you are so much against Sekhar (శేఖర్‌ అంటే నీకెందుకు ఇష్టం లేదో నాకర్థం కావడం లేదు).

Bhavan: Yea, move with him for a few days, and you will understand how he puts you out (వాడితో నువ్వు కొన్నిరోజులు కలిసి తిరుగు, అప్పుడు నీకర్థం అవుతుంది, అతనంటే నువ్వెందుకు ఇష్టపడవో).

b) Sambasiva: I found Nithyanand very friendly. He has very pleasant manners (నిత్యానంద్‌ చాలా స్నేహ స్వభావం కలవాడు. అతనికి ఆహ్లాదకరమైన ప్రవర్తన ఉంది).

Rajaram: Yea. He is such a nice guy. You never feel put out with him even if you move with him for a long time (అవును. అతను చాలా నాగరికుడు. అతనితో నువ్వు చాలాకాలం కలిసి ఉన్నా అతనంటే నీకు అయిష్టం కలగదు).

Englishలో Eat humble pie = Make a humble apology and accept humiliation (మనం తప్పని ఒప్పుకోవడం)

a) Sridhar: Kesav argued very strongly that he was right, but Prabhakar proved that he was wrong (కేశవ్‌ చాలా గట్టిగా వాదించాడు, తాను సరి అని. కానీ ప్రభాకర్‌ అతను తప్పని రుజువు చేశాడు).

Bhagavan: So he had to eat a humble pie, after all. The trouble with Kesav is he feels he is always right (అంతా అయిన తరువాత తను తప్పని ఒప్పుకోక తప్పలేదు. కేశవ్‌తో ఉన్న సమస్యే అది. ఎప్పుడూ తనే కరెక్ట్‌ అని భావిస్తాడు).

b) Suprabhat: Srikanth always makes sure he is right when he argues (తాను వాదించేటప్పుడు, శ్రీకాంత్‌ తాను కరెక్టే అని రూఢి చేసుకుంటాడు).

Sunanada: That is right. He sees to it that he has never to eat the humble pie (అవును, అది కరెక్టే. తాను తప్పని ఒప్పుకునే పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోడు).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌