• facebook
  • whatsapp
  • telegram

To  pick  your  brains

శ్రేయోభిలాషుల సలహాలను ఎవరైనా తీసుకుంటుంటారు. ఇలా ఇతరులనుంచి సలహా పొందడాన్ని సూచించే వ్యక్తీకరణ ఒకటుంది. దీన్ని ఉదాహరణల సాయంతో నేర్చుకుందామా?

Asok: How are you, buddy? Long time no see. What could be the reason? (ఏం మిత్రమా ఎలా ఉన్నావు? చాలా కాలమైంది నిన్ను చూసి. కారణం ఏమిటి?)

Harsha: I had to leave suddenly for Mumbai on some important business. I returned only yesterday. I have come to you to pick your brain (ఏదో ముఖ్యమైన పనిమీద ముంబయి వెళ్లాల్సి వచ్చింది. నిన్ననే తిరిగి వచ్చాను. నీ దగ్గరికి ఇప్పుడు వచ్చింది సలహా కోసం).

Asok: What about? (దేని గురించి?)

Harsha: It's about my buying a house. I have been racking my brains for the past few days. I am not able to decide whether to buy the house or not (ఇల్లు కొనడం గురించి. గత కొన్నిరోజులుగా నేను మథనపడుతున్నాను. కొందామా వద్దా అని నిర్ణయించుకోలేకపోతున్నాను).

Asok: Why don't you consult your father? Why don't you take his advice? (మీ నాన్నగారిని సంప్రదించవచ్చు కదా? ఆయన సలహా ఎందుకు తీసుకోకూడదు?)

Harsha: No, his memory is heading south. He has advised me to buy the house. But I want your advice too. I have plenty of money now, and my financial prospects are going very swimmingly (లేదు.ఆయన జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతూ ఉంది. ఆయన ఇల్లు కొనమనే సలహా ఇచ్చారు. కానీ నాకు నీ సలహా కూడా కావాలి. ఇప్పుడు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, నా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది ఇప్పుడు).

Asok: I am extremely happy about it. Wish you all success. Do buy that house. It is an independent house and is much better than a flat. Go ahead. My best wishes to you (నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు జయం పొందాలి. ఆ ఇల్లు కొను. అది ఇండిపెండెంట్‌ హౌజ్‌, పైగా ఫ్లాట్‌ కంటే అదే నయం. కాబట్టి తీసుకో. నీకు అంతా మంచే జరగాలని నేను కోరుకుంటున్నా).

Harsha: Thank you (ధన్యవాదాలు)

Look at the idioms from the conversation above

 1) To pick your brains = to get advice from you (Pick one's brains = get advice from someone) (ఇతరుల నుంచి సలహా పొందడం).

Ajitha: Why, what is the matter? What do you want from me? (ఏంటి సంగతి?నా నుంచి నీకేం కావాలి?)

Nikhila: I am proposing to marry off my son to Giridhar's daughter who you know. What kind of girl is she? It is in this matter I have come to pick your brains (నీకు గిరిధర్‌ తెలుసుగా! మా అబ్బాయికి ఆయన కూతురినిచ్చి పెళ్లిచేయమని అడుగుదామనుకుంటున్నా. ఆ అమ్మాయి ఎలాంటిది? నీ సలహా అడగడానికి వచ్చాను).

2) Heading south = To be failing (క్షీణించడం)

a) Ramana: Why don't you consult your father about your daughter's marriage? He can give you proper advice (నీ కూతురి పెళ్లి గురించి మీ నాన్నగారిని ఎందుకు సంప్రదించకూడదు? ఆయన నీకు సరైన సలహా ఇవ్వగలరు).

Raju: No, his memory is heading south. He can't remember much. He is too old to give me advice (లేదు. ఆయన జ్ఞాపకశక్తి క్షీణిస్తోంది. ఆయన అంతగా గుర్తుంచుకోలేడు. నాకు సలహా ఇవ్వలేనంత పెద్దవాడైపోయాడు).

3) Going swimmingly = Going very well / without any problem (చాలా బాగా జరుగుతున్న విషయం).

a) Nithyanand: How are the preparations for your daughter's wedding going on? (మీ అమ్మాయి పెళ్లికి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా?)

Athmaram: Oh, it is going swimmingly. The bridegroom is a man of ideals and does not want any dowry (చాలా బాగా జరుగుతున్నాయి. పెళ్లి కొడుకు ఆదర్శవంతుడు, కట్నం అక్కర్లేదతనికి).

 

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌