• facebook
  • whatsapp
  • telegram

Should I see the secretary? 

Divakar: I didn't go there yesterday because I thought I didn't need to.  (నిన్న నేను అక్కడికి వెళ్లే అవసరం ఉండదు అనుకున్నాను కాబట్టి వెళ్లలేదు.)

Bhaskar: Yea. You did the right thing. Ramesh needed to go there, and he did. (అవును. నువ్వు సరైన పనే చేశావు. రమేష్ వెళ్లాల్సిన అవసరం ఉండింది, అతడు వెళ్లాడు.)

Divakar: But I need to find out when I must be there. Otherwise the boss may get angry. (అక్కడ నేనెప్పుడుండాలో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. లేకుంటే మన boss కు కోపం రావచ్చు.)

Bhaskar: Do you have to go there now itself to find that out? (నువ్విప్పుడే వెళ్లాలా అది తెలుసుకునేందుకు?)

Divakar: Of course I need not. But go there I must, sooner or later. Better sooner than later. (అదీ నిజమే. ఇప్పుడే వెళ్లనవసరంలేదు. కానీ ముందరైనా తర్వాతైనా వెళ్లాల్సిందే కదా? అందువల్ల తర్వాత కంటే ముందర వెళ్లడం మేలు కదా?)

Look at the following sentences from the conversation above:

1) I didn't go there yesterday because I didn't need to.

2) Ramesh needed to go there, and he did.

3) I need to find out when I must be there.

4) Of course I needed not, but go there I must.

We are now going to know some more uses of 'need'.

We have so far seen that 'need' is both a main verb, and a helping verb.

eg: He needs money ('need' here is a main verb).

she needs to earn money ('need' here is a helping verb, because it forms a part of the verb, 'need to earn').

Hasith: When mustshouldhave I to go there? (నేనక్కడికి ఎప్పుడు వెళ్లాలి?)

Giri: You need not go there at all. (నువ్వక్కడికెళ్లాల్సిన అవసరం లేదు.)

మనకు తెలుసుకదా - must/ should/ have to/ has to - ఇవన్నీ duty (విధిగా చేయాల్సిన పని)/ command (ఆజ్ఞ)/ necessity (అవసరం కొద్దీ) చేయాల్సిన పనులను తెలుపుతాయి.

వీటన్నిటికీ opposite, need not/ not have to = చేయనవసరం లేదు.

must = should = have to/ has to అయితే must not = should not - ఈ రెండు మాత్రం ఒకటే. ఒక పని చేయకూడదు అని - negative command = నిషిద్ధం.

Yaswanth: Should I see the secretary? (నేను secretary ని చూడాలా?)

Jaisankar: No, you should not = లేదు. నువ్వు చూడకూడదు.

గమనించండి:

a) You must do it/ should do it/ have to do it = నువ్వది చేయాలి. (Duty/ command) X you must not/ should not do it (చేయకూడదు   - negative command.)

b) Prasanth: You have to send it now (= You must/ should send it now)

Sudhakar: I think I don't have to/ I need not = నేను పంపనవసరం లేదనుకుంటా).

Don't/ Doesn't have to = need not/ do not (don't) need to/ don't have to/ doesn't have to (చేయనవసరం లేదు).

'Not' లేకపోతే need = must = should = have to/ has to.

You must go = You should go = You have to go = You need to go.

Need I finish it before tomorrow? = Must I finish it before tomorrow = నేనది రేపటిలోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందా? చేయాలా?

ఇవీ 'need' ఉపయోగాలు.

Why don't we make a trip..?

Ekambar: You've (you have) been complaining of a headache since morning. Why don't you see a doctor? (పొద్దుటినించి తలనొప్పి అని బాధపడుతున్నావు కదా? డాక్టర్‌ని ఎందుకు చూడకూడదు?)

Ganesh: I don't want to for a simple headache they prescribe umpteen drugs. That's worse than the headache. (నాకు ఇష్టం లేదు.  చిన్న తలపోటుకు, ఇన్ని మందులు రాస్తారు. అది తలనొప్పి కంటే అధ్వాన్నంగా ఉంటుంది.)

Ekambar: Then how about trying some home remedy? (ఏదైనా గృహ వైద్యం చేసుకోవచ్చు కదా?)

Ganesh: I think I'd (I had) better go out and have some fresh air. That might be of help. (కాస్త బయటికెళ్లి శుభ్రమైన గాలి పీల్చుకోవడం మంచిదనుకుంటా.)

Ekambar: You ought to have a rest instead I feel. (దాని బదులు విశ్రాంతి ఎందుకు తీసుకోకూడదు?)

Ganesh: Haven't (Have not) I had enough rest? Let me go out. How about going out with me? (తీసుకున్న విశ్రాంతి చాలదా? నన్ను బయటికి వెళ్లనీ. నాతో బయటికి వెళ్లడం సంగతేంటి?)

Ekambar: No problem. Let's go. (అభ్యంతరం లేదు. పద.)

Now look at the following expressions from the conversation above:

1) Why don't you see a doctor?

2) How about trying some home remedy?

3) You ought to have a rest instead, I feel.

పైన underline చేసిన expressions అన్నీ సూచన (suggestions) ఇవ్వడానికి వాడతాం, English conversation లో practise చేద్దాం.

a) Hrithik: It's getting hotter by the minute. I'm (I am) afraid I can't walk any more. (నిమిష నిమిషానికి వేడి/ ఎండ ఎక్కువైపోతోంది. ఇంక నేను నడవలేనేమో అనిపిస్తోంది ఇక్కడ afraid = అనిపించడం, భయం కాదు.)

Divya: Yes. I feel so too. How about having some chilled drink? (నాకూ అలానే అనిపిస్తోంది. చల్లటి పానీయం ఏమన్నా తీసుకుంటే?)

b) Indraneel: I find it difficult to talk to him.

He simply wouldn't let me say anything. (అతడితో మాట్లాడటం కష్టం. నన్నసలేం చెప్పనివ్వడు.)

Jagannadh: How about taking the help of/ what about taking the help of Sumanth?

He can do the job for you. (సుమంత్ సాయం తీసుకుంటే?/ ఎందుకు తీసుకోకూడదు?/ తీసుకునే సంగతేంటి?)

Suggestions ఇచ్చేందుకు తరచుగా వాడే ఇంకో expression, Why don't we?/ Why don't you? etc.

a) Kantharao: A sunday at last followed by a holiday on Monday. We have two full days. I feel like going somewhere. (చివరికి సోమవారం సెలవుతో కలసిన ఆదివారం వచ్చింది. రెండు పూర్తి రోజులు సెలవు. ఎక్కడికైనా వెళ్దాం అనిపిస్తోంది.)

Krishna Rao: Why don't we make a trip to Araku? That'd be really enjoyable. (అరకు వెళ్తే? అది చాలా సరదాగా ఉంటుంది.)

b) Lakshman: Why don't you go to Ooty this summer? You haven't been there at all. (ఈ వేసవిలో ఊటీ ఎందుకు వెళ్లకూడదు?ఇంతవరకు వెళ్లలేదు నువ్వక్కడికి).

Lavanya: Why don't you accompany me? (నువ్వు నాతో ఎందుకు రాకూడదు?)

ఇవి practice చేద్దాం.

We went to school together 

Kishore: How do you know Yashwin? (నీకు యష్విన్ ఎలా తెలుసు?)

Wesley: What do you mean? We went to school together. We have been very close since then. (ఏంటంటున్నావు? మేం ఒకే స్కూల్లో చదువుకున్నాం. అప్పటి నుంచి మేం సన్నిహితులుగా ఉన్నాం.)

Kishore: Did you go to the same college too? (ఒకే college లో కూడా చదువుకున్నారా?)

Wesley: No, dad got transferred and we had to move from Vijayawada; ofcourse, that was after I took the X class exams.  (లేదు.  మానాన్న బదిలీ అయ్యాడు, మేం విజయవాడ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. అయితే అది నేను X Class పరీక్షలు రాసిన తర్వాత.)

Kishore: What about your younger brother?

What's he now? (మీ తమ్ముడి సంగతేంటి? అతనేం చేస్తున్నాడిప్పుడు?)

Wesley: He is doing Intermediate now.

Coming April he is taking his exams. (అతనిప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వచ్చే ఏప్రిల్‌లో అతను పరీక్షలు రాస్తాడు.)

Kishore: Which college will you put him in next? Which course will he do? (తర్వాత అతడ్ని ఏ కాలేజీలో చేరుస్తావు? ఏం course?)

Wesley: I'd prefer a college where the classes get over by 4.30 or 5.00 in the evening. I don't want these jail-like residential junior colleges. (సాయంత్రం 4.30 / 5.00కి అంతా అయిపోయే కళాశాలల్లోనే పెట్టాలనుకుంటున్నా. జైళ్లలాంటి Residential Junior Colleges లో పెట్టాలనుకోవడం లేదు.)

Kishore: I am there with you. (నేను ఒప్పుకుంటా ఆ విషయంలో.)

Functional English ఎప్పుడూ informal గా (కచ్చితంగా నిబంధనలు, grammar సూత్రాల ప్రకారం కాకుండా) ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు విద్యా, విద్యాలయాల విషయంలో Functional English expressions చూద్దాం.

Look at the following expressions from the conversation above:

 1) We went to school together.

 2) Did you go to the same college?

 3) We had to move from Vijayawada to Hyderabad.

 4) He is doing Intermediate now.

 5) Which college will you put him in next?

 6) Which course will he do?

గమనించారు కదా? మనం మాట్లాడుతున్నది చదువు విషయమే అయినా study, learning, pursuing లాంటి పెద్ద పెద్ద మాటలు వాడకుండా ఎంత మామూలు మాటల్లో చదువు విషయం చెప్పగలమో! ఇది మన spoken English కు సహజత్వాన్నిస్తుంది.

Vali: Hi, what a surprise! You visiting us after such a long time? (ఎంత ఆశ్చర్యం! నువ్వు మా ఇంటికి రావటం చాలా కాలం తర్వాత!)

Tarun: I've been busy. How is every body? How about the kids? (తీరికలేకుండా ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? పిల్లల సంగతేంటి?)

Vali: They are at school. They will be back home only at 5.

(Schoolలో ఉన్నారు. ఐదింటికి ఇంటికి తిరిగొస్తారు.)

School, the school తేడా:

He goes to school = అతను విద్యార్థి.

He goes to the school = అతను విద్యార్థి కాకపోవచ్చు. 

My children are at school - ఇక్కడ school ముందు 'the' లేదు: అర్థం: క్రమంతప్పకుండా schoolకు వెళ్లేవాళ్లు, school తో సంబంధం ఉండి - విద్యార్థులు.

1) Prasad: How long have you known her? (ఆమె నీకెంతకాలంగా తెలుసు?)

 Jyothi: Oh, since our school days. We went to school together / We went to the same school. (మా స్కూల్ రోజుల నుంచి. మేం ఒకే schoolలో చదివాం.)

మనం we were classmates / schoolmates అనే బదులు ఇలా అనేయొచ్చు. We attended the same school అని కూడా అనొచ్చు.

We were classmates అనటం కన్నా ఇలా ఎక్కువ అంటారు.

2) 'Doing' instead of studying / pursuing.

a) Rahim: Which class are you in? (నువ్వే class?)

Sunil: I am doing second year Inter. (నేను ఇంటర్ రెండో ఏడు చదువుతున్నాను.)

 In which class are you studying? I am studying.....,

 studying బదులు మనం వ్యావహారికంగా:

 a) I am in Inter second year / I am doing Inter second year - అంటే చాలా సహజంగా, conversationalగా ఉంటుంది.

What is your father? 

Siva: Where are you from, Ganesh? (మీదే ఊరు?)

 Ganesh: I came from Nellore. That's where my parents belong too. Dad looks after our fields. Mom is a homemaker. And what  are you? (మాది నెల్లూరు. మా తల్లిదండ్రులదీ అదే. మా నాన్న పొలాలు చూసుకుంటారు. మా అమ్మ గృహిణి. నువ్వేం చేస్తుంటావు?)

 Siva: I have a business (వ్యాపారం చేస్తుంటాను)

 Ganesh: What's the line? (ఏం వ్యాపారం?)

 Siva: We deal in stationery (మేం స్టేషనరీ వ్యాపారం చేస్తాం)

 Ganesh: How long have you been in the business? (ఎంతకాలంగా ఉన్నారు businessలో?)

 Siva: Since Dad's time (మా నాన్న రోజుల నుంచి)

 Ganesh: Good. Do you like the business? (మీకిష్టమేనా?)

 Siva: I wouldn't be doing it, if I didn't like it. (నచ్చకపోతే చేసేవాడిని కాదు కదా?)

 Look at the following:

 1) Where are you from?

2) I came from Nellore.

 3) That's where my parents belong too.

 4) What's (what is) the line?

 5) We deal in stationery

 ఇవన్నీ కూడా మన spoken English ను చాలా సరళంగా, సహజంగా ఉండేట్టు చేస్తాయి. ఇవి మనం practice చేద్దాం.

 సామాన్యంగా మీదే ఊరు? అని అడిగేందుకు, What is your native place? అంటుంటాం. ఇది, అంటే 'native place' English లో లేదు.

 దానికి బదులు am/ is/ are/ was/ were a native/ natives of అంటాం. అలాగే మాది ఫలానా ఊరు అనేందుకు, am/ is/ are/ was/ were  from, లేకుంటే come/ comes from అనొచ్చు. కానీ am/ is/ are coming from అంటే అర్థం మారిపోతుంది, అక్కడి నుంచి వస్తున్నాను/ వస్తున్నాం ఇప్పుడు అని.

a) Keerthi: Where is your wife from?/ Where does your wife come from? (మీ ఆవిడదేవూరు?)

Surendra: She is / comes from Kakinada (ఆవిడది కాకినాడ).

b) Suguna: Where is your mom from? (మీ అమ్మగారిదేవూరు?)

Bahuguna: She belongs to Kurnool. (ఆమె కర్నూలుకు చెందినది- belong, conversational English లో వాడం. అది కాస్త formal.) am/ is/ are belonging వాడం. 

 (ఈమధ్య TV Reality shows లో కొంతమంది participants, 'నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అంటున్నారు- మాది హైదరాబాద్ అంటే సహజంగా ఉంటుంది కదా)

అలాగే Landlord / agriculturist/ cultivator అనే బదులు, look after/ mind fields/ lands అనొచ్చు simpleగా.

అలాగే 'మీరేం చేస్తుంటారు? అనేందుకు, 'What are you?/ he?/ they? అనేది చాలా simple question. కాస్త మర్యాదగా అడగాలంటే, 'May I know  what you are?' (మీరేం చేస్తారో తెలుసుకోవచ్చా?) అనవచ్చు.

 What are you doing మాత్రం కాదు. What do you do? అనవచ్చు.

 'What is your father?'/ What does your father do? అనవచ్చు. Simplest: 'What is your father?'

 ఇవి మనం practice చేసి మన conversation సహజంగా ఉండేట్టు చేద్దాం.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం