• facebook
  • whatsapp
  • telegram

Do you know English ? 

 Sagar: Does your sister sing? (మీ చెల్లెలు పాడుతుందా?)

Peter: Yes, she does, mostly for movies. (పాడుతుంది. ఎక్కువగా సినిమాలకు.)

Sagar: What about your cousin ? (మీ cousin సంగతేంటి?)

Peter: She does too, but not for movies. She does concerts.(ఆమె కూడా పాడుతుంది. కానీ సినిమాలకు కాదు. ఆమె కచేరీలు చేస్తుంది.)

Sagar: Do they act too? (వాళ్లు నటిస్తారు కూడానా?)

Peter: Neither does. They are averse to performing on the stage. (ఇద్దర్లో ఎవరూ చేయరు. వాళ్లకు వేదిక ఎక్కి ప్రదర్శనలు ఇవ్వడం ఇష్టం లేదు.)

Averse = Unwilling

Sagar: But they have the talent. (కానీ వాళ్లకు ప్రతిభ ఉంది కదా?)

Peter: So have you, but you don't act, either (నీకూ ఉంది ప్రతిభ, కానీ నువ్వూ నటించవు)

Sagar: But I am doing a job that assures me security, and a good salary. (కానీ నేను మంచి జీతం తెచ్చిపెట్టే స్థిరమైన ఉద్యోగం చేస్తున్నాను)

Peter: So is my cousin. She has a plum job too (మా cousin విషయమూ అంతే. ఆమెకూ మంచి ఉద్యోగం ఉంది.)

Sagar: But your younger sister isn't. Perhaps she has no interest in film acting.  (మీ చెల్లెలు ఉద్యోగం ఏం చేయటంలేదు. బహుశా ఆమెకు నటనలో ఆసక్తి లేదేమో!)

                                 *   *  *

ఈసారి మనం మన మాట్లాడే/ మామూలు సంభాషణకు సహజత్వాన్ని/ సరళత్వాన్నిచ్చే short responses (క్లుప్త స్పందనలు) practice చేద్దాం. ఇది మనకు conversational easeఇస్తుంది.

Look at the following exchanges from the conversation above.

1) Sagar: Does your sister sing?

Peter: Yes, she does.

2) Sagar: What about your cousin?

Peter: She does too, but for concerts.

3) Sagar: Do they act too?

Peter: Neither does.

4) Sagar: They have the talent.

Peter: So have you.

Spoken English లో మామూలు questions కు సమాధానాలు చాలా క్లుప్తంగా ఉంటాయి.

S: Does your sister sing?

P: Yes, she does.

           ఇక్కడ 'Does your sister sing?' (మీ చెల్లి పాడుతుందా?) అంటే దానికి సమాధానం, మామూలుగా 'Does your sister sing?' అంటాం. కానీ, spoken form లో she does అంటాం. అలాగే, question కు answer, 'no' అయితే, No, she doesn't/ No, I/ we/ you/ they don't అని వస్తుంది.

a) Prathap: Do you know English?

Surendra: Yes, I do./ No, I don't.

            చూశారు కదా? Surendra response. Yes, I do అంటాం. కానీ మామూలుగా చాలామంది అనేట్టు, Yes, I speak English/ No, I don't speak English అని అనం.

b) Naresh: Will you see me tomorrow?

     Neeraj: Yes, I will/ No, I won'tఅంటే ఎక్కువగా helping verbs (do, does, did, shall, should, will, would, can, could, may, might, must, have to, has to, and had to, need and ought) వాడతాం.

వీటికి మీరు short responses ప్రయత్నించండి.

1) Are you happy? (Both Yes/ No)

2) Hope you won't do it again

3) Do you like Telugu movies (Yes/ No)

4) Should he come again? (Yes)

5) You like milk, don't you? (Yes/ No)

6) Will you be there tomorrow? (Yes/ No)

7) Were you at the meeting yesterday? (Yes/ No)

8) Need we attend the meeting? (Yes/ No)

9) Do you know the answer? (Yes/ No)

10) Doesn't he help you? (Yes/ No)

A correction: In the functional English part of lesson No. 732 (28.04.2013), in the first column, read 'I come from Nellore', instead of, 'I come from Nellore', both in the conversation part and explanation part.

I come from Nellore = I am a native of/I belong to Nellore. (మాది నెల్లూరు)

I came from Nellore = I arrived from Nellore (నేను నెల్లూరు నుంచి వచ్చాను).

             Answers:

  1) Yes, I am/ No, I am not

  2) No, I won't

  3) Yes, I do/ No, I don't

  4) Yes, he should

  5) Yes, I do/ No, I don't

  6) Yes, I will/ No, I won't

  7) Yes, I was/ No, I wasn't

  8) Yes, we need to/ No, we needn't

  9) Yes, I do/ No I don't

  10) Yes, he does/ No, he doesn't

They don't want any more

Remember the following contractions. English మాట్లాడేటప్పుడు, not ను పూర్తిగా అనకుండా, Do, does లాంటి helping verbs తో కురచ రూపం (contracted form)లో వాడతారు చాలా తరచుగా. అది practice చేసి అలవాటు చేసుకుంటే spoken English, spoken English లా ఉంటుంది. లేకుంటే bookish (గ్రాంథిక) English గా ఉంటుంది. Now look at the following contractions and practise them:

  1) Do not = Don't

  2) Does not = Doesn't

  3) Did not = Didn't

  4) Cannot = Can't

  5) Could not = Couldn't

  6) Will not = Won't

  7) Shall not = Shan't

  8) Would not = Wouldn't

  9) Should not = Shouldn't

  10) May not = Mayn't

  11) Might not = Mightn't

 12) Must not = Mustn't

  13) Need not = Needn't

  14) Have not = Haven't

  15) Has not = Hasn't

  16) Had not = Hadn't
          

   వీటిలో high frequency expressions(అతి తరచుగా వాడేవి): Don't, Doesn't, Didn't (డిడ్‌న్‌ట్), Can't (కాన్ట్), Couldn't, Won't, Wouldn't, Shouldn't, Haven't, Hasn't, Hadn't.
 

  వీటికితోడు మరికొన్ని: amn't (am not), isn't (is not), aren't (are not), wasn't (was not), weren't (were not) mee కు గుర్తుండే ఉంటుంది - వీటిని Question Tags లో ఎక్కువగా వాడుతుంటాం.
 

           వీటి ఉపయోగం, ఇంకా, short responses లో (క్లుప్త స్పందనల్లో) తప్పకుండా వాడతాం.

           వీటిని తరచుగా వాడటం అలవాటు చేసుకుంటే, spoken English చాలా సహజంగా ఉంటుంది.

Look at the following conversation:
 

Ajay: Have you any novels you can lend me? I want to read some during this vacation. (నాకివ్వగలిగిన నవలలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఈ సెలవుల్లో కొన్ని చదవాలనుకుంటున్నా.)
 

Sunil: I am sorry. I haven't/ don't have any. In fact I was about to ask you for some. (Sorry.. నా దగ్గరేం లేవు. అసలు నేనే నిన్ను కొన్ని అడగబోతున్నా.)
 

Ajay: We are sailing in the same boat then. (Do you) know any of our friends who can help us in the matter? (మనిద్దరం ఒకే పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఈ విషయంలో మనకు సాయం చేయగల స్నేహితులెవరన్నా తెలుసా?)
 

Sunil: There aren't any, I am afraid. (ఎవరూ లేరనే అనిపిస్తోంది.)
 

Ajay: I tried at the library. There had been some, but they have all been taken away. There weren't any left. (నేను లైబ్రరీలో ప్రయత్నించా. అక్కడ ఉండేవి, కానీ వాటినీ తీసుకెళ్లిపోయారు. ఏవీ మిగల్లేదు.)
 

Sunil: That's bad. Let me see if I can get any from my cousin. She might have some. (అది దురదృష్టమే. మా cousin దగ్గరేవైనా ఉంటాయేమో చూస్తా. ఆమె దగ్గర కొన్ని ఉండొచ్చు.)
 

Ajay: If you get any from her pass them on to me too. (నీకేమైనా వస్తే, కొన్ని నాకివ్వు.)
 

Look at the following expressions from the conversation above:
 

   1) Have you/ Do you have any novels? I want to read some.
 

   2) I don't have any. I was about to ask you for some.
 

   3) There aren't any.

   4) There had been some, but there weren't any.


Spoken English లో, some, any ఉపయోగం మన భాషను చాలా సరళంగా చేస్తుంది. వీటిని వాడటం వల్ల మన మాటలు క్లుప్తంగా ఉంటాయి. Spoken English లో no బదులు not any (contracted form - n't any) form వాడుక చాలా ఎక్కువ. గమనించండి.

a) Suseela: Please give me some more samosas (ఇంకొన్ని సమోసాలుంటే ఇవ్వవా?)
 

Mother: Sorry, child. There aren't any left. (లేదమ్మా, సమోసాలేం మిగల్లేదు.)
 

 మనం సామాన్యంగా, There are no samosas left అంటాం. దీని కంటే 'There aren't any more left' అనడం ఎక్కువ.
 

b) Janaki: Ask Mayuri for some nail polish. I haven't any more with me. (మయూరిని కాస్త గోళ్లరంగు అడుగు. నా దగ్గర ఇంకలేదు).
 

Sarala: I am sure she will give us some. (తను కొంత మనకిస్తుందనుకుంటా తప్పక.)

  కింది sentencesలో 'no' బదులు 'not.... any' వాడండి. (సాధారణంగా అలాంటిచోట్ల 'No' వాడేస్తుంటాం.) ఇది మీరు గబగబా అనేయాలి.

Eg: 1) I have no money to lend you (నీకు అప్పు ఇచ్చేందుకు నా దగ్గర డబ్బేం లేదు.)
 

  Ans: I haven't any money to lend you.
                          

Exercise:
 

  1) The teacher likes no boy to be irregular.
 

  2) She has no more patience with people like you. (patience = ఓర్పు / సహనం).
 

  3) There is no money left in his bank account.
 

  4) He brought home no money.
 

  5) I will see no more movies of that actor.
 

  6) There was no more food left.
 

  7) She has no new dress for the function.
 

  8) We have seen no new movies this month.
 

  9) I want no more; thank you.
 

  10) I have no more work to do.
 

    Answers:
 

  1) The teacher doesn't like any boy to be irregular.
 

  2) She hasn't anymore patience with people like you.
 

  3) There isn't any more money left in his bank account.
 

  4) He didn't bring home any money.
 

  5) I won't (will not) see any  more movies of that actor.
 

  6) There wasn't any more food left.
 

  7) She hasn't any new dress for the function.
 

  8) We haven't seen any new movies this month.
 

  9) I don't want any more; Thank you.
 

  10) I haven'tdon't have any more work to do.

..... either side of the road

b) Subba Rao: You can keep one of the two books. Which one do you want? (ఆ రెండు పుస్తకాల్లో ఒకటి నువ్వు ఉంచుకోవచ్చు. ఏది కావాలి?)
 

Ramana: Either (of them) is OK. (రెండిట్లో ఏదైనా సరే).
 

Eitherకు ఇంకో అర్థం - రెండిట్లో / ఇద్దరిలో ప్రతి ఒక్కటీ/ ప్రతి ఒక్కరూ)
 

a) There are trees on either side of the road = రోడ్డుకు రెండువైపులా చెట్లున్నాయి.
 

b) Arjun: Which way could the thief have escaped (ఏ దారిలోంచి దొంగ పారిపోయి ఉండొచ్చు?)

Bharath: Can't say. There is a door on either side of the building (చెప్పలేం. ఆ building కు చెరోవైపు ద్వారం ఉంది).

Any = One of more than two = రెండు/ ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్న వాటిల్లో/ వాళ్లలో ఎవరైనా.
 

a) Charumathi: Did any movie that you saw last year interest you? (నువ్వు కిందటేడాది చూసిన సినిమాల్లో నీకు ఏది బాగుంది?)
 

Saritha: Any of the movie that we saw last year was OK.
 

Either/ either of/ any/ any of - వీటన్నిటినీ singular గానే అనుకోవాలి. verb కూడా singular.
 

b) Sravani: Which of these saris (more than two) do you want? (ఈ చీరల్లో రెంటికన్నా ఎక్కువ) ఏవి కావాలి నీకు?
 

Vatsala: Any three of them (వాటిల్లో ఏ మూడైనా)
 

c) Charumathi:  These are all the candidates who have made the grade. Who do you want among them.
 

Saritha: Any five of them (వాళ్లల్లో ఏ ఐదుగురైనా)
 

Either/ either of/ any/ any of - వీటన్నిటికీ verb ఎప్పుడూ singular.

Neither of us will be...

Narayana: Which of the two ... Mallik and Prasanth .. is here? (మల్లిక్, ప్రశాంత్ ఇద్దరిలో ఎవరున్నారిక్కడ?)
 

Roy: Neither is. ((ఇద్దరిలో) ఏ ఒక్కరూ లేరు.)
 

Narayana: Then when are you going to tell them of this? Will you meet them or call them? (అయితే ఈ విషయం వాళ్లకి ఎప్పుడు చెప్తావు నువ్వు? నువ్వు వాళ్లని కలుస్తావా, ఫోన్ చేస్తావా?)
 

Roy: Neither. I'll send my brother with the message. If they respond, it's OK. If they don't respond it's OK too. (మా తమ్ముడికి విషయం చెప్పి వాళ్లకు చెప్పమని పంపిస్తా, వాళ్లు స్పందిస్తే సరే, స్పందించకపోయినా సరే.)
 

Narayana: That's being irresponsible. That they get the message is important. You may not be in trouble, but I will be. (అది బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం. వాళ్లకి ఆ వార్త చేరడం అనేది చాలా ముఖ్యం. నువ్వు ఇబ్బందుల్లో పడకపోవచ్చు, ఇబ్బంది పడేది నేను.)
 

Roy:  Neither of us will be, don't worry. My brother will ensure that they get the message. (ఎవరం (మనిద్దరిలో) ఇబ్బందిపడం, ఆందోళన పడకు. మా తమ్ముడు చూసుకుంటాడు వాళ్లిద్దరికీ వార్త అందేట్టు.)
 

Narayana: The trouble with you is, you don't make things clear. Nor do you act in time. Why don't you yourself go to them or call them? Is it that you don't like them? Which of the two don't you like? (ఏదీ స్పష్టంగా చెప్పవు. నీతో చిక్కదే. పోనీ సకాలానికి చర్య తీసుకుంటావా అంటే అదీ చెయ్యవు. నువ్వే వాళ్ల దగ్గరికి ఎందుకు వెళ్లవు? లేకుంటే ఎందుకు ్ప్త్న్థ్ఠ చెయ్యవు. అంటే వాళ్లంటే నీకు ఇష్టం లేనందువల్లేనా? వాళ్లిద్దరిలో ఎవరంటే ఇష్టం లేదు నీకు?)
 

Roy:  I like neither of them. In fact none of our friends like them except you. And neither do you always. (ఇద్దరూ ఇష్టంలేదు. అసలు మన స్నేహితుల్లో వాళ్లంటే ఎవరికీ ఇష్టం లేదు. నీకు తప్ప. నీకూ వాళ్లంటే అన్నివేళలా ఇష్టం ఉండదు).
 

Narayana: But I do, of course. You don't understand people properly, nor do you try to. (అదేంలేదు. వాళ్లంటే నాకెప్పుడూ ఇష్టమే. నువ్వు ఇతరులను సరిగా అర్థం చేసుకోవు. ప్రయత్నించవు కూడా).
 

Note: Ensure = make sure = (ఖరారు చేసుకోవడం).
 

Look at the following sentences from the conversation above:
 

  1) Neither is.
 

  2) Neither. I'll send my brother with the message.
 

  3) Neither of us will be.
 

  4) I like neither.
 

  5) Nor do you act in time.
 

  6) And neither do you always.
 

  7) ... nor do you.

    In the last lesson, we've seen the importance of 'either' which means one of only two. Now we are going to see how to use 'neither' which means 'not one of only two'.

       గత lesson లో 'either' అర్థం, దాని ఉపయోగం చూశాం కదా? 'either' అంటే రెండిట్లో/ ఇద్దరిలో, ఏదైనా, ఎవరైనా అని.

       అలాగే Neither / Neither of = రెండిట్లో ఏదీ లేదు/ ఇద్దరిలో ఎవరూ లేరు/ కారు అనే అర్థంతో వాడతాం. English సంభాషణలో, Either, Either of, Neither, Neither of చాలా తరచుగా వాడతారు. అలా వాడితేనే సంభాషణ సహజంగా ఉంటుంది. అదే ఇద్దరి కంటే/ రెంటి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే 'None'/ 'None of అంటాం.
 

Neither is here = ఆ రెంటిలో ఏదీ లేదు/ ఆ ఇద్దరిలో ఎవరూ లేరు.
 

None is here = వాటిల్లో (రెంటికంటే ఎక్కువ)/ ఏదీలేదు/ వాళ్లల్లో (ఇద్దరికంటే ఎక్కువ) ఎవరూ లేరు.
 

None of the books is interesting = ఆ పుస్తకాల్లో (రెంటికంటే ఎక్కువ) ఏదీ ఆసక్తికరంగా లేదు.
 

None of our students failed = మా విద్యార్థుల్లో (ఇద్దరికంటే ఎక్కువ) ఎవరూ తప్పలేదు.
 

1. a) Prasanna: Where do you come from, Vijayawada or Hyderabad? (మీది ఏ ఊరు, విజయవాడా/ హైదరాబాదా?)
 

Rajeswari: From neither. I come from Nellore. (రెండిట్లో ఏదీ కాదు. నెల్లూరు.)
 

b) Abhijith: Which of your two uncles is an MP? (మీ ఇద్దరు బాబాయిల్లో ఎవరు MP?)
 

Venkat: Neither is. (ఇద్దరిలో ఎవరూ కారు.)

2. a) Prabhakar: Which one of the two shirts do you want?

Sudheer: Neither suits me, I am afraid. (ఆ రెంటిలో ఏదీ నాకు సరిపోదని నా అనుమానం)
 

b) Srikanth: Which team has a better chance of winning, yours or theirs? (ఏ జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మీదా, వాళ్లదా?)
 

Chandra: I don't have an idea. (నాకేం తెలియట్లేదు.)
 

Srikanth: Nor do I (నాకూ తెలియడం లేదు.)

Important: 'Neither/ Neither of/ nor' always takes a singular verb.
 

   a) Neither (of them) is here.
 

   b) Neither (of them) knows the answer.
 

   c) Neither (of them) has been selected.
 

పై sentences అన్నింటిలో Neither (of) .. రెండిట్లో ఏదీ లేదు / ఇద్దరిలో ఎవరూ లేరు.
 

¤ None (of): Not even one of more than two (రెంటికంటే ఎక్కువగా ఉన్నవాటిల్లో ఏదీలేదు/ కాదు/ ఇద్దరికంటే ఎక్కువగా ఉన్న వాళ్లల్లో ఎవరూలేరు/ కారు.)
 

a) Sana: Did any policemen come to the scene of the accident? (పోలీసులెవరైనా ఆ ప్రమాదస్థలానికి వచ్చారా?)

గుర్తుంది కదా, Any = One of more than two.
 

Ranganath: None (ఇద్దరికంటే ఎక్కువ - ఎవరూ రాలేదు.)
 

Compare: a) Neither is here (ఇద్దరిలో ఎవరూ, లేరు/ రెండిట్లో ఏదీలేదు.)
 

None is here = రెండిటికంటే ఎక్కువ వాటిల్లో / ఇద్దరి కంటే ఎక్కువ వాళ్లల్లో, ఏదీలేదు/ ఎవరూలేరు.
 

None of them = Same as above - వాటిల్లో (రెంటికంటే ఎక్కువ) ఏదీ లేదు /వాళ్లల్లో (ఇద్దరికంటే ఎక్కువ) ఎవరూలేరు.)
 

a) Either (of) = one of only two
 

    Any (of) = One of more than two.

b) Neither (of) = Not even one of only two.

    None (of) = Not even one of more than two.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌