• facebook
  • whatsapp
  • telegram

Burn the midnight oil

 Himaja: She's made it to the IAS. I mean our friend Harshita. The career is right up her street. The minute I heard the news I lost no time in congratulating her.

(తను IAS సాధించింది. నేను చెప్పేది మన స్నేహితురాలు హర్షిత గురించి. IAS లాంటి వ్యాపకం తనకు చక్కగా అమరినట్టయింది. ఆ వార్త వినగానే  క్షణం ఆలస్యం లేకుండా తనకు అభినందన తెలిపాను.)

Girija: The message has come through loud and clear. Hard work always pays. Her burning the midnight oil has certainly paid off. I tried over the phone to congratulate her too, but all that I heard for quite some time was the busy tone.

 (దానిలో సందేశం చక్కగా, సులభంగా తెలుస్తోంది. శ్రమకు తగిన ఫలితం ఎప్పుడూ ఉంటుంది. తను ఎన్నో రాత్రుళ్లు మేలుకుని పడిన శ్రమకు తగిన ఫలితం లభించింది. నేనూ తనను అభినందించాలని చాలాసార్లు phone చేశాను. కానీ phone busy గా ఉందని వినిపించింది.

Himaja: Perhaps she was being flooded with messages of congratulations, when you called her. It certainly is an achievement, that too for a middle class girl, you know. (బహుశా, అభినందనల వెల్లువ phone ద్వారా వచ్చి ఉంటుంది, నువ్వు phone చేసినప్పుడు.

అది తను సాధించడం గొప్పే. అదీ తనలాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయికి.)

Girija: You can say that again and again. Her dad is an ordinary government employee who always makes do with the salary he gets and honest to the core. He is never known to accept bribes. (బాగా చెప్పావు. వాళ్ల నాన్న మామూలు ప్రభుత్వోద్యోగి. వచ్చిన జీతంతోనే తృప్తిపడతారాయన. చాలా నిజాయతీపరుడైన మనిషి. లంచాలు తీసుకోడనే విషయం అందరికీ తెలుసు.)

Himaja:Yea; his being above board is well known. His daughter's achievement is the best reward for his honesty and integrity. (ఆయన నిజాయతీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన నిజాయతీకి ఆయన కూతురు సాధించింది గొప్ప బహుమతే.)

Girija: You are aiming at civil services exams too, aren't you? You can have some useful tips from her. (నువ్వు కూడా civil services పరీక్ష రాయాలనుకుంటున్నావు కదా! హర్షిత దగ్గర నుంచి నువ్వు సలహాలు తీసుకోవచ్చు.)

Himaja: Yes, I am, and I have been taking her advice as well. I'll keep doing that.

 (అవును. నేను సలహాలు తీసుకుంటూనే ఉన్నాను తన దగ్గర నుంచి. అది కొనసాగిస్తాను.)

Girija: All luck to you.

Notes:

1. be flooded = ఏదైనా ఎక్కువ సంఖ్యలో/ ఎక్కువ మొత్తంలో వెల్లువగా రావడం.

* The market is flooded with cheap Chinese cell phones = చవకైన చైనా cell phones తో మార్కెట్  వెల్లువెత్తుతోంది. (ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి).

* As soon as the advertisement was out, the office was flooded with applications

  (ప్రకటన వెలువడగానే office అంతా దరఖాస్తులతో నిండిపోయింది).

* Spurious drugs are flooding the market = నకిలీ మందులు మార్కెట్‌ను ముంచేస్తున్నాయి. 

2. All that = ఉన్నదంతా.

* All that there in her bank balance is just Rs. 10,000/- (ఆమెకున్న bank నిల్వ అంతా రూ. 10,000/- మాత్రమే.)

3. Pay = ఎక్కువగా వాడే అర్థం, చెల్లించడం. కానీ ఇక్కడి అర్థం: ప్రతిఫలం ఉండటం.

   Hard work pay = ప్రతిఫలం ఉండటం.  

4. To the core = పూర్తిగా/మొత్తం.

* Most Indian politicians are corrupt to the core = భారత రాజకీయనాయకుల్లో ఎక్కువమంది పూర్తిగా/అణువణువునా అవినీతిపరులే.

5. Bribe = లంచం. 

bribery = లంచగొండితనం.    

6. Integrity = నీతికి కట్టుబడి ఉండే గుణం/ ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవడం.

  Honesty = నిజాయతీ.

7. Tips = సూచనలు.

Now look at the following expressions from the conversation above.

1) She's (She has) made it to the IAS.

2) ..... I lost no time in congratulating her.

3) The message has come loud and clear

4) Her burning the midnight oil .... has certainly paid off.

5) ... who always makes do with the salary he gets

6) His being above board is well known.

1) She has made it to the IAS:

* Has made it to... Present Perfect Tense of 'Make it to'.

* Make it to something = Achieve something/ succeed in doing something (సాధించడం/ విజయం పొందడం)

Dheeraj: Why is the professor sore? (ఎందుకు ఆ professor గోరంత అసంతృప్తిగా ఉన్నారు/ ఉడికిపోతున్నారు?)

Sore = అసంతృప్తితో కోపంగా ఉండటం

Dharma: Because try as he might, he could not make it to Vice-Chancellor.

(ఎందుకంటే ఎంత ప్రయత్నించినా ఆయన Vice-Chancellor పదవి సాధించలేనందుకు).  

* Eswar: Who is now the manager? (ఇప్పుడు manager ఎవరు?)

Ganesh: Purandhar? Who else? (పురంధర్, ఇంకెవరు?)

Eswar: Couldn't your company find a better man than him? I am surprised how anyone so stupid could make it to manager? (అంతకంటే మంచి వ్యక్తి దొరకలేదా, మీ company కి? 

  అలాంటి మూర్ఖుడు manager పదవి ఎలా సాధించగలిగాడా/ manager ఎలా అవగలిగాడా అని నాకు ఆశ్చర్యంగా ఉంది).

  ఇది చాలా వ్యావహారికమైన మాట. make it (ఏదైనా సాధించగలగడం). Daily conversation లో ఎంతో చక్కగా ఉంటుంది. ఇంకా ఇదీ చూడండి.

* In spite of his best efforts, he never really made it as an actor = అతడెంత ప్రయత్నించినా, నటుడిగా ఏమీ సాధించలేదు/ గొప్ప నటుడు కాలేకపోయాడు.

* He made it to the party in the last minute = అతడు పార్టీకి చివరి నిమిషంలో రాగలిగాడు/ వచ్చాడు.

* I am sorry I could not make it to your son's wedding = మీ అబ్బాయి పెళ్లికి రాలేకపోయినందుకు బాధపడుతున్నాను.

2) Lost no time in - Past tense of 'Lose no time in' = immediately = తక్షణమే/ క్షణం కూడా ఆలస్యం లేకుండా.

Harish: Is your brother at home? (మీ అన్న ఇంట్లో ఉన్నాడా?)

Hemanth: He is in Tirupathi. The minute he knew he had passed the exam, he lost no time in fulfiling his vow to Lord Venkateswara.

(అతడు తిరుపతిలో ఉన్నాడు. Pass అయ్యానని తెలియగానే క్షణం ఆలస్యం లేకుండా వెంకటేశ్వరుడి మొక్కు చెల్లించడానికి తిరుపతి బయల్దేరాడు).

fulfil a vow =మొక్కు చెల్లించడం

* The minute politicians are elected they lose no time in amassing wealth = రాజకీయనాయకులు ఎన్నికైన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా డబ్బు కూడబెట్టడం మొదలెడతారు.  

3) Loud and clear = Easy to understand

* The message is coming through loud and clear. The corrupt can never escape the long arm of the law = సందేశం సులభంగా, స్పష్టంగా అర్థమవుతోంది కదా. అవినీతిపరులు (the corrupt)  చట్టం నుంచి తప్పించుకోలేరు. (Long arm of the law).

Janaki: Finally the government had to accept Anna Hazare's conditions. 

 (చివరికి ప్రభుత్వం అన్నాహజారే షరతులకు ఒప్పుకోవాల్సి వచ్చింది.)

Jayaram: That was because the message had come loud and clear. People wouldn't tolerate corruption for a long time. 

  (ఎందుకంటే, ప్రజలు అవినీతిని ఎంతోకాలం సహించరని సంకేతాలు సులభంగా, స్పష్టంగా అందాయి కాబట్టి.)

4) Burn the midnight oil = రాత్రుళ్లు కూడా మేలుకుని శ్రమించడం/ బాగా కష్టపడటం.

Krishna: He has certainly risen to great heights as a lawyer (ఆయన లాయర్‌గా చాలా ఎత్తుకెదిగాడు).

Kumar: You don't know how he burnt the midnight oil to rise to that level.

  (ఆయన అంత ఎత్తుకెదగడానికి ఎన్ని రాత్రులు శ్రమించాడో నీకు తెలియదు.)

* Jayaram: A nap in the afternoon is what I like a lot. I do it almost everyday. (మధ్యాహ్నం నిద్ర అంటే నాకెంత ఇష్టమో. దాదాపు ప్రతిరోజూ నిద్రపోతా). 

Nap = short sleep

Jagan: You'd (You had) better avoid it. Or else you'll (you will) have to burn the midnight oil later.

(అలా చేయకుండా ఉండటం మంచిది. లేకపోతే తర్వాత నువ్వు రాత్రుళ్లు మేలుకుని చదవాల్సి వస్తుంది.)

5) Make do with something = సరిపెట్టుకోవడం/ తృప్తిపడటం

Lasya: I am hungry. How about a snack?

  (నాకు ఆకలిగా ఉంది. ఏదైనా తిందామా?)

Lavanya: Why, haven't you had your breakfast?

 (ఏం, పొద్దునేం తీసుకోలేదా?)

Lasya: We were in such a hurry that I had to make do with just coffee.

 (హడావుడిగా ఉండటం వల్ల coffee తోనే సరిపెట్టుకున్నా (ఏమీ తినకుండా)).

* Lekha: Why don't you find another driver? He is no good at all.

  (ఇంకో driver ని ఎందుకు పెట్టుకోవు? ఇతడేం పనికిరాడసలు).

Prema: I have to make do with him at least till I find another driver.

 (ఇంకో driver దొరికే వరకు ఇతడితో సరిపెట్టుకోవాలి.) 

* Being jobless now, he has to make do with whatever job he gets = అసలు ఉద్యోగం లేకుండా ఉన్న అతడు ఏ ఉద్యోగం వచ్చినా సరిపెట్టుకోవాల్సింది. ఇది చాలా ఉపయోగకరమైన expression. మన నిత్య సంభాషణలో వాడవచ్చు. చాలా సహజంగా ఉంటుంది.

6) Be above board - ఇది ప్రస్తుతం మన దేశం విషయంలో వాడాల్సిన పదం. అర్థం: Being honest - నిజాయతీ గల (పారదర్శకత -transparency తో - ఏం దాపరికం లేకుండా -అవినీతి (corruption) అనుమానం కూడా రాకుండా ప్రవర్తించడం) - to be uncorrupt = అవినీతి లేని

* Few politicians in India are above board. (భారత రాజకీయనాయకుల్లో నీతిపరులు దాదాపు లేరు.)

* The police chief's dealings are all above board. (ఆ పోలీస్ అధికారి లావాదేవీలన్నీ ఏవిధమైన సందేహానికీ తావివ్వనివి.) 
 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌