• facebook
  • whatsapp
  • telegram

Pencil it in

ఇంగ్లిష్‌లో వివిధ రకాల వ్యక్తీకరణలు తెలుసుకుని, సందర్భోచితంగా వాటిని ఉపయోగిస్తుంటే భాషా సామర్థ్యం మెరుగుపడుతుంది. Pencil it in అనేది ఇలాంటిదే. ఈ expression అర్థం, ఎలా ప్రయోగించాలి.. ఈ విషయాలు చూద్దామా?

Lakshman: You know our Sankar has been promoted officer. He now wields a lot of power over his subordinates. However, he is quite humble and talks to all of us without any pride

(నీకు తెలుసు కదా, మన శంకర్‌కు ఆఫీసర్‌గా పదోన్నతి వచ్చింది. అయితే అతను ఇంకా నిరాడంబరంగానే ఉంటాడు).

Janardhan: That is so. He is quite simple in his attitude and talks to us without any pride (అవును అతనంతే. నిరాడంబరంగా ఉంటాడు, మనతో ఎలాంటి గర్వం లేకుండా మాట్లాడుతాడు).

Lakshman: He is quite bossy in the office and lords it over his subordinates. Outside he is quite simple and does not pose as a superior (అయితే ఆఫీసులో తన కిందివారికి ఆజ్ఞలిస్తూ ఉంటాడు. కానీ బయట మాత్రం అతను చాలా నిగర్వి, గొప్పవాడినని చెప్పుకోడు).

Janardhan: His subordinates often flatter him, but he does not like it. His subordinates are all sycophants and go on praising him. He does not like it of course (అతని కింది ఉద్యోగులు తననెప్పుడూ పొగుడుతూ ఉంటారు, కానీ అతనికి అది నచ్చదు. అయినా వారి స్వార్థం కోసం అతడిని పొగుడుతూనే ఉంటారు).

Lakshman: Very often his subordinates often hold a meeting to know his opinions about them. They pencil it in and he calls for a meeting(తరచుగా అతని కింది ఉద్యోగులు సమావేశాలు పెడుతుంటారు, తమపై అతని అభిప్రాయాలను తెలుసుకోవడానికి. వాళ్లు తాత్కాలికంగా సమావేశాలు పెడుతుంటారు, అతనేమో సమావేశాలు పెడుతుంటాడు).

Janardhan: But very often the meeting gets cancelled and he puts it off to the next day. Even on the next day the meeting is not held and all his subordinates go home without any meeting (కానీ తరచుగా ఆ సమావేశాలు రద్దవుతూ ఉంటాయి. తిరిగి మరుసటి రోజుకి వాయిదా వేసినా, తన కింది ఉద్యోగులు ఒక్కోసారి ఎలాంటి సమావేశం లేకుండానే ఇంటికి వెనుదిరుగుతుంటారు).

Lakshman: That is the only trouble with him. He schedules a meeting and does not hold it. His subordinates think that he cancels the meeting to be held (అదొక్కటే అతనితో చిక్కు. అతను సమావేశం పెడుతుంటాడు, అది రద్దవుతూ ఉంటుంది. అతని కింది ఉద్యోగులకూ అతను సమావేశం రద్దు చేస్తుంటాడని తెలుసు).

Janardhan: That is the trouble with him. He tells his subordinates he holds a meeting, and when the time comes he cancels the meeting (అతనితో అదే చిక్కు. తన కింది ఉద్యోగులతో సమావేశం పెడతానని చెప్పి, చివరి నిమిషంలో దాన్ని రద్దు చేస్తాడు).

Notes: 1. Wield = Use power or influence (తమ శక్తినిగానీ, పలుకుబడినిగానీ వినియోగించడం).

2. bossy = giving people orders ( (కింది వాళ్లకు ఆజ్ఞలు ఇవ్వడం).

3. Lords over = one thinks he is better and more important than others (ఒకరు తాము ఇతరుల కంటే ఎక్కువ అని అనుకోవడం).

4. Flatter = praise for selfish (స్వార్థ ప్రయోజనాలకు ఇతరులను పొగడటం).

Look at the following sentences:

1) His subordinates are all sycophants and go on praising him for their selfish purposes. (అతని కింది ఉద్యోగులందరూ తమ స్వార్థం కోసం ఇతరులను పొగుడుతుండటం).

Swaroop: Raman is quite bossy and does not tolerate his subordinates. He acts ruthlessly towards them (రామన్‌ అధికారం చెలాయించడంలో మేటి. తన కింది ఉద్యోగుల మీద చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటాడు).

Sekhar: However, some of them are sycophants and he easily yields to them. That is his weakness (అయితే వాళ్లలో కొందరు అతనిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం పొగుడుతుంటారు. వాళ్లకతను లొంగిపోతాడు. అది అతని బలహీనత).

2) Pencil it in = provisionally schedule a meeting (తాత్కాలికంగా సమావేశాన్ని పెట్టడం).

Ramana: Our boss often calls for a meeting and in the last minute he cancels it (మన బాస్‌ ఎప్పుడూ సమావేశం పెడుతుంటాడు. కానీ చివరి నిమిషంలో దానిని రద్దు చేస్తాడు).

Lakshmipathi: That is the trouble with him. He pencils it in for a meeting and in the last minute he cancels it(అదే అతనితో చిక్కు. సమావేశం పెడతానని చెప్పి చివరి నిమిషంలో రద్దు చేస్తుంటాడు).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌