• facebook
  • whatsapp
  • telegram

kvs : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు లాటరీ ప్రక్రియ ప్రారంభం  

* అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి

Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya vidyalayas) 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు సోమవారం (ఏప్రిల్ 22) లాటరీ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా తాజాగా అప్లికేషన్‌ స్టేటస్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. లాగిన్‌కోడ్‌తో ఎంటర్‌అయితే అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మూడు కేవీల్లో  లాటరీ నంబర్‌తో పాటు పాఠశాలల వారీగా వెయిటింగ్‌లిస్ట్‌వివరాలను ఇచ్చారు. అది లాటరీ తర్వాత అభ్యర్థి అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారం మాత్రమేనని, పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్ధారణ కాదని పేర్కొంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన తర్వాత కేవీ సంఘటన్‌ నిర్ణయించిన విధివిధానాల ప్రకారం దరఖాస్తుదారుల అడ్మిషన్‌స్టేటస్‌ను సంబంధిత పాఠశాలలు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. తుది జాబితాలు, మరిన్ని వివరాల కోసం పాఠశాలలను సంప్రదించాలని కేవీ సంఘటన్‌పేర్కొంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుందని నిబంధన విధించారు. అప్లికేషన్‌స్టేటస్‌ను తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. చెక్‌ అప్లికేషన్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి, లాగిన్‌ కోడ్‌, పుట్టిన తేదీ వివరాలు, మొబైల్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి మీ అప్లికేషన్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(KVS) ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 
 

CHECK Your KVS Admission application status


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.