• facebook
  • whatsapp
  • telegram

NEET UG Dress Code: నీట్‌ యూజీ పరీక్ష రాస్తున్నారా.. ఈ నిబంధనలు పాటించాల్సిందే!

* మే 5వ తేదీన పరీక్ష

* తెలుగులోనూ ప్రశ్నపత్రం


 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌ (National Eligibility-cum-Entrance Test) యూజీ (NEET UG 2024) మే 5వ తేదీన మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది. అడ్మిట్‌కార్డులను ఇప్పటికే విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష (Examination) వ్యవధి 200 నిమిషాలు (3 గంటల 20 నిమిషాలు). ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఎంబీబీఎస్‌(MBBS), బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు ఇవే...

 ప‌రీక్ష రాసే విద్యార్థులు ప‌రీక్ష స‌మ‌యం కంటే గంట ముందుగా కేంద్రాలకు చేరుకుంటే మంచిది. 

ప‌రీక్ష కేంద్రాన్ని ముందే అడ్మిట్‌కార్డులో సూచించిన చిరునామా ప్రకారం పరిశీలించుకోవాలి. 

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి. 

పరీక్షార్థులు డ్రెస్‌ కోడ్ విధిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోనికి అనుమతించరు. 

స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్‌ వేసుకుంటే మంచిది. 

 పేపర్లు, జామెట్రీ బాక్సులు, ప్లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు పరీక్ష కేంద్రానికి అనుతించరు. 

‣ చేతి గడియారాలు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌, బెల్ట్‌లు, టోపీలు ధరించకూడదు. 

మొబైల్‌ ఫోన్లు, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌ వంటి ఎలక్ట్రానిక్స్‌ పరికరాలకు తీసుకెళ్లకూడదు. 

పరీక్ష రాసేందుకు అవ‌స‌ర‌మైన‌ బాల్‌ పాయింట్‌ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు.


  Click here for NEET UG 2024 Mock Test  


 Download  NEET UG 2024 Admitcard  


 

  NEET  Study Material  
 

Biology
Chemistry
Physics


 

  ♦ NEET Previous Papers  2024  

  ♦  Model Papers 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.