• facebook
  • whatsapp
  • telegram

JNTUH: ఇంజినీరింగ్‌ ‘గుర్తింపు’ ప్రక్రియకు దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల గుర్తింపు ప్రక్రియకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించింది. జేఎన్‌టీయూ పరిధిలో 220 కళాశాలలున్నాయి. వీటిల్లో 141 ఇంజినీరింగ్, 70 ఫార్మసీ, 9 ఎంబీఏ కోర్సులు అందించే కళాశాలలున్నాయి. అక్టోబరు 10 నాటికి దేశవ్యాప్తంగా మొదటి ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)  సూచించింది. దీనికి తగ్గట్టుగా ఆగస్టు 31లోగా కళాశాలలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియను విశ్వవిద్యాలయాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. గుర్తింపునకు జులై 5 నుంచి 18 వరకు కళాశాలలకు దరఖాస్తుకు వీలు కల్పిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ ఆదేశాలు జారీ చేశారు.
ఆ కళాశాలల పరిస్థితేంటి?
జీవో 111 పరిధిలో ఉన్న కళాశాలల విషయంలో ఏటా వివాదం నెలకొంటోంది. ప్రస్తుతం జీవో ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో నం.69 తీసుకువచ్చింది. ఆయా కళాశాలలకు ఊరట లభించనుందని అధికారులు చెబుతున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.