• facebook
  • whatsapp
  • telegram

BDS Seats: బీడీఎస్‌ మిగులు సీట్లకు ఐచ్ఛికాలు

ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న బీడీఎస్‌ మిగులు సీట్లకు స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్‌లో భాగంగా ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. మొదటి రెండు విడతలు, మాప్‌ అప్‌ రౌండులో సీట్లు రాని అభ్యర్థులు దీనికి అర్హులని, అక్టోబరు 27న‌ రాత్రి 9 గంటల్లోపు ఆప్షన్ల కసరత్తు చేసుకోవాలని సూచించింది. యాజమాన్య కోటాలో బీ1 కేటగిరీలో 6, బీ2లో 139, సీ (ఎన్నారై) కేటగిరీలో 136 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. మైనారిటీ నిమ్రా దంత కళాశాలలో బీ కేటగిరీలో 31, సీ కేటగిరీలో 14 సీట్లు ఉన్నాయని తెలిపింది. ఇతర సందేహాలకు 74165 63063, 83338 83934 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్‌షిప్పులు (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.