• facebook
  • whatsapp
  • telegram

Scholarships: భారతీయ విద్యార్థులకు రష్యా స్కాలర్‌షిప్‌లు

చెన్నై: తమ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో చదివే భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు రష్యా ప్రకటించింది. ‘‘రష్యాలో ఉన్నత విద్యను చదవాలనుకునే భారత విద్యార్థులు.. మా యూనివర్సిటీలు అందించే స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని చెన్నైలోని రష్యన్‌ హౌస్‌ న‌వంబ‌రు 15న ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రోగ్రామ్‌ కింద.. 89 ప్రాంతాల్లోని 766 రష్యన్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌, రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని వివరించింది. ఇందుకోసం www.education-in-russia.com వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చని వెల్లడించింది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.