• facebook
  • whatsapp
  • telegram

మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ

* ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత 

* కోడింగ్‌, కొత్త టెక్నాలజీతోనే అవకాశం

ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత ప్రతిభ ఉండి, తగిన కృషి చేస్తే ఆకర్షణీయ అవకాశాలను అందిపుచ్చుకోగలమని నిరూపించింది మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో చదివిన సంహిత. బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ అమ్మాయి.. మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ఏడాదికి రూ.52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఇదెలా సాధ్యమైందో తన మాటల్లోనే.. 

మాది సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఇంటర్‌ పూర్తయ్యాక ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో బీవీఆర్‌ఐటీలో సీఎస్‌ఈ కోర్సులో సీటు దొరికింది. మొదటి నుంచి కెరియర్‌ను దృష్టిలో ఉంచుకునే చదివా. ఇప్పుడు మంచి ప్యాకేజీతో ఉద్యోగం రావడం ఎంతో సంతోషంగా ఉంది. 

ఇంజినీరింగ్‌ మొదటి నుంచే కెరియర్‌ ఎలా ఉండాలనే ఆలోచన ఉండేది. అధ్యాపకుల సహకారంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాను. ఇంజినీరింగ్‌ తొలి సంవత్సరం నుంచే లాజికల్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, కోడింగ్‌ నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాను. రెండో సంవత్సరంలో మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేశాను. దాంతో కంపెనీ నుంచి కాల్‌ వచ్చింది. ఆ తర్వాత దశలవారీగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, కోడింగ్, గ్రూప్‌ డిస్కషన్‌.. ఇలా పలు రౌండ్స్‌ జరిగాయి. ప్రాజెక్టు కూడా ఇచ్చారు. వాటన్నింటిని సమర్థంగా పూర్తి చేయడంతో ఇంటర్న్‌షిప్‌ నిమిత్తం తీసుకున్నారు. రూ.1.25 లక్షల స్టైపెండ్‌తో మూడునెలల పాటు బెంగళూరులో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేశాను. ఆ సమయంలో చూపిన ప్రతిభను గుర్తించి ఇప్పుడీ ఉద్యోగానికి ఎంపిక చేశారు. 

ఇంటర్న్‌షిప్‌లో.. 

క్లౌడ్, అజ్యూర్, డాట్‌నెట్‌ టెక్నాలజీలపై నిర్ణీత సమయంలో మూడు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేశాను. ఆ సమయంలో కంపెనీ వారితో తరచూ సంప్రదిస్తూ అనుమానాలను నివృత్తి చేసుకున్నాను. ఇంటర్న్‌షిప్‌ సమయంలో కళాశాలలో నిర్వహించే పరీక్షలకూ హాజరయ్యాను. మేటి అవకాశాలు పొందడానికి.. విద్యార్థులు లాజికల్‌ థింకింగ్‌ నైపుణ్యం పెంచుకోవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్నెలా పరిష్కరించాలో ఆలోచించగలగాలి. కోడింగ్‌ బాగా నేర్చుకోవాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఏవైనా కొన్ని సర్టిఫికేషన్స్‌ పూర్తిచేయాలి. ఒక కంపెనీకి దరఖాస్తు చేసే ముందు రెజ్యూమెను దానికి ఉపయోగపడే విధంగా మార్చాలి. ఆ తర్వాత దరఖాస్తు చేయడం ద్వారా అధికంగా అవకాశాలుంటాయి. సీ, పైతాన్‌ వంటి వాటిపై సర్టిఫికేషన్‌ కోర్సులు చేయడంతోపాటు నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. ఈమేరకు మా డిపార్ట్‌మెంట్‌ అధిపతి డా. మధుబాబు, ఇతర అధ్యాపకుల సలహాలను పాటించాను. 

ఇంజినీరింగ్‌ పూర్తి కావడానికి నాలుగేళ్ల సమయం ఉంటుంది కాబట్టి ప్రణాళికా     బద్ధంగా అడుగేయాలి. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాన్ని ఎంపిక చేసుకునేవారు ప్రధానంగా కోడింగ్‌పై దృష్టిపెట్టాలి, తర్వాత వారి ఆసక్తిని బట్టి అనుబంధ విభాగాలవైపు వెళ్లవచ్చు. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి. ఇంగ్లిష్‌ మాట్లాడే విషయంలో ఎలాంటి భయాందోళనలూ లేకుండా స్పష్టంగా మాట్లాడాలి. ఇంటర్వ్యూ సమయంలో మన ప్రవర్తనను గమనిస్తుంటారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలనే అవగాహనతో మెలగాలి. అనుమానాల    నివృత్తికి ఎవరిని సంప్రదించాలో గుర్తించాలి. 

కంపెనీ అవసరాలకు అనుగుణంగా.. 

సమస్యా పరిష్కార నైపుణ్యాలతోపాటు, టాస్క్‌లను తక్కువ సమయంలో పరిష్కరించగలిగే సత్తా ఉంటే మంచి ప్యాకేజీ సాధించవచ్చు. డేటా స్ట్రక్చర్స్‌ నేర్చుకోవడం మరింత ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించగలగాలి. సీ ప్లస్‌ ప్లస్, జావా, పైతాన్‌ వంటి వాటిపై కనీస అవగాహన అవసరం. విద్యార్థులు కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలి. కంపెనీ ఏ సాంకేతికతపై ముందుకు వెళుతుందో తెలుసుకుని తదనుగుణంగా అడుగేయాలి. లేదా ఆసక్తి ఉన్న అంశాలను అంతకుముందే తెలుసుకుని ఉంటే వాటిని ఎంచుకోవచ్చు. యూట్యూబ్, గూగుల్‌తో ఇప్పుడు చాలా సులభంగా అన్నీ నేర్చుకునే వీలు కలుగుతోంది. ఇలా సొంతంగా నేర్చుకోవడం ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీల విద్యార్థులకు వచ్చేలాంటి అవకాశాలు అందుకోవచ్చు. 

కొత్త ఆలోచనలతో.. 

మనమున్న రంగంలో కొత్త ఆలోచనలు చేసేందుకు ప్రయత్నించాలి. అవి కార్యరూపం దాల్చేవరకు పట్టువదలకూడదు. కష్టపడాలనే ఆలోచన ఉండాలే కానీ అవకాశాలు వాటంతటవే వస్తాయనడంలో సందేహం లేదు. నేర్చుకునే తపన ఉండాలి. కళాశాలలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకోవాలి. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనాలి, తద్వారా మన ప్రొఫైల్‌ మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది!  

మరింత సమాచారం... మీ కోసం!

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!

‣ ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, 2 గెలుపు వ్యూహం

‣ ఆత్మన్యూనతతో అనర్థాలే!

‣ బ్యాంకులో కోర్సు.. ఆపై కొలువు!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!

‣ రూ.లక్ష జీతంతో నాబార్డులో ఉద్యోగాలు

Posted Date: 27-09-2023

  • Tags :

ఇత‌రాలు

మరిన్ని