ఏదీ వదలొద్దు... రివిజన్ మరవొద్దు!
* సీఎంఏ ఇంటర్ ఆలిండియా టాపర్ ఇరిగెల మహేంద్రరెడ్డి సూచనలు
కామర్స్ కోర్సుల్లో ప్రాచుర్యం పొందిన కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ (సీఎంఏ)లో ఇంటర్ దశ ఎంతో కీలకం. ఇది పూర్తయితే ప్రధాన అవరోధం దాటినట్టే. ఇటీవల విడుదలైన సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు కర్నూలు జిల్లా బత్తులూరుకు చెందిన ఇరిగెల మహేంద్రరెడ్డి. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించటం విశేషం! తన ప్రిపరేషన్ ఎలా సాగిందో, టాప్ ర్యాంకు రావటానికి ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో ‘చదువు’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..