• facebook
  • whatsapp
  • telegram

TS DSC: మెగా డీఎస్సీకి 9,800 పోస్టులు..!

*  గత ఆగస్టులో 5,089 ఖాళీలకే నోటిఫికేషన్‌


ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మెగా డీఎస్సీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తోంది. మూడున్నర నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో ఖాళీలు ఉండగా.. తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలోనే హామీ ఇచ్చింది.  డిసెంబరు15న అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై ప్రసంగంలోనూ వచ్చే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే గత నోటిఫికేషన్‌, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థికశాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు సుమారు 9,800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేశాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జులైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ ఆయా గణాంకాలు సమర్పించింది. అందుకు భిన్నంగా 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. అంటే 4,281 పోస్టులకు  కోత పడింది.


రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 కాగా.. ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో స్కూల్‌ అసిస్టెంట్‌లో 70 శాతం, హెచ్‌ఎం ఖాళీలన్నింటినీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది.

 

గత నోటిఫికేషన్‌ సమయంలోనే పదోన్నతుల ద్వారా 1947 గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, 2162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(పీఎస్‌హెచ్‌ఎం), మరో 5,870 స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు కలిపి మొత్తం 9,979 భర్తీ చేస్తామని సర్కారు స్పష్టంచేసింది. నోటిఫికేషన్‌ పోస్టులతో వీటిని కలిపినా మొత్తం 15,068 అవుతాయి. అంటే 3,975 ఖాళీలకు గండిపడింది.

విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370తో పాటు గత అక్టోబరులో స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన 9,820 ఖాళీలు ఉన్నట్లు.
అనుబంధ నోటిఫికేషన్‌ ఇస్తేనే ముందుకు

గత నోటిఫికేషన్‌కు సుమారు 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల నియమావళి కారణంగా ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్‌ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం(2024-25) ప్రారంభమయ్యే సమయానికి భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు, డీఎస్సీకి ముడిపెడితే నియామకాలు పూర్తికావనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.


డీఎస్సీ తెలంగాణ


స్కూల్ అసిస్టెంట్


తెలుగు (కంటెంట్)

గణితం (కంటెంట్)

సోషల్ స్టడీస్ (కంటెంట్)



సెకండరీ గ్రేడ్ టీచర్స్

సైకాలజీ (కంటెంట్)

గణితం (కంటెంట్)

సైన్స్ (కంటెంట్)


తెలుగు పండిట్

కంటెంట్

మెథడాలజీ


బిట్ బ్యాంక్
 

ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)

బయాలజీ (కంటెంట్)

మరిన్ని వాటి కోసం క్లిక్ చేయండి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.