• facebook
  • whatsapp
  • telegram

Result: ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో 72% ఉత్తీర్ణత

ఈనాడు, అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్‌ పరీక్షల్లో ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత నమోదైంది. ఎనిమిదేళ్ల ఫలితాలతో పోల్చితే ఈసారే ఎక్కువ మంది విద్యార్థులు పాసయ్యారు. రెండు సంవత్సరాలకు కలిపి 8,55,030 మంది పరీక్షలు రాయగా.. 6,17,403 మంది (72%) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 67%, ద్వితీయ సంవత్సరంలో 78% మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ప్రథమ సంవత్సరంలో 61%, రెండో ఏడాదిలో 72% పాసయ్యారు. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ వి.వి.సుబ్బారావుతో కలిసి ఇంటర్‌ మండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఏప్రిల్‌ 12న విడుదల చేశారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.