1. టీటీ మహిళల సింగిల్స్‌లో శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్‌లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ మనిక బత్రాను వెనక్కి నెట్టి భారత నంబర్‌వన్ క్రీడాకారిణిగా నిలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. జకోవిచ్‌కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్‌లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఇస్రో కోసం ఇంటర్‌ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్‌ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. రక్షణ వ్యయంలో భారత్‌ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. పట్నాసాహిబ్ కాంగ్రెస్ అభ్యర్థిగా మీరాకుమార్ తనయుడు
బిహార్‌లోని పట్నాసాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్షుల్ అవిజిత్ పోటీ చేయనున్నారు. బరిలో దిగేందుకు మీరాకుమార్ విముఖత వ్యక్తం చేయడంతో తనయుడికి అధిష్ఠానం అవకాశమిచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.