• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కేంద్ర విద్యుత్‌ సంస్థలో 425 డిప్లొమా ట్రైనీలు

పరీక్ష సన్నద్ధతకు సూచనలు


న్యూదిల్లీలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌  దేశవ్యాప్తంగా ఉన్న  రీజియన్‌/ కార్పొరేట్‌ టెలికాం డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాల్లో 425 డిప్లొమా ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్‌ మొదలైన విభాగాల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో  అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ఈ డిప్లొమా ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే... 70 శాతం మార్కులతో ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌-పవర్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ పవర్‌ సిస్టమ్స్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌/ టెలికమ్యూనికేషన్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులు కావాలి. మొత్తం 425 పోస్టుల్లో... అన్‌రిజర్వుడ్‌కు 214, ఓబీసీలకు 82, ఈడబ్ల్యూఎస్‌లకు 38, ఎస్సీలకు 67, ఎస్టీలకు 24 ఉన్నాయి. 

23.09.2023 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.300. 

విద్యార్హతలు, అప్‌లోడ్‌ చేసిన డాంక్యుమెంట్ల ఆధారంగా అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపికచేస్తారు. 

రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రంలో పార్ట్‌-1, పార్ట్‌-2 ఉంటాయి. 

‣ పార్ట్‌-1లో టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (టీకేటీ) ఉంటుంది. దీంట్లో సంబంధిత విభాగానికి చెందిన 120 ప్రశ్నలు ఉంటాయి. 

పార్ట్‌-2లో సూపర్‌వైజరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ) ఉంటుంది. దీంట్లో ఒకాబ్యులరీ, వెర్బల్‌ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ, డేటా సఫిషియెన్సీ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్, న్యూమరికల్‌ ఎబిలిటీలకు సంబంధించిన 50 ప్రశ్నలు ఉంటాయి.  

ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కును తగ్గిస్తారు. 

యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ప్రతి పార్ట్‌లోనూ 30 శాతం, సగటున 40 శాతం మార్కులు సాధించాలి. 

ఇతర కేటగిరీలకు చెందిన రిజర్వుడ్‌ అభ్యర్థులు ప్రతి పార్ట్‌లోనూ 25 శాతం, సగటున 30 శాతం మార్కులు సాధించాలి. 

రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి.. వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 

ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.27,500 స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు గ్రేడ్‌-4 జూనియర్‌ ఇంజినీర్‌గా రూ.25,000 - రూ.1,17,500 వరకూ వేతనం ఉంటుంది. మూల వేతనంతో పాటుగా డీఏ ఇతర సదుపాయాలూ లభిస్తాయి. 


ఎలా తయారవ్వాలి?

పార్ట్‌-1లో టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (టీకేటీ)లో సంబంధిత సబ్జెక్టుల నుంచి 120 ప్రశ్నలు అడుగుతారు. గతంలో చదివిన సబ్జెక్టులే కాబట్టి వీటి మీద గట్టి పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులను సంపాదించొచ్చు. 

 సబ్జెక్టులకు సంబంధించిన ముఖ్యాంశాలను నోట్‌ పుస్తకంలో రాసుకుని వాటిని పునశ్చరణ చేసుకుంటే సమయం వృథా కాదు. 

 పార్ట్‌-2లోని ఒకాబ్యులరీ, వెర్బల్‌ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ, డేటా సఫిషియెన్సీ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్, న్యూమరికల్‌ ఎబిలిటీల కోసం వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను చదవొచ్చు. 

 బ్యాంకు, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీల.. పాత ప్రశ్న పత్రాల సాధన వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 

 ఆన్‌లైన్‌ టెస్ట్‌లు రాయడం ద్వారా సన్నద్ధతను మెరుగుపరుచుకోవచ్చు. సమాధానాలను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ః  వ్యవధి లోపల సరైన సమాధానాలను గుర్తించడమూ ముఖ్యమే. సమయాన్ని నిర్దేశించుకుని పరీక్ష రాస్తే.. గడువులోగా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయగలుగుతున్నారో లేదో తెలుస్తుంది.  

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం

దరఖాస్తుకు చివరి తేదీ: 23.09.2023

వెబ్‌సైట్‌: http://www.powergrid.in


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

‣ కోర్సుల్లో ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇలా!

‣ దూరవిద్యలో వైవిధ్య కోర్సులెన్నో!

‣ ఒత్తిడిని ఓడించేద్దాం..!

Posted Date : 07-09-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.