• facebook
  • whatsapp
  • telegram

దూరవిద్యలో వైవిధ్య కోర్సులెన్నో!

వివిధ వర్సిటీల్లో దరఖాస్తుల ఆహ్వానం



నేరుగా కాలేజీకి వెళ్లి చదవడం అందరికీ వీలు కాకపోవచ్చు. అలాగే కోరుకున్న కోర్సు దగ్గరలోని విద్యాసంస్థల్లో అందుబాటులో లేకపోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక నేపథ్యం, అనారోగ్యం.. ఇలా ఏదైనా కారణంతో చదువులు ఆపేయాల్సిన పరిస్థితి రావచ్చు. వీరంతా దూరవిద్యను వేదికగా చేసుకుని సత్తా చాటవచ్చు. వివిధ విశ్వవిద్యాలయాలు వైవిధ్యమైన కోర్సులను ఈ విభాగంలో అందిస్తున్నాయి. ఇటీవలే ఎన్నో సంస్థలు ప్రకటనలూ విడుదలచేశాయి. అర్హతలు, ఆసక్తి, అభిరుచి ప్రకారం మీకు సరైనది ఎంచుకోవచ్చు.


మన దేశంలో దూరవిద్యకు తల్లి లాంటిది.. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో). కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇదొకటి. ఈ సంస్థ న్యాక్‌ ఏ++ గ్రేడ్‌తో ఓపెన్‌ యూనివర్సిటీల్లో మేటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ సర్టిఫికెట్, డిప్లొమా, యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికెట్‌ విభాగాల్లో ఎన్నో కోర్సులు ఉన్నాయి. సాధారణ చదువులతోపాటు స్వయం ఉపాధి దిశగా అడుగులేసేలా రూపొందించిన కోర్సులు, వృత్తిలో రాణించడానికి తోడ్పడేవి, ఆసక్తి ఉన్నవారికి పరిజ్ఞానం పెంచేవి, అతి తక్కువ విద్యార్హతలతో రూపొందినవీ.. ఇలా వైవిధ్యమైన కోర్సులు ఉన్నాయి. అలాగే తెలుగు మాధ్యమంలోనూ కొన్ని కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. 


సరికొత్తగా..

బీబీఏ (జనరల్‌), బీఏ (జర్నలిజం అండ్‌ డిజిటల్‌ మీడియా), ఎమ్మెస్సీ: జాగ్రఫీ, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్, జియోఇన్ఫర్మాటిక్స్‌. పీజీ డిప్లొమా: పాపులేషన్‌ అండ్‌ ఫ్యామిలీ హెల్త్‌ స్టడీస్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌. డిప్లొమా: అప్లైడ్‌ మర్చండైజింగ్‌ కోర్సులను ఈ ఏడాది జులై సెషన్‌ నుంచి ప్రారంభించారు.


తక్కువ మొత్తంలో ఫీజు, నాణ్యమైన స్టడీ మెటీరియల్, అందుబాటులో స్టడీ సెంటర్లు, ఆన్‌లైన్‌లో అభ్యసనకు వీలు, కాంటాక్ట్‌ తరగతులు, సర్టిఫికెట్‌కు గుర్తింపు, ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా విస్తృత సంఖ్యలో కోర్సులు.. ఇగ్నో ప్రత్యేకతలు. ఇందులో ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, సోషల్‌ సైన్సెస్, మెడిసిన్, న్యూట్రిషన్, నర్సింగ్, అగ్రికల్చర్, లా.. ఇలా భిన్న కోర్సులు ఉన్నాయి. పౌల్ట్రీ, డెయిరీ ఫార్మింగ్‌ తెలుగులోనూ అందిస్తున్నారు. 


విస్తృత స్థాయిలో..

ఎంకాం, ఎంబీఏ (పలు స్పెషలైజేషన్లు),  ఎంఎల్‌ఐఎస్సీ, ఎంసీఏ.


ఎంఏ: ఉర్దూ, పొలిటికల్‌ సైన్స్, హిస్టరీ, సోషియాలజీ, సైకాలజీ, ఎకనామిక్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రొపాలజీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, రూరల్‌ డెవలప్‌మెంట్, సోషల్‌ వర్క్, సోషల్‌ వర్క్‌ (కౌన్సెలింగ్‌), ఎడ్యుకేషన్, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, ఫిలాసఫీ, ఫోక్‌లర్‌ అండ్‌ కల్చర్‌ స్టడీస్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్, సస్టయినబిలిటీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, డెవలప్‌మెంట్‌ స్టడీస్, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, అర్బన్‌ స్టడీస్, విమెన్‌ అండ్‌ జండర్‌ స్టడీస్, జండర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, జర్నలిజం అండ్‌ డిజిటల్‌ మీడియా, జర్నలిజం అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, డెవలప్‌మెంట్‌ జర్నలిజం, అరబిక్, రష్యన్‌.


ఎమ్మెస్సీ: ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, మ్యాథమెటిక్స్‌ విత్‌ అప్లికేషన్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్, రెన్యూవబుల్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌.


యూజీ: బీఏ, బీకాం, బీబీఏ (రిటైల్‌ మేనేజ్‌మెంట్‌), బీఎస్సీ, బీసీఏ, బీఎల్‌ఐఎస్సీ, బీఏ టూరిజం స్టడీస్, బీఎస్‌డబ్ల్యూ, బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌ (టూరిజం మేనేజ్‌మెంట్‌), బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌ (మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) 


పీజీ డిప్లొమా: రూరల్‌ డెవలప్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ అండ్‌ ఫౌండేషనల్‌ స్టేజ్‌ ఎడ్యుకేషన్, ట్రాన్స్‌లేషన్, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఆపరేషన్స్, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, జియో ఇన్ఫర్మాటిక్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, మెంటల్‌ హెల్త్, లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, హయ్యర్‌ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, స్కూల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అడల్ట్‌ ఎడ్యుకేషన్, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, డెవలప్‌మెంట్‌ స్టడీస్, యానిమల్‌ వెల్ఫేర్, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, ఆడియో ప్రోగ్రాం ప్రొడక్షన్, డిజిటల్‌ మీడియా, డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్, అగ్రి బిజినెస్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఫార్మాస్యూటికల్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్, క్రిమినల్‌ జస్టిస్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్, ఫోక్‌లర్‌ అండ్‌ కల్చరల్‌ స్టడీస్, సస్టెయినబిలిటీ సైన్స్, మైగ్రేషన్‌ అండ్‌ డయాస్పరా, ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లా, విమెన్స్‌ అండ్‌ జండర్‌ స్టడీస్, బుక్‌ పబ్లిషింగ్, రైటింగ్స్‌ ఫ్రం ఇండియా, బ్రిటిష్‌ లిటరేచర్, ది నావెల్, రైటింగ్స్‌ ఫ్రమ్‌ ది మార్జిన్స్, అమెరికన్‌ లిటరేచర్, న్యూ లిటరేచర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్, సోషల్‌ వర్క్‌ కౌన్సెలింగ్, హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్, జెరియాట్రిక్‌ మెడిసిన్, మెటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్, హెచ్‌ఐవీ మెడిసిన్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌.


పీజీ సర్టిఫికెట్‌: సైబర్‌ లా, పేటెంట్‌ ప్రాక్టీస్, క్లైమెట్‌ చేంజ్, జియో ఇన్ఫర్మాటిక్స్, పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, ఇన్వెంటరీ ప్లానింగ్‌ అండ్‌ వేర్‌హౌసింగ్‌ ఫర్‌ ఇంజినీర్స్, అగ్రికల్చర్‌ పాలసీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, అడల్ట్‌ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ అసెస్టివ్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ ది ఇన్‌స్ట్రక్టర్స్‌ ఆఫ్‌ విజువల్లీ ఇంపైర్డ్‌.


డిప్లొమా: ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్, పంచాయత్‌ లెవల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, టూరిజం స్టడీస్, క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్, ఉర్దూ లాంగ్వేజ్, వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రం ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్, డెయిరీ టెక్నాలజీ, మీట్‌ టెక్నాలజీ, వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్, హార్టీకల్చర్, విమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, బీపీవో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, మోడర్న్‌ ఆఫీస్‌ ప్రాక్టీస్, పారా లీగల్‌ ప్రాక్టీస్, ఆక్వాకల్చర్, రిటైలింగ్, టీచింగ్‌ జర్మన్‌ యాజ్‌ ఫారిన్‌ లాంగ్వేజ్, నర్సింగ్‌ అడ్మినిస్ట్రేషన్, క్రిటికల్‌ కేర్‌ నర్సింగ్, థియేటర్‌ ఆర్ట్స్, వాల్యూ ఎడ్యుకేషన్, స్మార్ట్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌.


సర్టిఫికెట్‌: లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, లైఫ్‌ అండ్‌ థాట్‌ ఆఫ్‌ డా.బీఆర్‌ అంబేడ్కర్, పీస్‌ స్టడీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌ కేర్, రూరల్‌ డెవలప్‌మెంట్, అపారల్‌ మర్చండైజింగ్, గైడెన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్, టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఎ సెకండ్‌ లాంగ్వేజ్, ఫంక్షనల్‌ ఇంగ్లిష్, ఉర్దూ లాంగ్వేజ్, బిజినెస్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఫ్యాషన్‌ డిజైన్, సెరీ కల్చర్, ట్రైబల్‌ స్టడీస్, ఆర్గానిక్‌ ఫార్మింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్, బీ కీపింగ్, విదేశీ భాషలు, ఫస్ట్‌ ఎయిడ్, యోగ, హెల్త్‌కేర్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్, థియేటర్‌ ఆర్ట్స్‌.. ఇలా ఎన్నో కోర్సులు. 


ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మార్కెటింగ్‌ నిపుణులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు, టూర్‌ ప్లానర్లు, అకౌంటెంట్లు.. అన్ని వృత్తులు, రంగాలకు ఉపయోగపడే కోర్సులు లభిస్తున్నాయి. కొన్ని కోర్సులను ఆన్‌లైన్‌లోనూ ఇగ్నో  అందిస్తోంది. జ్ఞాన్‌ దర్శన్‌ టీవీ ఛానెల్‌లో అన్ని కోర్సుల పాఠాలూ వీక్షించవచ్చు. దూరదర్శన్, ఎయిర్‌టెల్, టాటా స్కై, సన్‌ డైరెక్ట్, డిష్‌టీవీ, హాథ్‌వే.. ఇలా పలు ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించే సౌకర్యం ఉంది. 


స్వయం ఉపాధికి..

డెయిరీ ఫార్మింగ్‌ అవేర్‌నెస్‌ కోర్సును తెలుగు మాధ్యమంలో అందిస్తున్నారు. పాడిపరిశ్రమపై ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరవచ్చు. జంతువుల పెంపకం, రోగాల బారినుంచి వాటిని సంరక్షించడం, పాల దిగుబడి పెంచడం, దాణా ఎంచుకోవడం.. తదితరాలు ఇందులో నేర్పుతారు. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి విద్యార్హతలూ అవసరం లేదు. చదవడం, రాయడం వస్తే చాలు. కోర్సు వ్యవధి 2 నెలలు. ఫీజు రూ.1100. డెయిరీ టెక్నాలజీ కోర్సు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో తెలుగు మాధ్యమంలోనూ అందిస్తున్నారు. వ్యవధి ఏడాది. కోర్సు ఫీజు రూ.15,200. పౌల్ట్రీ ఫార్మింగ్‌ కోర్సు వ్యవధి 6 నెలలు. ఫీజు రూ.3600. ఎనిమిదో తరగతి విద్యార్హతతో చేరవచ్చు. ఇదే విద్యార్హతతో తేనె తయారీ కోసం బీ కీపింగ్‌ కోర్సు ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. 6 నెలల వ్యవధి గల ఈ కోర్సు ఫీజు రూ.1400.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 31

వెబ్‌సైట్‌: http://ignou.ac.in/


ఆంధ్రా యూనివర్సిటీ

ఈ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పీజీ: ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, ఎమ్మెస్సీ(సైకాలజీ), ఎంఏ- హెచ్‌ఆర్‌ఎం/ ఎకానిమిక్స్‌/ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌/ ఇంగ్లిష్‌/ పొలిటికల్‌ సైన్స్‌/ సోషియాలజీ

యూజీ: బీఏ(హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్‌), బీకాం, బీకాం(అకౌంటెన్సీ)

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 31

వెబ్‌సైట్‌: https://www.andhrauniversity.edu.in/


పాండిచ్చేరి యూనివర్సిటీ

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన పాండిచ్చేరి యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి పలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

యూజీ: బీకాం, బీబీఏ, బీఏ- హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, పొలిటికల్‌ సైన్స్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌

పీజీ: ఎంకాం, ఎంఏ- ఇంగ్లిష్, సోషియాలజీ, హిందీ. ఎంబీఏ- మార్కెటింగ్, ఫైనాన్స్, ఇంటర్నేషనల్‌ బిజినెస్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, జనరల్, టూరిజం, ఆపరేషన్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌. 

ఈ సంస్థకు పర్సనల్‌ కాంటాక్ట్‌ ప్రోగ్రాం సెంటర్లు తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, విజయవాడల్లో ఉన్నాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 31

వెబ్‌సైట్‌: https://dde.pondiuni.edu.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ పేద విద్యార్థులకు ఉచితంగా అమెరికా విద్య!

‣ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌లో 153 కొలువుల భర్తీ

‣ ఇవి పాటిస్తే.. భవిష్యత్తు మీదే! ‣ బీడీఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

‣ ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్'

Posted Date: 30-08-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌