• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌ అలా సాధించారు!

నెలకు రూ.లక్ష స్టైఫండ్‌

ఇంటర్న్‌షిప్‌లు ఉద్యోగ సాధనకు సోపానాలుగా ఉపయోగపడతాయి. నెలకు లక్ష రూపాయిల స్టైపెండ్‌ అందించటం అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రత్యేకత. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ప్రదర్శించి ఇటీవల దీనికి ఎంపికయ్యారు దనీషా, పూజిత. కేఎల్‌ డీమ్డ్‌ టుబీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఈ ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులూ ఇందుకు తామెలా కృషి చేసిందీ చెపుతున్నారిలా...

కోడింగే కీలకం

బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాను. అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులే అర్హులు. దీనికి ఆన్‌ క్యాంపస్‌లో దరఖాస్తు చేయడానికే అవకాశం ఉంటుంది. మమ్మల్ని యూనివర్సిటీవారే గూగుల్‌ ఫామ్స్‌ నింపమన్నారు. దాంట్లో మా ఈమెయిల్‌ వివరాలు అన్నీ ఇచ్చాం. ఆ తర్వాత మా పర్సనల్‌ మెయిల్‌కు లింక్‌ వచ్చింది. ఈ లింక్‌ అనేది అందరికీ ఒకటే ఉండదు. ఎవరికివారికి ప్రత్యేకమైన లింక్స్‌ ఇచ్చారు. దాంట్లో ఆన్‌లైన్‌ పరీక్ష రాశాను. 

ఫలితం అనేది.. పూర్తిగా కోడింగ్‌ ప్రాక్టీస్‌ మీదే ఆధారపడి ఉంటుంది. రోజూ కనీసం రెండు గంటలు, ఒక్కోసారి నాలుగైదు గంటలపాటు సాధన చేసేదాన్ని. కొన్నిసార్లు రాత్రిళ్లు కూర్చుంటే అలా తెల్లవారిపోయేది కూడా. కోడింగ్‌ రాయడం అంటే నాకు అంత ఇష్టం. తర్వాత ఇంటర్వ్యూలోనూ నెగ్గి ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యాను.  

ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. జూన్‌లో మొదలవుతుంది. కాలవ్యవధి పది వారాలు. నెలకు రూ.లక్ష స్టైపెండ్‌ వస్తుంది. పని తీరు నచ్చితే ఉద్యోగావకాశమూ ఇస్తారు. అప్పుడు ఏడాదికి రూ.44 లక్షల వార్షిక వేతనం లభించే అవకాశం ఉంది. ఖాళీ సమయం దొరికితే నవలలు చదువుతాను. టీవీ కూడా చూస్తుంటాను. - దనీషా కర్రి

మాక్‌ ఇంటర్వ్యూలు  ఉపయోగపడ్డాయి

అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన సమాచారం మా యూనివర్సిటీ ద్వారానే తెలిసింది. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం నుంచీ ఆన్‌లైన్‌లో కోడింగ్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్ని. కోడింగ్‌కు చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో ప్రాక్టీస్‌ చేయడం ఇలాంటి పరీక్షల్లో ఎంపికవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. 

అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌లో సెలక్టు కావడానికి రెండు రౌండ్స్‌ ఉన్నాయి. మొదటి రౌండ్‌లో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. అందులో కంప్యూటర్‌ ఫండమెంటల్స్, ఆప్టిట్యూడ్, కోడింగ్, గమిఫీడ్‌ సెక్షన్లు ఉన్నాయి. పరీక్ష వ్యవధి 108 నిమిషాలు. రోజూ రెండు గంటలు తక్కువ కాకుండా.. నాలుగైదు గంటలపాటు కోడింగ్‌ సాధన చేసేదాన్ని. లింక్డ్‌ఇన్‌ వెబ్‌సైట్‌ చూడటం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ రౌండ్‌లో నెగ్గి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాను. ఈ సందర్భంగా సీనియర్లను అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాను. వాళ్లతో మాక్‌ ఇంటర్వ్యూలు కండక్ట్‌ చేయించుకునేదాన్ని. దాంతో ఇంటర్వ్యూ అంటే సహజంగా ఉండే బెరుకు పోయింది. ఇంటర్వ్యూ 50 నిమిషాలపాటు జరిగింది. దానిలో నన్ను కోడింగ్, ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన అంశాలు అడిగారు. 

ఆ తర్వాత ఎనిమిది రోజులకు సెలక్షన్‌ మెయిల్‌ వచ్చింది. ఈ ఇంటర్న్‌షిప్‌ వ్యవధి 10 వారాలు. పనితీరు నచ్చి.. సంస్థలో ఖాళీలుంటే.. పూర్తిస్థాయి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఖాళీ సమయంలో పజిల్స్‌ పూర్తిచేస్తాను, షటిల్‌ ఆడుతుంటాను. ఈ రెండు అలవాట్లూ నన్ను ఎప్పుడూ చురుగ్గా ఉంచుతాయి. - పూజిత రావూరి
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏఈ పరీక్ష తుది సన్నద్ధత ఎలా?

‣ సర్కారు కొలువుకు సిద్ధమయ్యే ముందు..!

‣ నేర్పుగా... ఓర్పుగా!

‣ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకు ప్రారంభించండి ప్రిపరేషన్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2022 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం