• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆయుర్వేద సంస్థలో పారా మెడికల్‌ ఉద్యోగాలు

140 ఖాళీలకు నోటిఫికేషన్‌



న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ) స్టాఫ్‌నర్స్, ఫార్మసిస్ట్, స్టాఫ్‌ సర్జన్, జూనియర్‌ స్టాఫ్‌ సర్జన్, మెడికల్‌ ఆఫీసర్, ల్యాబ్‌ అటెండెంట్‌.. మొదలైన 140 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్, డిప్యుటేషన్‌ ప్రాతిపదికన భర్తీచేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 


మొత్తం 56 రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిప్యుటేషన్‌పైన తీసుకోవడానికి అభ్యర్థులు అందుబాటులో లేకపోతే.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. 


1. స్టాఫ్‌నర్స్‌: 40 ఖాళీలు. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌-18, ఓబీసీ-10, ఎస్సీ-05, ఎస్సీ-03, ఈడబ్ల్యూఎస్‌-04 ఉన్నాయి. నర్సింగ్‌లో బీఎస్సీ (ఆనర్స్‌)/ బీఎస్సీ నర్సింగ్‌ రెగ్యులర్‌ కోర్సు (4 ఏళ్లు)/ 2 ఏళ్ల పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ పాసవ్వాలి. 

రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. 

బీఎస్సీ నర్సింగ్‌ (ఆయుర్వేద) పూర్తిచేసినట్లయితే.. రాష్ట్ర ఆయుర్వేద నర్సింగ్‌ కౌన్సిల్‌/ బోర్డ్‌/ యూనివర్సిటీలో రిజిస్టరై ఉండాలి. లేదా 

జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీలో డిప్లొమా పూర్తిచేయాలి. 

రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. 

100 పడకల ఆసుపత్రిలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా 

ఆయుర్వేద నర్సింగ్‌ అండ్‌ ఫార్మసీలో రెండున్నరేళ్ల రెగ్యులర్‌ డిప్లొమా కోర్సు పూర్తిచేయాలి. రాష్ట్ర ఆయుర్వేద నర్సింగ్‌ కౌన్సిల్‌/ బోర్డ్‌/ యూనివర్సిటీలో రిజిస్టరై ఉండాలి. 

100 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 

పేరొందిన ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేసిన వారికీ, కంప్యూటర్‌ వినియోగం తెలిసుండి.. ఆఫీస్‌ అప్లికేషన్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్లలో అనుభవం ఉన్నవారికీ ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. 


2. పంచకర్మ టెక్నీషియన్‌: 15 ఖాళీలు. 10 పోస్టులను రెగ్యులర్‌గా, 5 పోస్టులను డిప్యుటేషన్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. పంచకర్మలో ఏడాది వ్యవధి ఉన్న డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలి. ఆయుర్వేద ఆసుపత్రిలో 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.  


3. ఫార్మసిస్ట్‌: 12 ఖాళీలు. బీఫార్మా (ఆయుర్వేద) పూర్తిచేయాలి. లేదా ఆయుర్వేదిక్‌ ఫార్మసీ డిప్లొమా పూర్తిచేసి రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి/ 100 పడకల ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం ఉండాలి. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. గరిష్ఠ వయసు 27           సంవత్సరాలు. 


4. పంచకర్మ థెరపిస్ట్‌: 5 ఖాళీలు. పంచకర్మలో ఏడాది వ్యవధి ఉన్న డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలి. గుర్తింపు పొందిన ఆయుర్వేద ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు.


5. ల్యాబ్‌ అటెండెంట్‌: 4 ఖాళీలు. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో రెండేళ్ల రెగ్యులర్‌ డిప్లొమా పూర్తిచేయాలి/ బయాలజీ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. వయసు 28 ఏళ్లు మించకూడదు. 


ఇవే కాకుండా.. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, రిసెర్చ్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఫిజియోథెరపిస్ట్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, అసిస్టెంట్‌ స్టోర్‌ ఆఫీసర్, కంప్యూటర్‌ ప్రోగ్రామర్, స్టోర్‌ ఆఫీసర్, లైబ్రేరియన్, జూనియర్‌ ఇంజినీర్‌- సివిల్, బయో మెడికల్, స్టోర్‌కీపర్‌.. మొదలైన హోదాల్లో 64 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.  


దరఖాస్తు  రుసుము ఎంత?

జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250. దివ్యాంగులకు, డిప్యుటేషన్‌ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఫీజు లేదు. ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే.. ప్రతి పోస్టుకూ వేర్వేరుగా ఫీజు చెల్లించాలి. 

గరిష్ఠ వయసులో.. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు కేటగిరీని బట్టి 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. 


ఎంపిక ఇలా..

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం, సిలబస్‌ కోసం ఏఐఐఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

కొన్ని పోస్టులకు అవసరమైతే కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష/ ఆఫ్‌లైన్‌ పరీక్షను దిల్లీలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఇతర ప్రదేశాల్లోనూ నిర్వహించే అవకాశం ఉంటుంది. 

ఇంటర్వ్యూకు హాజరయ్యే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులను చెల్లిస్తారు. 


దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2024.


వెబ్‌సైట్‌: https://aiia.gov.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-01-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌