• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎయిమ్స్‌ భోపాల్‌లో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు

నవంబర్‌ 20 దరఖాస్తుకు గడువు



భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) 357 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 


కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), స్కిల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సీబీటీలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు ఎంపికచేస్తారు. అవసరమైన వారికి మాత్రమే స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఈ టెస్ట్‌ తేదీ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీ, వివరాలను ఎయిమ్స్‌ భోపాల్‌ వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటిస్తారు.  


ఏయే ఉద్యోగాలు?

హాస్పిటల్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-3 (నర్సింగ్‌ ఆర్డర్లీ) - 106 

ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌ 2 - 41 

మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌ - 38 

ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2 - 27

వైర్‌మేన్‌ - 20 

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌ 2 - 18

ప్లంబర్‌ - 15 

ఆర్టిస్ట్‌- 14 

క్యాషియర్‌ - 13

ఆపరేటర్‌/ లిఫ్ట్‌ ఆపరేటర్‌ - 12 

జూనియర్‌ మెడికల్‌ రికార్డ్‌ ఆఫీసర్‌ (రిసెప్షనిస్ట్స్‌) - 05 

మ్యానిఫోల్డ్‌ టెక్నీషియన్‌ (గ్యాస్‌ స్టివార్డ్‌/ గ్యాస్‌ కీపర్‌) - 06 

ఎలక్ట్రీషియన్‌ - 06 

మెకానిక్‌ - 06 

డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ 2 - 05 

అసిస్టెంట్‌ లాండ్రీ సూపర్‌వైజర్‌ - 04 

డిస్పెన్సింగ్‌ అటెండెంట్స్‌ - 04 

మెకానిక్‌ (ఈ అండ్‌ ఎం) - 04 

లైబ్రరీ అటెండెంట్‌ గ్రేడ్‌ 2 - 03 

గ్యాస్‌/పంప్‌ మెకానిక్‌ - 02 

లైన్‌మెన్‌(ఎలక్ట్రికల్‌) - 02 

టైలర్‌ గ్రేడ్‌ 3 - 02 

ల్యాబ్‌ టెక్నీషియన్‌ - 01 

ఫార్మా కెమిస్ట్‌/ కెమికల్‌ ఎగ్జామినర్‌ - 01

కోడింగ్‌ క్లర్క్‌ - 01 

మ్యానిఫోల్డ్‌ రూమ్‌ అటెండెంట్‌ - 01

మొత్తం పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 177, ఓబీసీలకు 89, ఎస్సీలకు 42, ఎస్టీలకు 20, ఈడబ్ల్యూఎస్‌లకు 29 కేటాయించారు. 

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. 


అర్హతలు 

హాస్పిటల్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-3 (నర్సింగ్‌ ఆర్డర్లీ): మెట్రిక్యులేషన్‌ పాసై హాస్పిటల్‌ సర్వీసెస్‌లో సర్టిఫికెట్‌ కోర్సు చేయాలి. వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. 

ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-2: సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ పాసవడంతోపాటు.. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో డిప్లొమా చేయాలి. వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. హాస్పిటల్‌లో రెండేళ్లు పనిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. 

మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌: బీఎస్సీ (మెడికల్‌ రికార్డ్స్‌) పాసై కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. ఆఫీస్‌ అప్లికేషన్స్, స్ప్రెడ్‌షీట్స్, ప్రజెంటేషన్స్‌లో అనుభవం ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైప్‌ చేయగలగాలి. లేదా సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ పాసై, మెడికల్‌ రికార్డ్‌ కీపింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్స్‌ చేయాలి. రెండేళ్లు హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2: ఫార్మసీ డిప్లొమా చేసి, రిజిస్టర్డ్‌ ఫార్మసిస్ట్‌ అయివుండాలి. ఫ్లూయిడ్‌ తయారీ/ స్టోరేజ్‌/ టెస్టింగ్‌లో హాస్పిటల్‌ లేదా పరిశ్రమలో పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2: ఇంటర్మీడియట్, ఏడాది వ్యవధిగల హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కోర్సు పాసవ్వాలి. 200 పడకల హాస్పిటల్‌లో నాలుగేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

గరిష్ఠ వయసులో.. ఓబీసీ - ఎన్‌సీఎల్‌కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల సడలింపు ఉంటుంది. 


కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌

మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రంలో పార్ట్‌-ఎ 25 మార్కులకు, పార్ట్‌-బి 75 మార్కులకు ఉంటాయి. రెండు పార్టుల్లోనూ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలే ఉంటాయి. ఉద్యోగాన్ని అనుసరించి సిలబస్‌ వేర్వేరుగా ఉంటుంది. పోస్టులవారీగా సిలబస్‌ వివరాలు వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులో ఉంచుతారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు తగ్గిస్తారు. టెస్ట్‌ సెంటర్లను అడ్మిట్‌కార్డ్‌లో తెలియజేస్తారు. సీబీటీకి ముందు దీన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, పోస్టులో పంపరు. సీబీటీలో చూపిన ప్రతిభ ఆధారంగా కేటగిరీవారిగా అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు. 


గమనించాల్సినవి..

ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టుల ప్రాధమ్యాన్ని దరఖాస్తులో తెలియజేయాలి. ప్రతిపోస్టుకూ వేర్వేరుగా దరఖాస్తు ఫీజును చెల్లించాలి. 

పరీక్ష తేదీ, ఇతర సమాచారాన్ని అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న ఈమెయిల్‌ ఐడీకి తెలియజేస్తారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2023

వెబ్‌సైట్‌: https://www.aiimsbhopal.edu.in/


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనలకు.. సీఎస్‌ఐఆర్‌ నెట్‌

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ ఏఐ టూల్‌తో రెజ్యూమె రెడీ!

‣ డిగ్రీతో క్లర్క్‌ కొలువుల భర్తీ

Posted Date : 07-11-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌