• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

* కొత్త కెరియర్‌కు సూచనలు

నేడు సమస్తం డిజిటల్‌మయం. ఈ ఆధునిక ప్రపంచంలో వ్యాపారాలను విస్తరించాలన్నా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విపణిలో కొనసాగాలన్నా డిజిటల్‌గా ఎలా రాణించాలో సరైన వ్యూహాలు అవసరం. అందుకే ఇదో కొత్త కెరియర్‌ మార్గంగా ప్రస్తుతం రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే ఉన్నత స్థాయి సంస్థల్లో డిజిటల్‌ స్ట్రాటజిస్టులు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు.


వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా, ఎస్‌ఈవో కంటెంట్, డిజిటల్‌ మార్కెటింగ్‌.. ఇలా అనేక ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తున్నాయంటే.. వాటి వెనుక బలమైన డిజిటల్‌ వ్యూహం ఉండటం వల్లనే. ఇది అభివృద్ధి మార్గాలను అన్వేషించడమే కాకుండా కొత్త పద్ధతులను కనిపెడుతుంది. మారుతున్న పరిస్థితులు, మార్కెట్‌ అవసరాలకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు యాజమాన్యాలకు సహకరిస్తుంది. డిజిటల్‌ టూల్స్‌ను ఉపయోగించి మార్కెటింగ్‌ కంటెంట్‌ను తయారుచేసి బ్రాండ్‌ విలువ పెంచడం ఈ వ్యూహకర్తల ప్రధాన విధి. సంస్థ ఉత్పత్తిని ప్రజల్లోకి డిజిటల్‌ బాటలో బలంగా తీసుకెళ్లడం కోసం వీరు పనిచేస్తారు.


ఏం చేస్తారు?


డిజిటల్‌ వ్యూహకర్తలు కొత్త సైట్ల తయారీ గురించి ఆలోచించడంతోపాటు వినియోగదారుడికి కావాల్సిన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అవసరమైన కంటెంట్‌ను రూపొందిస్తారు. వీరు డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. ఈ రెండు కెరియర్లకూ దగ్గరి పోలికలు ఉన్నా దేనికవే విభిన్నంగా ఉంటాయి. డెవలపర్లు, బిజినెస్‌ అనలిస్టులు, మార్కెటింగ్‌ అనలిస్టులు, అవసరాన్ని బట్టి ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తారు. మార్కెటింగ్‌ ఏజెన్సీలు, కార్పొరేషన్లు, స్టార్టప్స్‌... టెక్‌ సంస్థ నుంచి రిటైల్‌ కంపెనీల వరకూ అన్నింటిలోనూ వీరు వివిధ స్థాయుల్లో పనిచేయవచ్చు. 


( ఉద్యోగ సంస్థ, వారు నిర్వహించే ప్రాజెక్టులను బట్టి వీరి పనితీరు మారుతూ ఉంటుంది. చిన్న బృందాల్లో పని చేస్తున్నప్పుడు వ్యూహాలు రచించడంతోపాటు ఇతర టాస్క్‌లను కూడా పూర్తిచేయాల్సి రావొచ్చు. వినియోగదారుడు - సంస్థకు మధ్య సరైన అనుబంధం ఏర్పడేలా చర్యలను సూచించడం, క్లైంట్‌ - బృంద సమావేశాలను నిర్వహించడం  వంటి పనులు ఇందులో భాగం. ఎస్‌ఈవో (సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌) పద్ధతులకు తగిన విధంగా కంటెంట్‌ తయారు చేయడం, క్లైంట్‌ కంటెంట్‌ను వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రదర్శించడం, ఎస్‌ఈవో, సోషల్‌ మీడియా స్ట్రాటజీలను తయారుచేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, పోటీదారుల వ్యాపారతీరును గమనించడం, ఈ-మెయిల్‌ ప్రచారాన్ని రూపొందించడం వంటి అనేక పనులుంటాయి.


ఏ నైపుణ్యాలు కావాలి?


డిజిటల్‌ స్ట్రాటజిస్టులు డిజిటల్‌ మార్కెట్‌లోని మొత్తం అన్ని అంశాలను తెలుసుకోవాలి. వినియోగదారుల నుంచి సమాచారం సేకరించడం.. బ్రాండ్‌ గురించి, ప్రస్తుత సవాళ్లు, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌లో ఉత్తమ విధానాలు ఏంటో అవగాహన కలిగి ఉండాలి. సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌ (ఎస్‌ఈఎం), సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ (ఎస్‌ఎంఎం), కంటెంట్, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌ విధానాలపై అవగాహన అవసరం. మార్కెటింగ్‌ నాలెడ్జ్‌తోపాటు విశ్లేషణాత్మకంగా ఆలోచించే తీరు, టెక్నికల్‌ నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్, డిజిటల్‌ లిటరసీ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకంగా ఆలోచించడం, ఎలాంటి వాతావరణంలో అయినా పనిచేయగలగడం.. ఇటువంటి లక్షణాలు ఉన్న వారు ఇందులో చక్కగా రాణించగలరు.


ఏయే ఉద్యోగాలు?


ఈ రంగంలో ప్రవేశించేవారు డిజిటల్‌ స్ట్రాటజిస్ట్, డిజిటల్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజిస్ట్, కంటెంట్‌ స్ట్రాటజిస్ట్, డిజిటల్‌ మార్కెటింగ్‌ అకౌంట్‌ స్ట్రాటజిస్ట్, పెయిడ్‌ మీడియా స్ట్రాటజిస్ట్, కంజ్యూమర్‌ మార్కెటింగ్‌ డిజిటల్‌ స్ట్రాటజిస్ట్, ఈ-కామర్స్‌ డిజిటల్‌ స్ట్రాటజిస్ట్‌.. ఇలా అనేక విభాగాల్లోకి వెళ్లవచ్చు.


అవ్వడం ఎలా?

గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన తర్వాత డిజిటల్‌ స్ట్రాటజీకి సంబంధించి ఏదైనా డిగ్రీ చదవడం ద్వారా సబ్జెక్టు గురించి పూర్తిగా తెలుసుకునే వీలుంటుంది. ఇంటర్న్‌షిప్‌లు, కొద్దికాలంపాటు చేసే ఉద్యోగాలతో కొంత అనుభవం సంపాదించడం అవసరం. తర్వాత ఉన్నతస్థాయి పోస్టులకు ప్రయత్నించవచ్చు. వీలైనన్ని సర్టిఫికేషన్లు చేయడం వల్ల కూడా మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంటుంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా‌ (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ గేట్‌ తుది సన్నద్ధత

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి మార్గం.. మ్యాట్‌ (చివరి తేదీ: నవంబరు 28, 2023)

‣ దివ్యాంగులకు కేంద్రం ఆర్థిక సాయం (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ నేరాల గుట్టు పట్టే కోర్సులు

‣ కొత్త పరిస్థితుల్లో కంగారొద్దు!

Posted Date: 31-10-2023


 

సోషల్‌ మీడియా

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం