• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కోల్‌ఫీల్డ్స్‌లో కొలువులు

330 ఖాళీలకు నోటిఫికేషన్‌

అర్హత: పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా

కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ అయిన సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. సుమారు ఆరున్నర దశాబ్దాలుగా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. ఈ మినీరత్న సంస్థ తాజాగా ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా ఎంపిక చేస్తారు. 

మొత్తం 330 ఖాళీల్లో మైనింగ్‌ సర్దార్‌-77, ఎలక్ట్రీషియన్‌ (నాన్‌ ఎగ్జిక్యూటివ్‌) టెక్నీషియన్‌-126, డిప్యూటీ సర్వేయర్‌-20, అసిస్టెంట్‌ ఫోర్‌మేన్‌ (ఎలక్ట్రికల్‌)-107 పోస్టులు ఉన్నాయి. 

1. మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. మైనింగ్‌ సర్దార్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ లేదా మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష పాసై మూడేళ్ల మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉండాలి. ఓవర్‌మ్యాన్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. 

2. ఎలక్ట్రీషియన్‌ (నాన్‌-ఎక్స్‌కవేషన్‌/టెక్నీషియన్‌) పోస్టుకు మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష పాసై, ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ పూర్తవ్వాలి. నిబంధనల ప్రకారం.. ఎల్‌టీ పర్మిట్‌ లేదా 440-550 ఓల్ట్స్‌ మైనింగ్‌ పార్ట్స్‌ పర్మిట్, కేబుల్‌ జాయినింగ్‌లో హెచ్‌టీ పర్మిట్‌ ఉండాలి. 

3. డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుకు మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. మైన్స్‌ సర్వే సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.  

4. అసిస్టెంట్‌ ఫోర్‌మేన్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుకు మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. 

అభ్యర్థుల వయసు 19.04.2023 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. ఓబీసీ (నాన్‌క్రీమీలేయర్‌) అభ్యర్థులకు 33 సంవత్సరాలు. కోల్‌ ఇండియా లిమిటెడ్‌.. దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గరిష్ఠ వయసు లేదు.    

దరఖాస్తు ఫీజు రూ.200 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, కోల్‌ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నవారు ఫీజు చెల్లించనవసరం లేదు. 

ప్రతి పోస్టుకూ వేర్వేరుగా సీబీటీ

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ను రాంచీ, జెంషెడ్‌పూర్, ధన్‌బాద్, హజారీభాగ్‌లోని ఏదో ఒక పరీక్ష కేంద్రంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఎప్పుడు జరిపేదీ సీసీఎల్‌ వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు. దరఖాస్తులో తెలిపిన విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను సీబీటీకి ఎంపిక చేస్తారు. దీంట్లో కనీసార్హత మార్కులు సాధించినవారిని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. 

ప్రతి పోస్టుకూ వేర్వేరుగా సీబీటీని నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా  ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసార్హత మార్కులు 30. ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 36 మార్కులు సాధించాలి. పరీక్ష ఫలితాలను సీసీఎల్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతారు.  

దరఖాస్తుకు చివరి తేదీ: 19.04.2023

రాత పరీక్ష: 05.05.2023

ఫలితాల ప్రకటన: 29.05.2023  

వెబ్‌సైట్‌: https://www.centralcoalfields.in/hindi/ind/indexh.php
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ మీడియా సంస్థల్లో ఆహ్వానం

‣ ఇస్రోలో 62 టెక్నికల్‌ ఉద్యోగాలు

‣ లాభదాయక కెరియర్‌.. బిజినెస్‌ ఇంజెలిజెన్స్‌

‣ డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

‣ అవకాశం సులువు.. అధిక మార్కెట్‌ విలువ!

Posted Date : 11-04-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌