• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆవిష్కరణల అధ్యయనానికీ కోర్సులు!

ఆవిష్కరణ... ప్రతి ప్రశ్నకూ, ప్రతి సమస్యకూ, ప్రతి అవసరానికీ ఆవిష్కరణే జవాబు! దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నా, వ్యాపారాలు చకచకా పరుగులు తీయాలన్నా, సేవలు మెరుగ్గా అందాలన్నా... నూతన ఆవిష్కరణలు అవసరం. అందుకే దీనికి సంబంధించిన ‘ఇన్నోవేషన్‌ మేనేజ్‌మెంట్‌’ కోర్సుకు ఆదరణ పెరుగుతోంది.


ఇన్నోవేషన్‌ మేనేజ్‌మెంట్‌ అనేది నిజానికి మనం ఎప్పటినుంచో నేర్చుకుంటున్నాం. ఎంబీఏ చదివిన వారు ఒక సెమిస్టర్‌లో దీని గురించి చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు దీన్నే ప్రత్యేకంగా అధ్యయనం చేసేలా కొన్ని కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా విదేశాల్లో మాస్టర్స్‌ చేసేందుకు చాలా రకాలైన స్పెషలైజేషన్లు ఉన్నాయి. మన దేశంలో మాత్రం ప్రస్తుతానికి పూర్తిస్థాయి డిగ్రీలా చదివేందుకు ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్, డిజైన్‌ ఇన్నోవేషన్‌ వంటి కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఎందుకు చదవాలి..


మన దేశంలోనే కాదు... ప్రపంచం మొత్తం మీద టెక్నాలజీ  వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటం, నూతన అవసరాలకు తగ్గట్టు  సృజనాత్మక ఆవిష్కరణలు అవసరం కావడంతో ఇన్నోవేషన్‌ స్టడీస్‌కు గిరాకీ పెరిగింది. కామర్స్‌ - అనుబంధ కోర్సులు చదివేవారు ఇన్నోవేషన్‌ను అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు, పరిశ్రమల్లో సృజనాత్మకత నిండిన ఉత్పత్తుల తయారీకి దీని గురించి చదువుకుని వచ్చిన నిపుణుల అవసరం ఉంది. తదనుగుణంగా అవకాశాలూ పెరుగుతున్నాయి.


ఎన్ని రకాలు


ఇన్నోవేషన్‌ ప్రధానంగా పీజీ స్థాయిలో చదివే కోర్సు. ఇందులో గ్లోబల్‌ స్ట్రాటజీ అండ్‌ మేనేజ్‌మెంట్, మెడ్‌-టెక్, సోషల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్,         క్రియేటివ్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్, బిజినెస్, ఎడ్యుకేషన్‌ అండ్‌ లీడర్‌షిప్, టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్‌ డిజైన్, సస్టైనబుల్‌ ఇన్నోవేషన్‌ వంటి రకాలున్నాయి.


ఏం నేర్పుతారు


ఆవిష్కరణ అనేది అవసరమైనది మాత్రమే కాదు... విభిన్నమైనది కూడా. ఏదైనా ఉత్పత్తి, ఆలోచన, పరిష్కారం... ఇలా దేన్నయినా ఆవిష్కరణగా చెప్పవచ్చు. దీని పరిధి చాలా విస్తృతం. సంస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు, విధానాలు పాటించినప్పుడే నిరంతరం మార్కెట్‌లో నిలబడి ఉండగలదు. 


 అలా కంపెనీకి అవసరమయ్యే వస్తువు/విధానాల రూపకల్పన, వినియోగంలో లోపాలు - సవరణ, పనితీరు అంచనా... ఇవన్నీ ఈ సబ్జెక్టులోకి వస్తాయి. సృజనాత్మకతను పెంచుకోవడం, మార్కెట్‌లో చొచ్చుకుపోయేలా నూతన విధానాలు ఆలోచించడం, డిజైన్స్‌ను సృష్టించడం... ఇలాంటి పలు విషయాలు ఇందులో నేర్చుకుంటారు.


విదేశాల్లో ఎక్కువ


మనవద్దకంటే విదేశాల్లో ఈ ఇన్నోవేషన్‌ అనే సబ్జెక్టు చదివేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. అమెరికా, జర్మనీ, సింగపూర్, స్విట్జర్లాండ్, స్వీడన్, యూకే వంటి పలు దేశాల్లో పదులకొద్దీ ఇన్నోవేషన్‌ స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. కనీసం గ్రాడ్యుయేషన్‌ అర్హతతో వీటిని చదివేలా రూపొందించారు. వీటిని చదువుకోవడం ద్వారా విదేశాల్లోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.


ఉద్యోగాలేంటి..


దీన్ని అభ్యసించడం ద్వారా మేనేజ్‌మెంట్‌ రంగంలో కొత్త తరహా ఉద్యోగాల్లోకి అడుగుపెట్టవచ్చు. ఇన్నోవేషన్‌ ఎక్స్‌పర్ట్‌ మేనేజర్, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ మేనేజర్, ఇన్నోవేషన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ వంటి పలు ఉద్యోగాలు అందుకోవచ్చు.


ఆన్‌లైన్‌ కోర్సులు


మనవద్ద పేరుపొందిన విద్యాసంస్థలు అందిస్తున్న కోర్సుల గురించి చెప్పాలంటే... ఐఐటీ దిల్లీ ‘ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం ఇన్‌ స్ట్రాటజిక్‌ ఇన్నోవేషన్, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ అండ్‌ బిజినెస్‌ అనలటిక్స్‌’ పేరిట ఏడాది కాలవ్యవధితో కోర్సు అందిస్తోంది. ఐఐఎం లఖ్‌నవూ ‘ఎగ్జిక్యూటివ్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రాం ఇన్‌ డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ మేనేజ్‌మెంట్‌’ పేరిట ఆరు నెలల కాలవ్యవధి గల కోర్సును అందిస్తోంది.  అమిటీ యూనివర్సిటీ ఆరువారాలపాటు నడిచే ‘ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ బిజినెస్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌’, ఐఐఎం బెంగళూరు ‘ఇన్నోవేషన్‌ అండ్‌ ఐటీ మేనేజ్‌మెంట్‌’ పేరిట 4 వారాల వ్యవధిగల కోర్సును అందిస్తున్నాయి. ఇక కోర్సెరా, సింప్లీలెర్న్, యుడెమీ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో చాలా రకాలైన  కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు

‣ టెన్త్‌ పాసైతే సాయుధ దళాల్లోకి స్వాగతం!

‣ ‘క్రిటికల్‌’ అంటే నిజంగా క్రిటికల్‌ కాదు!

‣ దివ్య జీవనానికి దృఢమైన ఆసరా!

‣ ఆఫీసర్‌ కొలువుకు నౌకాదళం పిలుపు!

‣ ఉన్నత చదువులకు ఉపకారవేతనం

‣ ఇంటర్‌ పాసైతే స్కాలర్‌షిప్‌లు

‣ ఈఆర్‌పీలో తిరుగులేని ఎస్‌ఏపీ!

Posted Date : 03-11-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌