• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోవా షిప్‌యార్డులో ఖాళీల భర్తీ

106 నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ కొలువులకు నోటిఫికేషన్‌



మినీరత్న కేటగిరీకి చెందిన గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (జీఎస్‌ఎల్‌) 106 నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


ఈ పోస్టులకు ఎంపికైన వారిని ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగిస్తారు. 


1. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ (హెచ్‌ఆర్‌) - 2: బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పాసవ్వాలి. లేదా ఏదైనా డిగ్రీతోపాటు పీజీ డిప్లొమా/డిగ్రీ ఇన్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/ లేబర్‌ లా అండ్‌ లేబర్‌ వెల్ఫేర్‌/ బీఎస్‌డబ్ల్యూ/ బీఏ (సోషియాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. హెచ్‌ఆర్‌/అడ్మిన్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 36 ఏళ్లు. 


2. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌) - 1: ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా హిందీ డిగ్రీ చదవాలి. హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లిష్‌ నుంచి హిందీలోకి అనువాదం చేయడంలో ఏడాది డిప్లొమా ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 33 ఏళ్లు మించకూడదు. 


3. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ (సీఎస్‌) - 1: ఇంటర్‌ కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తిచేయాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 33 సంవత్సరాలు. 


4. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రికల్‌) - 4: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఆటోక్యాడ్‌ పరిజ్ఞానం ఉండాలి. వయసు 33 ఏళ్లు మించకూడదు. 


5. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌) -1: ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 33 ఏళ్లు. 


6. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌) - 4: మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఆటోక్యాడ్‌ పరిజ్ఞానం ఉండాలి. గరిష్ఠ వయసు 33 ఏళ్లు. 


7. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (షిప్‌బిల్డింగ్‌) - 20: షిప్‌బిల్డింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసై.. రెండేళ్ల అనుభవం ఉండాలి. ఆటోక్యాడ్‌ పరిజ్ఞానం ఉండాలి. వయసు 33 ఏళ్లు మించకూడదు. 


8. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) - 1: సివిల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసై.. రెండేళ్ల అనుభం ఉండాలి. వయసు 33 సంవత్సరాలు.


9. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఐటీ) - 1: ఐటీ/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసై.రెండేళ్ల అనుభవం ఉండాలి. హార్డ్‌వేర్, నెట్‌వర్క్‌ సమస్యా పరిష్కార నైపుణ్యం ఉండాలి. వయసు 33 ఏళ్లు మించకూడదు. 


10. ఆఫీస్‌ అసిస్టెంట్‌ - క్లరికల్‌ స్టాఫ్‌ - 32: ఏదైనా డిగ్రీ పాసై.. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలి. నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 36 ఏళ్లు. 


11. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌/ఇంటర్నల్‌ ఆడిట్‌) - 6: కామర్స్‌ డిగ్రీ పాసై.. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు చేయాలి. గరిష్ఠ వయసు 33 ఏళ్లు. 


12. పెయింటర్‌ - 20: పదోతరగతి, ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.గరిష్ఠ వయసు 36 ఏళ్లు. 


13. వెహికల్‌ డ్రైవర్‌ - 5: పదో తరగతి పాసై హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్, ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 36 ఏళ్లు.. 


14. రికార్డ్‌ కీపర్‌ - 3: పదోతరగతి పాసై.. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో 6 నెలల కంప్యూటర్‌ కోర్సు చేయాలి. రికార్డ్‌ కీపింగ్‌ పరిజ్ఞానం ఉండాలి. వయసు 33 ఏళ్లు.. 


15. కుక్‌ - 3: పదోతరగతితో పాటు కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. ఇండియన్‌/ కాంటినెంటల్‌/ చైనీస్‌ ఫుడ్‌ తెలిసినవారికి ప్రాధాన్యం. గరిష్ఠ వయసు 33 ఏళ్లు.. 


16. ప్లంబర్‌ - 1: ప్లంబర్‌ ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేయాలి. ఐదేళకల పని అనుభవం ఉండాలి. గరిష్ఠ  వయసు 36 ఏళ్లు. 


17. సేఫ్టీ స్టివార్డ్‌ - 1: పదో తరగతిపాటు ఇండస్ట్రియల్‌ సేఫ్టీ/ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ/ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో ఏడాది డిప్లొమా పూర్తిచేయాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 36 ఏళ్లు. 


గమనించండి..

హిందీ, ఇంగ్లిష్‌తోపాటు కొంకణి/మరాఠీ తెలిసిన అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు. 

రాత పరీక్ష.. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) లేదా పెన్‌ పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (పీబీటీ) విధానంలో ఉంటుంది. 

జనరల్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు 25 శాతం, సబ్జెక్ట్‌/ ట్రేడ్‌ సంబంధిత ప్రశ్నలు 75 శాతం ఉంటాయి.

రాత, స్కిల్‌ టెస్ట్‌లో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 35 శాతం కనీసార్హత మార్కులు సంపాదించాలి. 


దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2024


వెబ్‌సైట్‌: https://goashipyard.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

‣ పరీక్షలో మంచి మార్కులకు మెలకువలు

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

Posted Date : 20-03-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌