• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దిల్లీలో హెడ్‌కానిస్టేబుల్‌ కొలువులు

857 ఖాళీల భర్తీకి ప్రకటన

దిల్లీ పోలీస్‌ విభాగంలో 857 హెడ్‌ కానిస్టేబుల్‌ (అసిస్టెంట్‌ వైర్‌లెస్‌ ఆపరేటర్‌ (ఏడబ్ల్యూఓ/ టెలీ-ప్రింటర్‌ ఆపరేటర్‌ (టీపీఓ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు వీటికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్‌ టెస్టులతో నియామకాలు ఉంటాయి!


నియామక రాత పరీక్షను ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. జనరల్‌ అవేర్‌నెస్‌ 20, జనరల్‌ సైన్స్‌ 25, మ్యాథమెటిక్స్‌ 25, రీజనింగ్‌ 20, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో.. పన్నెండో తరగతి స్థాయిలో ఉంటుంది.


విభాగాలవారీ ఖాళీలు: పురుషులకు: అన్‌ రిజర్వ్‌డ్‌-213, ఈడబ్ల్యూఎస్‌-58, ఓబీసీ-128, ఎస్సీ-106, ఎస్టీ-68 మొత్తం 573.


మహిళలకు: అన్‌ రిజర్వ్‌డ్‌-107, ఈడబ్ల్యూఎస్‌-29, ఓబీసీ-63, ఎస్సీ-52, ఎస్టీ-33 మొత్తం 284 పోస్టులు. ఎంపికైనవారికి లెవెల్‌-4 మూలవేతనం రూ.25,500 అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులతో ప్రతి నెలా సుమారు రూ.50వేలు అందుకోవచ్చు. 


ఎవరు అర్హులు?


10+2 (సీనియర్‌ సెకండరీ) సైన్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో పాసై ఉండాలి. ప్రాథమిక కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. ఇంగ్లిష్‌ వర్డ్‌ ప్రాసెసింగ్‌లో భాగంగా.. 15 నిమిషాల్లో 1000 కీ డిప్రెషన్స్‌ ఇవ్వగలగాలి. 


వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠ వయసులో అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.  


దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. మిగతావాళ్లకు రూ.100


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు 


చివరి తేదీ: 29.07.2022


ఆన్‌లైన్‌ పరీక్ష: అక్టోబరులో. 


రీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో..చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో..హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. 


వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


ఏ అంశాల్లో ప్రశ్నలు? 


జనరల్‌ అవేర్‌నెస్‌: పర్యావరణంపై అభ్యర్థికి ఉన్న అవగాహన, తాజా సంఘటనలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, వైజ్ఞానిక పరిశోధనలు.. మొదలైన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. 


జనరల్‌ సైన్స్‌: ఈ విభాగంలో ఫిజిక్స్‌లోని థర్మోడైనమిక్స్, మెకానిక్స్, న్యూటన్స్‌ లా ఆఫ్‌ మోషన్, గ్రావిటీ, మోషన్, ప్రెషర్, యూనిట్స్‌ అండ్‌ మెజర్‌మెంట్స్, సౌండ్, హీట్, టెంపరేచర్, ఎలక్ట్రానిక్స్, మ్యాగ్నటిజం, నంబర్‌ సిస్టమ్స్, ఫైబర్‌ ఆప్టిక్స్, మోడ్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.


కెమిస్ట్రీ: సాధారణంగా ఉపయోగించే రసాయనాలు, రియాక్షన్లు, యాసిడ్లు, ఆటమిక్‌ నంబర్, ఎలిమెంట్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ.. మొదలైన అంశాలకు చెందిన ప్రశ్నలుంటాయి. 


మ్యాథ్స్‌: నంబర్‌ సిస్టమ్స్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, పర్సంటేజెస్, యావరేజెస్, సింపుల్‌ అండ్‌ కాంపౌండ్‌ ఇంట్రెస్ట్, ప్రాఫిట్, లాస్‌ అండ్‌ డిస్కౌంట్, టైమ్, డిస్టెన్స్‌ అండ్‌ వర్క్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, సీక్వెన్స్‌ అండ్‌ సిరీస్, 


పెర్మ్యుటేషన్, కాంబినేషన్‌ అండ్‌ సింప్లిఫికేషన్‌.. అంశాల్లో ప్రశ్నలు  అడుగుతారు. 


రీజనింగ్‌: నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌ (ఫిగర్స్‌), ఆల్ఫాన్యూమరిక్‌ సిరీస్, నంబర్‌ సిరీస్, క్రిటికల్‌ థింకింగ్, కోడ్, డీకోడింగ్‌ లాజికల్‌ రీజనింగ్, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్స్‌/ర్యాంకింగ్‌ టెస్ట్, వెన్‌ డయాగ్రమ్స్, సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్, కోడెడ్‌ ఇన్‌ఈక్వాలిటీస్‌ అండ్‌ డేటా సఫిషియన్సీ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 


కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌: ఎలిమెంట్స్‌ ఆఫ్‌ వర్డ్‌ ప్రాసెసింగ్, ఎంఎస్‌-ఎక్సెల్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్‌ వెబ్‌ బ్రౌజర్స్‌ మొదలైన అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 


 

ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ 


పురుషులకు: అభ్యర్థులు 1600 మీటర్ల పరుగును 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. మూడు ప్రయత్నాల్లో ఒకసారైనా.. లాంగ్‌జంప్‌ 12 1/2 అడుగులు, హైజంప్‌ 3 1/2 అడుగులు చేరుకోవాలి. 


మహిళలకు: 800 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల్లో చేరుకోవాలి. మూడు ప్రయత్నాల్లో ఒకసారైనా..లాంగ్‌జంప్‌ 9 అడుగులు, హైజంప్‌ 3 అడుగులు దాటాలి.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అగ్రికల్చర్‌ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ డేటాసైన్స్‌ ఉద్యోగాలకు డిమాండ్‌!

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!

‣ ఆతిథ్య రంగంలో అవకాశాలు అనేకం!

‣ డిజిటల్‌ గేమింగ్‌కు ఉజ్జ్వల భవిత

Posted Date : 21-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌