• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఒత్తిడి నివారణకు ఇన్‌స్టా గైడ్‌

సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌.. పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం ఓ ఉపయోగకరమైన గైడ్‌ను తీసుకొచ్చింది. కరోనా విజృంభణ తర్వాత పూర్తిస్థాయిలో తరగతులు, పరీక్షలు మొదలైనది ఇప్పుడే. దీంతో విద్యార్థులు ఈ మార్పును త్వరితగతిన పాజిటివ్‌ కోణంలో స్వాగతించేలా ‘రీఅడాప్ట్‌ అండ్‌ రీఅడ్జస్ట్‌ - బ్యాక్‌ టు ది క్లాస్‌రూం’ అనే పేరుతో ఓ గైడ్‌ను తయారుచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచారు. ఫోర్టిస్‌ నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రాం, ఫోర్టిస్‌ హెల్త్‌ కేర్, సంగత్‌ - ‘ఇట్స్‌ ఓకే టు టాక్‌ క్యాంపెన్‌’ల ఉమ్మడి కృషితో ఈ గైడ్‌ను రూపొందించారు. ప్రధానంగా పది, ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సృష్టించిన దీనిలో హైస్కూలు పిల్లలకూ తగిన సూచనలు ఉన్నాయి. పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఫలితాల స్వీకరణలో మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి... ఇలాంటి అంశాలన్నింటి గురించీ నిపుణుల సలహాలు ఇందులో పొందుపరిచారు. విద్యార్థులకు దీన్ని చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.  

గైడ్‌ను చూసేందుకు వెబ్‌లింక్‌: https://bit.ly/3KbzZIb

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరిపోతుందా మీ సామర్థ్యం!

‣ పదితో.. త్వరగా స్థిరపడదాం!

‣ పరీక్షల సమయం ఫోనుకు విరామం!

‣ ఐఐఎఫ్‌టీలో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ

‣ బీఐఎస్‌లోకి స్వాగతం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌