• facebook
  • whatsapp
  • telegram

ఐఐఎఫ్‌టీలో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) కాకినాడ క్యాంపస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సు చదివేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2020 నూతన విద్యావిధానాన్ని అనుసరించి యువతను మేనేజ్‌మెంట్‌ నిపుణులుగా తీర్చిదిద్దేలా ఈ కోర్సు ఉంటుంది.

ఇందులో మొదటి మూడేళ్లు పూర్తిచేసిన విద్యార్థులకు ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌’ డిగ్రీ అందుతుంది. ఈ మూడేళ్లు సెమిస్టర్‌ విధానంలో మొత్తం 160 క్రెడిట్స్‌ ఉంటాయి. ఆఖరి రెండేళ్లు ట్రైమిస్టర్‌ విధానంతో 120 క్రెడిట్లు ఉంటాయి. మొత్తం కోర్సులో ఉండే క్రెడిట్లు 280. ఐదేళ్ల కోర్సు పూర్తిచేసిన వారికి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌) పట్టా అందుతుంది. కేస్‌ స్టడీస్, ప్రాజెక్ట్స్, ప్రెజెంటేషన్స్, గేమ్స్, రోల్‌ప్లే, ఫీల్డ్‌ విజిట్, ఇండస్ట్రీ సెషన్స్‌ వంటి మెథడాలజీస్‌తో బోధన ఉంటుంది. జేఎన్‌టీయూ కాకినాడలో ఉన్న ఐఐఎఫ్‌టీ తాత్కాలిక క్యాంపస్‌లో వచ్చే సెప్టెంబర్‌ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

మొత్తం సీట్లు: 40

ఎంపిక విధానం: ఐపీమ్యాట్‌ - 2022 స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అకడమిక్‌ మార్కులనూ పరిగణనలోకి తీసుకుంటారు.

అర్హత: అభ్యర్థి ఇంటర్, తత్సమాన అర్హత కలిగి ఉండాలి. పదోతరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. మ్యాథమెటిక్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథమేటిక్స్‌ను కచ్చితంగా ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iift.ac.in/iift/index.php
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరిపోతుందా మీ సామర్థ్యం!

‣ పదితో.. త్వరగా స్థిరపడదాం!

‣ పరీక్షల సమయం ఫోనుకు విరామం!

‣ డిగ్రీతో కమాండెంట్‌ కొలువు

‣ గ్రూప్‌-1 విజయానికి ఏ పుస్తకాలు చదవాలి?

‣ నీట్‌ ర్యాంకుల కటాఫ్‌ ఎంత?

‣ నియామకాల్లో ఏమేం చూస్తారు?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 02-05-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌