* డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతతో అవకాశం
పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) 15 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
గ్రూప్-ఎ పోస్టులైన అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మిగతా పోస్టులకు రాత పరీక్ష ఒక్కటే ఉంటుంది.
1. అసిస్టెంట్ రిజిస్ట్రార్-02: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. సంబంధిత రంగంలో 8 ఏళ్ల అనుభవం ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్/ లీగల్/ ఫైనాన్స్/ స్టోర్స్ అండ్ పర్చేజ్/ ఎస్టాబ్లిష్మెంట్ వ్యవహారాల నిర్వహణలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 45 సంవత్సరాలు.
2. జూనియర్ సూపరింటెండెంట్-04: డిగ్రీ ప్రథమ శ్రేణిలో పాసవ్వాలి. సంబంధిత రంగంలో 6 ఏళ్ల అనుభవం ఉండాలి. మేనేజ్మెంట్/ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/ అడ్మినిస్ట్రేషన్/ లీగల్/ స్టోర్స్, పర్చేజ్/ ఎస్టాబ్లిష్మెంట్ వ్యవహారాల్లో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం. 32 సంవత్సరాలు మించకూడదు.
3. ఫిజికల్ ట్రైనింగ్ కమ్ యోగా ఇన్స్ట్రక్టర్-1: ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ (బీపీఈడీ) పాసవడంతోపాటుగా 3 ఏళ్ల అనుభవం ఉండాలి. యోగా సర్టిఫికెట్, కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్వహణ సామర్థ్యం ఉన్నవారికి ప్రాధాన్యం. వయసు 32 సంవత్సరాలు మించకూడదు.
4. జూనియర్ టెక్నీషియన్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్)-01: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్లొమాలో డిప్లొమా/ డిగ్రీ పాసవ్వాలి. లేదా ఐటీఐ పాసవడంతోపాటు 2 ఏళ్ల అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
‣ సిస్టమ్ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, ఓఎస్ ఇన్స్టలేషన్స్, డ్రైవర్ ఇన్స్టలేషన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ సర్వర్స్, నెట్వర్కింగ్, వైఫై సెట్టింగ్స్, వైర్డ్ అండ్ వైర్లెస్ లాన్ పరిజ్ఞానం ఉండాలి. పైతాన్, జావా, సీ++, రౌటింగ్లలో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం.
5. జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్)-01: ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా/ డిగ్రీ పాసవ్వాలి. లేదా ఐటీఐ పాసై, 2 ఏళ్ల అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
‣ సర్క్యూట్ లా, ఏసీ ఫండమెంటల్స్, ఎలక్ట్రికల్ కంట్రోల్ సర్క్యూట్స్, సెన్సర్స్, కమ్యూనికేషన్ - నెట్వర్క్స్, ఎలక్ట్రిక్ డివైజెస్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్.. మొదలైన వాటిలో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
6. జూనియర్ అసిస్టెంట్-05: డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
‣ కంప్యూటర్ అప్లికేషన్స్/ సైన్స్ డిగ్రీ/ డిప్లొమాతోపాటు పేరోల్, అకౌంట్స్ పరిజ్ఞానం.
‣ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
7. జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ)-01: డిగ్రీతోపాటు లైబ్రరీసైన్స్ డిప్లొమా పాసవ్వాలి. లేదా లైబ్రరీ సైన్స్ డిగ్రీ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
‣ లైబ్రరీ మేనేజ్మెంట్లో ప్రస్తుత పోకడలు, పరిజ్ఞానం తెలిసినవారికి ప్రాధాన్యం.
దరఖాస్తు ఫీజు: గ్రూప్-ఎ పోస్టులకు రూ.1180. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.590. గ్రూప్ బీ, సీ పోస్టులకు: రూ.590. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.295.
‣ 6 నెలల కంటే తక్కువ ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోరు.
‣ గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
‣ ఎంపికైన అభ్యర్థులను ముందుగా 5 ఏళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగి పనితీరు, సంస్థ అవసరాల దృష్ట్యా మరో 5 ఏళ్ల కాలానికి కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉంటుంది.
‣ సంతృప్తికరమైన పనితీరును కనబరిచిన వారిని శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
రాత పరీక్ష: ఆఫ్‌లైన్ విధానంలో పుణె ఐఐఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు కేటాయిస్తారు.
‣ జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ - 20 ప్రశ్నలు.
‣ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ - 10 ప్రశ్నలు.
‣ ఎంఎస్-వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, ఇంటర్నెట్, ఈమెయిల్స్‌కు సంబంధించి - 20 ప్రశ్నలు.
‣ సిస్టమ్ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, ఓఎస్ ఇన్స్టలేషన్స్, డ్రైవర్ ఇన్స్టలేషన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ సర్వర్స్, నెట్వర్కింగ్, వైఫై సెట్టింగ్స్, పైతాన్, జావా, సి ++ కు సంబంధించినవి - 50 ప్రశ్నలు.
‣ రాత పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
‣ 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
‣ పూర్తిచేసిన దరఖాస్తుకు డిమాండ్ డ్రాఫ్ట్, విద్యార్హతలు, అనుభవాన్ని తెలిపే సర్టిఫికెట్ కాపీలను జతచేసి స్పీడ్/ రిజిస్టర్/ కొరియర్లో పంపాలి.
చిరునామా: ది డైరెక్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), పుణె, సర్వే నం.9/1/3, అంబెగావ్ బద్రుక్, సింహ్ఘడ్ ఇన్స్టిట్యూట్ రోడ్, పుణె-411 041. మహారాష్ట్ర.
దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2024
వెబ్సైట్: http://www.iiitp.ac.in/
మరింత సమాచారం... మీ కోసం!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)
‣ గ్రూప్-1 ప్రిపరేషన్ ప్లాన్ (టీఎస్పీఎస్సీ)
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!