• facebook
  • whatsapp
  • telegram

జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ అకడమిక్‌ సక్సెస్‌కు సూచనలు

‘కొంతమంది విద్యార్థులు ఒక్కసారి చదివినా సరే భలే గుర్తుపెట్టుకుంటారు. అసలు జ్ఞాపకశక్తి బాగుంటే చాలు.. పాఠాలన్నీ చక్కగా గుర్తుంటాయి’ అని భావిస్తుంటారు చాలామంది. అయితే చదివినవాటిని  మర్చిపోకుండా ఉండాలంటే ఒక్క జ్ఞాపకశక్తి మాత్రమే సరిపోదు.  ఇతర అంశాలూ తోడ్పడతాయి.


ముఖ్యాంశాలు, వాస్తవ, విధానపరమైన వివరాలు.. వీటి సహాయంతో విషయాన్ని అర్థంచేసుకోవాలి. ఇటుకలతో నిర్మాణం పూర్తయినట్టుగా ఈ వివరాలన్నింటినీ అనుసంధానించుకుంటే.. ప్రధానాంశం ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. 


సంక్షిప్తంగా, విడిగా చిన్న భాగాలుగా ఉన్న సమాచారాన్ని సేకరించుకుని చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే అందుబాటులో ఉన్న సమాచారాన్ని అలాగే గుర్తుంచుకోవాలని ప్రయత్నించకూడదు. ఎవరికివారు కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలను రాబట్టుకుంటూ నేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల విషయం బాగా అర్థమవుతుంది. అంతే కాదు.. ఎక్కువ కాలంపాటు గుర్తుంటుంది కూడా. పరీక్షల్లో ప్రశ్నలను ఎన్ని రకాలుగా అడిగినా తికమక పడకుండా సమాధానాలు రాయగలుగుతారు. 


చదివినదాన్ని కొన్ని వారాలు లేదా నెలల విరామంలో పునశ్చరణ చేసుకోవాలి. 


అప్పుడప్పుడూ బలాలు, బలహీనతలనూ సమీక్షించుకోవాలి. అలాంటప్పుడు ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకుని మెరుగుపరుచుకోవచ్చు. 


‘ఎన్నిసార్లు చదివినా గుర్తుండవు.. ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాను’ అని బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. తరచూ ప్రతికూల ఆలోచనలు చేయడం వల్ల ఫలితాలూ అలాగే వస్తాయి. కాబట్టి వాటిని దరిదాపుల్లోకి రానీయకుండా జాగ్రత్తపడాలి. ముందుగా మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు స్ఫూర్తిని నింపుతాయి. దాన్ని అందిపుచ్చుకుంటే సమర్థంగా చదవగలుగుతారు. అలా నేర్చుకున్నదాన్ని అంత త్వరగా మర్చిపోలేరు కూడా. 



మూడు పద్ధతుల్లో...

నేర్చుకునే విధానంలో సాధారణంగా విజువల్, ఆడిటరీ, కైనీస్తటిక్‌ అనే మూడు పద్ధతులు ఉంటాయి. 

విజువల్‌: ఈ పద్ధతిలో గ్రాఫ్‌లు, పవర్‌పాయింట్లు, ఇలస్ట్రేషన్లు, వీడియోలు, బొమ్మల ఆధారంగా నేర్చుకోవచ్చు. ఇవి కంటికి ఎదురుగా కనిపిస్తాయి కాబట్టి త్వరగా మర్చిపోలేరు. 

ఆడిటరీ: దీంట్లో బృంద చర్చలు, ఓరల్‌ ప్రజంటేషన్లు, పాడ్‌కాస్ట్‌లు, ఆడియోలు.. లాంటివి ఉంటాయి. 

కైనీస్తటిక్‌: నోట్‌ టేకింగ్, సమావేశాలకు హాజరుకావడం, రోల్‌-ప్లేయింగ్‌.. ఇవన్నీ ఈ పద్ధతిలో ఉంటాయి. 

అయితే చదువులో బాగా రాణించేవాళ్లు పాటించే విధానాన్ని పరిశీలించి.. మిగతావాళ్లూ దాన్నే అనుసరించాలని అనుకోకూడదు. ఎవరికి అనువైన పద్ధతిని వాళ్లు ఎంచుకుని అనుసరిస్తే ప్రయోజనం ఉంటుంది. 


 గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... స్వీయ సానుభూతి. ప్రతికూల ఆలోచనల మాదిరిగానే ఇది కూడా అభివృద్దికి అడ్డుపడుతుంది. ‘అధ్యాపకుల కొరతతో అర్థమైనట్టు చెప్పేవాళ్లు లేరు, సరైన వసతి సదుపాయాలు, ప్రోత్సహించేవాళ్లు లేకపోవడంతో వెనబడిపోయాను...’ ఇలా మీపైన మీరే సానుభూతిని పెంచుకుంటే.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. మరో విషయం- పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఎవరైనా అద్భుతాలు సాధించగలుగుతారు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా..  తట్టుకుని నిలబడినప్పుడే పదిమందిలోనూ ప్రత్యేకంగా నిలవగలుగుతారు! 


మరింత సమాచారం... మీ కోసం!

‣ కోస్టుగార్డులో 260 నావిక్‌ ఉద్యోగాలు

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date: 13-02-2024


 

జ్ఞాపకశక్తి

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం