• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బృందంతో నడుస్తూ..!

లీడర్‌ అడ్వైజ్‌ 


 


నేను ఎంబీఏ చదవ లేదు, ఏ విధమైన బిజినెస్‌ స్కూల్‌కూ వెళ్లలేదు. ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌ పూర్తిచేశాక, బ్యూరోక్రాట్‌ అవ్వాలనుకున్నాను. కానీ చిన్న వయసులోనే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ అయ్యాను. కెరియర్‌లో మనం అనుకున్నవి జరగకపోవచ్చు, కానీ అంతకంటే మంచిగా జరుగుతుందని నమ్మాలి. కొన్నిసార్లు చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలు మోయడం, కిందిస్థాయి ఉద్యోగులతో కఠినంగా వ్యవహరించాల్సీ వస్తుంది. పరిస్థితులు బాగాలేని సమయంలోనూ అందరితోనూ ప్రేమపూర్వకంగానే వ్యవహరించాలి. వృత్తిలో భాగంగా ఎదుటివారికి మంచి చేయడానికి, కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నించాలి. నిజాయతీగా, నిక్కచ్చిగా కష్టపడి పనిచేసినప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇటువంటి లక్షణాలే విజయవంతమైన కెరియర్‌కు పునాదులు వేయగలవు.


కొన్నిసార్లు పనిలో భాగంగా ఇతర ఉద్యోగులకు నచ్చని విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ సమయానికి వారు నొచ్చుకున్నా, మనం సరిగ్గానే చెబుతున్నామన్న విషయాన్ని తర్వాతనైనా గ్రహిస్తారు.. ఇటువంటి సందర్భాల్లో ఓపిగ్గా ఉండాలి. వృత్తిలో మనం సాధించే విజయాలు కేవలం మనవి మాత్రమే కాదు... మనతోపాటు పనిచేసే ఎంతోమంది కష్టపడితేనే అది సాధ్యమవుతుంది. ఒక కంపెనీగా, ఒక కుటుంబంగా కలిసి పనిచేసినప్పుడు ఉన్నత స్థాయి విజయాలను అందుకోగలం. ఉమ్మడిగా పనిచేసినప్పుడు వచ్చే ఫలితాలు కచ్చితంగా మెరుగ్గా ఉంటాయి. మేనేజ్‌మెంట్‌ పోస్టుల్లో ఉన్నవారు క్లిష్ట సమయాల్లో ఎప్పుడూ ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలవాలి. అదే వారికి కంపెనీ పట్ల మన అనే భావనను పెంచుతుంది. నేను అహ్మదాబాద్‌లో హిందుస్థాన్‌ యూనీలీవర్‌ కంపెనీకి మేనేజర్‌గా పనిచేసినప్పుడు అప్పటి ఛైర్మన్‌ నుంచి నేర్చుకున్నది ఇదే. నమ్మకం, గౌరవం అనే పునాదుల మీదే కెరియర్‌ మొదలవ్వాలి. మా నాన్నమ్మ ఓ సందర్భంలో చెప్పారు.. మన గురించి మనం ఆలోచించుకున్నట్లే మనతోటివాళ్లు, మన దగ్గర పనిచేస్తున్నవారి యోగక్షేమాలూ పట్టించుకోవాలన్నారు. జీవితసారం కలిపి చెప్పిన ఆ మాటలంటే నాకు ఎంతో గౌరవం. అందుకే నేను వాటిని పనిలో అన్వయిస్తున్నా.


సందర్భం ఏదైనా సరే, మనతో ఎదుటివారు ఎలా నడుచుకోవాలి అని కోరుకుంటామో మనం కూడా వారితో అలాగే ప్రవర్తించాలి. డబ్బు, స్థితిగతులు మారుతూ ఉంటాయి, కానీ మన వ్యక్తిత్వమే మనం చేరుకునే స్థానాలను నిర్ణయిస్తుంది. ఈరోజుల్లో చాలా మంది యువత విభిన్నపోకడలు అనుసరిస్తున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలని, వేగంగా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అనుకుంటున్నారు. ఇది తప్పు కాకపోయినా ఈ ప్రక్రియలో ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసుకోవాలి.


కష్టపడి పనిచేయండి, నమ్రతగా మెలగండి, ఎప్పుడూ మన మూలాలు మరిచిపోకూడదు. ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఎలా బతుకుతున్నాం అనేది ముఖ్యం. జాబ్‌ అంటే పని కాదు, అదో వెకేషన్‌లా ఉండాలి. నచ్చిన పనే చేయండి, నచ్చిన కంపెనీలోనే చేరండి, నమ్మకం సంపాదించుకోండి. అంతా బాగున్నప్పుడు ఎవరైనా నాయకత్వం వహిస్తారు. పరిస్థితులు బాగా లేనప్పుడు నిలబడ్డవారే నిజమైన నాయకులు. అథెంటిసిటీ, ఆర్కెస్ట్రేషన్‌ అనే రెండు లక్షణాలతో మీలోని నాయకుడికి శిక్షణ ఇవ్వండి!

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Posted Date : 28-05-2024 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌