• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌సీఎల్‌లో ట్రైనీ సూపర్‌వైజరీ పోస్టులు

* డిప్లొమా అర్హతతో దరఖాస్తుకు అవకాశం


నార్తర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఎల్‌) 150 ట్రైనీ సూపర్‌వైజరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులను మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లోని ఎన్‌సీఎల్‌కు చెందిన గనులు/ యూనిట్లలో నియమిస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. 

కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలో సాధించిన మార్కులు, ధృవ పత్రాల పరిశీలనతో అభ్యర్థులను ఉద్యోగానికి తీసుకుంటారు. పోస్టుల ప్రకారం పరీక్షను వేర్వేరుగా నిర్వహిస్తారు. 

1. అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ (ఈ అండ్‌ టీ) ట్రైనీ- గ్రేడ్‌-సి: 9 ఖాళీలు. మూడేళ్ల మెట్రిక్యులేషన్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పాసవ్వాలి. 

2. అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ (మెకానికల్‌) ట్రైనీ - గ్రేడ్‌-సి: 59 ఖాళీలు. మెట్రిక్యులేషన్, మూడేళ్ల మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి. 

3. అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌) ట్రైనీ - గ్రేడ్‌-సి: 82. మెట్రిక్యులేషన్, మూడేళ్ల ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. 

డిగ్రీ/ పీజీ /డిప్లొమాలను దూరవిద్య/ పార్ట్‌టైమ్‌ ద్వారా పూర్తిచేసినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు. 

అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. అన్‌రిజర్వుడ్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1180 (ఫీజు 1000 + 180 జీఎస్టీ). ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. 

 రాత పరీక్ష ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రంలో రెండు సెక్షన్లు ఉంటాయి. 

సెక్షన్‌-ఎ టెక్నికల్‌ పరిజ్ఞానానికి సంబంధించిన 70 ప్రశ్నలుంటాయి. 

సెక్షన్‌-బిలో జనరల్‌ అవేర్‌నెస్, రీజనింగ్, వెర్బల్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లకు సంబంధించిన 30 ప్రశ్నలు ఉంటాయి. 

ప్రతి ప్రశ్నకూ 1 మార్కు ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. 

ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.  

అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎప్‌ అభ్యర్థులు కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలో 50 మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు పొందాలి.


గమనించాల్సినవి

దరఖాస్తును నింపే సమయంలోనే పరీక్ష కేంద్రాలను ఎంపికచేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఎలాంటి మార్పులకూ అవకాశం ఉండదు. 

ఒకరు ఒక దరఖాస్తును మాత్రమే పంపాలి.

బ్జెక్టు సంబంధిత అంశాల నుంచే 70 ప్రశ్నలు వస్తాయి. పాఠ్యాంశాల్లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. సబ్జెక్టుల మీద గట్టి పట్టు సాధించాలి. 

సెక్షన్‌-బిలో జనరల్‌ అవేర్‌నెస్, రీజనింగ్, వెర్బల్‌-మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలకు వివిధ] పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. 

ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకోవాలి. వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 05.02.2024

వెబ్‌సైట్‌: www.nclcil.in


మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Posted Date : 17-01-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌