• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెబీలో ఆఫీసర్‌ కొలువులు

‣ పరీక్ష సరళి, సన్నద్ధత వివరాలు


ముంబయిలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) 97 ఆఫీసర్‌ గ్రేడ్‌-ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఫేజ్‌-1, ఫేజ్‌-2 ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలుంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌), రిసెర్చ్, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. 

1. అసిస్టెంట్‌ మేనేజర్‌-జనరల్‌- 62: ఏదైనా మాస్టర్స్‌ డిగ్రీ/ రెండేళ్ల వ్యవధి ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా లేదా లా డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా చార్టర్డ్‌ అకౌంటెంట్‌/ చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌/ కంపెనీ సెక్రెటరీ/ కాస్ట్‌ అకౌంటెంట్‌ పాసవ్వాలి.  

2. లీగల్‌ - 5: లా డిగ్రీతోపాటు.. అడ్వకేట్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. 

3. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-24: కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బ్రాంచ్‌తో ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసవ్వాలి. 

4. ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌)-2: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సీసీటీవీ, సెక్యూరిటీ, ఫైర్‌ అలారం సిస్టమ్స్, ఈపీఏబీఎక్స్, యూపీఎస్‌ సిస్టమ్, లిఫ్ట్స్, పంప్స్, ఏసీ ప్లాంట్స్‌ నిర్వహణ అనుభవం. పీఈఆర్‌టీ/ సీపీఎం టెక్నిక్స్‌ పరిజ్ఞానం ఉండాలి. 

5. రిసెర్చ్‌-2: ఎకనామిక్స్‌/ కామర్స్‌/ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/ ఫైనాన్స్‌/ క్వాంటిటేటివ్‌ ఫైనాన్స్‌/ మ్యాథమెటికల్‌ ఫైనాన్స్‌/ స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేటిక్స్‌/ డేటాసైన్స్‌.. మొదలైన వాటిలో మాస్టర్స్‌ డిగ్రీ/ రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా పాసవ్వాలి. 

6. అఫిషియల్‌ లాంగ్వేజ్‌-2: హిందీ/ హిందీ అనువాదంలో మాస్టర్స్‌ డిగ్రీ పాసవ్వాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదవాలి. లేదా సంస్కృతం/ ఇంగ్లిష్‌/ ఎకనామిక్స్‌/కామర్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ. డిగ్రీ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్టుగా చదవాలి. లేదా ఇంగ్లిష్‌ అండ్‌ హిందీ/ హిందీ అనువాదంలో మాస్టర్స్‌ డిగ్రీ. 

ఫలితాల కోసం చూస్తున్నవారూ, చివరి ఏడాది పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. 

ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు చెందినవారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

31.03.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు చెందినవారికి సడలింపులు వర్తిస్తాయి. 

అన్‌ రిజర్వుడ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు ఫీజు రూ.1000 + 18 శాతం జీఎస్టీ. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలకు రూ.100 + 18 శాతం జీఎస్టీ.మూడు దశల్లో...


ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఫేజ్‌-1, ఫేజ్‌-2లో ఆన్‌లైన్‌ పరీక్షలు, ఫేజ్‌-3లో ఇంటర్వ్యూ ఉంటాయి. ఫేజ్‌-1లోని ఆన్‌లైన్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. దీంట్లో అర్హత సాధించినవారిని ఫేజ్‌-2కు ఎంపిక చేస్తారు. దీంట్లోనూ రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలో పాసైనవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీంట్లో అర్హత సాధించినవారిని ఆఫీసర్స్‌ గ్రేడ్‌-ఎగా నియమిస్తారు. వీరికి రెండేళ్ల ప్రొబేషన్‌ ఉంటుంది. 

ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉండే సెబి కార్యాలయాల్లో ఎక్కడైనా నియమించవచ్చు, బదిలీ చేయొచ్చు. 

 వేతన శ్రేణి రూ.44,500- 89,150 వరకూ ఉంటుంది. నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్, గ్రేడ్‌ స్పెషల్, ఫ్యామిలీ, లోకల్, లెర్నింగ్, స్పెషల్‌ గ్రేడ్‌ అలవెన్స్‌లు ఉంటాయి. అవకాశాన్ని బట్టి వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. 

ఉచిత శిక్షణ: ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/ పీడబ్ల్యూబీడీలకు ఉచిత ప్రీ-ఎగ్జామినేషన్‌ శిక్షణ సదుపాయం ఆన్‌లైన్‌ విధానంలో అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోదలిచినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపే సమయంలోనే అవసరమైన వివరాలను నింపాలి. 

 ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నగరాల్లో నిర్వహిస్తారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: తర్వాత ప్రకటిస్తారు. 

వెబ్‌సైట్‌: https://www.sebi.gov.in


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

‣ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

Posted Date : 17-04-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌