• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పాఠాలు గుర్తుండాలంటే..!

విద్యార్థులను ఎక్కువగా భయందోళనలకు గురిచేసేది... పరీక్షల్లో వచ్చే మతిమరుపు. చదివిన పాఠ్యాంశాలు మర్చిపోకుండా ఉండాలంటే కొన్ని సూచనలను పాటించాలంటున్నాయి అధ్యయనాలు

మనిషి మెదడు పదాల కంటే చిత్రాలను త్వరగా గుర్తుంచుకుంటుంది. కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటున్న విషయాన్ని చిత్రం రూపంలో ఊహించుకుంటే ఫలితం ఉంటుంది. 

కొన్ని పదాల్లోని మొదటి అక్షరాలను కలిపి కొత్త పదాన్ని తయారుచేసుకుంటే గుర్తుండిపోతుంది. .  

గుర్తుపెట్టుకోవాలనుకుంటున్న విషయాల చుట్టూ ఆసక్తికరమైన ఓ కథను అల్లుకోవాలి. అప్పుడిక మర్చిపోవటం ఉండదు.  

ఒక విషయాన్ని నేర్చుకునే క్రమంలో... కొత్త విషయాన్ని మీకు అంతకుముందే తెలిసిన పాత విషయంతో జతచేయాలి. అప్పుడు కొత్త విషయం వెంటనే గుర్తుకువస్తుంది. 

ఎప్పుడూ ఒకే ప్రదేశంలో చదవకుండా మారుతూ ఉండాలి. ఒకే విషయాన్ని వేర్వేరు ప్రదేశాల్లో చదవడానికి ప్రయత్నించాలి. 

నేర్చుకోవడానికి కష్టంగా ఉన్నవాటిని నిద్రపోవడానికి కాస్త ముందు చదవాలి. ఇలా చదివిన విషయాలు ఎక్కువకాలం జ్ఞాపకం ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 

రికార్డింగ్‌ లెక్చర్‌ వినడానికి ముందూ, నిర్వచనాలూ సమీకరణాలూ చదవడానికి ముందూ కాస్త నడిస్తే ప్రయోజనం ఉంటుంది. 

నిశ్శబ్దంగా చదివే కంటే బయటికి చదవడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. 

విషయాన్ని అర్థం చేసుకోకుండా బలవంతంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. అర్థంచేసుకుని చదివిన విషయం ఎక్కువకాలంపాటు గుర్తుంటుంది. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

చదివింది గుర్తుంచుకోవడం ఎలా? - వీడియో

‣ లక్ష్య సాధనకు సరైన ఆయుధం చదువు

‣ ప్రతికూల ఆలోచనలు వేధిస్తున్నాయా?

‣ శ్రద్ధగా.. చురుగ్గా చదవలేకపోతున్నారా ?

‣ నోట్సు రాయడం ఎలా ?

‣ అనువుగా.. ఆన్‌లైన్‌ అభ్యాసం!

‣ పాఠాలపై దృష్టి నిలవటంలేదా?

‣ ఎంత చదివినా గుర్తుండటం లేదా?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌