• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నలుగురితో కలిసిపోండి!

విద్యార్థులందరూ ఒకేలా ఉండరు కదా... కొందరు త్వరగా నలుగురితో కలిసిపోతారు. మరికొందరు కలవలేరు. కొత్తవారితో మాట్లాడాలంటే వీరికి విపరీతమైన మొహమాటం, బిడియం. దీంతో పరిచయాలనూ పెంచుకోలేక ఇబ్బందిపడుతుంటారు. 

నలుగురితో కలిసి పనిచేయడమనేది విద్యార్థులకు తప్పనిసరిగా ఉండాల్సిన నైపుణ్యం. రికార్డులు రాయడం, అసైన్‌మెంట్లు, ప్రాజెక్టు వర్క్‌లు పూర్తిచేయడం లాంటివన్నీ కలసికట్టుగానే చేయాలి. 

తరగతిలో చివరి బెంచీలో కూర్చుని ఏదో బలవంతాన వచ్చామా.. వెళ్లామా అన్నట్టుగా ఉండకూడదు. తోటి విద్యార్థులతో మెల్లగా మాటలు కలపాలి. అవి పాఠాలు, అసైన్‌మెంట్లు, పరీక్ష తేదీలు.. వీటికి సంబంధించిన సందేహాలైనా కావచ్చు. వీటిని మనసులోనే పెట్టుకుని ఇబ్బందిపడకుండా అడగడం వల్ల పరిచయాలూ పెరుగుతాయి. ఆ తర్వాత కొంతకాలానికి అది స్నేహంగానూ మారొచ్చు.

తరగతులు అయిపోగానే తిన్నగా ఇంటికి లేదా హాస్టల్‌కు వెళ్లకూడదు. మీకు ఆసక్తి ఉన్న క్రీడను సాధన చేయొచ్చు. అభిరుచులను కొనసాగించడం వల్లా పరిచయాలు పెరుగుతాయి. ఉదాహరణకు మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే లైబ్రరీకి వెళతారు. అక్కడి పుస్తక ప్రియులతో మీకు పరిచయం కలగొచ్చు. 

మీ స్నేహితులు వారి పరిచయస్తులతో బయటకు వెళుతుంటే మీరూ వారి వెంట వెళ్లొచ్చు. దీంతో కొత్తవారితో మీకూ పరిచయం అవుతుంది. మీ అంతట మీరుగా ఇతరులతో కలవలేనప్పుడు ఈ పద్ధతి వల్ల లాభం ఉంటుంది.

మీ అభిరుచులకు అనుగుణంగా బృందంగా ఏర్పడి వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీల్లో పాల్గొనవచ్చు. ఇలా చేయడం వల్ల నలుగురితో మాట్లాడటం, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లగలిగే నేర్పు అలవడుతుంది. 

సమస్య మన ఒక్కరికే ఉందని సరిపెట్టుకోకూడదు. ఇదే సమస్యను తోటి విద్యార్థులు, సీనియర్లు ఎలా పరిష్కరించుకున్నారో తెలుసుకోవాలి. వారి అనుభవాల నుంచి కూడా పరిష్కారాలను తెలుసుకోవచ్చు.  

కొన్ని విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్‌ సేవలూ అందుబాటులో ఉంటాయి. వారి సహకారంతో ఒంటరితనం, ఆందోళన, ఒత్తిడి.. లాంటి సమస్యలను అధిగమించే మార్గాల గురించీ తెలుసుకోవచ్చు. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విదేశీ ఉద్యోగాల కోసం మోసపోవద్దు!

‣ డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులకు డిమాండ్‌!

‣ నగలకు నగిషీలు చెక్కే నిపుణులు

‣ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు ముందు ఏం చేయాలి?

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు ఎలా చ‌ద‌వాలి?

‣ సృజ‌నాత్మ‌క‌త‌కు స్వాగ‌తం!

Posted Date : 12-10-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌