• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

భూవిజ్ఞానశాస్త్రం (ఎర్త్‌ సైన్సెస్‌) మంత్రిత్వ శాఖకు అనుబంధంగా నిర్వహిస్తున్న ‘ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌’ (ఐఎన్‌సీవోఐఎస్‌) సంస్థ తాత్కాలిక ప్రాతిపదికన 138 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2021 నుంచి 2026 వరకూ ప్రభుత్వ అనుమతి లభించిన ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


హైదరాబాద్‌ కేంద్రంగా ఈ సంస్థను 2007లో నెలకొల్పారు. ఇది సముద్రాలను పరిశీలించడం, వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, సునామీ వంటి విపత్తులను ముందుగా పసిగట్టడం, ఫిషింగ్‌ జోన్లను గుర్తించడం వంటి వివిధ విధులతోపాటు ఇతర ప్రాజెక్టులు, పరిశోధనలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఉన్న పోస్టులను మొదట ఒక ఏడాది కాలానికి భర్తీ చేస్తారు. తదుపరి సంస్థ అవసరాలు, అభ్యర్థి ప్రదర్శనను అనుసరించి ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ కొనసాగిస్తారు.


వయసు: పోస్టును అనుసరించి 35 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. 


ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా...


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో...

దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్‌ 9

అర్హత: ఏదైనా డిగ్రీ, బీఎస్సీ, సివిల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (టెక్‌), ఎంటెక్‌ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు అనుభవం ఉండాలి. పీహెచ్‌డీ ఉండటం అదనపు అర్హత. (పీహెచ్‌డీని మూడేళ్ల అనుభవంగా పరిగణిస్తారు)


జీతభత్యాలు: పోస్టును అనుసరించి నెలవారీ వేతనం 18,000/- నుంచి 78,000/- వరకూ ఉంటుంది. అదనంగా హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.


పరీక్ష విధానం: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులకు సాధారణంగా ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్‌  చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌ను రెండు విభాగాలుగా ఇస్తారు. పార్ట్‌-ఎలో జనరల్‌ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంగ్లిష్‌ అంశాలపై 60 మార్కులకు ప్రశ్నలుంటాయి. పార్ట్‌-బిలో జనరల్‌ సైన్స్‌ అంశాలపై 40 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఎక్కువ పోస్టులు మాస్టర్స్‌ డిగ్రీ అర్హతతో ఉండటం వల్ల ప్రశ్నపత్రం కఠినత్వం కూడా పీజీ స్థాయిలో ఉంటుంది. పైన పేర్కొన్న సబ్జెక్టుల్లో దాదాపు ముఖ్యమైన టాపిక్స్‌ అన్నింటిపైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు ఆమేరకు సన్నద్ధం కావాలి.


మరిన్ని వివరాలకు... వెబ్‌సైట్‌ : www.incois.gov.in

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏఐ ట్రెండ్‌.. ఎంఎల్‌ డిమాండ్‌!

‣ కేంద్ర సంస్థల్లో స్టెనోలు!

‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!

‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్‌ డిగ్రీ

Posted Date : 01-09-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌