• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌ఈసీఎల్‌లో కొలువులు

405 ఖాళీల భర్తీకి ప్రకటన

ప్రిపరేషన్‌ విధానం

బిలాస్‌పూర్‌లోని మినీరత్న కంపెనీ ‘సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఎల్‌)’కు సంబంధించి 92 గనులు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిల్లో 70 అండర్‌గ్రౌండ్, 21 ఓపెన్‌కాస్ట్, 1 మిశ్రమ రకానికి చెందినవి. ఈ కంపెనీ తాజాగా మైనింగ్‌ సర్దార్, డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం 405 కొలువుల్లో మైiనింగ్‌ సర్దార్, టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-సి 350 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ఎస్సీలకు 48, ఎస్టీలకు 97, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 42, ఈడబ్ల్యూఎస్‌కు 32, అన్‌రిజర్వుడ్‌కు 131 కేటాయించారు. డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌ - సి పోస్టులు 55 ఉన్నాయి. వీటిల్లో ఎస్సీలకు 7, ఎస్టీలకు 14, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 7, ఈడబ్ల్యూఎస్‌కు 5, అన్‌రిజర్వుడ్‌కు 22 ఉన్నాయి. 

అర్హతలు: 

1. మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. మైనింగ్‌ సర్దార్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, ఫస్ట్‌ఎయిడ్‌ అండ్‌ గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష పాసై మూడేళ్ల మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి ఉండాలి. ఓవర్‌మేన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, ఫస్ట్‌ ఎయిడ్‌ అండ్‌ గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. 

2. డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుకు మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఓపెన్‌ కాస్ట్, అండర్‌గ్రౌండ్‌ కోల్‌మైన్స్‌లో పనిచేసేట్లుగా సర్వే సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. 

అభ్యర్థుల వయసు: 30.01.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.  

ఎంపిక: అభ్యర్థులను రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో.. 100 ప్రశ్నలకు 100 మార్కులు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ఓఎంఆర్‌ షీట్‌పై జవాబులు గుర్తించాలి. నెగెటివ్‌ మార్కులుండవు. 

మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు.. నిర్వహించే రాత పరీక్షలో ఈ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కోల్‌ మైన్స్‌ రెగ్యులేషన్స్‌-1957, మైన్‌ గ్యాసెస్, డిటెక్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్లేమబుల్‌ అండ్‌ నాక్సియస్‌ గ్యాసెస్, మైనింగ్‌ మెథడ్స్, మైన్‌ వెంటిలేషన్, యూజ్‌ ఆఫ్‌ ఎక్విప్‌మెంట్, హేండ్‌ ఓవర్‌ అండ్‌ టేక్‌ ఓవర్‌ ఛార్జ్, యూజ్‌ ఆఫ్‌ బ్లాస్టింగ్‌ కార్డ్స్, ఎక్స్‌ప్లోజివ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ అండ్‌ దెయిర్‌ యూజెస్, డీలింగ్‌ విత్‌ ద అకరెన్స్‌ ఆఫ్‌ ఫైర్, గ్యాస్, ఎయిర్‌-బ్లాస్ట్, ఇన్‌అన్‌డేషన్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్, సపోర్ట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ప్లేసెస్, సేఫ్టీ ప్రొవిజన్స్‌ అండ్‌ ప్రికాషన్స్‌ మొదలైనవి. 

డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుకు.. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్, మైన్‌ గ్యాసెస్, మైనింగ్‌ మెథడ్స్, మైన్‌ వెంటిలేషన్, యూజ్‌ ఆఫ్‌ ఎక్విప్‌మెంట్‌ లైక్‌ ఎనిమోమీటర్, మల్టీ-గ్యాస్‌ డిటెక్టర్, హ్యాండింగ్‌ ఓవర్‌ అండ్‌ టేకింగ్‌ ఓవర్‌ ఛార్జ్, కోల్‌మైన్స్‌ రెగ్యులేషన్స్, యూజ్‌ ఆఫ్‌ బ్లాస్టింగ్‌ కార్డ్స్, ఎక్స్‌ప్లోజివ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ అండ్‌ దెయిర్‌ యూజ్‌ ఇన్‌ కోల్‌ మైన్స్, డీలింగ్‌ విత్‌ ద అకరెన్స్‌ ఆఫ్‌ ఫైర్, డిటెక్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్లేమబుల్‌ అండ్‌ టాక్సిక్‌ గ్యాసెస్‌ ఇన్‌ కోల్‌ మైన్స్, సేఫ్టీ ప్రొవిజన్స్‌ అండ్‌ ప్రికాషన్స్‌ ఇన్‌ అండర్‌గ్రౌండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్, థర్మల్‌ ఇంజినీరింగ్, కాంక్రీట్‌ టెక్నాలజీ, ఇరిగేషన్‌ ఇంజినీరింగ్, ది స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్, సివిల్‌ ఇంజినీరింగ్‌ డ్రాయింగ్, ది డిజైన్‌ ఆఫ్‌ స్టీల్‌ అండ్‌ మేసన్రీ స్ట్రక్చర్, ఎన్విరాన్‌మెంటల్‌ పొల్యూషన్‌ అండ్‌ కంట్రోల్, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.  

రాత పరీక్షలో సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలే కాకుండా.. జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ సైన్స్, కరెంట్‌ అఫైర్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఇస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌లో.. ఇండియన్‌ హిస్టరీ, పాలిటిక్స్, జాగ్రఫీ, ఆర్ట్స్, కల్చర్‌; జనరల్‌ సైన్స్‌లో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, డిఫెన్స్, అగ్రికల్చర్, స్పేస్, ఎన్విరాన్‌మెంట్, బయాలజీ; కరెంట్‌ అఫైర్స్‌లో.. ఎకానమీ, అవార్డ్స్, బ్యాంకింగ్, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్, కరెంట్‌ ఈవెంట్స్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.  

ఎలా సన్నద్ధం కావాలి?

రోజూ వార్తాపత్రికలను చదవడం వల్ల వర్తమానాంశాలపై పట్టు సాధించవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే స్పష్టత వస్తుంది. దాని ప్రకారం పరీక్షకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావొచ్చు. మాక్‌ టెస్టులను రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చేసిన పొరపాట్లను తెలుసుకుని.. అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.1180 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

దరఖాస్తును పూర్తిచేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసిన తర్వాత దరఖాస్తు ప్రింటవుట్‌ తీసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి, ఫొటో అంటించి, సంతకం చేసిన దరఖాస్తును రిజిస్టర్డ్‌/ స్పీడ్‌ పోస్టులో పంపాలి. చిరునామా: జనరల్‌ మేనేజర్‌ (పీ/ఎంపీ), ఎస్‌ఈసీఎల్, సీపట్‌ రోడ్, బిలాస్‌పూర్‌ (సీజీ) - 495 006. 

గవర్నమెంట్‌/ సెమీ గవర్నమెంట్‌/ పీఎస్‌యూల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను దరఖాస్తుకు జతచేయాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 23.02.2023 

వెబ్‌సైట్‌: http://www.secl-cil.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతిష్ఠాత్మక బిర్లా సంస్థల్లో ఇంజినీరింగ్‌!

‣ సొంతంగా నైపుణ్యాలకు మెరుగు!

‣ ప్రేమ్‌జీ సంస్థల్లో ప్రతిష్ఠాత్మక కోర్సులు!

‣ విద్యార్థులకు ఏఐ ఎందుకు?

‣ నాణ్యమైన బోధన.. నెలనెలా స్టైపెండ్‌!

‣ చివరివరకూ అంతే ఉత్సాహంగా..

Posted Date : 13-02-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌