• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐటీ సంస్థల్లో ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాల జోరు!

సాఫ్ట్‌వేర్‌ కంపెనీల కొలువుల జాతర మొదలు

విఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో కొలువుల జాతర మొదలైంది. అన్ని సంస్థలూ ఎక్కువ సంఖ్యలో ఆఫ్‌ క్యాంపస్‌ విధానంలో నియామకాలను చేపడుతున్నాయి. వీటికి ఎవరైనా పోటీ పడవచ్చు. 2019, 2020, 2021లో డిగ్రీలు పూర్తిచేసుకున్న వారితోపాటు 2022లో చదువు పూర్తిచేసుకోబోతున్నవారికీ అవకాశం కల్పిస్తున్నాయి. మరి మీరు సిద్ధంగా ఉన్నారా?

టీసీఎస్‌ స్వాగతం

మీరు బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులు 2019/2020/2021లో పూర్తి చేసుకున్నారా? ఐటీలో కనీసం ఆరు నెలల అనుభవం ఉందా? అయితే మీకోసమే విఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఎదురు చూస్తోంది. ఆఫ్‌ క్యాంపస్‌ డిజిటల్‌ హైరింగ్‌ ప్రకటన విడుదల చేసింది. పరీక్షలో ప్రతిభ చూపి ఎంపికైతే రూ.7 లక్షల నుంచి 7.3 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఇందుకోసం ముందుగా నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు (ఎన్‌క్యూటీ)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అందులో చూపిన ప్రతిభతో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. 

ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందుగా టీసీఎస్‌ నెక్స్‌స్టెప్‌ పోర్టల్‌లోకి వెళ్లాలి. అందులో రిజిస్టర్‌ నౌ క్లిక్‌ చేసి ఐటీ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ వివరాలు నమోదు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ సార్లు పేరు నమోదు చేసుకుంటే అనర్హులుగా పరిగణిస్తారు. పరీక్ష రిమోట్‌ విధానంలో ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు టీసీఎస్‌ అయాన్‌ ద్వారా తెలుపుతారు.

పరీక్ష ఇలా

టీసీఎస్‌ అయాన్‌ ద్వారా దీన్ని నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 110 నిమిషాలు. ఇందులో అడ్వాన్స్‌డ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40, వెర్బల్‌ ఎబిలిటీ 10, అడ్వాన్స్‌డ్‌ కోడింగ్‌ 60 నిమిషాల వ్యవధితో ఉంటాయి. టీసీఎస్‌ రెజొనెన్స్‌ ద్వారా పరీక్షకు సన్నద్ధత కావచ్చు. ఇందులో డిజిటల్‌ టెస్ట్‌ ప్రిపరేషన్‌ సిరీస్‌లు ఉంటాయి. వాటిని బాగా సాధన చేస్తే పరీక్షలో విజయం సాధించడానికి వీలవుతుంది. టెస్టు షెడ్యూల్‌ వివరాలు ఈమెయిల్‌కు అందుతాయి. అలాగే పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ వివరాలూ ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. ఇంటర్వ్యూ సమయానికి అన్ని సర్టిఫికెట్లూ అందుబాటులో ఉండాలి. 

ఇవీ అర్హతలు

పది, ఇంటర్మీడియట్‌/ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ (చదివినట్లైతేనే)లో 70 శాతం మార్కులు తప్పనిసరి. ఆయా కోర్సులను కేటాయించిన వ్యవధిలోనే పూర్తిచేసుకున్నవారై ఉండాలి. బ్యాక్‌లాగ్స్‌ ఉండకూడదు. విద్యా సంవత్సరాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ వ్యవధి ఖాళీగా ఉండరాదు. ఫుల్‌ టైమ్‌ కోర్సులు చదివినవారే అర్హులు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదువుకున్నా పర్వాలేదు. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఐటీలో పని అనుభవం తప్పనిసరి. వయసు 28 ఏళ్లకు మించరాదు. ఇంజినీరింగ్‌లో యూజీ లేదా పీజీ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఎస్, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌-ఎంఎస్, ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌-ఎంటెక్‌ వీటిలో ఏదైనా కోర్సు పూర్తిచేసుకున్నవారై ఉండాలి. 

రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: ఫిబ్రవరి 25.

పరీక్ష తేదీలు: తర్వాత ప్రకటిస్తారు. 

వెబ్‌సైట్‌: https://www.tcs.com/careers/tcs-digital-hiring

మైక్రోసాఫ్ట్‌ లో..

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ విధానంలో 2022లో కోర్సులు పూర్తిచేసుకుంటున్నవారికి అవకాశం కల్పిస్తోంది. కోడింగ్‌లో నైపుణ్యం, మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్నవారు ప్రయత్నించవచ్చు. 

అర్హత: 7.5 సీజీపీఏతో బీటెక్‌/ఎంటెక్‌/ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఉత్తీర్ణత. 2022 బ్యాచ్‌ విద్యార్థులు మాత్రమే అర్హులు. 

పని ప్రదేశాలు: హైదరాబాద్, బెంగళూరు, నోయిడా. 

వెబ్‌సైట్‌: https://careers.microsoft.com/us/en

ఇవే కాకుండా ఐబీఎం, డెల్, ఇంటెల్‌...తదితర సంస్థలు ఇటీవల కాలంలో బీటెక్‌ పూర్తిచేసుకున్న, 2022లో పూర్తిచేసుకోబోతున్న విద్యార్థుల కోసం అవకాశాలు అందిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఆయా సంస్థల వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేసుకోవచ్చు. 

యాక్సెంచర్‌ లో..

తమ సంస్థలోని ఆధునిక సాంకేతిక కేంద్రాల్లో పనిచేయడానికి నైపుణ్యం ఉన్న మానవ వనరులను యాక్సెంచర్‌ ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్నవారికి అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌గానూ, బీఏ, బీకాం, బీవోక్, బీఎస్సీ, బీసీఏ చదువుకున్నవారికి సిస్టమ్‌ అండ్‌ అప్లికేషన్‌ సర్వీసెస్‌ అసోసియేట్‌గానూ అవకాశం కల్పిస్తోంది.  

అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌: 2019, 2020, 2021లో బీఈ/బీటెక్‌ కోర్సులు పూర్తి చేసుకున్న అన్ని బ్రాంచీల విద్యార్థులూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే విభాగంలో పీజీ వాళ్లకోసం ప్రత్యేకంగా నియామకాలు చేపడుతున్నారు. ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ (సీఎస్‌సీ/ఐటీ) కోర్సులు 2019/ 2020/ 2021లో పూర్తిచేసుకున్నవారు వీటికి అర్హులు.

సిస్టమ్‌ అండ్‌ అప్లికేషన్‌ సర్వీసెస్‌ అసోసియేట్‌: తక్కువ స్థాయిలో కోడింగ్, ఆటోమేషన్‌ టెస్టింగ్‌ల్లో వీరికి అవకాశం కల్పిస్తారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీవోక్‌ కోర్సులను ఫుల్‌ టైమ్‌ విధానంలో చదువుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే విభాగంలో పీజీ వాళ్లకోసం ప్రత్యేకంగా నియామకాలు చేపడుతున్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీఎం, ఎంఎఫ్‌ఎ కోర్సులు 2019/ 2020/ 2021లో పూర్తిచేసుకున్నవారు అర్హులు.

దివ్యాంగుల కోసం: ఈ సంస్థ దివ్యాంగుల కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 2019, 2020, 2021లో కోర్సులు పూర్తిచేసుకున్నవారితోపాటు 2022లో పూర్తి చేసుకోబోతున్నవారికీ ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు. 

వెబ్‌సైట్‌: https://www.accenture.com/in-en
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మర్యాదలకూ మేనేజర్లు!

‣ సమయం ఇలా సద్వినియోగం!

‣ బ్లాక్‌ టెక్నాలజీలో కొలువుల చెయిన్‌!

‣ IISC: ఐఐఎస్సీలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

‣ సివిల్స్‌... గ్రూప్స్‌ ఏది మీ టార్గెట్‌?

‣ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమేనా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌