• facebook
  • whatsapp
  • telegram

ఏఎఫ్‌క్యాట్‌తో ఫ్ల‌యింగ్ ఆఫీస‌ర్లు 

ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) పేరుతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రత్యేకంగా ఏడాదికి రెండు సార్లు పరీక్ష నిర్వహిస్తోంది. ఏటా జూన్‌, డిసెంబరుల్లో ఈ పరీక్ష ప్రకటన వెలువడుతుంది. ఇందులో పలు రకాల పోస్టులు ఉంటాయి. వీటిలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ (పైలట్‌) ఒకటి. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ విధానంలో ఎంపికైనవారు 14 ఏళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ కాడెట్‌ కార్ప్‌ (ఎన్‌సీసీ)-సీ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ద్వారా పైలట్‌ కావచ్చు. ఈ నియామకాలు కూడా ఏఎఫ్‌క్యాట్‌ తోనే చేపడతారు.


అర్హత: ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా సాధారణ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరి. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.


వయసు: 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు: కనీసం 162.5 సెం.మీ. ఉండాలి.


రాత పరీక్ష: వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలడుగుతారు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులకు ఇంటెలిజెన్స్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి సైకలాజికల్‌ టెస్ట్‌, బృంద పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. చివరగా పైలట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టులోనూ అర్హత సాధిస్తే పైలట్‌ శిక్షణకు ఎంపిక చేస్తారు.


శిక్షణ: ముందుగా ఆరు నెలల పాటు ప్రాథమిక శిక్షణ నిర్వహిస్తారు. సాధారణంగా దీన్ని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ - దుండిగల్‌, హాకింపేట్‌, ఎలహంక, బీదర్‌ల్లో చేపడతారు. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం ఫైటర్‌ పైలట్‌, ట్రాన్స్‌ పోర్ట్‌ పైలట్‌, హెలికాప్టర్‌ పైలట్లుగా విడదీసి అందుకుతగ్గ శిక్షణను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఈ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.


 

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌