• facebook
  • whatsapp
  • telegram

ఘన మూలాలు కనుక్కుందాం!

పోటీ పరీక్షల్లో లెక్కల చిట్కాలు

పోటీ పరీక్షల్లో సంఖ్యల ఘన మూలాలు (క్యూబ్‌ రూట్స్‌) తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సింప్లిఫికేషన్స్‌ ప్రశ్నలు సాధించేటప్పుడు కొన్ని సందర్భాలలో వీటి అవసరం ఉంటుంది. కచ్చితమైన ఘనం అయినటువంటి సంఖ్య ఘనమూలం కనుక్కునే పద్ధతిని తెలుసుకుందాం. 

సంఖ్య ఘనమూలాన్ని సులభంగా కింది అంచెల్లో కనుక్కోవచ్చు...

ఇచ్చిన సంఖ్యను కుడివైపు భాగంలో మూడు అంకెలు ఉండే విధంగా రెండు భాగాలుగా చేసుకోవాలి. ఎడమవైపు భాగంలో ఎన్ని అంకెలైనా ఉండొచ్చు. 

కుడివైపు భాగంలోని మూడు అంకెల్లో చివరగా ఉండే అంకెను బట్టి జవాబులోని చివరి అంకె ఉంటుంది. 

కుడి భాగంలోని చివరి అంకె 1, 4, 5, 6, 9 లేదా ‘0’ గా ఉంటే జవాబులో కూడా చివరి అంకె అదే అవుతుంది.

కుడిభాగంలోని చివరి అంకె 2 అయితే జవాబులోని చివరి అంకె 8; 8 అయితే 2 అవుతాయి. అదేవిధంగా 3 అయితే 7; 7 అయితే 3గా ఉంటాయి. 

తర్వాత ఇచ్చిన సంఖ్యలోని ఎడమ భాగం ఏ రెండు కచ్చితమైన సంఖ్యల ఘనాల మధ్య ఉంటుందో దానిలోని చిన్న సంఖ్య, జవాబులోని తొలి భాగం అవుతుంది. 

ఉదాహరణకు 21952 ఘనమూలం తెలుసుకోవటం ఎలాగో చూద్దాం. 

21952ను కుడివైపున మూడు అంకెలు ఉండేలా రెండు భాగాలు చేయాలి. 

21 | 952

దీనిలో కుడివైపున ఉన్న 952లో చివరి అంకె ‘2’ కాబట్టి జవాబులోని చివరి అంకె ‘8’ అవుతుంది. 

ఇచ్చిన సంఖ్యలోని ఎడమ భాగం ‘21’. 2 ఘనం (8); ‘3’ ఘనం (27)ల మధ్య ఉంది. 2, 3లలో చిన్న సంఖ్య ‘2’ జవాబులోని తొలి భాగం అవుతుంది. కాబట్టి 28 జవాబు. 

21952 ఘనమూలం 28.

205379 ఘన మూలం తెలుసుకుందాం. 

205 | 379

కుడిభాగంలోని 379లోని చివరి అంకె ‘9’. కాబట్టి జవాబులోని చివరి అంకె కూడా ‘9’ 

ఎడమవైపు భాగం 205; 5 ఘనం (125), 6 ఘనం (216)ల మధ్య ఉంది. ఈ రెండింటిలో చిన్న సంఖ్య ‘5’ జవాబు తొలి భాగం అవుతుంది.

కాబట్టి 59 జవాబు. 

కచ్చితమైన ఘనం అయినటువంటి ఏ సంఖ్యకైనా ఘనమూలాన్ని ఈ పద్ధతిలో చాలా తేలికగా తెలుసుకోవచ్చు. 

Posted Date : 11-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌