• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Navy: ఇండియన్ నేవీలో సెయిలర్ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ) పోస్టులు 

భారత నౌకాదళం.. సెయిలర్ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ 02/2024 బ్యాచ్) ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. జులై 20 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. 10+2 ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకటన వివరాలు:

* సెయిలర్‌- స్పోర్ట్స్ కోటా ఎంట్రీ- 02/2024 బ్యాచ్

ఖాళీలు:

1. డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్ (స్పోర్ట్స్ ఎంట్రీ)

2. చీఫ్ పెట్టీ ఆఫీసర్ (స్పోర్ట్స్ ఎంట్రీ)

క్రీడాంశాలు: అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్, గోల్ఫ్, టెన్నిస్, సెయిలింగ్ తదితరాలు.

అర్హత: 10+2 ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్‌/ జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులై ఉండాలి.

వయస్సు: 17 1/2 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థి 01 నవంబర్ 1999 - 30 ఏప్రిల్ 2007 మధ్య జన్మించి ఉండాలి.

కనీస ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం.మీ, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: స్పోర్ట్స్‌ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

శిక్షణ: ఐఎన్‌ఎస్‌ చిల్కా, ఒడిశాలో.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సెక్రటరీ, ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, 7వ అంతస్తు, చాణక్య భవన్, నౌకాదళ ప్రధాన కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ, న్యూదిల్లీ చిరునామాకు పంపాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-07-2024.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!



Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 26-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :