• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్‌ మ్యుజీషియన్‌) పోస్టులు 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా.. భారత నౌకాదళంలో అగ్నివీర్(ఎంఆర్‌ మ్యుజీషియన్‌) ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్(ఎంఆర్‌ మ్యుజీషియన్‌) ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2024 (నవంబర్‌ 24) బ్యాచ్‌ పేరున శిక్షణ ఉంటుంది. జులై 1 నుంచి 11 వరకు దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు:

* అగ్నివీర్ (మెట్రిక్‌ రిక్రూట్‌- ఎంఆర్‌ మ్యుజీషియన్‌): 02/2024 (నవంబర్‌ 24) బ్యాచ్‌

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతో పాటు మ్యూజికల్ ఎబిలిటీ, మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు: అభ్యర్థి 01.11.2003 – 30.04.2007 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు, మహిళల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్ మార్కులు, స్టేజ్-1 (ప్రిలిమినరీ స్క్రీనింగ్), స్టేజ్ II (ఫైనల్ స్క్రీనింగ్), మ్యూజిక్ స్క్రీనింగ్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

శిక్షణ: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్‌ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 11-07-2024.

శిక్షణ ప్రారంభం: 2025, నవంబర్‌ నెలలో.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 26-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :