• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IAF: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు(02/ 2025) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

* ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్ వాయు(02/ 2025) బ్యాచ్ నియామకం

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/  తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 03-07-2004 నుంచి 03-01-2008 మధ్య జన్మించి ఉండాలి.

ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష ఫీజు: రూ.550.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08-07-2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 28-07-2024.

ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 18-10-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 18-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :