Q.

‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బుద్ధిజం’గా ఏ గ్రంథాన్ని పిలుస్తారు?

  • బుద్ధచరితం
  • సుహృల్లేఖ
  • వినయ పీఠిక
  • మహావిభాష శాస్త్రం
Answer: మహావిభాష శాస్త్రం

Q.

జాతీయ అత్యవసర పరిస్థితుల్లో విధానసభ కాలపరిమితిని పార్లమెంటు ఎన్నేళ్లకు పొడిగించొచ్చు?

  • 6 నెలలు
  • ఏడాది
  • 2 సంవత్సరాలు
  • 5 నెలలు
Answer: ఏడాది

Q.

కొంత సొమ్ముపై 15% వడ్డీరేటు చొప్పున రెండేళ్లకు అయ్యే చక్రవడ్డీ, బారువడ్డీల తేడా రూ.180. అయితే అసలు ఎంత?

  • రూ.8,000
  • రూ.10,000
  • రూ.12,000
  • రూ.9,000
Answer: రూ.8,000

Q.

యూక్లిడ్‌ రాసిన ఎలిమెంట్స్‌ గ్రంథంలోని 13 భాగాల్లో 5వ భాగంలో ఉన్న అంశం ఏది?

  • సరూప త్రిభుజాలు
  • ప్రాచీన సంఖ్యా సిద్ధాంతం
  • త్రిపరిమాణ జ్యామితి
  • అనుపాతం
Answer: అనుపాతం

Q.

సముద్రపు నీటి pH విలువ?

  • 5.6
  • 6.7
  • 7.8
  • 4.2
Answer: 7.8

Q.

మంత్రిమండలి సభ్యుల సంఖ్యపై పరిమితిని విధించిన రాజ్యాంగ సవరణ?

  • 93వ
  • 91వ
  • 96వ
  • 89వ
Answer: 91వ

Q.

కిందివాటిలో సమగ్ర శిక్షా అభియాన్‌కు సంబంధించి సరికానిది?

  • ఉపాధ్యాయుల నియామకం
  • పాఠ్యపుస్తకాల పంపిణీ
  • అదనపు తరగతి గదుల నిర్మాణం
  • ఉపాధ్యాయుల జీతభత్యాల ఏర్పాటు
Answer: ఉపాధ్యాయుల జీతభత్యాల ఏర్పాటు

Q.

కిందివాటిలో రసాయన ఆవరణం అని దేన్ని పిలుస్తారు?

  • థర్మో ఆవరణం
  • మీసో ఆవరణం
  • స్ట్రాటో ఆవరణం
  • ట్రోపో ఆవరణం
Answer: మీసో ఆవరణం

Q.

ఫిరోజ్‌ షా తుగ్లక్‌ పేదల సంక్షేమం కోసం స్థాపించిన శాఖ?

  • దివాన్‌-ఇ-ఖైరాత్‌
  • దార్‌-ఉల్‌-షిఫా
  • దివాన్‌-ఇ-కోహి
  • పైవన్నీ
Answer: దివాన్‌-ఇ-ఖైరాత్‌

Q.

ప్రపంచంలో మొదటిసారిగా తయారుచేసిన కృత్రిమ దారం?

  • నైలాన్‌
  • రేయాన్‌
  • ఆక్రలిన్‌
  • పాలిస్టర్‌
Answer: నైలాన్‌