Post your question

    Asked By: డి. అశోక్‌

    Ans:

    మీరు బీఏలో మూడో సబ్జెక్ట్‌గా చదువుతున్న ఆర్థికశాస్త్రంతో  ప్రత్యేకించి ఉద్యోగాలు ఉండవు. కానీ డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకూ మీరు అర్హులే. ఎకనామిక్స్‌లో నాలుగు సంవత్సరాల బీఏ ఆనర్స్‌ కానీ, రెండు సంవత్సరాల పీజీ కానీ చదివితే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువుంటాయి. బీఏ తరువాత మంచి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్‌ చదివితే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎంఏ ఎకనామిక్స్‌ చదివినవారు యూపీఎస్‌సీ నిర్వహించే ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ పరీక్షకు అర్హులు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నాబార్డ్, ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వే లాంటి సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగం పొందవచ్చు. పీజీలో ఎకనామిక్స్‌ చదివితే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ రంగాల్లో, స్వచ్ఛంద సంస్థల్లో, పరిశోధన, బిజినెస్‌ అనలిటిక్స్, బోధన, వ్యాపార పత్రికారంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎంఏ ఎకనామిక్స్‌ చదివినవారు ఎకనమిస్ట్‌గా, మార్కెట్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌గా, క్రెడిట్‌ అనలిస్ట్‌గా, రిస్క్‌ అనలిస్ట్‌గా, ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌గా, ఎకనమిక్‌ కంటెంట్‌ రైటర్‌గా పనిచేయవచ్చు. డేటా సైన్స్, ఆక్చూరియల్‌ సైన్స్, ఇన్సూరెన్స్‌ల్లో సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వీటితో పాటు ఎంఎస్‌ ఎక్సెల్, ఎస్‌పీఎస్‌ఎస్, జమోవి, బ్లూస్కై స్టాటిస్టిక్స్, ఈ వ్యూస్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌లపై పట్టు సాధిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. దిలీప్‌సాయి

    Ans:

    మీరు ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో ఉన్నారు కాబట్టి, ఇప్పటినుంచే ఎంఎస్‌ కోర్సు చదవడానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలుపెట్టండి. కెనడాలో ఎంఎస్‌ చేయాలంటే జీఆర్‌ఈ స్కోర్‌ తోపాటు, టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ అవసరం. వీటిల్లో మంచి స్కోర్‌ సంపాదిస్తే ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశంతోపాటు, స్కాలర్‌షిప్‌ కూడా లభించే అవకాశం ఉంది.
    కొన్ని యూనివర్సిటీలు టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ల్లో వచ్చిన స్కోర్‌తోనూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కెనడాతో పోలిస్తే జర్మనీలో ట్యూషన్‌ ఫీజు నామమాత్రం. జర్మనీలో చాలా యూనివర్సిటీలు ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌ స్కోర్‌ ఆధారంగానే అడ్మిషన్‌లు ఇస్తున్నాయి. కొన్ని జర్మన్‌ యూనివర్సిటీలు మాత్రం  ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌తో పాటు జీఆర్‌ఈ స్కోర్‌ కూడా పరిగణనలోకి తీసుకొంటున్నాయి.
    ముందుగా ఏ దేశంలో, ఏయే యూనివర్సిటీలో ఎంఎస్‌ని ఏ స్పెషలైజేషన్‌తో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్ళి ఫీజు వివరాలను, ఆ నగరంలో వసతికయ్యే ఖర్చుల వివరాలను తెలుసుకొని, అవసరమైన ఆర్థిక వనరుల గురించి కూడా ఆలోచించండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. అరుణ్‌కుమార్‌

    Ans:

    ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివినవారు డిగ్రీలో సైన్స్‌ చదివే అవకాశం లేదు కానీ, సైన్స్‌ గ్రూప్‌ చదివినవారు, డిగ్రీలో ఆర్ట్స్‌లో చేరొచ్చు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఈ అవకాశం ఉండొచ్చు. కాకపోతే చదవబోయే సైన్స్‌ కోర్సుకు సంబంధించిన కొన్ని ముందస్తు సబ్జెక్టులు చదివివుండాలనే నిబంధన పెట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మాత్రం ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివినవారికి బీఎస్‌సీ ఇంటీరియర్‌ డిజైన్, బీఎస్‌సీ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బి. డిజైన్‌ లాంటి కోర్సులు అందిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌. హరిప్రసాద్‌

    Ans:

    పదో తరగతి చదివాక ప్రభుత్వ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ఎంట్రన్స్‌ పరీక్ష రాసి ప్రవేశం పొందినట్లయితే, ఇంటర్మీడియట్‌ ఉచితంగా, వసతిగృహంలో ఉండి చదివే అవకాశం ఉంది. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీలకు ప్రత్యేకంగా వసతిగృహాలతో కూడిన జూనియర్‌ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కూడా ఇంటర్‌ని ఉచితంగా చదవొచ్చు. హాస్టల్‌తో సంబంధం లేకుండా ఇంటర్‌ను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నామమాత్రపు ఫీజుతో చదువుకోవచ్చు. పద్దెనిమిది సంవత్సరాలు నిండాక ఉద్యోగం కావాలనుకుంటే వొకేషనల్‌ కోర్సులతో ఇంటర్‌ చదవొచ్చు. ఉపాధి త్వరగా లభించే అవకాశాలుంటాయి. ఇంటర్మీడియట్‌ చదివేవారికి వారి సామాజిక, ఆర్థిక నేపథ్యాలను బట్టి ప్రభుత్వ స్టైపెండ్‌ వచ్చే అవకాశం ఉంది. పద్దెనిమిది ఏళ్లకే ఉద్యోగం కావాలనుకొంటే, పదో తరగతి పూర్తయ్యాక పాలిటెక్నిక్‌ కోర్సు చదవొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: యు. నాగేంద్రకుమార్‌

    Ans:

    - బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌) చదివిన తరువాత ఈ మూడు సబ్జెక్టుల్లో దేంట్లోనైనా ఎంఎస్సీ చేసే అవకాశం ఉంది. నిమ్‌సెట్‌ కానీ, ఐసెట్‌ కానీ రాసి ఎంసీఏ కూడా చేయవచ్చు. ఎంఎస్సీ డేటాసైన్స్‌ కూడా చేయొచ్చు. క్యాట్‌/ ఐసెట్‌ రాసి ఎంబీఏ కూడా చేయవచ్చు. కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు గురించి కూడా ఆలోచించవచ్చు. ఆక్చూరియల్‌ సైన్స్‌లో పీజీ చదివే అవకాశం కూడా ఉంది. ఇటీవల కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు ప్రారంభించిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ లాంటి కోర్సులు చేస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీఎస్సీ డిగ్రీ పూర్తయ్యాక బీఈడీ కూడా చేయవచ్చు.

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌   

    Asked By: శ్రీనివాసులు, హైదరాబాద్‌

    Ans:

    మీరు బీఏ చదివి ఆయుర్వేదం, మూలికలపై పట్టు సాధించినా, బీఏఎంఎస్‌ చేయాలంటే జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌లో మెరుగైన ర్యాంకు సాధించాలి. నీట్‌ రాయాలంటే ఇంటర్మీడియట్‌లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు చదివి ఉండాలి. ఎంబీబీఎస్‌ కోర్సు లాగే బీఏఎంఎస్‌ కోర్సును కూడా దూరవిద్యలో చదవడం కుదరదు. కొన్ని ప్రైవేటు సంస్థలు బీఏఎంఎస్‌ను దూరవిద్యలో అందిస్తామని ఇంటర్నెట్‌లో ప్రకటనలు ఇస్తున్నాయి. అలాంటివాటిని చూసి మోసపోకండి. ఇంజినీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్‌మెంట్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌ పద్ధతిలో చదవడమే శ్రేయస్కరం. ఆగ్జిలరీ నర్స్‌ మిడ్‌వైఫ్‌ (ఏఎన్‌ఎం)గా పనిచేస్తున్న వారికోసం ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 6 నెలల కాల వ్యవధితో సర్టిఫికెట్‌ ఇన్‌ ఆయుష్‌ నర్సింగ్‌ (ఆయుర్వేద) అందుబాటులో ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: డి.వి. రఘురామ్‌

    Ans:

    అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఒక సంవత్సరం వ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమాను ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ దూరవిద్యలో అందిస్తోంది. అతి తక్కువ ప్రైవేటు యూనివర్సిటీలు ఈ కోర్సులను దూరవిద్యలో అందిస్తున్నాయి. అలాంటి విశ్వవిద్యాలయాలను ఎంచుకొనేముందు వాటి విశ్వసనీయతను పరీక్షించుకోండి. అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, టౌన్‌ ప్లానింగ్, కంట్రీ ప్లానింగ్‌ లాంటి కోర్సులను రెగ్యులర్‌గా చదవడమే  మేలు. ఈ కోర్సులను  ప్రముఖ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సాంకేతిక విశ్వవిద్యాలయాలు, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్‌ కాలేజీలు రెగ్యులర్‌ విధానంలో అందిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: నానాజీ

    Ans:

    బీఎస్సీ కార్డియాక్‌ పల్మనరీ పర్‌ఫ్యూజన్, బీఎస్సీ ఈసీజీ అండ్‌ కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ, బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, కోర్సులు నాలుగు సంవత్సరాల కాలవ్యవధితో  శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, తిరుపతిలో అతి తక్కువ సీట్లతో అందుబాటులో ఉన్నాయి. నాలుగు సంవత్సరాల్లో మొదటి మూడు సంవత్సరాలు కోర్స్‌ వర్క్‌ , చివరి సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ ఉంటాయి. పైన చెప్పిన అన్ని కోర్సులకూ  ఇంటర్మీడియట్‌లో బైపీసీ లేదా ఇంటర్‌ వొకేషనల్‌ అండ్‌  బ్రిడ్జ్‌ కోర్సు చదివివుండాలి. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సుకు మాత్రం ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చదివినవారు కూడా అర్హులే. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర రాష్ట్రాల్లో, అతి తక్కువ ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీల/కళాశాలల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాకే కోర్సులో ప్రవేశం పొందండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌