Post your question

 

    Asked By: GANJALLA

    Ans:

    In Telangana JL exam notification was given. Waiting for DL. Need to wait for some more time.

    Asked By: Ramesh

    Ans:

    Right now no option given to download e-Books.

    Asked By: Charan

    Ans:

    ఆప్షన్ పెట్టుకోవచ్చు.

    Asked By: Dhana Lakshmi

    Ans:

    ఏదైనా డిగ్రీ అని అర్హత ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికీ మీరు అర్హులే.

    Asked By: గణేష్‌

    Ans:

    బయోటెక్నాలజీలో పీజీ కోర్సు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లో, ప్రైవేటు కళాశాలల్లో ఉంది. తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ కాకినాడ/ అనంతపురం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సు చదివే అవకాశం ఉంది. బయోటెక్‌ పీజీ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. సీడ్, బయోటెక్‌ కంపెనీలు, వ్యవసాయ పరిశోధన సంస్థలు, పుడ్‌ పరిశ్రమలు, బయో ప్రాసెసింగ్, ఫార్మా, కెమికల్‌ కంపెనీలు, ఎన్విరాన్‌మెంటల్‌ రిసెర్చ్‌ సంస్థల్లో, బోధన రంగంలో ఉద్యోగావకాశాలుంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌.ప్రసాద్‌

    Ans:

    ఎమ్మెస్సీ కెమిస్ట్రీతో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాల్లో, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులుగా ఉద్యోగం చేయవచ్చు. నెట్‌/ సెట్‌లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొలువుల కోసం ప్రయత్నించవచ్చు. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ… చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి అర్హత ఉంటుంది. మనదేశంలో పీహెచ్‌డీ, విదేశాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేసి బోధన/ పరిశోధన/ పారిశ్రామిక రంగాల్లో అక్కడే స్థిరపడవచ్చు. ఆసక్తి, అవకాశం ఉంటే విదేశాల్లో పీహెచ్‌డీ చేసి మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాల్లో, మనదేశంలో ప్రయత్నించవచ్చు. ఎమ్మెస్సీతో విదేశాల్లో పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండవు. ఏవైనా సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేసి ఆ రంగంలో విదేశాల్లో/ మనదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీతో ఫార్మా, బయోటెక్‌ రంగంలో, కేంద్ర పరిశోధన సంస్థల్లో, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఎమ్మెస్సీ తరువాత బీఈడీ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కూడా పోటీపడవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: రామ్‌నాథ్‌

    Ans:

    పర్యావరణ కోర్సులకు విదేశాల్లో చాలా డిమాండ్‌ ఉంది. యూఎస్‌లో ఈ కోర్సు చేశాక వివిధ వస్తువుల తయారీ పరిశ్రమల్లో, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ, రిఫైనరీ, బోధన - పరిశోధన రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఎన్విరాన్‌మెంటల్‌ కోర్సు చేసినవారు పర్యావరణ శాస్త్రవేత్త, అధ్యాపకుడు, పర్యావరణ పాత్రికేయుడు, పర్యావరణ అధికారి, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్, రిసెర్చ్‌ అసోసియేట్, క్లైమేట్‌ కంట్రోలర్‌ ఉద్యోగాలు చేయటానికి వీలుంటుంది. ఇంకా ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్, సస్టెయినబిలిటీ కన్సల్టెంట్, నేచర్‌ కన్జర్వేషన్‌ ఆఫీసర్, పర్యావరణ విద్యాధికారి.. ఈ హోదాల్లో పనిచేసే అవకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సాగర్‌

    Ans:

    - విదేశాల్లో విద్యను అభ్యసించడం శ్రేయస్కరమే కానీ, ఆ విదేశీ డిగ్రీలతో మంచి వేతనంతో మనదేశంలో ఉద్యోగం పొందటం అనేది ఒక సవాలే! యూఎస్‌ లాంటి పాశ్చాత్య దేశాల్లో బిజినెస్‌ ఎకనామిక్స్‌ కోర్సు చదివినవారికి ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ చదివినవారితో సమాన ఉద్యోగావకాశాలూ, వేతనాలూ, హోదా ఉంటాయి. మనదేశంలో కూడా ఇటీవలికాలంలో బిజినెస్‌ ఎకనామిక్స్‌కు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. కానీ ఈ ఉద్యోగావకాశాలన్నీ ప్రైవేటు వ్యాపార సంస్థల్లో, మల్టీనేషనల్‌ కంపెనీల్లో, అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉంటున్నాయి. మీరు బిజినెస్‌ ఎకనామిక్స్‌ డిగ్రీతో పాటు బిజినెస్‌ అనలిటిక్స్, డేటా సైన్స్‌ లాంటి కోర్సులను కూడా చేసినట్లయితే మనదేశంలో మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. మీరు కాలిఫోర్నియా యూనివర్సిటీలోనే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మల్టీనేషనల్‌ కంపెనీల్లో/ అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగం పొంది, బదిలీపై మనదేశానికి వచ్చినట్లయితే మంచి వేతనం లభిస్తుంది. చదువు పూర్తయ్యాక రెండు/ మూడేళ్లు యూఎస్‌లోనే ఉద్యోగం చేసి, ఆ ఉద్యోగానుభవంతో మనదేశంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. బిజినెస్‌ ఎకనామిక్స్‌ డిగ్రీతో మనదేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నీతి ఆయోగ్‌ లాంటి ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. బోధనపై ఆసక్తి ఉంటే యూఎస్‌లోనే పీహెచ్‌డీ కూడా చేసినట్లయితే మనదేశంలో ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో, ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీల్లో అధ్యాపక ఉద్యోగాలు పొందే అవకాశముంది.

    Asked By: Charan

    Ans:

    Follow government data and standard books and for 6th to 10th academic books for particular subjects like History. For remaining topics you need to follow the academic and current events also. Reading news paper regularly will help you to answer the questions easily. If you plan properly time is not a problem at all.

    For Previous Papers visit following link.

    https://tinyurl.com/27tsc85a

    https://pratibha.eenadu.net/modelpapers/paperslist/jobs/2-1002-275