• facebook
  • whatsapp
  • telegram

Numerous.. Countless

Janaki: I am searching for information on healthy food and nutrition. Can you suggest some books with a lot of material on it?

(ఆరోగ్యకరమైన ఆహారం, పోషక పదార్థాల సమాచారం కోసం వెతుకుతున్నాను. దాన్ని గురించి బాగా సమాచారం ఇచ్చే పుస్తకాలను నువ్వేమైనా సూచించగలవా?)

Sobha: Oh, they are easy to find. We have plenty of information on it on the google. We have a lot of books on it too.

(అవి సులభంగా దొరుకుతాయి. గూగుల్‌లో దాన్ని గురించి చాలా సమాచారం ఉంటుంది. దానిమీద చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి.)

Janaki: Google! OK. Everybody says there are numerous books but I have hardly come across books which can explain the subject in simple and plain language.

(గూగుల్! సరేలే ప్రతీవాళ్లూ అంటారు ఆ విషయం మీద అసంఖ్యాకమైన పుస్తకాలున్నాయని, కానీ విషయాన్ని సరళమైన భాషలో తెలియజేసే పుస్తకాలు నాకింతవరకూ తగల్లేదు.)  

Sobha: That's nonsense. We have an abundant stock of books in our library. Go to any good book shop in the city and you find books with copious information. But what do you need all this for?

(అది అర్థం లేని మాట. మన గ్రంథాలయంలోనే అపారమైన సమాచారాన్నిచ్చే పుస్తకాలు చాలా ఉన్నాయి. నగరంలో ఏ పుస్తకాల దుకాణానికెళ్లినా, అక్కడ నీకు ఎంతో సమాచారాన్నిచ్చే పుస్తకాలు చాలా దొరుకుతాయి. అది సరే కానీ, ఇపుడెందుకిదంతా నీకు?)

Janaki: I have to make a speech on the subject and that too in the presence of experts. If I make a good job of it, more invitations will follow.

(ఆ విషయం మీద నేనో ప్రసంగం చేయాలి, అది కూడా నిపుణుల సమక్షంలో. అది బాగా చేస్తే మరిన్ని ఆహ్వానాలు వస్తాయి.)

Sobha: You are an excellent speaker. Once they listen to you, you will get countless offers. You will be ever in demand.

(నువ్వు గొప్ప వక్తవు. ఒకసారి నీ ప్రసంగాన్ని విన్నారంటే నీకు అసంఖ్యాకమైన పిలుపులు వస్తాయి. నీ ప్రసంగాలకు మంచి డిమాండ్ ఉంటుంది.)

Janaki: You have given a number of lectures already, but this happens to my first major exercise.

(నువ్వు ఇప్పటికే చాలా ఉపన్యాసాలు ఇచ్చావు. కానీ, ఇది నా మొదటి పెద్ద కసరత్తు.)

Sobha: Wish you all luck.

Notes: 1. Nutrition = పౌష్టికాహారానికి సంబంధించిన, పౌష్టికాహారం.

            2. Come across = అనుకోకుండా దేన్నైనా/ఎవర్నైనా చూడటం, కలుసుకోవడం.

Now look at the following expressions from the conversation above:

1) Can you suggest some books with a lot of information on it.

2) We have plenty of information on it.

3) OK. Everybody says there are numerous books on the subject.

4) We have an abundant stock of books on the subject in our library.

5) You find books with copious information.

6) You will get countless offers.

       పైన underline చేసిన మాటలన్నీ కూడా 'ఎక్కువ సంఖ్య' (a number of)/ 'చాలా', అనే అర్థం ఉన్న మాటలు. అన్నింటి అర్థం 'చాలా' నే అయినా అవి వాడే సందర్భాలన్నీ ఒకటి కాకపోవచ్చు. కాబట్టి, ఏ మాటను ఏ సందర్భంలో వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

'ఎక్కువ సంఖ్యలో', 'చాలా' అనే అర్థంతో మనం మామూలుగా వాడే మాట. 'many'.

many - చాలా (countables - లెక్కపెట్టేవాటికి వాడతాం.)

అయితే ఓ ముఖ్య విషయం: 'Many' ని correct English లో చాలావరకూ 'not' తోనే వాడతాం. 'ఎక్కువ లేవు' అనే అర్థంతో. questions లో కూడా వాడతాం.

 Many people attended the party yesterday - ఇది అంత సరైన English కాదు. 'చాలా మంది పార్టీకి వచ్చారు నిన్న' అనే అర్థంతో చెప్పాలంటే, 'Many people' బదులు, 'A lot of people/ a large number of/ a number of people attended the party అనడం correct.

a) Rupa: How many attended your class this morning?

(ఈరోజు ఉదయం నీ క్లాసుకు ఎంత మంది హాజరయ్యారు?)

Sheela: Not many. It was too cold in the morning. That perhaps was the reason.

 (ఎక్కువేం రాలేదు. పొద్దున చాలా చలిగా ఉంది. అది కారణమై ఉండొచ్చు.)

చూశారు కదా? పై సంభాషణలో, many ని, not తో question లో వాడాం కదా? అదీ 'many

b) Sudha: Where can I get such books?

 (అలాంటి పుస్తకాలు నేనెక్కడ పొందగలను?)

Prabhakar: Oh, you find plenty of such books in our college library.' ఉపయోగించే విధానం.

 (అలాంటి పుస్తకాలు మన కాలేజీ లైబ్రరీలో చాలా దొరుకుతాయి.)

c) Prabhu: We have plenty of job opportunities in banking.

(Banking లో చాలా/ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి.)

Pramod: But those competing for them are plenty too.

(వాటికి పోటీచేసేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు.)

ఎక్కువ సంఖ్యలో అనే అర్థంతో, 'a lot of' అని కూడా వాడతాం.

a) Gopal: A lot of students are in favour of doing Engineering courses.     

(చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులు చేసేందుకు సుముఖంగా ఉన్నారు.)

Govind: That's true. They feel that a degree in Engineering offers them a lot of job opportunities.

(నిజమే. ఇంజినీరింగ్ డిగ్రీ చాలా ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని వాళ్లనుకుంటారు.) 

ఇలా 'చాలా/ ఎక్కువ సంఖ్యలో' అనే అర్థంతో 'a lot of', 'plenty of' అని వాడతాం. అలాగే ఇదే అర్థంతో మనం వాడగల మరో మాట: numerous/ a number of/ a large number of/ a great number of

Numerous = a large number of/ a great number of

a) Gajendar: He is surely going to be sentenced.

(అతడికి కచ్చితంగా శిక్షపడబోతోంది/ అతడు కచ్చితంగా శిక్షింపబడతాడు.)

Hemanth: How do you know? 

(నీకెలా తెలుసు?)

Gajendar: He is involved in numerous cases of cheating.

(మోసపూరితమైన చాలా కేసులతో అతడికి సంబంధం ఉంది.)

b) Prabhakar: Why is India not making the desired progress?

(భారత్ తగినంత ప్రగతిని ఎందుకు సాధించలేకపోతోంది?)

Sekhar: The causes are numerous, among which the most important is corruption.

(కారణాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో అవినీతి ముఖ్యమైంది.)      

Abundant = plenty of = large number of = ఎక్కువ సంఖ్యలో ఉన్న/ చాలా

a) Karthik: Why do you like that company?

You can try for a job in other companies too. You are so highly qualified.

(ఆ కంపెనీనే ఎందుకిష్టపడతావు నువ్వు? ఇతర కంపెనీల్లో కూడా ప్రయత్నించవచ్చు కదా. నీకు మంచి విద్యార్హతలున్నాయి)

Kiran: This company provides abundant opportunities of promotion for the hardworking.

  (బాగా శ్రమించే వాళ్లకు పదోన్నతి ఇచ్చే విషయంలో ఈ కంపెనీ చాలా అవకాశాలు కల్పిస్తుంది.)

b) Lavanya: Where do you get this kind of dresses?

   (నీకిలాంటి డ్రెస్సులు ఎక్కడ దొరుకుతాయి?)

Manogna: Why this kind of dresses alone? There is abundant variety in a number of shops here.

  (ఇలాంటి డ్రెస్సులు మాత్రమే ఎందుకు? ఇంతకంటే చాలా ఎక్కువ వైవిధ్యం ఉన్న చాలా దుకాణాలున్నాయిక్కడ.)

ఇదే అర్థం వచ్చే ఇంకో మాట 'copious'.

Copious = Abundant = A large number of

a) Santhi: Alekhya always tops the class. She is really industrious.

   (అలేఖ్య ఎప్పుడూ క్లాసులో ముందుంటుంది. నిజానికి ఆమె చాలా కష్టపడి చదువుతుంది.)

Kranthi: Not surprising. She doesn't simply listen to the teacher. She takes copious notes in the class.

  (ఆశ్చర్యం ఏం లేదు. ఆమె క్లాసులో ఊరకే వింటూ కూర్చోదు. Notes బాగా ఎక్కువగా రాస్తూ ఉంటుంది)

b) Bhupal: Yesterday's Lecture by the swamiji was very interesting.     

  (నిన్న స్వామీజీ ఉపన్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది.) 

Naresh: What accounts for it?

  (దానికి కారణం ఏమిటో?)

Bhupal: I think his giving copious examples for every idea he presented are the reason.

  (ఆయన మనకు చెప్పిన ప్రతి భావానికీ ఎక్కువ ఉదాహరణలు ఇవ్వడంవల్ల అనుకుంటా)

ఎక్కువ/ చాలా/ పెద్ద సంఖ్యలో అనే అర్థాలతో మనం వాడగల ఇంకో మాట 'countless' అయితే 'countless

     Countless = too many to be counted

        = లెక్కపెట్టలేనన్ని/ అసంఖ్యాకం

The stars are countless/ countless stars adorn the sky.' ఇదివరకు చర్చించిన మాటల కంటే కాస్త తీవ్రమైన పదం.

నక్షత్రాలు లెక్కపెట్టలేనన్ని/ లెక్కించలేనన్ని నక్షత్రాలు ఆకాశాన్ని అలరిస్తాయి. 

a) Manohar: I pity Ekambar. There has been no improvement in his position at all.

  (ఏకాంబర్‌ను చూస్తే జాలేస్తుంది. అతడి పరిస్థితిలో ఏ విధమైన అభివృద్ధీ లేదు.)

Nagesh: He has himself to blame. He let slip the countless opportunities he has had to prosper in his business.

  (అతడినతడే నిందించుకోవాలి/ అదంతా అతడి తప్పే. అసంఖ్యాకంగా వచ్చిన అవకాశాలన్నీ జారవిడుచుకున్నాడు.)

Let slip = జారవిడవడం

b) Spandana: It's really a wonder that Kumar has recovered from such a massive heart attack.

  (అంత తీవ్రమైన హృద్రోగం నుంచి కుమార్ కోలుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే.)

Jayaram: I am not surprised. Modern surgery has saved the lives of countless others.

  (నాకేం ఆశ్చర్యంగా లేదు. ఆధునిక శస్త్రచికిత్స చాలా మంది హృద్రోగులను/ లెక్కకు మించిన హృద్రోగులను కూడా కాపాడింది.)

గమనిక: పైన మనం చూసిన expressions అన్నీ countables (లెక్కపెట్టగలిగిన వాటి)కి వాడాం ఎక్కువ సంఖ్యలో అనే అర్థంతో. వీటిలో, a lot of/ plenty of/ abundant/ copious లను uncountables (లెక్క పెట్టలేనివి, rice, sugar, milk etc) ముందు కూడా వాడవచ్చు. 'ఎక్కువ మొత్తంలో' అనే అర్థంతో.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌